Ndnnews Online

Ndnnews Online news news, news videos, articles, news reviews, and journalistic related..
(1)

02/02/2025

వామ్మో పెంపుడు జంతువుల షో అదిరిందిగా
పాములు, ఎగిరే ఉడుతలు , పక్షులు , కుక్కలు..
============================
వామ్మో పెంపుడు జంతువుల షో అదిరిందిగా పాములు, ఎగిరే ఉడుతలు , పక్షులు , కుక్కలు..చిలుకలు, హంస్టర్స్ , ఇలా ఎన్నెన్నో రకాలు .. అన్నీ ఒకేచోట పెట్టేసి జంతు, పక్షి ప్రేమికులకు కనువిందు చేసాయి.

02/02/2025

కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో
జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.
=================
జగన్నాథ రధ చక్రాలు కదిలాయి..భక్తుల భజన కనువిందు చేసింది.. ఇలా ఊరువాడా కోలాటాలు, భజనలు, సంకీర్తనలతో జగన్నాథ రథయాత్ర సాగిపోతుంది.

02/02/2025

గండికోట అసలు రహస్యం చాలామందికి తెలియకపోవచ్చు..కడపజిల్లాలో గండికోట చూసేందుకు పోయే చాలా మందికి ఈ గండికోట ప్రపంచంలో ఎంత ప్రసిద్ధి చెందిందో బహుశా తెలియకపోవచ్చు. గండికోట లోని భవనాలు, ఆలయాలు , మినార్లు, మసీదులు లేదా ఇతరత్రా చారిత్రిక ప్రాధాన్యం ఉన్న విశేషాలను చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ గండికోట ప్రపంచంలో ఎనిమిది ప్రకృతి వింతల్లో ఒక వింతని చాలామందికి తెలియదు . గండికోట చుట్టూ ప్రవహించే పెన్నా నది, దీన్ని ప్రపంచ పటంలో నిలిపింది. ఇలాంటి ప్రకృతి అద్భుతాలు ప్రపంచంలో 8 ఉన్నాయి . అలాంటి ప్రకృతి అద్భుతంలో గండికోట కూడా ఒకటి. కొన్ని లక్షల సంవత్సరాల పాటు, కొండలు చుట్టూ ,రాళ్ల చుట్టూ నదులు ప్రవహించి వరదలతో ఉరవళ్ళు, పరవళ్లతో ఒక ఆకారాన్ని అంటే లోయ లేదా అగడ్త లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటారు . ఇలాంటి అగర్త లేదా లోయలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి విదేశాల్లో తర్వాత మన దేశంలో గండికోట చుట్టూ ఉన్న పెన్నా నది మాత్రమే. గండికోట పటిష్టమైన ఒక రాతి పునాది చుట్టూ కట్టింది. పెన్నా నది ఈ రాతి పునాది చుట్టూ ప్రవహించడం వల్ల కొన్ని లక్షల సంవత్సరాలకి దానికి ఈ ఆకారం ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందువల్లనే ఇది ఒక విశేషం అయింది. రక్షణ పరంగా కూడా సహజ సిద్ధమైన అగర్త తో ఇది ఏర్పడింది . దీని చుట్టూ పెన్నా నది ప్రవహించడంతో గండి కోట ఒక అబేధ్యమైన కట్టడం గా నిలిచిపోయింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి కట్టడాల్లో ఆరిజోనాలో ఉన్న ఫిష్ రివర్ కానియన్, మరియు చైనాలో ఉన్న టైగర్ లీడింగ్ గాడ్ ,మరియు ఆరిజోనాలోనే ఉన్న మరో గ్రాండ్ కాన్యన్ , ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఉన్న గాడ్ ఆన్ కాన్యన్ , ఆ తర్వాత యాంటోలోప్ క్యానియన్, ఆ తర్వాత కౌబాయ్ అనే ప్రాంతంలో వేంస్కానియన్, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న కింగ్ కానియన్, ఆ తర్వాత ఉన్న సమారియలోయ ,ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ రక్షణ కవచాలు. వీటి తర్వాత గండికోట చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడ్డ పెన్నా నది వల్ల దీనికి కూడా ప్రపంచ పటంలో స్థానం లభించింది.

