కోరుట్ల న్యూస్

కోరుట్ల న్యూస్ మన ఊరు మన వార్తలు

జగిత్యాల జిల్లా...*చిన్నపిల్లలచే బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్*పిల్లలను అపహరించి ...
12/12/2023

జగిత్యాల జిల్లా...

*చిన్నపిల్లలచే బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్*

పిల్లలను అపహరించి వ్యబిచారం లోనికి దింపడం , అమ్మడం, బలవంతపు వెట్టి చాకిరీ, బలవంతపు బిక్షాటన, పిల్లలను బందించి పని చేయించడం, పిల్లల అవయవాలను అమ్ముకోవడం మరియు అక్రమంగా దత్తత తీసుకోవడం వంటి కార్యకలాపాలు మానవ అక్రమ రవాణాకింద వస్తాయీ పై కార్యకలాపాలు చేసే వారికి చట్టప్రకారం చర్యలు తీసుకుని త్వరితగతన శిక్షలు పడే విధంగా చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.,

ఈ చర్యలకుఎవరైనా పాల్పడితే 8712656810 నెంబర్ ఫోన్ చేసి సమాచారం అందించగలరు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తప్పిపోయిన, వదిలివేయబడిన కార్మీకులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, రక్షించి వారి తల్లి దండ్రులకు అప్పగించి , బలవంతంగా బిక్షాటన చేయించిన వారిపై వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునే విదంగా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు.

జగిత్యాల జిల్లా...*- - -మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి**- -మహిళల రక్షణ కొరకే షీ టీం...
08/12/2023

జగిత్యాల జిల్లా...

*- - -మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి*

*- -మహిళల రక్షణ కొరకే షీ టీం , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంలు*

విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డిఎస్పీ రంగా రెడ్డి గారు అన్నారు.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలమేరకు ఈరోజు పొలస అగ్రికల్చర్ కళాశాలలో ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ,వుమన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్,షీ టీం అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ.... మహిళలు మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళల పై పెరిగిపోతున్న నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు. షీ టీమ్స్ నిర్వహణ, విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేశామని, కొంత మందిపై కేసులు నమోదు చేస్తూ, మరికొందరికి వారి కుటుంబీకుల సమక్షంలో కోన్సిలింగ్ నిర్వహించామని అన్నారు. మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఆకతాయిల పై నిరంతరం షి టీమ్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి అని అన్నారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు డైల్ 100 గాని, లేదా షీ టీమ్ 87126 70783 గాని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో డీఎస్పీ రంగ రెడ్డి,CCS &AHTU ఇన్ఛార్ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లు, రూరల్ సీఐ అరిఫ్ అలీ ఖాన్, షీ టీం ASI మీర్జా వాలి భేగ్ ,WPC పూజిత,సౌజన్య యువతీ యువకులు పాల్గొన్నారు.

*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ**టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం**ముఖ్యమంత్రి రేవంత్ ...
08/12/2023

*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ*

*టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం*

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం*

*పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం*

*ఉచిత ప్రయాణానికి ప్రజలు సహకరించాలి: టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ బస్సుల్లో శనివారం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది. హైదరాబాద్ లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ ల్లోనూ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపింది. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుపై శుక్రవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలను వివరించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం (తేది:09.12.2023) మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం గారు ప్రారంభించగానే శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

*మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే!*

-పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు

-తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు

-స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి

-కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.

-ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.

-అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు.

“కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శనివారం (తేది:09.12.2023) నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్ గా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ గారు తెలిపారు.

ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గత రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

ఈ మీడియా సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పైనాన్స్‌ అడ్వైజర్‌ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

08/12/2023

కోరుట్ల పట్టణ విద్యుత్ వినియోగదారుల కు తెలియజేయునది. తేదీ 09.12.2023 రెండవ శనివారం రోజున ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు కోరుట్ల కల్లూరు రోడ్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును .ఇట్టి అంతరాయం నకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి.

ఇట్లు.
AE Town-1

08/12/2023

కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు అస్వస్థత.

