01/12/2023
👉🔹 దళిత మహిళా ఉద్యమ స్ఫూర్తి ప్రదాత - ఈశ్వరీ భాయి గారు 🔹👈
మహిళలు అంటే దిగువ స్థాయి నాగరికులుగా భావించే రోజులు అవి,, అలాంటి సమయంలో ఒక మహిళ, అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా ఎదగడం,, పురుషులతో పోటీ పడడం లాంటివి ఊహించుకోవడానికే కష్టం.. అందునా, సామాజికంగా అత్యంత వెనుకబడిన, మాల కులం నుండి, ఒక మహిళా నాయకురాలు స్వతంత్రంగా పైకి ఎదిగి, తెలుగు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు.. మాలల జన్యువుల్లో ఇంకిపోయిన "నాయకత్వ, పోరాట లక్షణాలకు" మరో ఉదాహరణ "జెట్టి ఈశ్వరీ భాయి" గారు..
అసెంబ్లీలో దళితుల వాణి బలంగా వినిపించిన రాజకీయ నాయకురాలిగా, మహిళల సామాజిక ఉన్నాయి కోసం కృషి చేసిన సమాజికవేత్తగా,, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా, ఈశ్వరీ భాయి గారు దళిత ఉద్యమాలకు అందించిన స్ఫూర్తి,, ఆవిడ జయంతి సందర్బంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి..
🔹 ఈశ్వరీభాయి గారి జీవితం 🔹
డిసెంబర్ 01, 1918 న సికింద్రాబాద్ నగరంలో జన్మించిన ఈశ్వరీ భాయి గారు, బాల్యంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. 13 ఏళ్ల వయసులో పుణాలో డెంటల్ డాక్టరుగా పనిచేస్తున్న, జెట్టి లక్ష్మనారాయణ గారిని వివాహం చేసుకున్నారు.. వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించి ఆ రోజుల్లోనే ఆవిడ మెట్రికులేషన్ పాస్ అయ్యి పరోపకారిణి విద్యాలయంలో ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారు..
ఆ సమయంలో ఆవిడ మహిళల అభ్యున్నతి కోసం, మహిళలు తమ కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడడం కోసం వాళ్లకు టైలరింగ్, పెయింటింగ్ వంటి వాటిలో ఉచిత శిక్షణ క్యాంపులు ఏర్పాటు చేసేవారు..
🔹 బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ప్రభావం 🔹
బాబాసాహెబ్ 1944 సంవత్సరంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ (SCF) పార్టీ స్థాపించాక, తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకున్నారు ఈశ్వరీ భాయి గారు.. SCF హైదరాబాద్ కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలోనే ఆవిడ 1950లో సికంద్రబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో "కౌన్సిలర్"గా ఎన్నిక అయ్యారు.. అలా ఎన్నికైన మొట్ట మొదటి దళిత మహిళ ఈశ్వరీభాయి గారు..
బాబాసాహెబ్ కు అత్యంత సన్నిహితంగా నాయకురాలిగా హైద్రాబాద్ రాజకీయాలను ఆవిడ ప్రభావితం చేస్తూ వచ్చారు.. 1956 లో బాబాసాహెబ్ తో పాటు బౌద్ధ ధమ్మ స్వీకరించిన ఈశ్వరీభాయి గారు,, బాబాసాహెబ్ తదనంతరం రిపబ్లికన్ పార్టీగా రూపాంతరం చెందిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీని తెలుగు రాష్ట్రాలలో నడిపించే పూర్తి బాధ్యత తీసుకున్నారు.. 1958 లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కి జనరల్ సెక్రటరీ గా ఎన్నికయ్యారు.. ఆ సమయంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టించి, నాలుగు కౌన్సిలర్ స్థానాలు గెలిపించారు..
రిపబ్లికన్ పార్టీ తరపున 1967 ఎన్నికల్లో, ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈశ్వరీ భాయి గారు.. రిపబ్లికన్ పార్టీ దేశవ్యాప్తంగా చేసిన భూపోరాటాల వలన 3 లక్షల ఎకరాల భూమి దళితులకు పంచబడింది.. ఇప్పుడు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దళితులు అనుభవిస్తున్న భూములు అన్నీ,, ఈశ్వరీభాయి గారి నాయకత్వంలో భూపోరాటల ద్వారా సాధించిన భూములే..
🔹 కంచికచర్ల కొటేసు ఉదంతం - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిప్పులు చెరిగిన ఈశ్వరీభాయి గారు 🔹
వందల సంవత్సరాలుగా దళితుల మీద అత్యాచారాలు జరగడం మాములు విషయంగా భావించబడుతున్న తరుణంలో,, కంచికచర్ల కొటేసు ఉదంతం,, ఒక రాజకీయ దుమారాన్నే లేపింది.. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రికార్డెడ్ అట్రాసిటీ కంచికచర్ల కొటేసు హత్య, దేశవ్యాప్తం దృష్టిని ఆకర్షించడానికి కారణం ఈశ్వరీభాయి గారు మాత్రమే ..
