Rayalaseema Joint Action Committee

Rayalaseema Joint Action Committee A page to bring together people who wish to be a part of the struggle for the rights of Rayalaseema. A fight for justice. A call for action. c. BAR

We are the believers who refuse to be back down in the face of the over whelming odds....
a. A government which subscribes to the philosophy of might being right...
b. a biased media which believes in censorship. a disinterested class of politicians who we would't wish for our worst enemies. They can't and will not stop us. We shall and will prevail my brothers and sisters. This group aims to bri

ng us together, to coordinate and work towards the common goal of creating a equitable Rayalaseema surpassing even its past glory. Despite a variety of people, social groups, political groups putting forward various demands before the new government in light of the bifurcation of Andhra Pradesh the issue is intentionally or otherwise not being sufficiently covered by the various papers. Leading us to believe that the newspapers have imposed a ban on the reporting of this very important issue of development of Rayalaseema. Even the reports which are carried by the newspapers are published in the local edition. In view of the implicit ban. I request any member who come across any news reports in the local edition of news paper to post a scanned copy of the news report in this group. The most important task on hand is to ensure that we do not lose hope and ensure that people are made aware of the various activities being organised and highlight the demands being made in the different parts of Rayalaseema. Do not be disheartened there are many more like you who's hearts burn and bleed for the plight of our Rayalaseema. We shall not rest till we get the justice due to us.

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన మరియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8 వ ...
15/12/2024

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన మరియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8 వ రాయలసీమ మహాకవి సమ్మేళనం లో "వర్తమాన అంశాలపై కూడా రచయితలు, కవులు, కళాకారులు దృష్టి పెట్టాల్సిన అవరాన్ని వివరిస్తూ" రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రసంగం నుండి ...

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన రియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 2024 న అనంతపురంలో నిర్వహించిన 8...

♦️ కృష్ణా డెల్టా హక్కుగా ఉన్న నీటిని వినియోగించుకోవడంలో విఫలమై, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని తరలించి...
01/12/2024

♦️ కృష్ణా డెల్టా హక్కుగా ఉన్న నీటిని వినియోగించుకోవడంలో విఫలమై, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని తరలించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లా సాగునీటి హక్కులకు భంగం కలిగించడం "సాగునీటి సమగ్ర విధానమా" ?

👉 "ఆంధ్రప్రదేశ్ నీటి విధానం, సమస్యలు - పరిష్కారాలు " అంశంపై శుక్రవారం బాపట్ల పౌర సమాఖ్య నిర్వహించిన సెమినార్ లో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రసంగం లోని ఒక భాగం.

రాయలసీమ సాగునీటి సాధన సమితి

"ఆంధ్రప్రదేశ్ నీటి విధానం, సమస్యలు - పరిష్కారాలు " అంశంపై నవంబర్ 29, 2024 శుక్రవారం అంబేద్కర్ భవన్, బాపట్లలో పౌర సమాఖ్.....

https://youtu.be/TDZ3W0anROwరాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఆపండి ....
18/11/2024

https://youtu.be/TDZ3W0anROw

రాయలసీమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను ఆపండి ....

రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం నవంబర్ 18, 2024 న రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయం, నంద్యాలలో నిర్వహించిన సం....

🟡 శ్రీబాగ్ ఒడంబడిక, రాజ్యాంగం, రాష్ట్ర విభజన చట్టం రాయలసీమకు కల్పించిన హక్కులను గౌరవించండి ...🟢 హైకోర్టును కర్నూలు లో ఏర...
17/11/2024

🟡 శ్రీబాగ్ ఒడంబడిక, రాజ్యాంగం, రాష్ట్ర విభజన చట్టం రాయలసీమకు కల్పించిన హక్కులను గౌరవించండి ...

🟢 హైకోర్టును కర్నూలు లో ఏర్పాటు చేయండి ....

🛑 పాలన వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ఏర్పాటు చేసిన కార్యాలయాల తరలింపును నిలుపుదల చేయండి ....

