Janata News9

Janata News9 Janata News 9 is an independent and unbiased digital news platform reporting on issues from the Telugu speaking states.

వైసీపీ నాయకుడా అక్రమ రిజిస్ట్రేషన్ .. రాజకీయ నాయకుల అండతో 50 కోట్ల స్థలం ఖబ్జా కు గురైందా ..?https://youtu.be/m1huGZsj7L...
04/03/2024

వైసీపీ నాయకుడా అక్రమ రిజిస్ట్రేషన్ ..
రాజకీయ నాయకుల అండతో 50 కోట్ల స్థలం ఖబ్జా కు గురైందా ..?
https://youtu.be/m1huGZsj7L0?si=WUsTa1KltOBBIEz6

మునిసిపల్ స్థలం ఖబ్జా...స్థలం విలువ 50 కోట్లు...ఖబ్జా చేసింది ఎవరు..?త్వరలో పూర్తి వివరాలతో మీ ముందుకు...https://youtu.b...
01/03/2024

మునిసిపల్ స్థలం ఖబ్జా...
స్థలం విలువ 50 కోట్లు...
ఖబ్జా చేసింది ఎవరు..?
త్వరలో పూర్తి వివరాలతో మీ ముందుకు...
https://youtu.be/rE8aufzEaT4?si=vwprSIxto2rHCP-z

మేము రాజకీయానికి  పనికి రారా.. బాబు .. ! ఒక్క సీట్  భిక్షానా ..? ముస్లిం మైనార్టీల ద్రోహి నారా చంద్రబాబు నాయుడు...!!!htt...
28/02/2024

మేము రాజకీయానికి పనికి రారా.. బాబు .. !
ఒక్క సీట్ భిక్షానా ..?
ముస్లిం మైనార్టీల ద్రోహి నారా చంద్రబాబు నాయుడు...!!!
https://youtu.be/V-AQxrK-fPk?si=EtsWoMvKFLj-Ehlb

ఆటో డ్రైవర్ మృతి .. ఇది హత్య నా .. లేక ఆత్మహత్య నా ...?https://youtu.be/kOw9rkmTgnQ?si=QY0eogLe1iJLNfckజనతా న్యూస్ 9 : ప...
21/02/2024

ఆటో డ్రైవర్ మృతి .. ఇది హత్య నా .. లేక ఆత్మహత్య నా ...?
https://youtu.be/kOw9rkmTgnQ?si=QY0eogLe1iJLNfck

జనతా న్యూస్ 9 : పది రోజుల క్రితం ఓబులేసు అనే బాబా నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఓ మహిళా చెప్పుతో కొట్టింది అని పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడడం జరిగింది చికిత్స కోసం దాదాపు 10 రోజులు నుండి ఉదయానంద్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు చికిత్స ఫలించక కొద్దిసేపటి క్రితమే మృతి చెందడం జరిగింది.

మైనార్టీలు టీడీపీ వైపే : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్janata news9https://youtu.be/MAyn77PyM2w?si=AxH...
21/02/2024

మైనార్టీలు టీడీపీ వైపే : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్
janata news9
https://youtu.be/MAyn77PyM2w?si=AxH8V3HMU4Y9Rhey

వైసీపీ టికెట్ శిల్ప కి లేదు : టీడీపీ నాయకులూ , NMd ఫరూఖ్ మీడియా సమావేశం .https://youtu.be/sZahlzInRrI?si=evo0MjnUFnKucS_...
18/02/2024

వైసీపీ టికెట్ శిల్ప కి లేదు : టీడీపీ నాయకులూ , NMd ఫరూఖ్ మీడియా సమావేశం .
https://youtu.be/sZahlzInRrI?si=evo0MjnUFnKucS_y

శిల్పా ఇంటి పని మనుషులకు మున్సిపాలిటీ జీతాల ..?   శిల్పా వల్ల వైసీపీ పార్టీ కి నష్టం జరుగుతుంది : గోకుల్ రెడ్డిhttps://y...
17/02/2024

శిల్పా ఇంటి పని మనుషులకు మున్సిపాలిటీ జీతాల ..?
శిల్పా వల్ల వైసీపీ పార్టీ కి నష్టం జరుగుతుంది : గోకుల్ రెడ్డి
https://youtu.be/9aqQHuUINvM?si=xDYtkegk8u8bzszP

23/11/2023

జనతా న్యూస్ 9 : మాజీ మంత్రి , మాజీ MLA , మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు NMd ఫరూక్ కు నంద్యాలలో వ్య.....

