NDN News

NDN News Nellore's first full HD Digital Cable Network :: NDN News

10/12/2024

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం
ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన..!
====================
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. 10వ తేదీ రాత్రికి శ్రీలంక-తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ముందుగానే హెచ్చరించారు. ఈ అల్పపీడన ప్రభావంతో చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.

10/12/2024

రెవెన్యూ సదస్సులో..
పాల్గొన్న మంత్రి ఆనం..!
===========
మర్రిపాడు మండలం, పొంగూరులో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెవిన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూలో జరిగిన అవకతవకలపై ఆనం పైరయ్యారు.

10/12/2024

జీతాలు పెంచండి..
లేదంటే పాఠాలు చెప్పలేం..!
================
రేణిగుంట సమీపంలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు.. జీతాలు పెంచాలని గత 20 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. మరో రెండు నెలల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇలా అధ్యాపకులు చేస్తున్న ఆందోళన.. విద్యార్థులను టెన్షన్ పెడుతోంది.

10/12/2024

కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేస్తుంటే..
ఇదిగో.. ఇలా నాశనం చేస్తున్నారు..!
===================
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేస్తుంటే.. మరోవైపు కొందరు ఆ రోడ్లను నాశనం చేస్తున్నారు. ట్రాక్టర్లకు కేజీ వీల్స్ బిగించి రోడ్లను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలా ఎక్కువగా పల్లెల్లో జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్లకు కేజీ వీల్స్ పొలంలో బిగించుకోవాలనే నిబంధనలు ఉన్నా అవెక్కడా అమలు కావడం లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ రోడ్లు.. ఈ కేజీ వీల్స్ వల్ల గాడులు గాడులుగా ఏర్పడి రోడ్లు పెచ్చులు పెచ్చులుగా లేచిపోతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

10/12/2024

మర్రిపాడు మండలానికి..
సోమశిల జలాలు తీసుకొస్తాం..!
==================
ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ ను పూర్తిచేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ ను రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. 2026 మార్చిలోగా ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ మొదట విడత పనులను పూర్తి చేసి పడమటి నాయుడు పల్లి, పొంగూరు, ఇసుకపల్లి, పెగళ్లపాడు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సోమశిల జలాలను తరలిస్తామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా పనిచేసిన పాలకులు ఈ రిజర్వాయర్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

10/12/2024

మంచు తుఫాన్..
చివరికి ఏమవుతుందో..?
===============
మంచు ఫ్యామిలీలో ముసలం పుట్టింది. అన్నదమ్ముల ఆస్తుల రచ్చ వీధికెక్కింది. ఈ ఆస్తుల గొడవలో మోహన్ బాబు.. తన పెద్ద కొడుకు విష్ణుకి మద్దతుగా నిలిచారు. మంచు మనోజ్ ని ఒంటరి వాడిని చేసి వీధిన పడేశారు. ఈ గొడవ కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని.. పోలీసు ఫిర్యాదుల వరకూ వెళ్ళింది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా.. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ.. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గురించే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్ లో తన ఆవేదనను పంచుకున్నాడు.

10/12/2024

సంక్షేమం మరియు అభివృద్ధి..
ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు..!
===============
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను కోటి 15 లక్షల రూపాయలతో చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే పది రోజుల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళులా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని పేర్కొన్నారు.

10/12/2024

15 రోజుల్లో.. ప్యాచ్ వర్క్స్..
మొత్తం పూర్తయిపోవాలి..!
==============
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలనీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 15 రోజుల్లోగా మరమ్మత్తు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

10/12/2024

హైవేపై మంచుతో ప్రమాదం..
డివైడర్ ఎక్కేసి బోల్తా పడ్డ కంటైనర్ ట్రక్కు..!
===================
నెల్లూరు - విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఒంగోలు సమీపంలో.. ఈ ఉదయం దట్టంగా ఏర్పడిన పొగ మంచు కారణంగా కంటైనర్ బోల్తా పడింది. కంటైనర్ ముందు భాగం డివైడర్ పైనే నిలిచిపోగా.. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ప్రమాదానికి గురైన కంటైనర్ చెన్నై నుంచి రాజస్థాన్ వెళ్తున్నట్టు డ్రైవర్ తెలిపారు.

