బుచ్చి ముచ్చట్లు

బుచ్చి ముచ్చట్లు For any News, Updates,adds,wishes,Tolets, Rents nd for anything related to Buchi
send it through Wha

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడి పాలెం లో జరిగినటువంటి కట్టుబడిపాలెం స్లం సమాఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ...
26/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడి పాలెం లో జరిగినటువంటి కట్టుబడిపాలెం స్లం సమాఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కట్టుబడి పాలెం వార్డ్ నెంబర్ -1 లో మొత్తం SHG:30, వైయస్సార్ ఆసరా గ్రూపులు:9, సున్నా వడ్డీ గ్రూపులు:23, జగనన్న తోడు 25 మందికి 10 వేల రూపాయలు చొప్పున 2,50,000/- ఇవ్వడం జరిగింది అని ,కొత్త గ్రూపులు:7, మొండిబాకి:1 SHG అని,"A" గ్రేడ్ లో ఉన్న సంఘాలు 29 అని తెలియజేశారు. కట్టుబడిపాలెం సమాఖ్య లాభంలో ఉందని, జగనన్న కాలనీ వచ్చిన సభ్యులు 71 మందిని తెలియజేశారు.RP కామేశ్వరి గత నాలుగు సంవత్సరాల నుంచిRP గా కట్టుబడి పాలెం సమాఖ్యకు పని చేస్తుందని, కామేశ్వరి మీద ఎటువంటి అభియోగం లేదని,DRDA నుంచి జీతం లేకుండా పనిచేస్తుందని, తర్వాత మెప్మా లో కూడా జీతం రాలేదని, తెలియజేశారు. అయినా కూడా ఈ సమాఖ్యకు ఎన్నో సేవలు చేస్తుందని, కామేశ్వరి కి జీతం వచ్చే విధంగా పై అధికారుల దగ్గరకు తీసుకొని వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ కత్తి నాగరాజు గారు, మెప్మా సీవో నర్మదా గారు, ఏపీఎం లలితమ్మ గారు, పొదుపు మహిళలు పాల్గొన్నారు

పిల్లల పండుగలో పిల్లల మాస్టారు ప్రతిభజేఎన్టీయూ కాకినాడలో జరుగుతున్న పిల్లల పండుగలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామ...
26/11/2023

పిల్లల పండుగలో పిల్లల మాస్టారు ప్రతిభ

జేఎన్టీయూ కాకినాడలో జరుగుతున్న పిల్లల పండుగలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ ప్రతిభ చాటారు. పిల్లల పండుగలో శనివారం శ్రీకృష్ణదేవరాయల భువన విజయం, అష్టదిగ్గజ కవుల వేషధారణతో తెలుగు భాష సాహితీ వైభవం పేరుతో నాటిక రచించి, దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. తెలుగు శతక కారులైన తెనాలి రామలింగ, ధూర్జటి, అల్లసాని పెద్దన రచించిన శతకాలను పరిచయం చేసి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మబాషకు జీవం పోస్తున్న గండికోటను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు.

24/11/2023
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 14 వ వార్డు, 15వ వార్డు, మరియు 17వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి ...
17/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 14 వ వార్డు, 15వ వార్డు, మరియు 17వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు, టౌన్ అధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి గారు, టౌన్ సచివాలయాల కన్వీనర్ మోర్ల మురళి గారు, కౌన్సిలర్ తో కలిసి వైఎస్ఆర్సిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రకు ఎందుకు మరల జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా ఈ జెండాను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, స్థానికంగా ఉండే ప్రజలు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సచివాలయం 2 లో జరిగినటువంటి డిస్ప్లే ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్ బోర్డ్ ను ఆవిష్కరించిన మున్సిప...
17/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సచివాలయం 2 లో జరిగినటువంటి డిస్ప్లే ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్ బోర్డ్ ను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కొరకు 15004 సచివాలయం ఏర్పాటు చేసి ఎటువంటి అవినీతికి , పొరపాట్లకు తావు లేకుండా సంక్షేమ ఫలాలను అందించారని, ఈ బోర్డు నందు 2019 నుండి ఇప్పటివరకు రామకృష్ణ నగర్ సచివాలయ పరిధిలో ప్రత్యక్షంగా గాను, పరోక్షంగా గాను చేకూరిన లబ్ది మొత్తం 31 కోట్ల 89 లక్షల 63 వేల 558 రూపాయలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తో పాటు టౌన్ అధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి గారు, టౌన్ సచివాలయాల కన్వీనర్ మోర్ల మురళి గారు, కౌన్సిలర్స్ ప్రసాద్ గారు, జయంతి గారు, అనంతమ్మ గారు, కో ఆప్షన్ సభ్యులు నాగలక్ష్మి గారు, , వైయస్ఆర్ సీపీ నాయకులు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, స్థానికంగా ఉండే ప్రజలు పాల్గొన్నారు.