గురువారం యశోద ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు.

వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేసిన వైద్యులు.

ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్న విద్యాసాగర్ రావు.

మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి ఆందోళన వద్దు .

హైదరాబాద్ ఎవరు రావొద్దని కుమారుడు, ఎమ్మెల్యే డా.సంజయ్ తెలిపారు.

రెండ్రోజుల్లో మెట్ పల్లి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా కోరుట్ల లోని ప్రధాన కూడలిలో బాణా సంచులు పేల్చిఆనందోత్సాహాలతో...
07/12/2023

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా కోరుట్ల లోని ప్రధాన కూడలిలో బాణా సంచులు పేల్చిఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

|| *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..* || ◻️  *మహాలక్ష్మి పథకం* - పేద మహిళలకు నె...
07/12/2023

|| *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసంతకం చేసిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే..* ||

◻️ *మహాలక్ష్మి పథకం* - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.

◻️ *గృహజ్యోతి -* ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

◻️ *రైతు భరోసా -* రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.

◻️ *యువ వికాసం -* ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
◻️ *చేయూత -* రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.

◻️ *ఇందిరమ్మ ఇళ్లు -* ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, అనుముల రేవంత్​ రెడ్డి ప్రమ...
07/12/2023

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, అనుముల రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రేవంత్​ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు.

తెలంగాణ సీఎంగా నేడు  రేవంత్‌రెడ్డి ప్రమాణంఆరు గ్యారెంటీల్లో ఒక దాని అమలుకు శ్రీకారం మహాలక్ష్మి పథకం అమలుపైనే తొలి సతకం మ...
07/12/2023

తెలంగాణ సీఎంగా నేడు రేవంత్‌రెడ్డి ప్రమాణం

ఆరు గ్యారెంటీల్లో ఒక దాని అమలుకు శ్రీకారం

మహాలక్ష్మి పథకం అమలుపైనే తొలి సతకం

మహాలక్ష్మి ద్వారా ప్రతి మహిళకూ నెలకు రూ.2500 చొపున సాయం

రూ.500కే గ్యాస్‌ సిలెండర్‌, బస్‌ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

రేవంత్‌ ప్రమాణ స్వీకారానికి సోనియా, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక

దివ్యాంగురాలు రజినికి తొలి ఉద్యోగం...

జగిత్యాల జిల్లా పట్టణంలోని మహబూబ్ పురా కు చెందిన మొహమ్మద్ అయాన్ అలీ (15)  విద్యుత్ షాక్ తో మృతి...  మృతుడు డెకరేషన్ పని ...
06/12/2023

జగిత్యాల జిల్లా పట్టణంలోని మహబూబ్ పురా కు చెందిన మొహమ్మద్ అయాన్ అలీ (15) విద్యుత్ షాక్ తో మృతి... మృతుడు డెకరేషన్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో పట్టణంలో డెకరేషన్ కు వెళ్లి పని చేస్తుండగా ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి డిసెంబరు 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రేవంత్‌రెడ్డిని సీఎంగా అధికారికంగా ప...
05/12/2023

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి
డిసెంబరు 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
రేవంత్‌రెడ్డిని సీఎంగా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గా ఎన్నికైన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు

03/12/2023
03/12/2023

*కోరుట్ల నియోజకవర్గం.....*

*మొదటి రౌండ్ ఫలితాలు....*

01. BRS - 3612
02. INC - 2098
03. BJP - 3444

*మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం ఓట్లు....*

01. BRS - 3612
02. INC - 2098
03. BJP - 3444

LEAD - BRS 168

03/12/2023

*జగిత్యాల జిల్లా*మల్యాల మండలం నూకపెల్లి VRK ఇంజనీరింగ్ కళాశాల లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం..........

జగిత్యాల జిల్లా:- నియోజకవర్గంలో 1,413, కోరుట్లలో 1,121, ధర్మపురిలో 807 పోస్టల్ బ్యాలెట్లు

30/11/2023

జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని ...

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా వెల్లడించారు....

గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో ఉదయంనుంచే ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడి ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు....

