27/08/2020
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మందమరి, చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలా మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి, 14 ప్రధాన ఎజెండాల పై సమీక్ష చేపట్టారు...
INB TV న్యూస్..
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు శ్రీ:బాల్క సుమన్ ఈరోజు సాయంత్రం చెన్నూరు నియోజక వర్గ పరిధిలోని *మందమర్రి, చెన్నూరు, క్యాథనపల్లి* నియోజకవర్గ మునిసిపల్ కమీషనర్లతో మునిసిపాలిటీలలో జరుగు పట్టనాభివృద్ది కార్యక్రమంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
ఇట్టి సమీక్ష కార్యక్రమములో *మందమర్రి* పట్టణ కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,అలాగే జరగబోవు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు...అందులో ముఖ్యముగా..
*అజెండా అంశములు*
*1.కరోన వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు* ప్రస్తుతం కరోన వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందువలన ప్రజలలో అవగాహన కల్పించేందుకు పాంప్లేట్స్ ద్వారా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకునే విధముగా చూడడం,
పట్టణం నందు అన్ని ఏరియా ల నందు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించడం,కరోన కేసులు ఉన్న ఏరియా ల నందు కంటోన్మెంట్ జోన్ గా గుర్తించాలని సూచించినారు.
*2.పట్టణ ప్రగతి*: నందు జరిగిన కార్యక్రమంలో జరిగిన పనులు అలాగే చేపట్టబోయే పనులపై ప్రస్తుత పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.
*3.భువన్ సర్వే మరియు పట్టణ సమగ్ర నివేదిక(DPR)*:రాబోయే 20 సం: లను దృష్టిలో పెట్టుకుని పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్, పట్టణ ప్రణాళిక, ప్రభుత్వ స్థలాల గుర్తింపు కొరకు మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని,మాస్టర్ ప్లాన్ ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగాలని సూచించారు.
అలాగే ఇంటింటి కొలతలు తీసుకునేటువంటి సర్వే(GIS) వివరాలు తెలుసుకుని సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
*4.పారిశుద్ధ్యం*: మందమర్రి పట్టణములో పారిశుధ్య పనులు అస్తవ్యస్థంగా ఉన్నందువలన *గౌరవ* *తెలంగాణ* *రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు* గారితో మాట్లాడి పట్టణం నందు పారిశుధ్య పనులు మెరుగు పరుచుటకు DMFT నిధుల నుండి 24 స్వచ్ఛ్ ఆటోలకు 1 కోటి 44 లక్షలు మరియు ఇంటింటికి చెత్తను సేకరించు విధముగా 16,229 కుటుంబాలకు ఇంటికి రెండు చెత్త బట్టల కోసంఇంటీటికి పంపిణీ చేసేందుకు 19 లక్షల 55 వేలు మంజూరు చేయించినారు చెత్త బుట్టలను ఇంటిoటికి పంపిణీ చేసేందుకు అనుమతి తీసుకున్నాము.
వీటి ద్వారా ఇంటింటికి చెత్త సేకరించడం చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి స్వచ్ఛ్ ఆటోస్ కి ఇవ్వడం వాటిని డంపింగ్ యార్డ్ కి ప పంపడం ద్వారా అక్కడ తడి పొడి చెత్తను వేరు చేసి డ్రై రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం లాంటివి చేయడం.
అలాగే డంపింగ్ యార్డ్ కి వెళ్లే రోడ్ ను అతి త్వరలో మరమ్మతులు చేయించడం జరుగుతుంది.
పట్టణములో నిర్మించిన షీ టాయిలెట్ మరియు పబ్లిక్ టాయిలెట్ లు అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది.
*5.వాటర్ సప్లై*:పట్టణములో ఇప్పటికే గోదావరి నీటిని పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇంకా నల్లా కలెక్షన్ లు లేని వారికి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఇంకా త్వరలో మిషన్ భగీరథ ద్వారా కూడా నీటి సరఫరా చేయడం జరుగుతున్నదని చెప్పినారు.
వాటర్ ఆడిట్ :ద్వార నీటి సరఫరా కొరకు ఎంత ఖర్చు పెట్టాము, ఆదాయం, గ్యాప్ లాంటి వివరాలు తెలుసుకున్నారు.