గ్రంథాలయోద్యమ నేతలకు ఘన నివాళులుభారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో గ్రంథాలయోద్యమానిది కీలక పాత్ర అని అపస్మా జిల్లా అధ్యక్షులు...
17/11/2023

గ్రంథాలయోద్యమ నేతలకు ఘన నివాళులు

భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో గ్రంథాలయోద్యమానిది కీలక పాత్ర అని అపస్మా జిల్లా అధ్యక్షులు నేల నూతల శ్రీధర్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయంలో మూడవరోజు గ్రంథాలయ వారోత్సవాలలో గురువారం గ్రంథాలయ ఉద్యమ నేతలకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమ నేతల కృషివలన స్వాతంత్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. వాడ వాడలా ప్రజలకు స్వాతంత్ర ఉద్యమ చరిత్ర తెలిసిందంటే దానికి కారణం గ్రంథాలయ ఉద్యమ నేతల కృషి అని పేర్కొన్నారు. అనంతరం గ్రంధాలయ ఉద్యమ నేతలకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధికారిణి కే.మంజులత, జిల్లా రిసోర్స్ గ్రూపు సభ్యులు గండికోట సుధీర్ కుమార్,స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🚚 Exciting News! 🚚  "The Hunger Wheels" Food Truck is rolling into Nellore on Nov 17 at 5:30 PM near NTR Park, Anil Gard...
16/11/2023

🚚 Exciting News! 🚚

"The Hunger Wheels" Food Truck is rolling into Nellore on Nov 17 at 5:30 PM near NTR Park, Anil Gardens!

🎉 Satisfy your cravings with delicious bites! Don't miss the Friday feast!



వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి" (వై ఏప...
16/11/2023

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి" (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, రేబాల సచివాలయం పరిధిలో జరిగిన సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరిస్తూ అమర్చిన డిసిప్లె బోర్డుని ఆవిష్కరించి, అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసిన కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు

పుస్తక పఠనంతో మనోవికాసంపుస్తక పఠనంతో మనోవికాసమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తాటిపర్తి వెంకటేశ్వర్లు అన్నారు. ...
16/11/2023

పుస్తక పఠనంతో మనోవికాసం

పుస్తక పఠనంతో మనోవికాసమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తాటిపర్తి వెంకటేశ్వర్లు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయంలో జరుగుతున్న 56వ గ్రంథాలయ వారోత్సవాలలో రెండో రోజైన బుధవారం పుస్తక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం ప్రతినిత్యం చదవటం వలన వివేకము, విజ్ఞానము, వికాసము, విచక్షణ, అభ్యుదయము కలుగుతాయన్నారు. పుస్తక పఠనం పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి కే. మంజులత, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి గారి అధ్యక్షత న సా...
16/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి గారి అధ్యక్షత న సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో మొత్తం 58 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిలో 3 అజెండాలను తిరస్కరించడమైనది, మిగతా అజెండాలను కౌన్సిలర్స్ అందరూ ఆమోదించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తో పాటు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

15/11/2023
భారతదేశానికీ ప్రత్యేక విదేశాంగ విధానానికి రూపకల్పన చేసి, పంచశీల సూత్రాలను ప్రతిపాదించి, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత నై...
15/11/2023