మూడు నియోజకవర్గాలలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 74.87 శాతం మంది ఓటు వేయడం జరిగిందని పేర్కొన్నారు...

ఈ మేరకు జగిత్యాల నియోజకవర్గంలో 73.54శాతం..

కోరుట్ల నియోజకవర్గంలో 73.68 శాతం...

ధర్మపురి నియోజకవర్గంలో 77.50 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు...

జిల్లాలోని 785 పోలింగ్ కేంద్రాలలో, జిల్లా యంత్రాంగం, పోలీసుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొన్నారు....

జగిత్యాల లో 5:00.PM పోలింగ్ శాతం నమోదు..కోరుట్ల.  73.68జగిత్యాల   73.54ధర్మపురి.     77.5మొత్తం .. 74.87 %  డిసెంబర్ 3న ...
30/11/2023

జగిత్యాల లో 5:00.PM పోలింగ్ శాతం నమోదు..

కోరుట్ల. 73.68
జగిత్యాల 73.54
ధర్మపురి. 77.5
మొత్తం .. 74.87 %


డిసెంబర్ 3న ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3(ఆదివారం)న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు ముగిసిన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా డిసెంబర్ 3నే జరగనుంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఈ 5 రాష్ట్రాల ఫలితాల కోసం యావత్ భారతదేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

30/11/2023

మెట్ పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, BRS అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్.

కోరుట్ల పట్టణంలోని ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు.

జగిత్యాల జిల్లా..*-ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు.**- - - స్వేచ్చాయుతoగా ప్రజలు ఓటు హక్క...
28/11/2023

జగిత్యాల జిల్లా..

*-ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు.*

*- - - స్వేచ్చాయుతoగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి.*

*- - - తెలంగాణ అసెంబ్లీ -2023 ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ అమలు.*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28వ తేదీ(మంగళవారం) సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ (శుక్రవారం ) ఉదయం 7 గంటల వరకు జిల్లా లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు.

శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు,రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్ట్రయికింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

*ఎన్నికల భద్రతా దృష్ట్యా ఎన్నికలు సజావుగా సాగటానికి ఈ దిగువ తెలిపిన నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేయనైనది.*

 జిల్లా పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.
 రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు.
 మైకులు, లౌడ్‌ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు.
 విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు.
 ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,మరియు ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
 తేది: 28-11-2023 సాయంత్రం 5 గంటల నుండి తేది: 04-12-2023 ఉదయం 6 గంటల వరకు ప్రతీ ఒక్కరు తూచ తప్పకుండా ఎన్నికల నిబంధనలు పాటించగలరు.

జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

23/11/2023

జగిత్యాల జిల్లా :-

*కోరుట్ల పట్టణం లో స్కూల్ కు వెళ్లమని మందలించినందుకు విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య*

కోరుట్ల లోని బిలాల్ పుర కు చెందిన షేక్ హైదర్– సుల్తానా బేగం దంపతుల కూతురు అస్రిన్ బేగం(14) గవర్నమెంట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతుంది.గత 5 రోజులుగా స్కూల్ కు అస్రిన్ బేగం వెళ్లడం లేదు. తల్లి సుల్తానా బేగం స్కూల్ కు వెళ్లమని మందలించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూం లో ఫ్యాన్ కు ఉరేసుకుని అస్రిన్ బేగం ఆత్మహత్య కు పాల్పడింది.మృతురాలి తండ్రి షేక్ హైదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు...

*తెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్*రాష్ట్రం మొత్తం 3 రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. న...
21/11/2023

*తెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్*

రాష్ట్రం మొత్తం 3 రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి.

నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.

తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.

గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది...