02/02/2025

ఆ దేశం సైకిళ్లకు భూతలస్వర్గం..
జనాభాకు రెండింతలు సైకిళ్ళు ..
==================
ప్రపంచంలో సైకిళ్లకు స్వర్గం లాంటి దేశం నెదర్లాండ్స్ . ఈ దేశం జనాభా 18 మిలియన్ల . అంటే ఒక కోటి 18 లక్షలు.. ఈ దేశంలో సైకిళ్ళు ఎన్నో తెలుసా..? అక్షరాలా రెండు కోట్ల 30 లక్షలు.. అంటే జనాభాకు రెండింతలు సైకిళ్ళు ఉన్నాయన్నమాట.. సగటున ఒక మనిషికి రెండు సైకిళ్ళు.. మనదేశంలో చాలామంది సైకిల్ తొక్కడం నామోషీగా భావిస్తారు. లేవివాడుకూడా అప్పుచేసైనా కారు లేదా బైక్ కొనుగోలు చేసే దుస్థితి మనది.. కానీ నెదర్లాండ్స్ దేశంలో ఎక్కువగా ప్రజలు సైకిళ్లే వాడుతారు. శారీరక శ్రమకు, కాలుష్యం లేని వాతావరణం కోసం, ఇంధనం పొదుపు కోసం, తద్వారా దేశ ఆర్థికాభివృద్దికోసం నెదర్లాండ్స్ప్రభుత్వం సైకిళ్ళ విధానాన్ని ప్రోత్సహించింది. మొదటినుంచి నెదర్లాండ్స్ ప్రజలకు సైకిళ్లంటే ఇష్టం. వారిజీవితంలో సైకిళ్ళు ఒక భాగం. సైకిళ్లపై ప్రపంచ యాత్రలు కూడా చేస్తారు. నెదర్లాండ్స్ దేశంలో మనకు హైవేస్ ఉన్నట్టు , సైకిళ్లకు ప్రత్యేక ట్రాక్స్ ఉంటాయి. అలాఉండే దేశం నెదర్లాండ్స్ ఒక్కటే. ఆమ్ స్టర్ డాం నగరంలో అయితే సైకిల్ ట్రాక్స్ కి అటుఇటు పచ్చిక బయళ్లు ఉంటాయి. కనువిందు చేసే వాతావరణం మధ్య ఈ నగరంలో మొత్తం సైకిల్ ట్రాక్స్ ఉంటాయి. రోడ్ల కంటే ఆ దేశంలో సైకిల్ ట్రాక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అధికారులు , మంత్రులు కూడా సైకిళ్ళలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ప్రతి నగరంలోనూ సైకిల్ పార్కింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. అందుకే నెదర్లాండ్స్ దేశం అంత సుభిక్షంగా , సుసంపన్నంగా, కాలుష్యానికి దూరంగా ఉంది..

02/02/2025

దక్షిణ భారతదేశంలో ప్రముఖ చర్చీలలో తమిళనాడులోని వేలాంగిణి చర్చి ఒకటి.. పాశ్చాత్య దేశాలలో చర్చిల తరహాలో దీనిలోపల అలంకరణ ఘనంగా ఉంటుంది. మేరీ మాత విగ్రహం కూడా ప్రశాంత వదనంతో చూపరులను ఆకట్టుకుంటుంది..

31/01/2025

నాగపట్నం తీరప్రాంత పరిధిలో కొన్ని అరుదైన చేపలుంటాయి. కార , వలస , కరంగిడే, తుండవ , పిల్లిపున్ని , కోనంగి , వెండిచేప, కోతిచందువా .. ఈ రకమైన చేపలతో బీచ్ లో స్టాల్ల్స్ ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు కూడా వాటికోసం ఎగబడతారు..

31/01/2025

నాలుగు శతాబ్దాలనాటి పెయింటింగ్స్..
నేటి ఆధునిక కాలంలో ఫొటోగ్రఫీ సాటిరాగలదా ?
=========================///
ప్రపంచంలో చిత్రకళ 7ఏడువందల ఏళ్ళ క్రితమే కొత్త పుంతలు తొక్కింది. ఆకులు నుంచి తీసిన రంగులతో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోశారు. అలనాటి మొఘుల్ చక్రవర్తుల కాలంనుంచి వేసిన వేలాది పెయింటింగ్స్ ఇప్పటికీ తాజాగానే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో చిత్రకళ వెలుగులు విరజిమ్మింది. మనిషిని ఎదురుగా నిలబెట్టి , ఆ రూపాన్ని యధాతధంగా చిత్రించడం , అది కూడా వందలయేళ్ళుగా వెలిసిపోకుండా ఉండటం గొప్ప విషయమే. నాలుగు శతాబ్దాలనాటి పెయింటింగ్స్ నేటికీ మ్యూజియంలలో కనువిందు చేస్తున్నాయి. వీటికి నేటి ఆధునిక కాలంలో ఫొటోగ్రఫీ సాటిరాగలదా ?