23/11/2023







జనతా న్యూస్ 9 : మాజీ మంత్రి , మాజీ MLA , మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు NMd ఫరూక్ కు నంద్యాలలో వ్య.....

https://youtu.be/NgLRlALpjZYఅది ఐదు ఎకరాల పచ్చని పొలం. చెమటోర్చి పండించిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి, కోట్లకు ...
16/07/2023

https://youtu.be/NgLRlALpjZY

అది ఐదు ఎకరాల పచ్చని పొలం. చెమటోర్చి పండించిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి, కోట్లకు పడగెత్తిన ఒక రాజకీయ నాయకుడి మేనల్లుడు, కౌలు డబ్బులు చెల్లించలేదంటూ రాబందు అవతారం ఎత్తి పంటను సర్వనాశనం చేయడమే కాకుండా మహిళ రైతుపై దాడికి తెగబడ్డాడు.

https://youtu.be/n88Hhs43MH0సమస్యల మీద చర్చలు తక్కువ...! అరుపులు ఎక్కువ ...!
01/05/2023

https://youtu.be/n88Hhs43MH0

సమస్యల మీద చర్చలు తక్కువ...! అరుపులు ఎక్కువ ...!

అససుపత్రిలో బిల్లులు బదులు ...! బెదిరింపులు ..Vedio Link..👇👇👇
19/01/2023

అససుపత్రిలో బిల్లులు బదులు ...! బెదిరింపులు ..

Vedio Link..👇👇👇

నంద్యాల టిడ్కో గృహల సభ అట్టర్ ప్లాప్ ... ?Vedio Link.👇👇👇
09/01/2023

నంద్యాల టిడ్కో గృహల సభ అట్టర్ ప్లాప్ ... ?

Vedio Link.👇👇👇

5 కోట్ల రూపాయలతో ప్రభత్వ ఆసుపత్రి అభివృద్ధి ..Vedio Link 👇👇👇
06/01/2023

5 కోట్ల రూపాయలతో ప్రభత్వ ఆసుపత్రి అభివృద్ధి ..

Vedio Link 👇👇👇

ఇచ్చింది 1050 పింఛన్లు... పీకింది ఎన్ని పింఛన్లు...?Vedio Link👇👇👇👇👇
04/01/2023

ఇచ్చింది 1050 పింఛన్లు... పీకింది ఎన్ని పింఛన్లు...?

Vedio Link👇👇👇👇👇

31/12/2022

కేజీ బంగారం , వెండి , కార్లు, బైకులు స్వాధీనం..12 మంది అరెస్ట్ ..

Vedio Link..👇👇👇👇👇👇

ఓ జర్నలిస్టు దుర్మార్గుడైతే ఏం జరుగుతుంది...?జర్నలిస్టులు సమాజానికి దర్పణాలు.. కానీ ఆ దర్పణాలు మారుతున్న కాలంలో  బాగా పన...
29/12/2022

ఓ జర్నలిస్టు దుర్మార్గుడైతే ఏం జరుగుతుంది...?

జర్నలిస్టులు సమాజానికి దర్పణాలు.. కానీ ఆ దర్పణాలు మారుతున్న కాలంలో బాగా పని చేస్తున్నాయా..? లేక అమ్ముడుతుపోతున్నాయా..? అన్న అనుమానం కొందరికి తప్పకుండా కలుగుతుంది. అయితే ఓ రిపోర్టర్ మంచోడైతే ఏం జరుగుతుంది.. ? చెడ్డవాడైతే ఏం జరుగుతుంది..? అన్న అంశంపై ఓ పాత్రికేయుని స్వీయ అనుభవం ఇది. ఇటీవల సోషల్ మీడియాలో జర్నలిస్టు గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయిన ఈ సందేశం మీ అందరి కోసం...