14/11/2023

*ఎలక్షన్ కోడ్‌'తో పెట్టుకోవద్దు!*

*ఉల్లంఘిస్తే కేసులు, మొత్తం 426 నమోదు*

*తెలంగాణలో ఎన్నికల కమిషన్‌ అన్నీ గమనిస్తోంది. నియమావళి అమల్లో ఉన్నవేళ.. 'ఏం ఫర్వాలేదులే' అన్న ధోరణితో ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా కేసులు తప్పవు*

*ఒక్కసారి కేసు నమోదైతే అది కొన్నేళ్లపాటు వెంటాడుతూనే ఉంటుంది. నేరం నిరూపితమైతే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత ప్రచారం చేసినా.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినా.. చివరకు ప్రచార గోడపత్రికలు అతికించినా.. పెద్దశబ్దంతో డీజేలు పెట్టినా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా.. ప్రభుత్వ పథకాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకున్నా.. కేసులు నమోదవుతాయి. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత గత నెల 10వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు (నెల రోజుల్లో) రాష్ట్రంలో ఈ తరహా కేసులు 426 నమోదయ్యాయి. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సర్వైలెన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేస్తున్నారు*

*తిప్పలు తప్పవు..*

*కేసులది ఏముందిలే.. అని చాలామంది బాహాటంగానే నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. కానీ అవి నమోదైతే కొన్నేళ్లపాటు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సదరు నాయకులు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ కేసుల గురించి ప్రస్తావించాలి. కొన్ని ప్రభుత్వ పథకాల వంటివి పొందాలన్నా కేసుల ప్రస్తావన తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసుశాఖలోకి ఎంపిక కావాలంటే కేసులు కచ్చితంగా అడ్డంకిగా మారతాయి. ఇక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఈ కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించడం అవసరం*

*శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్‌లో ఓ పార్టీ నాయకుడు 50 మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందం గుర్తించింది. ర్యాలీ నిర్వహిస్తున్న నాయకుడితోపాటు ఆయన పార్టీపైనా గత నెల 12న కేసు నమోదైంది.*

*కాచిగూడలోని ఓ పాఠశాలలో ఓ పార్టీ నాయకుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అనుమతి లేకుండా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.*

*ప్రభుత్వ పథకం కింద వచ్చిన నష్టపరిహారాన్ని గ్రామస్థుల మధ్య బాధితులకు ఇస్తూ, దాన్ని పార్టీ తరఫున ఇస్తున్నట్లు ప్రచారం చేసిన ఓ సర్పంచిపై మెదక్‌ జిల్లాలో కేసు నమోదైంది*

జగిత్యాల జిల్లా :*జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి - సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ...
30/10/2023

జగిత్యాల జిల్లా :

*జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి - సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్*

**సి విజల్ యాప్ పై ప్రజలకు, యువత ముందుకు మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి*

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.

సోమవారం న్యూ ఢిల్లీ నుండి ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా

*సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ,* నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన, ఎన్నికల నిబంధనలు పాటించాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, వంటి అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.
మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు. రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు. ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి ప్రతి రోజు వచ్చే అప్పీల్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వివిధ నోడల్ అధికారులతో మాట్లాడుతూ, సి విజిల్ యాప్ పై పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించి యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఏ ఆధారం లేని డబ్బు, సరుకులు రవాణా చేయకుండా ప్రజలకు తెలియజేయాలని, 50 వేల రూపాయల కన్న ఎక్కువ నగదు తీసుక వెళ్లకూడదనే విషయాన్ని ప్రజలకు తెలియ పరచాలని సూచించారు. ఎన్నికల నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు
పోస్టల్ బ్యాలెట్ కోసం అర్హత కలిగిన వారు నిర్ణీత ఫారం 12 లో వివరాలను సమర్పించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని నోడల్ అధికారిని ఆదేశించారు. 80 సంవత్సరాలకు పైబడిన వారు, 40 శాతం కన్నా అంగవైకల్యం కలిగిన వారు ఇంటినుండి ఓటుహక్కు కల్పించుకునేందుకు నిర్ణీత ఫారం 12 డి లో పూర్తి వివరాలతో ఆయా అధికారులకు సమర్పించాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా ప్రచార వాహనాలు, నిబంధనల మేరకు ప్రచురణకు అనుమతిలేని ప్రచార కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీ లు ఏర్పాటు, పంపిణీ చేస్తున్నట్లు తెలిసిందని, అట్టి వాటికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా, అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉందని, అబ్కారీ అధికారులు పోలీసు సిబ్బంది సహకారంతో దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని అన్నారు. బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలని అన్నారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత ప్రాంతాలలో దాడులు నిర్వహించాలన్నారు. ఓటుహక్కు కలిగిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటు వేసే విధంగా ప్రచారం స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అన్నారు. నోడల్ అధికారులు రోజువారీ నివేదికలను సమర్పించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ/రిటర్నింగ్ అధికారులు రాజేశ్వర్, నరసింహ మూర్తి, డి.ఎస్.పి.లు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

