24/07/2022
ఇది సమాజంలో "కొందరు" స్త్రీల పరిస్థితి.
'స్త్రీవాదులు' మాత్రం ఇటువంటివేమీ పట్టించుకోకుండా, ఎంతసేపూ "కొందరు" పురుషులు చేసే నేరాల గురించే రెచ్చిపోతుంటారు, సోషల్ నెట్వర్క్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ఈ దరిద్రం మరింత పెట్రేగిపోయింది.
స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఆపోజిట్ జెండర్ పై దాడులు చేస్తున్నపుడు, వీరు కేవలం స్త్రీలపై జరిగే దాడులపైనే స్పందిస్తుండడం ఎంత అనైతికమో ఆలోచించండి, అలా చేసే వీరికి లింగపక్షపాతం తప్ప మానవత్వం ఉండదు. దురదృష్టవశాత్తూ సమాజం, చట్టం, లింగవివక్షను నేరంగా గుర్తిస్తుందే తప్ప లింగ పక్షపాతాన్ని కూడా అంతే నేరంగా గుర్తించలేకపోతుంది, అందుకే ఇలాంటి ఏక పక్షపోరాటాలకు హద్దూ అదుపులేకుండా కొనసాగుతున్నాయి.
ఇక్కడ మనం ప్రాముఖ్యంగా రెండు విషయాలు గుర్తించాలి.
(1) పురుషులు స్త్రీల విషయంలో ఎటువంటి నేరం చేసినా కఠినశిక్షలు అమలౌతున్నాయి, కానీ స్త్రీల విషయంలో అటువంటి కఠినశిక్షలు లేవు (అమలుకావట్లేదు). పైకి చట్టం ఎవరికీ చుట్టం కాదంటారే తప్ప నిజానికి చట్టం కొన్నిసార్లు స్త్రీలకు బాగా దగ్గర చుట్టంలాగే ప్రవర్తిస్తుంది. ఇంతకూ నేరం చేసినా చట్టప్రకారం కఠినంగా శిక్షించబడే పురుషులు చేసే దాడుల విషయంలో పోరాడాలా లేక, ఎటువంటి నేరాలు చేసినా కఠిన శిక్షలు లేకుండా తప్పించుకుతిరిగే స్త్రీలు చేసే దాడుల విషయంలో ఎక్కువ పోరాడాలా? ఇందులో ఏది న్యాయబద్ధంగా ఉంది?. స్త్రీవాదులకు ఇటువంటి న్యాయబద్ధత ఎందుకుండదు? వారు మనుషులు కాదా?.
వారు పురుషులకు కాకుండా జంతుశయనం ద్వారా పుట్టినవారా?.
(2) పురుషులు స్త్రీలపై చాలా విధాలుగా దాడులు చేస్తుంటారు, కానీ స్త్రీలు అటువంటి విధానాలలో మాత్రమే కాకుండా చట్టాన్ని కూడా అడ్డుపెట్టుకుని దాడులు చేస్తుంటారు (తప్పుడు కేసులు). కానీ వీటిపై ఎటువంటి పోరాటాలూ ఆరాటాలూ మనకు కానరావు. "గతంలో ఒకామె నాతో మాట్లాడుతూ స్త్రీలకోసం స్త్రీలు పోరాడుతున్నట్టు పురుషులకోసం పురుషులు కూడా పోరాడుకోవచ్చుగా" అని ప్రశ్నించింది. కానీ ఆ వాదనకు స్త్రీలకు లింగపక్షపాతం తప్ప మానవత్వం ఉండదనే అర్థం వస్తుంది. ఒకవేళ పురుషులు కూడా అలానే ఆలోచిస్తే స్త్రీల పరిస్థితి ఏమయ్యేదో, ఏమౌతుందో ఇటువంటి వాదన చేసేవారు బాగా ఆలోచించుకోవాలి.
ఇక అసలు విషయానికి వస్తే, మీకు నేను చూపించిన న్యూస్ లో ఒక స్త్రీ 19 సంవత్సరాల మైనర్ కుర్రాడితో అక్రమసంబంధం పెట్టుకుని భర్తను చంపేసింది. అటువంటి దానిని ఏం చెయ్యాలంటారు. ఏముంది "క్రిందా పైనా కోసిపడేస్తే సరి".
ఈమాటలు నా అంతట నేనుగా మాట్లాడడం లేదు సుమా, నేను పూర్తిగా అహింసావాదిని.
పురుషులు ఇటువంటి నేరాలు చేసినపుడు కొందరు ఎలా స్పందిస్తుంటారో ముఖ్యంగా ఆడవాళ్ళు, నేను కూడా అదే కోలమానాన్ని ఇక్కడ ప్రస్తావించాను అంతే. నేరం చేసినా చట్టప్రకారంగా శిక్షించబడుతున్న పురుషుల విషయంలోనే కొందరు అంత కఠినంగా స్పందిస్తున్నపుడు, నేరం చేసినా అటువంటి కఠినశిక్షలు పడని స్త్రీల విషయంలో మరింత తీవ్రంగా ప్రతిఘటించాలి కదా!. పురుషులు ఈ విషయంలో కాస్త update అవ్వాలి.