09/12/2024

ఉరుములు, మెరుపులకు , వానజల్లుకు
పుట్టగొడుగులు ఎందుకు స్పందిస్తాయి..
====================
పుట్టల మీద చీమల గుడ్లు లాగా పుట్టగొడుగులు ఎలా మొలిచిపోతున్నాయో చూడండి . పుట్ట మొత్తం తెల్లటి గుడ్లు లాగా మొలుస్తున్నాయి. సాధారణంగా ఉరుములు, మెరుపులు ,వర్షాలు వచ్చినప్పుడు పుట్టగొడుగులుకి బాగా అనుకూలమైన సమయం . మెరుపులు కారణంగా ఏర్పడే రసాయనిక ప్రక్రియ పుట్టగొడుగులు గంటల్లో మొలిచేందుకు అవకాశం ఇస్తుంది. మెత్తటి మట్టిలోని రసాయనిక బంధాలను మెరుపు ఉత్తేజపరుస్తుంది. తద్వారా పుట్టగొడుగులు పెరిగేందుకు అవసరమైన పోషకాలను సరఫరా చేస్తుంది. . దీనివల్ల పుట్టగొడుగులు పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది . మెరుపు ,పుట్టగొడుగుల్లో జీవపదార్థమైన మైసిలియం ఒక ప్రమాద హెచ్చరికగా మారుస్తుంది. అందుకే జల్లులు, ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు పుట్టగొడుగు బయటకు వచ్చి పెరుగుతాయి. ఆ సమయంలో పుట్టగొడుగులు రేణువులను విస్తృతపరచడం ద్వారా పునరుత్పత్తికి అవకాశం ఇస్తాయి. వర్షం కారణంగా ఇలాంటి పుట్టల మీద మట్టి మరింత మెత్తగా తయారై దాని రసాయనిక ప్రక్రియలో పుట్టగొడుగుల్లో మైసీలిం పెరిగేందుకు సహకరిస్తాయి. అందువల్లనే గంటల్లోనే పుట్టగొడుగులు మొలిసిపోతాయి . మెరుపులు వర్షం జల్లు పడినప్పుడు పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మామూలుగా మెరుపుల్లో ఉండే అత్యధిక ఉష్ణోగ్రత మరియు వాతావరణంలో ఒత్తిడి , నైట్రోజన్ గ్యాస్ ను నైట్రోజన్ ఆక్సైడ్స్ గా మారుస్తుంది . ఈ నైట్రోజెనాక్సైడ్స్ వర్షపు నీటిలో కలిసి నైట్రేట్స్ ను తయారు చేస్తాయి . వర్షపు నీళ్లలో కలిసిన నైట్రేట్స్ కలిసిన నీళ్లు భూమిలోకి పోవడంతో భూమిని నైట్రోజన్తో బలం చేకూరుస్తాయి. ఈ విధంగా నైట్రోజన్ పుష్కలంగా లభించడంతో పుట్టగొడుగులు వేగంగా పెరుగుతాయి. దీనికి తోడు పుట్టల్లో సేంద్రియ పదార్ధం కూడా ఎక్కువగా ఉండటంతో పుట్టగొడుగులు అపరిమితంగా పెరిగేందుకు ఇది అవకాశం ఇస్తుంది . కృత్రిమంగా పెంచే పుట్టగొడుగులు కంటే ప్రకృతి పరంగా వచ్చే పుట్టగొడుగులు రుచిగాను పోషక విలువలు దండిగా కలిగి ఉంటాయి. అందువల్ల పుట్టగొడుగులు కొన్ని సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

09/12/2024

కేసులమీదతప్ప ప్రజా సమస్యలపై శ్రద్ద ఏదీ ?
రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు..అంతా వంచనే..
===========================
ప్రతిపక్ష నేతలు , కార్యకర్తలమీద తప్పుడు కేసులమీదతప్ప ప్రజా సమస్యలపై శ్రద్ద ఏదీ ? రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు..అంతా వంచనే..చంద్రబాబుపై మాజీమంత్రి కాకాణి ధ్వజం.