ఓ జర్నలిస్ట్ ఒకరోజు ఎప్పటిలాగే తహశీల్దార్ ఆఫీసు సందర్శనకు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ రైతు దిగాలుగా కూర్చున్నాడు. ఏం అయిందని అడిగితే.. ‘అయ్యా.. మా అయ్య పేర మీద ఉన్న భూమిని నా పేరు మీదికి ఎక్కియ్యడానికి.. మా ఊరి వీఆర్వో పది వేలు తీసుకున్నాడు. ఆరు నెలలు దాటింది. ఆఫీసుకు వస్తే కనబడటంలేదు. ఎమ్మార్వో సార్​కు చెప్పుకుందామన్నా.. సార్​బిజీగా ఉన్నాడని లోపలికి పోనివ్వడంలేదు... అని తన గోడు వెళ్ల బోసుకున్నాడు. విషయం ఏమిటంటే రైతు దగ్గర డబ్బులు తీసుకున్న వీఆర్వో పని చేయకుండా మొఖం చాటేస్తున్నాడు. పైగా రైతు తహసీల్దార్​ దగ్గరకు పోకుండా.. గేటు వద్ద ఉండే అటెండర్​కు డబ్బులు ఇచ్చి మరీ ఆపుతున్నాడు. ఈ విషయం గ్రహించిన విలేకరి రైతును తీసుకొని నేరుగా.. తహసీల్దార్​దగ్గరకు వెళ్లాడు. తప్పు దొరికింది కదా.. అని ఆఫీసర్​పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా.. సర్​ ఈ రైతు పరిస్థితి ఇదీ అని నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు.స్పందించిన తహసీల్దార్​వీఆర్వోను పిలిపించి చెడామడా వాయించి రూ. 10 వేలు రైతుకు తిరిగి ఇప్పించారు. రెండు రోజుల్లో పని పూర్తి చేసి నేనే పట్టాదారు పాస్ బుక్​ మీ ఇంటికి పంపుతా అని తహసీల్దార్​ రైతుకు చెప్పారు. రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు తిరిగితే గానీ పని ఒక్క రోజులో అయింది. పైగా తన డబ్బులు తనకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత రైతు మన విలేకరికి రూ. 5 వేలు ఇవ్వబోయాడు. డబ్బులు ఏం వద్దు పెద్దాయన జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే చిన్న విషయాన్ని పెద్దగా చేసి తహసీల్దార్​ ఆఫీసులో వసూళ్ల పర్వం అని హెడ్డింగులు పెట్టి అక్కడ పని చేసే వారందరూ అవినీతి పరులే అన్నట్లుగా వార్త రాయకుండా.. విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో మన రిపోర్టర్​ అంటే తహసీల్దార్​కు గౌరవం పెరిగింది. అదే సమయంలో సదరు వీఆర్వోకు భయం పెరిగింది. రైతుకు మనపై నమ్మకం కలిగింది. ఇలా కొంతకాలం గడిచింది. మండల పరిధిలోని ఓ తండాలో అత్తమామ ఓ కోడలిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. రిపోర్టర్లు అందరూ వెళ్లారు. డెడ్​బాడీ చూశారు. మన రిపోర్టరూ వెళ్లాడు. డెడ్​బాడీ చూశాడు. కొంత అనుమానం కలిగింది. అందరూ ఫొటో తీసుకొని తిరిగొచ్చారు. ఇంతలో మన రిపోర్టర్​ఫోన్​ రింగ్​అయింది. లిఫ్ట్​ చేయగా.. సార్​ మా తండాలో ఆ అమ్మాయిని అత్త, మామనే రాత్రివేళ చంపేశారు. మా ఇంటి పక్కనే ఉండటంతో మాకు అరుపులు వినిపించాయిని ఓ వ్యక్తి చెప్పాడు. మన రిపోర్టర్​అనుకున్నది నిజమే అయింది. అది సరే పెద్దమనిషి ఇంతకీ నువ్వు ఎవరూ? అని అడిగాడు.. అయ్యో సార్​ నాకు తహసీల్దార్​ కార్యాలయం లో వీఆర్వోతో డబ్బులు ఇప్పించారు కదా... అన్నాడు. మన రిపోర్టర్​కు గుర్తొచ్చింది. రైతు చెప్పిన వివరాలతో వార్త ఫైల్​చేశాడు.
అన్ని పేపర్లలో వివాహిత ఆత్మహత్య అని వార్త వచ్చింది. మన విలేకరి పత్రికలో మాత్రం.. కట్నం కోసం హత్య అనే హెడ్డింగ్​తో ఫస్ట్​పేజీలో పేలింది. పలు అనుమానాలు అన్న కోణంలో వార్త వివరంగా రాశాడు. పోలీసులు సహా.. మిగతా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. మండల కేంద్రంలో ఉండే విలేకరికి ఎక్కడో తండాలో జరిగిన హత్య విషయం ఎలా తెలిసిందా? అని. పోలీసులు దర్యాప్తు చేస్తే..హత్య నిజమేనని తేలింది. పోలీసులకు కూడా మన రిపోర్టర్ పై గౌరవం, భయం రెండూ పెరిగాయి. మన రిపోర్టర్​ వార్త ద్వారా సెంటర్​లో కింగ్​అనిపించుకున్నాడు.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. ఇక్కడ మన రిపోర్టర్​మాట సాయంతో ఓ రైతుకు సాయం చేస్తే.. ఆ సాయం మరిచిపోని రైతు.. ఓ వార్తకు మంచి సోర్స్​గా ఉపయోగపడ్డాడు.
అదే రిపోర్టర్ వీఆర్వో డబ్బులు తీసుకున్న విషయంపై మన రిపోర్టర్​ వీఆర్వోను కలిసి డబ్బులు తీసుకున్న విషయంపై వార్త రాస్తా అంటూ బ్లాక్​మెయిల్​చేసి ఉంటే.. ఆ రోజు రూ. 10 వేలు జేబులో పడేవి కావొచ్చు. అలా చేసి ఉంటే ఆ వీఆర్వో ఆ రిపోర్టర్​కు ఓ రేటు కడతాడు. ఫలానా రిపోర్టర్​కు ఇంత ఇస్తే.. వార్త రాయడు అని. ఒక్కసారి అలాంటి పేరు వస్తే ఎన్ని మంచి పనులు చేసినా.. మంచి పేరు సంపాదించుకోలేం. పైగా అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన రిపోర్టర్​ డబ్బుకు అమ్ముడుపోవడం ద్వారా రైతుకు అన్యాయం చేసినట్లు అయ్యేది. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తహసీల్దార్​కు విషయం తెలిస్తే.. ఆయన కూడా ఆ రిపోర్టర్​పై సదభిప్రాయం ఉండేది కాదు. పాత్రికేయ వృత్తిలో విలువలతో పని చేసేవారికి, సహృదయంతో స్పందించేవారికి, మానవత్వంతో జీవించేవారికి సమాజంలో మంచి విలువ ఉంటుంది.