భారతదేశానికీ ప్రత్యేక విదేశాంగ విధానానికి రూపకల్పన చేసి, పంచశీల సూత్రాలను ప్రతిపాదించి, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత నైపుణ్యాలుగా విద్యాసంస్థలను అభ్యుదయ మార్గంలో నడిపిన దార్శినికుడు జవహర్లాల్ నెహ్రూ అని బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎం. దిలీప్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయంలో మంగళవారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి నెహ్రూ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్ లో జరిగిన బాలల దినోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న NDCC బ్యాంక్ మేనేజర్ శ్రీ...
15/11/2023

బుచ్చిరెడ్డిపాలెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్ లో జరిగిన బాలల దినోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న NDCC బ్యాంక్ మేనేజర్ శ్రీ నాగరాజు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ రకాల దేశ నాయకులు వేషధారణ మరియు ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాం జరిగాయి. వారందరికీ బహుమతులని అందజేశారు.

   positives : karthi , bgm , few action episodes , few one linersnegatives :weak story , direction ,  screenplay , hero...
10/11/2023



positives :
karthi , bgm , few action episodes , few one liners

negatives :
weak story , direction , screenplay , heroine track

2.5/5

ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహ...
10/11/2023

ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఐదవ వార్డు మరియు ఆరో వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు, స్థానికంగా ఉండే ప్రజలంతా పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో జరిగినటువంటి వెల్ఫేర్ స్కీం బోర్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చ...
10/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో జరిగినటువంటి వెల్ఫేర్ స్కీం బోర్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి గారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం 2.4 లక్షల కోట్ల ప్రత్యక్ష నగదు బదిలీ (DTB) ద్వారా మరియు 1.67 లక్షల కోట్లు పరోక్షంగా (NON DTB) ద్వారా మన రాష్ట్రంలో 91.10% కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. పరిపాలన వికేంద్రీకరణ కొరకు 15,004 సచివాలయం ఏర్పాటు చేసి ఎటువంటి పొరపాట్లకు అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను అందించారు. ఈ బోర్డు నందు 2019 నుండి ఇప్పటివరకు కాజా నగర్ సచివాలయ పరిధిలో ప్రత్యక్షంగా గాను, పరోక్షంగా గాను, చేకూరిన లబ్ది మొత్తం 15 కోట్ల 61 లక్షల 36వేల 767 రూపాయలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐదో వార్డ్ కౌన్సిలర్ షేక్ షావుల్ గారు, ఆరో వార్డు కౌన్సిలర్ రహమత్ భాషా గారు, 14వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ గారు, కో ఆప్షన్ మెంబర్ ఇర్షాద్ గారు, వైఎస్ఆర్సిపి నాయకులు మల్లారెడ్డి గారు, మురళి గారు, చాందిని గారు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

14 నుండి గ్రంధాలయ వారోత్సవాలుఈ నెల14 నుండి 20వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధా...
10/11/2023

14 నుండి గ్రంధాలయ వారోత్సవాలు

ఈ నెల14 నుండి 20వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయ అధికారిణీ కే. మంజులత అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంథాలయంలో గురువారం వారోత్సవాల కృత్యమాలికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14న గ్రంథాలయం వారోత్సవాలను ప్రారంభించి నెహ్రూ చిత్రపటానికి ఘనంగా నివాళులు, 15వ తేదీ పుస్తక ప్రదర్శన, 16వ తేదీ గ్రంథాలయ ఉద్యమ మహోన్నతులైన డాక్టర్ ఎస్. రంగనాథన్,అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం తదితరుల సంస్మరణ, 17వ తేదీ కవి సమ్మేళనం,18వ తేదీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 19వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి ఘన నివాళి, 20వ తేదీ అక్షరాస్యతా దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవ ముగింపు వేడుకలు, బహుమతి ప్రధానం జరుగుతుందని వివరించారు. ఈ వారోత్సవాలలో గ్రంథాలయాల ఆవశ్యకత,పుస్తక పఠనం వలన ప్రయోజనాలు, ఆటలు, క్విజ్ పోటీలుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ గ్రూపు సభ్యులు గండికోట సుధీర్ కుమార్, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బుచ్చి నగరంలోని ఇస్కపాళెం రోడ్డులో గల వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ మఠానికి చెందిన ఆస్తులు ఆక్రమణ గురైంది దీనిపై అధికారులు స్...
09/11/2023

