Nellore Live News

Nellore Live News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nellore Live News, News & Media Website, ULAVAPALLA, Pune.

వేరుకాపురం అని వేధిస్తే.. భార్యకు విడాకులు ఇవ్వొచ్చు!తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధి...
11/04/2023

వేరుకాపురం అని వేధిస్తే.. భార్యకు విడాకులు ఇవ్వొచ్చు!

తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక
భర్తకు ఆ హక్కు ఉంటుంది.. కలకత్తా హైకోర్టు స్పష్టీకరణ

తల్లిదండ్రులను చూడడం కొడుకు బాధ్యత అని స్పష్టం

కోల్‌కతా, ఏప్రిల్‌ 10: తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉండాలంటూ భర్తను భార్య వేధిస్తే.. బాధితుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మానసికంగా వేధింపులకు గురిచేయడమేగాక సహేతుకమైన కారణాలు చూపకుండా అత్తమామల నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి చేస్తుంటే.. విడాకులు కోరే హక్కు భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘తల్లిదండ్రులతో ఉండడంతోపాటు వారిని పోషించడం కొడుకు బాధ్యత. భారతీయ సంస్కృతిలో ఇది భాగం’’ అని జస్టిస్‌ సౌమెన్‌ సేన్‌, జస్టిస్‌ ఉదయ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు మార్చి 31న ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ మండల్‌కు 2001లో ఝార్నాతో వివాహమైంది. ప్రశాంత్‌ స్కూళ్లలో పార్ట్‌టైం టీచర్‌గా, పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి పనులతో కొంత సంపాదించేవాడు. అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఆ ఆదాయం సరిపోయేది కాదు. దీంతో, ఆమె వేరు కాపురం ఉందామని ప్రశాంత్‌ను వేధించింది. ప్రశాంత్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఝార్నా అతనిపైనా, అత్తమామలపైనా వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసుతో ప్రశాంత్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌ మిడ్నాపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో ప్రశాంత్‌ విడాకుల కేసు దాఖలు చేయగా.. 2009లో విడాకులు మంజూరు చేసింది. దాన్ని సవాలు చేస్తూ ఝార్నా కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

ఆసక్తికర రాజకీయం............!అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.బాపట్ల: అ...
11/04/2023

ఆసక్తికర రాజకీయం............!

అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

బాపట్ల: అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu) విసిరిన చాలెంజ్‌ను మంత్రి మేరుగ నాగార్జున (Minister meruga Nagarjuna) స్వీకరించారు. వేమూరులో అభివృద్ధిపై, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కొడుకును తెచ్చుకున్న సరే అని... తాను మాత్రం ఒక్కడినే వస్తానని అన్నారు. ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని మంత్రికి నక్కా ఆనందబాబు (TDP Leader) సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ టీడీపీ సవాల్ విసిరారు.

కాగా టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు.

02/09/2022
10/01/2022

కర్ణాటక రాష్ట్రం నుండి శబరిమల లోని అయ్యప్ప స్వామి దర్శనం కోసం దాదాపు 850 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న, ఈ చిన్న స్వాములు..! | NELLORE LIVE NEWS

Address

ULAVAPALLA
Pune
524152

Alerts

Be the first to know and let us send you an email when Nellore Live News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nellore Live News:

Share