*6.హరితహారం*: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీ లో నర్సరీ ఉండాలని వాటినందు ఇంకా ఎక్కువ మొక్కలు పెంచి ఇవ్వాలని సూచించారు.
*7.విద్యుత్ సరఫరా*: పట్టణములో ఇప్పటికే అన్ని ఏరియా లలో వీధి దీపాలు ఏర్పాటు ఉన్నవని, ఇంకా ఏయే ప్రాంతాలలో అవసరమున్న చోట పోల్స్, వైర్ చాపడం అలాగే ఇంకా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
*8.మెప్మా*: మహిళ సంఘాలను ప్రతి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు చేయడం, వారికి త్వరలో 3 కోట్ల రూపాయలతో సమ్మక్క-సారక్క పేరుతో భవనం నిర్మించి అందులో పలు శిక్షణ కార్యక్రమంలు జరుగువిధముగా చూడడం,
అలాగే వారు స్వయం ప్రతిపత్తి చేసుకునే విధముగా కుట్టు మిషన్, అల్లికలు, పేపర్ ప్లేట్లు మరియు జ్యూట్ బ్యాగ్ ల తయారీ లాంటి వాటిలో వారికి శిక్షణలు ఇప్పిస్తామని చెప్పినారు.
*9.ఫిర్యాదుల విభాగం*: మున్సిపాలిటీకి సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కృతం అయ్యేలా పిర్యాదు విభాగం ద్వారా అక్కడే ఒక అధికారిని ఉంచడం, ప్రజలు ఆఫీసునకు రాకుండా ఫిర్యాదులు Mandmarri Muncipality b Buddy అనే అప్లికేషన్ ను రూపొందించుకుని వారి సమస్యలు పరిస్కారం అయ్యేలా చూడాలని, అలాగే పిర్యాదులు వచ్చిన వెంటనే పరిస్కారం అయ్యేందుకు సోషల్ మీడియా అప్లికేషన్ లు వాట్సాప్, ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ల ద్వారా వారికి సమాచారం తెలిసేలా చూడాలని సూచించారు.
*10.స్వాగత తోరణాలు*: పట్టణం నందు స్వాగత తోరణములు 1.యాపల్ ఏరియా 2.నార్లాపూర్ 3.సుబాష్ నగర్ 4.పాల చెట్టు ఏరియా వద్ద మొత్తం నాలుగు ఏర్పాటు చేస్తామని చెప్పినారు.
*11.పారిశుధ్య కార్మికుల సమస్యలు*:మునిసిపాలిటీ నందు పనిచేసే కార్మికులకు G.O No.14 ప్రకారం 12,000 వేతనం ఇవ్వడం, ప్రతి నెల ఒకటవ తేదీనే వారియుక్కా వేతనాలు వారియుక్కా వ్యక్తిగత ఖాతలలో జమ అయ్యేలా చూడాలని వారికి చెల్లించే ESI, EPF లాంటి సౌకర్యాలు ప్రతి కార్మికునికి అందేలా చూడాలని సూచించారు.
అలాగే కరోన లాంటి వ్యాధి విస్తరిస్తున్న విధులు నిర్వహిస్తున్న వారికి గ్లౌసెస్, మాస్క్ లు, Rain Coats, మరియు షూస్ ఇవ్వాలని చెప్పినారు.
*12.ఆదర్శ పట్టణ సూచికలు*: కేంద్ర మరియు రాష్ట్ర పురపాలక శాఖ లో 42 పట్టణ సూచికలు యందు ఎన్ని అమలు అవుతున్నావి ఆలాగే రాబోయే రోజుల్లో వాటిని ఎలా అమలు చేయాలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
*13.పట్టణాభివృద్ధి కాంక్షించే వారి సూచనలు మరియు సలహాలు* పట్టణం యుక్కా అబివృద్ధిని కాంక్షించే విశ్రాంత ఉద్యోగులు, NGO లు, మహిళ సంఘాలు, మరియు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని పట్టాణాభివృద్ధి కార్యక్రమంలలో పాల్గొనేలా చూడాలని సూచించారు.
*14.పట్టణ సుందరీకరణా:* పట్టణం నందు వేగంగా విస్తరించు ఏరియా లను గుర్తించి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడాలని సూచించారు...