బుచ్చి నగరంలోని ఇస్కపాళెం రోడ్డులో గల వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ మఠానికి చెందిన ఆస్తులు ఆక్రమణ గురైంది దీనిపై అధికారులు స్పందించి మఠం ఆస్తులు పరిరక్షించాలని ప్రతిపక్షాలు ప్రజలు కోరుతున్నారు

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కోనేటిమిట్టలో బుచ్చిరెడ్డిపాళెం మండలం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (సింహప...
09/11/2023

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని కోనేటిమిట్టలో బుచ్చిరెడ్డిపాళెం మండలం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (సింహపురి వైద్య సేవా సంస్థ అనుబంధం) కార్యాలయ ప్రారంభోత్సవం మరియు రైతు అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డి.సుజాత గారు (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కోవూరు)శ్రీ యం.సురేంద్ర రెడ్డి గారు (అగ్రికల్చర్ ఆఫీసర్ బుచ్చిరెడ్డిపాలెం మండలం) వారు విచ్చేసి కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామకృష్ణ నగర్ లో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వెంకటేశ్వరుని...
09/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామకృష్ణ నగర్ లో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వెంకటేశ్వరుని దర్శించుకుని అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రూ.10 ల‌క్ష‌ల విరాళం అందించారు.

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని మినగల్లులో దాదాపుగా 253 కిలోలు బియ...
09/11/2023

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని మినగల్లులో దాదాపుగా 253 కిలోలు బియ్యం అధికంగా ఉన్నట్లు, 263 ప్యాకెట్లు చక్కెర, 49 ప్యాకెట్లు గోధుమ తక్కువగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుచ్చిరెడ్డిపాళెం టౌన్ కు కొత్తగా సాంక్షన్ చేయించిన 132 kV సబ్ స్టేషన్ నిర్మాణం కోసం APTRANSCO కు చెందిన 4.8 ఎకరాల స్థలా...
08/11/2023

బుచ్చిరెడ్డిపాళెం టౌన్ కు కొత్తగా సాంక్షన్ చేయించిన 132 kV సబ్ స్టేషన్ నిర్మాణం కోసం APTRANSCO కు చెందిన 4.8 ఎకరాల స్థలాన్ని సంబంధిత విద్యుత్ అధికారులు మరియు మండల నాయకులతో కలసి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామచంద్రపురం గ్రామంలో జరిగినటువంటి రామచంద్రపురం స్లం సమాఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన...
08/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామచంద్రపురం గ్రామంలో జరిగినటువంటి రామచంద్రపురం స్లం సమాఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 20వ వార్డులో జరుగుతున్నటువంటి రామచంద్రపురం సమాఖ్యలో ఉన్న మొత్తం గ్రూపులు 30, వైయస్సార్ ఆసరా వచ్చిన గ్రూపులు 23, సున్నా వడ్డీ వచ్చిన గ్రూపులు 28, జగనన్న తోడు ఇచ్చిన సభ్యులు 31 మందికి పదివేల రూపాయలు చొప్పున 3,10,000/- రూపాయలు ఇవ్వడం జరిగినది.SLF లో ఉన్న సంఘాలన్నీ "A" గ్రేడ్ లో ఉన్నదని,SLF కూడా ఆదాయంలో ఉన్నదని తెలియజేశారు.RP పద్మ ప్రతి గ్రూప్ ను సమావేశం జరిపించడం జరుగుతుందని, అన్ని గ్రూపులు "A" గ్రేడ్ కు వచ్చే విధంగా చాలా కష్టపడిందని, RP పద్మ పనితీరు మీద ఏ గ్రూప్ కూడా సమస్యలు చెప్పలేదని, ప్రతినెల సమావేశం జరుపుతూ తన విధులు బాధ్యతగా చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ కత్తి శ్రీదేవి గారు, మెప్మా సి ఓ నర్మదా గారు, ఆర్ పి పద్మ గారు, వైయస్ఆర్ సీపీ నాయకుడు పెంచలయ్య గారు, పొదుపు సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🍽️ RK FASTFOODS 🍽️🥚 Introducing EGG KULFI 🍨📣 Exciting News for Food Lovers in Buchireddypalem! 📣🎉 Be the FIRST to savor ...
07/11/2023