అయితే ఈ సంఘటనపై కొందరు "ఇది అబ్బాయికి ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల జరిగిన నేరమని, అందుకే అబ్బాయిలు మరీ చిన్నవారిని పెళ్ళి చేసుకోకూడదని, దానివల్ల భార్యలకు వయసు పెరిగేసరికి భర్తలకు వయసైపోయి, వారికి వేరేవారిపై ప్రేమపుట్టి భర్తలను చంపడమో లేచిపోవడమో చేస్తున్నారని" స్పందించారు, ఇది pshycological fact కూడా అంట. ఔను ఒకవిధంగా ఇది వాస్తవమని ఒప్పుకోక తప్పదు. అయితే ఈ వాదన చేసినవారు స్త్రీలు చేసే నేరాల విషయంలో ఇటువంటి కారణాలు వెదికినట్టు పురుషులు చేసే నేరాల విషయంలో కూడా వెదుకుతారేమో వివరించాలి. ఉదాహరణకు పురుషులు ఎవరైనా పెళ్ళి అయ్యాక భార్య లావుగా అయిపోయిందని కానీ, పిల్లలను కన్నాక యోని వదులై సరిగా సుఖాన్ని పంచడం లేదని కానీ అక్రమసంబంధాలు పెట్టుకుని, ఆ భార్యలను చంపేస్తే, వీరు అలానే కారణాలతో కొంచెం positive గా స్పందిస్తారా?. ఇంతకూ చిన్నపిల్లలను రేప్ చేసేవారి psychological status ఏంటి?.
ఇక ఈ వాదన గురించి పరిశీలిస్తే, ఏజ్ తక్కువ అమ్మాయిని ఆ అబ్బాయి బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడా లేక, ఆమె ఇష్టంతో చేసుకున్నాడా? అలాంటపుడు అతనే కాదు ఆమె కూడా ఏజ్ ఎక్కువైన అతడిని పెళ్ళి చేసుకుందిగా?.
మరక్కడ అతనేదో ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకున్నట్టు "చేసుకోకూడదు" అని వీరెలా అంటారు?. ఒకవేళ ఆమె కుటుంబ సభ్యుల బలవంతం మీద చేసుకుంది అంటారేమో, అదే కుటుంబ సభ్యులు కుష్టురోగం ఉన్నవాడిని తీసుకువచ్చి బలవంతం చేస్తే ఆమె అతడిని పెళ్ళి చేసుకునేదా?. ఇంకొక విషయం చాలామంది అమ్మాయిలు తమకంటే ఎక్కువ ఏజ్ అబ్బాయిలను పెళ్ళి చేసుకోవడానికి ఆ అబ్బాయి వెనుకున్న ఆస్తే కారణంగా ఉంటుందని మరచిపోవద్దు.
సరే వాదనకోసం ఆమె తన భర్త వెనుకున్న ఆస్తిని కాకుండా కుటుంబసభ్యుల బలవంతం మీదనే పెళ్ళి చేసుకుంది అనుకుందాం, తర్వాత ఆమెకు అతనితో పొసగకపోతే విడాకులు తీసుకునే అవకాశం ఆమెకు ఉందికదా?. పైగా ఆమె విడాకులు తీసుకునేటపుడు పురుషుడిలా తన ఆస్తినుంచి భాగం కూడా దానం చెయ్యక్కర్లేదు. ఇలాంటి చట్టపరమైన అవకాశం ఉన్న ఆమె వేరే అబ్బాయితో అక్రమసంబంధం పెట్టుకుని తన భర్తను చంపితే, మానవత్వంతో అతనిపై జాలిపడి ఆమెను శిక్షించాలని కోరుకోకుండా, ఇలాంటి కారణాలు చెప్పి ఆమెను సమర్థించడానికి ప్రయత్నించడం నైతికంగా ఎంత దిగజారుడు తనమో ఈ వాదన చేసినవారు బాగా ఆలోచించుకోవాలి. ఇంతకూ ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న అబ్బాయి వయసు 19 (minor) మరి వారు దీనికేమంటారో?.
చివరిగా ఈ ఏజ్ ప్రస్తావన తెచ్చినవారు ఒక విషయం గుర్తుంచుకోండి, చాలామంది అబ్బాయిలు మంచి జాబ్ సంపాదించి సెటిల్ అయ్యేసరికి వారి వయస్సులు తప్పకుండా 30/30+ ఔతాయి.
ఏ అమ్మాయైనా, ఆమె తల్లి తండ్రులైనా అబ్బాయి జాబ్ ఏంటి ఆస్తి ఏంటి అనేది చూసుకునే పెళ్ళి చేసుకుంటారు/చేస్తారు. అందుకే చాలామట్టుకు పెళ్ళిళ్ళలో అమ్మాయి వయసుకంటే అబ్బాయిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేముందు లింగపక్షపాతంతో స్త్రీలు చేసే నేరాలను ఎలా వెనకేసుకురావాలి అని కాకుండా మనుషులుగా న్యాయబద్ధంగా ఆలోచించి మాట్లాడండి.
ఈ వ్యాసంపై ఎవరైనా వేరే వాదన తీసుకురావాలి అనుకుంటే, ఈ క్రింది లింక్ ద్వారా నేను సూచించిన 14 పాయింట్ల వ్యాసాన్ని కూడా చదివి అప్పుడు మాట్లాడండి, నేను సిద్ధంగా ఉన్నాను.
"స్త్రీవాదం Vs మానవతావాదం"
https://www.facebook.com/103344521510870/posts/259199112592076/
- Repudiating evil feminism.