*జగిత్యాల జిల్లా :* *సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై  ఫిర్యాదు చేయవచ్చు - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్...
29/10/2023

*జగిత్యాల జిల్లా :*

*సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యా స్మిన్ బాషా*

ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై *సి విజిల్ యాప్ ద్వారా* ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

ఓటర్ లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి - విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు.

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు లపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్. ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిగ్గా లోకేషన్ నమోదు అవుతుందని తెలిపారు. సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన, పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా నిర్వహించే ర్యాలీలు, ప్రచార వాహనాలు, ఇతరత్ర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు సి - విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు. ముఖ్యంగా సి-విజిల్ యాప్ ను యువత ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘనలను ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో
24 గంటలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం లో సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్, తదితర వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఆ ప్రకటనలో తెలిపారు.

జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు 109 ఫిర్యాదులు అందాయని, అట్టి వాటిపై ఆయా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

జగిత్యాల జిల్లా : శాసన సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించుటకు ఏర్పాట్లు చేశామని జ...
29/10/2023

జగిత్యాల జిల్లా :

శాసన సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించుటకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. వచ్చే నవంబర్ 30 న కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి శాసన సభ నియోజక వర్గాల సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఈ నెల 30, 31 తేదీలలో ఆయా నియోజక వర్గం పరిధులలో సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2236 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జగిత్యాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో స్ట్రాంగ్ రూం లు, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాలను ఎన్నికల...
19/10/2023

జగిత్యాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో స్ట్రాంగ్ రూం లు, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జగిత్యాల నియోజక వర్గము నకు సంబంధించిన వి.ఆర్.కే. కళాశాలలో ప్రతిపాదిత ఓట్ల లెక్కింపు కేంద్రం, మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రం, ధర్మపురి నియోజక వర్గము నకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయా స్ట్రాంగ్ రూంలలో అవసరమైన పనులు చేపట్టాలని, స్ట్రాంగ్ రూం ల ముందు సిసి కెమెరాలు, విద్యుత్ లైట్స్, తదితర ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. మెటీరియల్ పంపిణీ లకు అవసరమైన బారికేడింగ్ చేయించాలని అన్నారు. స్ట్రాంగ్ రూం లకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కోరుట్ల లో SFS హై స్కూల్ లో స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రం లలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.,

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర, ఆర్డీవోలు నరసింహ మూర్తి, రాజేశ్వర్, పోలీసు, రెవిన్యూ, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు, మునిసిపల్ కమిషనర్ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా...*- - - ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు , సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.**- - - సమస్య...
18/10/2023

జగిత్యాల జిల్లా...

*- - - ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు , సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.*

