Jamalapuram Venkateswara Swami

Jamalapuram Venkateswara Swami TELANGANA TIRUPATI

07/10/2024

Dear friends... I got all new Sony A7M4 Camera ( Best Option for non theatrical Films, Event Photography, Videography. ) with lens kit and lighting equipment...

If you or anyone in your circle watching for camera and DOP for
Short Films,
Independent Films,
Demo Films,
Documentary Films,
YouTube Vlog Videos,
Social Media Reels,
Promotional Videos,
Web series,
Album songs,
Cover songs,
Commercials,
Advertainments.
Portfolio Photography,
Calendar Photography,


Or Looking for Photographer, Videographer, Candid or Cinematic at events such as...
Wedding,
Pre Wedding,
Post Wedding,
Engagement,
Half saree ceremony,
Annapraasana,
College Functions,
Birthday Parties
Break up parties
Devotional Programs in house or temples,
Shop or Business or New Office Opening Functions,
Retirement Programs.

Or Looking For Still Photographer at
Movie shooting,
Serial shooting,
Web series shooting.
Or at any other shooting.

Please contact me...
Manoj kumar.chinthala.
9908810671

( Album Making, Editing, Color Grading Photo printing Available )

07/10/2024
30/09/2024

మన్యు స్వరూపమేమి? మన్యు వుకు హనుమంతులవారికి ఏమి సంభంధము?మన్యు సూక్తముతో అభిషేకించడం వలన ఉపయోగము. ఈ మతికి హనుమన్నదయ వలన తెలిసినది చెప్ప ప్రయత్నం చేస్తాను.తప్పులున్నయెడల సరి చేయవలసినదిగా పెద్దలయందు ప్రార్ధన.

ఋగ్వేదమునందు దశమమండలమున 83,84 సూక్తములకు మన్యు సూక్తముల ని నామము గలదు.కోపానికి అధిష్టాన దేవత మన్యువు. ఈ దేవతయే రుద్రుడు.
కొన్ని సందర్భములలో ఇంద్రుడని,వరుణుడని కూడా ప్రస్తుతించారు.పాపము పై,అధర్మముపై కోపముగల దేవత.రుద్రునకు సాదృశ్యము గనుక ఏక పాద రుద్రాంశయైన హనుమంతులవారికి ప్రీతిసంధాయకమైనది.పృథివీధరుని ప్రకారము అంతఃశత్రువులను జయించుటకే ఈ సూక్తములను తెలియజేయుడమైనది.
మన్యుసూక్తములకు రెండు విధములైన భాష్యములు చెప్పబడియున్నవి.1,సాయణ భాష్యము,2,పృథ్వీధర భాష్యము.

ఇందులో మొదటిది బాహ్య శత్రువులను సంహరించుటకు .
భావము:క్రోధాభిమానియైన మన్యుదేవా!వజ్రమువలె సారభూతమై శత్రువులను హింసించు అస్త్రమా !ఈ ఆముకుడు నీకు పరిచర్య చేయుచు ,యుద్ధమునందు దేహబలమును,ఓజస్సును నీ అనుగ్రహము వలన నీ సహాయముతో కలుగు బలముతోజయించగలము.
2,పృథ్వీధర భాష్యము: సర్వజగ ప్రకాశకుడవైన మన్యుదేవా!శత్రు నాశకరమైన ఓ అస్త్రమా సమస్త విశ్వము నీకు పరిచర్య చేయుచూ సహశక్తిని,ఓజశక్తిని చక్కగా పెంపొందించు కొనుచున్నది. మన్యువు యొక్క పరిచారకుడు బల ప్రభావములతో సదా పూర్ణుడై వర్థిల్లును.కేవలం ధ్యానబలము చేతనే అల్ప శత్రువును, మహా బలముగల శత్రువును సైతము అనగా సర్వ శత్రువులను జయించగలము.

అతిముఖ్యమైనది ఆత్మరక్షణ కొరకు,రోగశమనము కొరకు,శత్రు పరాభవముకొరకు,అంతః శత్రుజయము కొరకు సర్వ గ్రహ పీడాది భాధా నివారణ కొరకు చేయుదురు.

30/09/2024

మూల శక్తుల ఆరాధన.............!!
మన మూలాలను మనకు గుర్తుచేసే మంచి సమయం పితృపక్షం. మొన్నటి పున్నమి తెల్లవారి పాడ్యమి నుంచి వచ్చే అమావాస్య వరకు పదిహేను రోజులూ మన వంశవృక్షాన్ని పెంచి పెద్ద చేసిన మాతృ-పితృ దేవతలంతా కొలువుదీరే విలువైన కాలం. ఆఖరి రోజు పెత్రమాసైతే సమస్త మూల శక్తుల ఆరాధనకు అద్భుత సందర్భం. ఈ సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ సత్సమ యాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

Base-energy

భారతీయ ధార్మికత అందరికంటే పెద్దపీట తల్లిదండ్రులకే వేసింది. ఎందుకంటే, వారు ప్రత్యక్ష దేవుళ్లు. మాతృదేవోభవ, పితృదేవోభవ.. ఆ తర్వాతే ఆచార్యుడైనా, అతిథి అయినా, ఆఖరకు మరే దేవతలైనా సరే. అందుకే, దేవతలకు పూజలు చేయకపోయినా ఫరవాలేదు కానీ, పితృదేవతలకు మాత్రం కోపం రానివ్వకూడదని, వారి శాపాలు మన పాలిట పాపాలై చుట్టుకుంటాయని పెద్దలు అంటారు. ఇందులోని నిజానిజాలు అనుభవజ్ఞులకే అర్థమవుతై.