29/12/2022

కందుకూరులో చంద్రబాబు గారి సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. కందుకూరులో వేల మంది ప్రజలు, కార్యకర్తలు తరిలివచ్చారు. సభా ప్రాంగణంలో ప్రజలు పోతెట్టటంతో, కార్యకర్తల తోపులాటలో ఒక్కసారిగా పెద్ద కాలవలో సుమారు పది మంది కార్యకర్తలు పడి పోయారు. ఆ కాలువ ప్రభుత్వ నిర్వహణ సరిగా లేక, ఓపెన్ గా ఉండటం, సెంటర్ లోనే అలా ఉంటుందని ఊహించక పోవటంతో, అందులో పడిపోయారు. దీంతో చంద్రబాబు గారు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయన కాన్వాయ్ లో అంబులెన్సు ఇచ్చి పంపించారు. అంతే కాకుండా, వారి యోగక్షేమాలు తెలుసుకోవటానికి, చంద్రబాబు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు, అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షలు ప్రకటించారు. అలాగే గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించి, మీటింగ్ రద్దు చేసారు.

కర్నూలు తాహశీల్దారు కార్యాలయం లో ఎసిబి అధికారులు దాడులు. లక్ష అరవై వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన రెవెన్...
28/12/2022

కర్నూలు తాహశీల్దారు కార్యాలయం లో ఎసిబి అధికారులు దాడులు. లక్ష అరవై వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ విజయ కుమార్. సర్వేయర్ జిలానీ .

విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయం... ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి...నంద్యాల మున్సిపాల...
28/12/2022

విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయం... ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి...

నంద్యాల మున్సిపాలిటీ మరియు నంద్యాల మండలం లోని ఎనిమిదో తరగతి చదువుతున్న 2022 మంది విద్యార్థులకు గర్ల్స్ హైస్కూల్ నందు బైజుస్‌ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను ఈరోజుMLA శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇషాక్ భాషా విద్యార్థులకు అందజేశారు._

ఈ సందర్భంగా MLA శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అంటే చిన్న చూపే కాకుండా ఉన్నతమైన చూపుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని అన్నారు, ఆ సంకల్ప నిర్ణయంతోనే ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ విప్లవానికి నాంది పలికారు అని,విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తున్నారని అన్నారు నాడు-నేడు పథకం ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల రూపురేఖలే మార్చేశారని,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు,అందులో భాగంగానే నంద్యాల మున్సిపాలిటీ మరియు నంద్యాల మండల పరిధిలోని ఎనిమిదో తరగతి చదువుతున్న 2022 మంది విద్యార్థులకు బైజుస్‌ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్‌లను ఈరోజు వారికి అందించడం జరిగిందని తెలిపారు._

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి, రాష్ట్ర దృశ్యకళాలు డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి ,డీఈవో అనురాధ, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ ,ఎంఈఓ బ్రహ్మం నాయక్ ,ఎమ్మార్వో శ్రీనివాసులు ,మరియు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు ,వైఎస్ఆర్సిపి వార్డు ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు...

Address

Nandyal
518501

Website

Alerts

Be the first to know and let us send you an email when Janata News9 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janata News9:

Videos

Share


Other Media/News Companies in Nandyal

Show All