*- - - సమస్యాత్మకమైన గ్రామాల్లో తరచూ సందర్శించి నిఘా ఉంచాలి*

*- - జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*

రాబోయే శాసనసభ ఎలక్షన్స్ కు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ ల పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎస్పీ గారు అన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లొ రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి అధికారులు తీసుకోవలసిన చర్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, సమస్యాత్మకమైన గ్రామాల్లో తరచూ సందర్శించి నిఘా ఉంచాలని అన్నారు. రోజు పోలీస్ స్టేషన్ ల పరిదిలో వాహనాల తనిఖీలు నిర్వహించి నగదు, గోల్డ్, ఇతర వస్తువులను సీజ్ చేసి జిల్లా ఎన్నికల కమిటీకి అప్పగించాలని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాప్ నిర్వహకులపై , గుడుంబా తయారీ దాడులపై డైనమిక్ తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని బైండోవర్ చేయాలని, గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా బ్లూ కోల్ట్ సిబ్బంది,అధికారులు తరచు పర్యటిస్తూ విసిబుల్ పొలిసింగ్ అమలు చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 22,71,446/- రూపాయల నగదు సీజ్ చేయడం జరిగిందని, అదేవిధంగా 12,26,577/- రూపాయల విలువ గల 2564 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందని అన్నారు.ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. చెక్ పోస్టు ల దగ్గర, ఇతర ప్రదేశాలలో తనిఖీలలో విడియో కవరేజ్ చేయటం, క్యాష్ , లిక్కర్ ,ఇతర వస్తువులు పట్టుబడినప్పుడు ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం సంభందిత అధికారులు అనుసరించాల్సిన విధివిధానాల పై తగు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ర్యాలీలు, మీటింగ్ లకు ఎన్నీకల నిబంధనలకు లోబడి అనుమతులు పై పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయం కావున వీఐపీలు ఎక్కువగా జిల్లాకు వస్తారు బందోబస్తుకు సంబందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. ఎలక్షన్ కి సంబంధించి నమోదు చేసే కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన అవగాహనతో కేసులను నమోదు చేయాలని సూచించారు.ప్రచార వాహనాలకు, ఎన్నికల ర్యాలీలకు, సభలకు అనుమతులు పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. లాంగ్ పెండింగ్ లో ఉన్న NBWs ను త్వరగ సర్వ్ చేయాలనీ జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలోఅడిషనల్ ఎస్పీ లు ప్రభాకర రావు, భీంరావ్, డిఎస్పీలు రవీంద్ర కుమార్ వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, సురేష్ D.V రంగారెడ్డి ,SB,CCS ఐటీ core ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు,సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా...* శాంతి భద్రతల దృష్ట్యా  ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో జిల్లా పోలీసులు.**-స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్క...
17/10/2023

జగిత్యాల జిల్లా...

* శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో జిల్లా పోలీసులు.*

*-స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహణ.*
- జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*

ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ గారు ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యొక్క స్థితిగతులను గురించి, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్చాయుత గా ప్రజలు ఓటు హకు ను వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ గారు అన్నారు. జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామనీ, నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ గారు స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ఉండదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటానన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వ్యక్తులను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెట్టరాదని, ఎవరైనా పై చర్యలకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ప్రలోభాల గురిచేసిన, భయభ్రాంతులకు గురి చేసిన జిల్లా పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం అందిస్తే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులపై ఇతర వ్యక్తులు గాని పార్టీలను రెచ్చగొట్...
12/10/2023

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులపై ఇతర వ్యక్తులు గాని పార్టీలను రెచ్చగొట్టేవిధంగా, కించపరిచే విధంగా,అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీ మీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని, పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని, లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలంగాణ పోలీస్ శాఖ వారు తెలిపారు

*ప్రైవేటు వెహికిల్స్ ఎక్కొద్దు**దసరాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం**ప్రయాణికులకు సజ్జనార్ సూచన*బతుకమ్మ, దసరా పండుగలకు...
11/10/2023

*ప్రైవేటు వెహికిల్స్ ఎక్కొద్దు*
*దసరాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం*
*ప్రయాణికులకు సజ్జనార్ సూచన*

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఈ నెల 13-24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.

టీఎస్ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో సంస్థ ఉద్యోగులతో కలిసి వారు పనిచేస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థకు వస్తోన్న ఫలితాల్లో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంది. గతంలో మాదిరిగానే ఈ దసరాకు ఆయా శాఖలు సహకరించాలి.' అని సజ్జనార్ కోరారు.

బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధికంగా రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.

Address

Koratla
505326

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm

Telephone

0588381512

Website

Alerts

Be the first to know and let us send you an email when కోరుట్ల న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to కోరుట్ల న్యూస్:

Videos

Share

Category

Nearby media companies


Other Koratla media companies

Show All

You may also like