🍽️ RK FASTFOODS 🍽️
🥚 Introducing EGG KULFI 🍨
📣 Exciting News for Food Lovers in Buchireddypalem! 📣
🎉 Be the FIRST to savor the unique and delicious EGG KULFI at RK FASTFOODS! 🎉
📍 Location: Opposite Kokila Sweets, Kottha Bus Stand Centre, Chennur Road, Buchireddypalem
🕒 Coming Soon...
Don't miss out on this delectable treat that's sure to delight your taste buds!


బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని, పురందరపురం గ్రామంలో సోమవారం అధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగి...
07/11/2023

బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని, పురందరపురం గ్రామంలో సోమవారం అధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో అయ్యప్ప మాలదారణలో ఉన్న రౌతు వినయ్ పై చేసిన దాడులను ఖండిస్తూ బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద హిందూ...
07/11/2023

ఆత్మకూరులో అయ్యప్ప మాలదారణలో ఉన్న రౌతు వినయ్ పై చేసిన దాడులను ఖండిస్తూ బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద హిందూ ఐక్యవేదిక ధర్నా నిర్వహించడం జరిగినది.

హిందూ ఐక్యవేదిక, బిజెపి, జనసేన, హిందూ సంఘాలు కలుపుకొని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, మండల తహసీల్దారు వీరి సుధీర్ కుమార్ గారికి మరియు బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ కార్యాలయంలో ఉన్న ఏఎస్ఐ హరేంద్ర గారికి రౌతు వినయ్ పై దాడికి,ఆత్మహత్యకు నిరసనగా వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

🎆 SMS CRACKERS 🎆🔥 WHOLESALE 🔥Get the BEST QUALITY CRACKERS at UNBEATABLE PRICES!📍 Location: BUCHIREDDYPALEM📦 Online Orde...
05/11/2023

🎆 SMS CRACKERS 🎆

🔥 WHOLESALE 🔥

Get the BEST QUALITY CRACKERS at UNBEATABLE PRICES!

📍 Location: BUCHIREDDYPALEM
📦 Online Orders Available

Contact for orders and inquiries:
Pro. Shafi - 📞 9908660946

Don't miss out on the opportunity to light up your celebrations with our premium fireworks. Hurry, order now!



05/11/2023
భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మండలశాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఇస్కపాళెం పంచాయితీ పోలినాయుడుచెరువు గిరిజన కాలనీ,వడ్డీ...
05/11/2023

భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మండలశాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఇస్కపాళెం పంచాయితీ పోలినాయుడుచెరువు గిరిజన కాలనీ,వడ్డీపాళెం,కట్టుబడిపాళెం తదితర ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మంజూరైన ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయడం జరిగింది.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి మంచినీటి కొరత తీర్చేందుకు నిధులు కేటాయించిన భారత దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్...
04/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి మంచినీటి కొరత తీర్చేందుకు నిధులు కేటాయించిన భారత దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు.