09/12/2024

కొత్త కార్యకర్తలు వచ్చినా..
పాత వారికే గుర్తింపు..!
==============
టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వనని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కొత్త కార్యకర్తలు వచ్చినా.. పాత వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు. బాలకృష్ణ ఆశీస్సులతోనే తనకు నుడా ఛైర్మెన్ పదవి వచ్చిందని తెలిపారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్పొరేటర్లు, కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు.

09/12/2024

నెల్లూరు CMR షాపింగ్ మాల్..
వారంవారం వీక్లీ డ్రాలో స్కూటీలు..!
===================
నెల్లూరు CMR షాపింగ్ మాల్ లో వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు. తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ వారం లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతకు స్కూటీ అందజేశారు.

09/12/2024

జొన్నవాడ ఆలయ ప్రతిష్ట..
క్రమంగా మసకబారుతోందా..!
==============
నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ ప్రతిష్ట మసకబారుతోంది. భక్తులపట్ల ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల తరచుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి అమ్మవారి భక్తుడైన మలిఖార్జునని చొక్కా పట్టుకొని లాగుతూ.. బయటకు నెట్టి వేశాడని దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై దేవదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పెంచలకోన దేవస్థానం ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి జొన్నవాడకు చేరుకొని.. భక్తుడి ఫిర్యాదు మేరకు ఆలయ ఈఓను విచారించారు. ఇద్దరి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.

09/12/2024

వర్షాలు కురిశాయి.. పంటలు పండుతున్నాయి..
రాష్ట్రం సుభిక్షంగా ఉంది..!
=====================
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. చక్కటి వర్షాలు కురిసి.. పాడిపంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు. నదులు పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు.

09/12/2024

మారుతీ కారుని..
రోల్స్ రాయిస్ లా మార్చేశాడు.. !
================
ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనదేశంలో కుర్రాళ్ళు, చిత్రవిచిత్రమైన అవిష్కరణలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. శాస్త్రవేత్తలకు కూడా రాని ఆలోచనలు మన భారతీయులకు వస్తుంటాయి. పెద్ద పెద్ద సమస్యలకి కూడా సింపుల్ గా పరిష్కారం వెతికేస్తూ ఉంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన ఇప్పుడు అతన్ని ఫేమస్ చేసేసింది.

09/12/2024

అర్ధరాత్రి.. అడవిలో..
అసలేం జరిగిందంటే..?
===============
రాపూరు మండలంలోని పెనుబర్తి గ్రామంలో జంతువులను వేటాడే క్రమంలో సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. పెనుబర్తి గిరిజన సంఘానికి చెందిన తాళ్ల సుధాకర్, సొంటె మణి, యాకసిరి శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి శనివారం అర్ధరాత్రి సమయంలో పెనుబర్తి గ్రామ అడవుల్లో వేటకు వెళ్లారు. వేటాడే సమయంలో సొంటే మణి జరిపిన కాల్పుల్లో భాగంగా తుపాకీ అదుపుతప్పి తాళ్ల సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో సుధాకర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచారణలో భాగంగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, రాపూరు సీఐ విజయ్ కృష్ణ, కండలేరు ఎస్సై రామకృష్ణ, పాల్గొని సంఘటన స్థలాన్ని పరిశీలించి, అక్కడ దొరికిన ఆధారాలను సేకరించారు. మందు గుండ్లు, వేటకు వాడే టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

08/12/2024

స్కూల్స్ లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
చంద్రబాబు , టిడిపి ప్రచారం కోసమే స్టంట్ ..
=======================
వైసిపి హయాంలో పాఠశాల విద్య అత్యున్నత స్థాయికి చేరిందని , ఇప్పుడు దానికి అధోగతి పట్టిందని ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి అన్నారు. వైసిపి హయాంలో అన్నివిధాలా ఇంటర్నేషల్ స్థాయిలో విద్యావ్యవస్థను తీర్చిదిద్దితే , ఇప్పుడు చెడగొట్టారని అన్నారు. నాడునేడు పనులు ఇంతవరకు ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. రాయచోటిలో టీచర్ పై విద్యార్థుల దాడి దారుణమని ఖండించారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చర్యతీసుకోలేదని అన్నారు.

Address

Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when NDN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NDN News:

Videos

Share


Other News & Media Websites in Nellore

Show All