02/06/2023
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, పదవ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం వివిధ దశల్లో సాగిన పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.
రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కున్న కష్టాలను, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను, సీఎం యాది చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వేలాది సభలను నిర్వహిస్తూ, సబ్బండ వృత్తులను సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ, అందరి భాగస్వామ్యం సహకారంతో, శాంతియుత పద్దతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, ఈ క్రమంలో సహకరించిన వారినందరినీ సీఎం యాది చేసుకున్నారు. విజయతీరాలకు చేరుకున్న ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో ఇమిడివున్న.. నిర్థిష్ట పరిస్థితులకు అనుసరించిన నిర్థిష్ట కార్యాచరణను, ‘బోధించు సమీకరించు పోరాడు’ అనే పంథా ద్వారా సాధించిన విజయాన్ని సీఎం దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు.
తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్ 2 నాడు భారత దేశంలో 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థులు కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని సీఎం అన్నారు. వొకనాడు వెనకబాటుకు గురయిన తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలవడం పట్ల సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని,’ అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని సీఎం పేర్కొన్నారు. ప్రతి వొక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిదని సీఎం అన్నారు.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగవైభవంగా, పండుగ వాతావారణంలో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందకర సమయంలో తమ సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములై రాష్ట్ర ప్రజలందరూ వాడ వాడనా సంబురాలను ఘనంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
On the auspicious occasion of completion of nine years of Telangana Self-rule and entering the 10 th year, Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of Telangana on the tenth state Formation Day on June 2. On the occasion of decennial celebrations of Telangana Formation Day celebrations, CM remembered the struggles, movements and sacrifices done for Telangana statehood at various stages for six decades.
The Chief Minister recalled the manner in which the second phase movement was transformed into a democratic struggle in a parliamentary manner by spreading the ideology towards the formation of the state and uniting people. CM recounted the hardships, humiliations and obstacles he had to overcome in the process of achieving the statehood for Telangana. The Chief Minister recollected the support extended by all those who contributed to the whole process by touring Telangana, holding thousands of meetings, mobilizing and coordinating all sections of people, continuing the struggle in a peaceful manner, mounting pressure on the centre and finally achieved statehood for Telangana.
CM commemorated the success of this entire movement, the action plan devised in accordance with the situation and the path - “Educate, Gather and Fight” adopted during the struggle.
Nine years ago on June 2, 2014, Telangana became the 29th state of India, the Chief Minister said it is remarkable that the new State of Telangana overcame all hurdles and thwarted the political conspiracies hatched by the antagonists and stood as a strong developing state in the country. CM said that the Telangana state, which suffered setbacks, is now taking the country forward in all fields. CM expressed his satisfaction that with the efforts of the state government and the participation of all the people, the development and welfare programmes and the results achieved by Telangana in these nine years became exemplary for the country. The Chief Minister said that the 'Telangana model' governance is available to the people of the country that never seen before. The CM said that the people of all states are demanding a government like Telangana and it is a great achievement of the people of Telangana to get the support of all the people of the country in this direction. CM said that it is a great occasion that every citizen of Telangana should be proud of.
CM said that the state government made all arrangements to organize state Formation Day celebrations for three weeks by displaying the achievements in all sectors including Agriculture, Irrigation, Electricity, Education, Medical, Welfare and Financial sector, in a festive atmosphere. CM called upon all the people of the state to participate in the decennial celebrations organized by the government and share their happiness during the joyous time of enjoying the fruits of Telangana state's achievements.