కంచికచర్ల కొటేసు ఉదంతాన్ని 1968 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చిన ఈశ్వరీభాయి గారి ప్రసంగాన్ని అడ్డుకుంటూ,, పెద్దారెడ్డి అనే సభ్యుడు,, "దొంగతనం చేస్తే చంపరా ఏంటి..?? " అని హాస్యస్పదంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.. కోపం కట్టలు తెంచుకున్న ఈశ్వరీభాయి గారు, తన చెప్పు తీసి, పెద్ద రెడ్డి మీద విసిరి,, నిండు అసెంబ్లీ ప్రాంగణంలో అతన్ని కొట్టడానికి ముందుకు ఉరికింది.. నిర్ఘాంతపోయిన పెద్దా రెడ్డి బయటకు పరుగులు తీసాడు,, మొత్తం అసెంబ్లీ ఈశ్వరీభాయి గారిని ఆపి, కూర్చోబెట్టి శాంతింపచేశారు..
ఈ ఉదంతం అప్పట్లో దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.. కంచికచర్ల కొటేసు ఉదంతం అప్పట్లోనే బీబీసీ వారు, తమ రేడియో ద్వారా టెలికాస్ట్ చేసే స్థాయికి వెళ్ళింది.. కంచికచర్ల కొటేసు హత్య, ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమాలలో మొదటి మైలురాయిగా ఎంతటి స్ఫూర్తిని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..
🔹 ఈశ్వరీభాయి గారు - ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 🔹
1969 లో పతాక స్థాయికి చేరిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఈశ్వరీభాయి గారు.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఏర్పాటు అయిన "తెలంగాణ ప్రజా సమితి" (TPS) కి వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన ఈశ్వరీభాయి గారు.. తెలంగాణ పోరాటంలో పాల్గొని 8 నెలలు జైలు పాటు జీవితం అనుభవించారు..
1972 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో,, తెలంగాణ ప్రజాసమితి బలపరిచి RPI అభ్యర్థిగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఈశ్వరీభాయి గారు.. ఈ సమయంలో మహిళ మరియు శిశు సంరక్షణ శాఖకు chair person గా ఎన్నికై,, ""బాలికలకు ఉన్నత చదువుల వరకు ఉచిత విద్య" పధకానికి రూపకల్పన చేసి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి, పాస్ చేయించారు.. ఈ పధకం తరువాతి కాలంలో ఎన్నో రాష్ట్రాల అసెంబ్లీలు తమ రాష్ట్రంలో కూడా అమలుచేసాయి...
బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పూర్తితో జీవితాంతం,, పీడిత జాతి, మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈశ్వరీభాయి గారు 25 ఫిబ్రవరి 1991 న పరినిర్వాణం చెందారు..
🔹 ఇప్పటి తరం పూర్తిగా మర్చిపోయిన ఈశ్వరీభాయి గారు 🔹
దేశవ్యాప్త దళిత ఉద్యమాలను ప్రభావితం చేసినప్పటికీ,, మహిళా ఉద్యమాలకు ఇంతటి స్ఫూర్తి, దిశా నిర్దేశం చేసిన ఈశ్వరీభాయి గారిని, దళిత సంఘాలు కూడా గుర్తు చేసుకొకపోవడం బాధాకరం.. దానికి కారణం ఆవిడ మాల కులస్తురాలు కావడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మాదిగ మెహర్బానీ వాదానికి బాగా అలవాటుపడిన దళిత సంఘాలు,, ఉద్దేశపూర్వకంగా మాల నాయకుల త్యాగాలను గుర్తింపును నాశనం చేసే క్రమంలో ఈశ్వరీభాయి గారి పేరుని కూడా ఎక్కడా వినిపించకుండా చేశారు..
చివరికి ప్రత్యేక తెలంగాణ కోసం గళం ఎత్తిన మొదటితరం నాయకురాలు అయిన ఈశ్వరీభాయి గారిని, తెలంగాణ ప్రభుత్వాలు కూడా విస్మరించాయి.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో,, ఈశ్వరీభాయి గారి జీవిత చరిత్రను, తెలంగాణ బడుల్లో ఒక పాఠ్యఅంశంగా చేరుస్తాము అని, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఇచ్చిన వాగ్దానం కూడా, ఇప్పటికీ అమలు కాలేదు..
💐💐💐💐 ఈశ్వరీభాయి గారి జయంతి సందర్భంగా,, ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటు... ఈ పోస్టు అందరికీ చేరేలా చూడండి..