31/01/2025

120 ఏళ్లనాటి ఇల్లు..అదే బృందావనం.
నాలుగు తరాలు తరించిన అందమైన లోగిలి..
=========================
సైబర్ టవర్స్, సైబర్ సిటీలో భవనాలు.. అత్యాధునికంగా కట్టిన ఇళ్ళు.. ఇవన్నీ ఇదిగో ఈ ఇంటిముందు దిగదుడుపే . 120 ఏళ్ళక్రితం కట్టిన ఈ ఇల్లు , ఇప్పటికీ ఏసీలు, ఫ్యాన్లు లేకపోయినా చల్లదనానికి ఆలయంగా ఉంటుంది. మట్టిపెంకులతో కట్టిన ఈ ఇంటిలో తలుపులు , ద్వారబందరాలు , చిలుకులు చూస్తే , ఆ నాటి పనితనానికి ఆశ్చర్యపోవాల్సిందే.. ఇంటిపైన పెంకులు కూడా పురాతనకాలం నాటివే.. కాకపోతే మధ్యలో సిమెంటింగ్ చేశారు. ప్రాచీనకాలం నాటి ఈ కట్టడాన్ని , ఇంటిముందు వరండాను అలాగే ఉంచి కాపాడుతున్నారు. ముత్తాతల కాలంనాటి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తిరువణ్ణామలై కి సమీపంలోని మంగళం గ్రామంలో ఇలాంటి ఇళ్ళు చాలాఉన్నాయి..

31/01/2025

ఇంట్లో టైల్స్ అయినా మార్బుల్ అయినా కొన్ని ఇళ్లలో ఇప్పటికీ పేడతో అలికి ముగ్గులేస్తారంటే నమ్మలేం.. కానీ సంప్రదాయమే ప్రాణంగా బ్రతికే వాళ్ళు ఇంకా ఉన్నారనడానికి ఇలాంటి ముత్యాల ముగ్గుల లోగిళ్ళు సాక్ష్యం..

30/01/2025

అమ్మమీద ప్రేమ దాచుకునేది..
నాన్నమీద ప్రేమ దాచుకోలేనిది ..
=================
అమ్మమీద ప్రేమ దాచుకునేది.. నాన్నమీద ప్రేమ దాచుకోలేనిది ..
చదువుకోలేని చిట్టి చేతులు కాయలు కాసాయి. అంటూ పొదలకూరు నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జానపద కళాకారిణి నోట ఆణిముత్యాల్లాంటి పాటలు.. సంగీత వాయిద్యాల రొదలేని, మనసుకు హాయినిచ్చే జానపద బాణీలో మంచి, పాటల ముత్యాల సరాగాలు..పొదలకూరు నాగార్జున స్కూల్ లో...

30/01/2025

20ఏళ్ళనుంచి ఆ బీచ్ కి పోయి సముద్రంలో కాలు పెట్టాలంటేనే వణికిపోతారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సునామీలో అక్కడ రెండు నిమిషాల్లో 650మంది సముద్రంలోకి కొట్టుకుపోయారు.. సాధరణంగా అక్కడ సముద్రం ఎప్పుడూ రంకెలు వేసినట్టు ఉంటుంది. అందుకు సాహసం చేయడం ప్రమాదకరం..

29/01/2025

వేపచెట్టుకు పాలు . బ్రహ్మంగారు ముందే చెప్పారా..?
నురగలు కక్కుతూ ఆగకుండా కారుతున్నాయి.
=====================
విడవలూరు మండలం, చౌకచర్ల గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. వేపచెట్టుకి గత పది రోజులుగా పాలు కారుతున్నాయని ప్రచారం సాగుతోంది. చెట్టు నుంచి తెల్లని ద్రవం కారుతుండటంతో భక్తులు కూడా తరలివచ్చి.. పోలేరమ్మ అంటూ పూజలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు ఆ పాలను తాగి వెళ్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ గుడి కట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం.

29/01/2025

చిన్నారుల పండరిభజనలో పల్లె తల్లి మైమరిచింది. ఆరిపోతున్న భజనల సంప్రదాయాన్ని అరచేతులు అడ్డం పెట్టి కాపాడుతుంది. బెడుసుపల్లిలో కాశీనాయన ఆశ్రమంలో జయంతి సందర్భంగా పండరి భజన ఎంత బాగుందో చూడండి..

29/01/2025

తప్పెట దరువు పల్లె జీవనంలో ఒక కళ, పల్లె గుండె చప్పుడు.. తప్పెట మోగితేనే తెలియకుండానే లయ బద్దంగా అడుగులు పడతాయి.. అలాంటి మేటి తప్పెట కళాకారుల మేళవింపులో దరువు ఎలా ఉందో చూడండి.. సీతారాంపురం మండల కేంద్రం బెడుసుపల్లిలో కాశీనాయన ఆశ్రమంలో స్వామి జన్మదిన వేడుకలు సందర్భంలో..