బుచ్చిరెడ్డి పాలెంలోని 14 మరియు 15 వ వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యకమానికి ముఖ్య అతిధిలు...
04/11/2023

బుచ్చిరెడ్డి పాలెంలోని 14 మరియు 15 వ వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యకమానికి ముఖ్య అతిధిలుగా మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు , వవ్వేరు బ్యాంక్ చైర్మన్ యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు , జొన్నవాడ చైర్మన్ పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు గారు, కౌన్సిలర్ లు ,కో ఆప్షన్ సబ్యులు బుచ్చి పట్టణ సచివాలయ కన్వీనర్ మోర్ల మురళి గారు మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు , మోర్ల భరత్ గారు , మరియు నాయకులు పాల్గోని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు

బుచ్చిరెడ్డిపాలెం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర గారిని బుచ్చి పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి సత...
03/11/2023

బుచ్చిరెడ్డిపాలెం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర గారిని బుచ్చి పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన బుచ్చిమండల పరిషత్ ప్రెసిడెంట్ మన్నేపల్లి శ్రీనివాసులు, దామరమడుగు రామచంద్రారెడ్డి నగర్ గ్రామ వైసీపీ బూత్ కన్వీనర్ పేరు బోయిన రమేష్ యాదవ్ మరియు బుచ్చి మండల వైయస్సార్సీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ ఇందూరు పల్లి భాను ప్రకాష్.

POLIMERA 2POSITIVES : SATYAM RAJESH , KAMAKSHI , STORY , DIRECTION , SCREENPLAY , HORROR SCENES , BGM , TWISTS NEGATIVES...
03/11/2023

POLIMERA 2

POSITIVES :
SATYAM RAJESH , KAMAKSHI , STORY , DIRECTION , SCREENPLAY , HORROR SCENES , BGM , TWISTS

NEGATIVES :
SOME UNWANTED SCENES , SLOW NARRATION

RATING - 2.75/5

KEEDA COLAPositives : Tharun Bhaskar , Jeevan , Entertainment , BGM , One Liners , Cinematography , Production ValuesNeg...
03/11/2023

KEEDA COLA

Positives :
Tharun Bhaskar , Jeevan , Entertainment , BGM , One Liners , Cinematography , Production Values

Negatives :
Weak Story , Silly to the Core , Climax , Slow Pace

RATING - 2.75/5

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అమృత్ 2.0, స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్, ట్రాంచ్-1 నిధులు రూ.85.00 కోట్ల రూపాయలతో చేపట్టబ...
01/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అమృత్ 2.0, స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్, ట్రాంచ్-1 నిధులు రూ.85.00 కోట్ల రూపాయలతో చేపట్టబోయే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేసిన వి.పి.ఆర్.అలాగే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో NUDA నిధులు రూ.1.00 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన బెజవాడ గోపాలరెడ్డి పార్కును కూడా ప్రారంభోత్సవం చేసిన
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు , వి.పి.ఆర్ ఫౌండేషన్ తరపున కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను దాదాపు 25 మంది వికలాంగులకు రూ.8.75 లక్షల విలువచేసే బ్యాటరీ ట్రై సైకిల్స్ ను తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేసిన రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు,బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు.

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏడవ వార్డు మరియు ఎనిమిదవ వార్డు శాంతినగర్ లో జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్...
01/11/2023

బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏడవ వార్డు మరియు ఎనిమిదవ వార్డు శాంతినగర్ లో జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి గారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, పేదవాడి ప్రాణాలు విలువ తెలిసిన నాయకుడిగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంటింటికి సంపూర్ణ వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని, ప్రజలు మంచి జీవితాన్ని గడపాలని, అందుకు వైద్య సిబ్బంది సర్వే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తో పాటు ఏడవ వార్డు కౌన్సిలర్ షేక్ షకీల బేగం గారు, 8వ వార్డు కౌన్సిలర్ పటాన్ నస్రిన్ గారు, ఆరో వార్డు కౌన్సిలర్ షేక్ రహమత్ భాషా గారు, వైఎస్ఆర్ సీపీ నాయకులు డాక్టర్ అల్లా బక్షు గారు, పటాన్ మహబూబ్ బాషా గారు, నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Address

Buchi
Nellore
524305

Alerts

Be the first to know and let us send you an email when బుచ్చి ముచ్చట్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to బుచ్చి ముచ్చట్లు:

Videos

Share


Other News & Media Websites in Nellore

Show All