🟣 రాయలసీమ సాగునీటి రంగానికి బడ్జెట్ లో 42 శాతం నిధులు కేటాయించండి ....

👉 "రాయలసీమ హక్కుల దినోత్సవం" సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్

నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో "రాయలసీమ హక్కుల దినోత్సవం"

రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒడంబడిక జరిగి సరిగ్గా 87 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒప్పంద పత్రంలోని కీలక అంశాలైన కృష్ణా, తుంగభద్ర నదీ జలాలలో ప్రథమ ప్రాధాన్యత, పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని, హైకోర్టులాంటి హామీలను నేటికీ ఏర్పాటు చేయకపోవడం పట్ల రాయలసీమ సాగునీటి రంగంతో పాటు అన్ని రంగాలలో వెనుకబడటమే గాకుండా పాలనా వికేంద్రీకరణలో కూడా రాయలసీమ ప్రాంతం వివక్షతకు గురవుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షతకు వ్యతిరేకంగానే ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనదనీ, రాయలసీమకు తెలుగు రాష్ట్రంలో పాలన, అభివృద్ధి, వికేంద్రీకరణలో ప్రాధాన్యత హామీ శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా కల్పించడం వలననే తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అందించారని ఆయన గుర్తు చేసారు.
రాయలసీమకు హక్కులను కల్పిస్తూ "శ్రీ బాగ్ ఒడంబడిక" నవంబర్ 16, 1937 న రూపొందించిన సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి అధ్యక్ష్యతన శనివారం నంద్యాల పట్టణంలోని భగీరథ సమావేశ మందిరంలో రాయలసీమ హక్కుల దినోత్సవాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్వహించింది.
ఈ సందర్భంగా వై.యన్.రెడ్డి మాట్లాడుతూ..
భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్డం కూడా రాయలసీమకు హక్కులను కల్పించినప్పటికీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ హక్కుల అమలు దిశగా అడుగులు వేయడంలో విఫలమయ్యాయనీ, తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక వెనుకకు నెట్డివేయబడిందని విమర్శించారు.
ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను చేపడుతామని అంటూనే రాయలసీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులలో తీవ్ర వివక్షతను చూపడం వలన కృష్ణా, తుంగభద్ర నదీ జలాలలో హక్కులు ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.

స్వర్గ లోకంలో ఉన్న గంగను భూలోకానికి తేవడంలో భగీరథుడు విజయం సాధించారనీ, బొజ్జా దశరథరామిరెడ్డి కూడా మన నీటి హక్కుల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారనీ ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మనము కూడా ఒక్కో భగీరథుడిలాగా తయారై మన నీటిని మనం సాధించుకోవాలని ఈ భగీరథ సమావేశ మందిరం నుంచి రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.

ఆంద్రాబ్యాంక్ విశ్రాంత ఎజియమ్ శివనాగిరెడ్డి మాట్లాడుతూ..

రాయలసీమ సాంప్రదాయక వనరులైన చెరువుల నిర్మాణం, నిర్వహణ పట్ల పాలకుల నిర్లక్ష్యం వలన రాయలసీమ జల సంరక్షణలో విఫలమయిందనీ, రాయలసీమ సాగునీటి రంగానికి మొక్కుబడిగా అరకొర నిధులు కేటాయిస్తూ గోదావరి - పెన్నా నదుల అనుసంధానం చేపడుతామంటూ రాయలసీమను ఆశల పల్లకీలలో ఊరేగిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ సాగునీటి రంగాన్ని చక్కదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 శాతం భూభాగం వున్న రాయలసీమకు రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 42 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..

రాయలసీమ సమగ్రాభివృద్ది కొరకై రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వంలోని గత పన్నెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ బాగ్ ఒడంబడికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతు నాయకులు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, M.C. కొండారెడ్డి తదితరులు మాట్లాడుతూ..

రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు గురించి మాట్లాడని పాలకులు పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో ఏర్పాటు అయిన హ్యూమన్ రైట్స్ కమీషన్, లోకాయుక్త, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్, కొప్పర్తిలో ఏర్పాటు అయిన శిక్షణ కేంద్రాన్ని అమరావతికి తరలించడానికి చట్టాలు రూపొందించే ప్రక్రియను చేపట్టడం గర్హనీయమని ఆందోళన వ్యక్తం చేసారు.

తెలుగు ప్రజల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడిన చారిత్రక అంశాన్ని గుర్తు ఉంచుకొని అయినా, ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించే పాలకుల చర్యలకు ఇకనైనా ముగింపు పలికి, రాయలసీమ‌ హక్కులను గౌరవించి అమలు చేయాలని రాయలసీమ హక్కుల దినోత్సవం నాడు ప్రభుత్వాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి,
పాణ్యం మండలం రైతు నాయకులు మురళీ ధర్ రెడ్డి,రామ ప్రసాదరెడ్డి, రామసుబ్బారెడ్డి, వెలుగోడు రైతు సంఘం నాయకులు నస్రుల్లా ఖాన్, నంద్యాల మండల రైతు నాయకులు మాజీ సర్పంచ్ రామ గోపాల్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, క్రిష్ణమోహన్ రెడ్డి, మహమ్మద్ పర్వేజ్, భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, రాజేశ్వరరెడ్డి, క్రిష్ణా రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పులి కొండన్న, గోస్పాడు మండల రైతు నాయకులు చిన్న రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి, బండిఆత్మకూరు మండల రైతు నాయకులు శివరామిరెడ్డి,సంజీవరెడ్డి, గాయకుడు గౌడ్, షణ్ముఖరావు, మహానంది మండల రైతు నాయకులు సాకేశ్వరరెడ్డి, సదాశివరెడ్డి,శిరివెల్ల మండల రైతు నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేటి దినపత్రికలలో వచ్చిన వార్తా‌ కథనాలు, ఛాయా చిత్రాలు

రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం - నవంబర్ 18, 2024
17/11/2024

రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం - నవంబర్ 18, 2024

సాగునీటి వనరులు -  సక్రమ వినియోగం - భూగర్భ జలాల లభ్యత మెరుగుపరచడం  - పర్యావరణ పరిరక్షణ  తదితర అంశాలలో భాగస్వాములందరినీ వ...
31/10/2024

సాగునీటి వనరులు - సక్రమ వినియోగం - భూగర్భ జలాల లభ్యత మెరుగుపరచడం - పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలలో భాగస్వాములందరినీ విశ్వాసంలోనికి తీసుకొని ఒక స్పష్టమైన అవగాహనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి చేపట్టవలసిన విధానాలను రూపొందించాల్సిన అవసరాలపై సమాజంలోని కీలకమైన వ్యక్తులతో సంప్రదింపుల్లో భాగంగా వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు జొన్నలగడ్డ రామారావు, విశ్రాంత విద్యుత్ రంగ సాంకేతిక నిపుణులు అన్నె సాంబశివరావు గార్లతో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అక్టోబర్ 29, 2024 న గుంటూరులోని వారి స్వగృహాలలో కలిసిన సందర్భంలోని ఛాయా చిత్రాలు.

అధికారంలో ఉన్న  రాజకీయ పార్టీలకు ప్రజలను మభ్య పరిచే లక్ష్యంతో చేసే ప్రకటనలపై  స్పష్టమైన అవగాహన ఉంది. వాటిలో మచ్చుకు రెండ...
29/10/2024

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రజలను మభ్య పరిచే లక్ష్యంతో చేసే ప్రకటనలపై స్పష్టమైన అవగాహన ఉంది. వాటిలో మచ్చుకు రెండు ప్రకటనలు ...

1. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.

2. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉన్న "స్పష్టత"ను సమాజం అర్థం చేసుకొవడానికి ఎన్ని అవరోదాలో !

Address

Srinivasa Nagar
Nandyal

Alerts

Be the first to know and let us send you an email when Rayalaseema Joint Action Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share