28/01/2025

తుక్కునుంచి తళుక్కుమనే బొమ్మలు, చెత్త నుంచి నమ్మలేని రీతిలో పరికరాలు.. అతడో సాధారణ బైక్ మెకానిక్. పేరు సీతయ్య. చదువులేకపోయినా చేయితిరిగిన నైపుణ్యం ఉంది.. బైక్ తనదగ్గరకు వస్తుంటేనే లోపం చెప్పగల మేధస్సు ఉంది. ముగ్గురు బిడ్డలలో ఇద్దరు ఇంజనీరింగ్ , మరొకరు మేనేజిమెంట్ కోర్సు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పొదలకూరులో మెకానిక్ గా పేరున్న సీతయ్యలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. ఆ కళాకారుడికి కాన్వాస్, పెయింట్లు, బ్రష్ లు అవసరంలేదు.. పనికిరాని బైక్ పార్ట్శ్ తో నమ్మలేని విధంగా బొమ్మలు చేస్తాడు. వాటిని మన దైనందిన కార్యక్రమాలకూ వాడుకునేవిధంగా ఉంటాయి. దీన్ని ఆయన హాబీగానే చేస్తుంటాడు. టేబుల్ మీద,టీవీ ల మీద,ఆఫీస్ టేబుల్స్ మీద అందంగా ఉంటే వస్తువులను చేసేస్తూ ఉంటాడు..ఇలా ఒకటి కాదు ,రెండు కాదు ఇరవై రకాలైన వస్తువులను రెడీ చేసి తన దుకాణంలో పెట్టుకుంటాడు. అలాగే సీతయ్య అందరి లాగా కాకుండా తనకి అవసరమైన కుర్చీలు, స్టాండ్లు,ఇంజన్ స్టాండ్లు, బాక్సులు ఇలా అనేక రకాలైన వస్తువులను స్వంతంగానే తయారు చేసుకుంటాడు.

28/01/2025

అది సన్నాయి అయినా, మేళం అయినా భారతీయ సాంప్రదాయ సంగీతం ముందు ఏ దేశ సంగీతమైనా తలలు వంచాల్సిందే.. సీతారాంపురం బెడుసుపల్లిలో కాశీనాయన ఆశ్రమంలో స్వామి వారి జన్మదినం సందర్భంలో..

28/01/2025

సృష్టి రహస్యం అద్బుతం.. ప్రకృతిలో ఇంత అందం దాగుందని చూసేవరకు తెలియదు.. సాలె గూటి దారాలకు మంచు ముత్యాల సరాలు ప్రకృతికి హారాలుగా.. ఎంత అద్భుతమో..

28/01/2025

ఆ చర్చికి ఇలా దోగాడుతూ ఎందుకు పోతారు..?తమిళనాడులోని వేలాంకిణి మాత చర్చివద్ద ఇలాంటి దృశ్యాలు ప్రతిరోజూ కనిపిస్తాయి. చర్చి బీచ్ ఒడ్డున ఉండటంతో అక్కడకు వచ్చే భక్తులు ఇలా ఇసుకలో మోకాలిపై దోగాడుతూ చర్చికి చేరుకుంటారు. ఇలా చేయడం వెనుక తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. తరువాత ఆ కోరికలు తీరితే మళ్ళీ ఇది విధంగా మోకాలిపై దోగాడుతూ మొక్కు తీర్చుకుంటారు. అక్కడ మేరీమాతకు జబ్బులు నయం చేసే శక్తి ఉందని చెబుతారు. అందుకే ఆమెను ఆరోగ్య మాత అని కూడా పిలుస్తారు. 16 వ శతాబ్దంలో వేలాంకిణి గ్రామంలో మజ్జిగ అమ్మే నడవలేని ఒక వికలాంగ బాలుడికి కనిపించి తన ఉనికిని మాటగా ఊరివాళ్లకు చెప్పిరమ్మని పంపిందట.. అప్పుడు బాలుడు లేచి పోయేప్పుడు వికలాంగ పరిస్థితిపోయి ,మామూలుగా నడిచిపోయాడట.. ఇది గమనించి గ్రామస్తులు కూడా అప్పటినుంచి ఆమెను ఆరోగ్య మాతగా కొలిచి , చర్చి నిర్మించారని చెబుతారు..

Address

Near Kims Hospital
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when Ndnnews Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category