ప్రతి దానికీ ఒక నిర్దిష్ట సమయం వున్నట్టే మరణించిన మన వంశోద్ధారకుల కోసమూ ఏడాదిలో భాద్రపద మాసం బహుళపక్షంలోని పదిహేను రోజులూ మహాలయ పక్షంగా వారికోసం కేటాయించారు. అసలు, పితృదేవతల పేర ఎందుకు శ్రాద్ధాలు, తర్పణాలు వంటివి చేయడం? మనిషి చనిపోయిన తర్వాత మరణకాండలు చేస్తే ఏమొస్తుంది? చేయకపోతే ఏమవుతుంది?? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు గరుడ పురాణంలో చాలా విశదంగా లభిస్తుంది.

మనిషి చనిపోయాక సదరు వ్యక్తి ఆత్మ ఇంకా బతికే ఉంటుందా? అంటే, దీనికి సమాధానం భగవద్గీతలోనే ఉంది. ఆత్మకు మరణం లేదని, అది దేహం నుంచి వేరు పడుతుందే తప్ప దానిని పూర్తిగా నాశనం చేసే శక్తి మృత్యువుకూ లేదని ఆత్మ సంయమన యోగం పేర్కొంది. కాబట్టి, ఎవరైనా (జీవులు) మరణించారు అంటే వారి భౌతిక శరీరం నిర్జీవమైందని మాత్రమే అర్థం. మరి, చనిపోయాక ఆత్మ ఏమవుతుంది? ఊర్ధలోకాలలో దాని ప్రయాణం ఎలా సాగుతుంది? అన్నవి నిజంగానే ఆసక్తికరం. మనం (జీవులు) చేసుకున్న పాపపుణ్యాలను బట్టి స్వర్గ నరకలోకాల యాత్ర ఉంటుంది. పునర్జన్మ లేకుండా చేసుకోగలిగినపుడే ఆత్మ పరమాత్మలో లీనమైనట్టు లెక్క. అదే మోక్షం.

మనిషి తన జన్మ పరమార్థాన్ని తెలుసుకోవడానికే కాక తమ వంశోద్ధారకుల ఆత్మశాంతికి, ఋణ విముక్తికీ పితృకర్మలను ఆచరించాలని ప్రాచీన ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. జన్మనిచ్చిన వారి ఋణం జన్మజన్మలకూ తీరనిదని పెద్దలు చెప్తారు. అందుకే, ఋణానుబంధం అన్ని బంధాలకంటే ప్రబలమైందనీ అంటారు. కనుకే, మనిషి (పురుషుడు) బతికి ఉన్నన్నాళ్లూ పితృదేవతలకు శ్రాద్ధాలు పెడుతూ తర్పణాలు వదులుతూనే ఉండాలని అన్నారు. మరణతిథి తెలియని వారు ఈ పితృపక్షం పదిహేను రోజుల్లో ఏదో ఒకరోజు, ఇంకా ఈ పద్నాలుగు రోజులూ చేయలేని వారు కనీసం ఆఖరి రోజైన అమావాస్య నాడైనా తప్పనిసరిగా పెద్దల కర్మలను ఆచరించాలని వేద పండితులు నిర్ధారించారు.

అసలు, ఈ ఋణం ఎక్కడిది? అనుకుంటారు సాధారణ ప్రజానీకం. భౌతికంగా లేని వారి ఆకలిని తీర్చే పేరిట పితృకర్మలు ఆచరించడం మూర్ఖత్వం కాదా? పిండాలు చేసి నీళ్లలో వదిలినంత మాత్రాన, లేదా వాటిని ఆవులు, కాకులకు పెట్టినంత మాత్రాన, నువ్వులతో వాళ్ల పేర్లు చెప్పుకొని తర్పణాలు విడిచినంత మాత్రాన తీరని ఋణం ఎలా తీరుతుంది? అని ప్రశ్నించేవారూ ఉంటారు. నిజానికి పితృఋణం ఎప్పటికీ తీరనిదే. అయినా సరే, పితృకర్మలు వారి ఆత్మశాంతికి చేయాల్సిందేనని ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి.

పితృదేవతలు అంటే ఒక్క గతించిన వారు మాత్రమే కాదు, మొత్తం పితృదేవతా వ్యవస్థలోని వసువులు, రుద్రులు, ఆదిత్యులు వంటి దేవతలంతా పితృదేవతల స్వరూపాలేనని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు అనడంలోనూ ఇదే తత్వం దాగి ఉంది. మగప్లిలలు లేనివారికి ఆడబిడ్డ కొడుక్కు అంతటి విలువ, అర్హతను ధర్మశాస్ర్తాలు కల్పించాయని అంటారు. అసలు మగ- ఆడ సంతానమే లేని వారు మరెవరినైనా దత్తత తీసుకొనే వీలు కూడా ఉంది. ఇదీ సాధ్యం కాని వారికి వంశంలోని ఎవరో ఒకరు ఇలాంటి ఏదో ఒక సందర్భంలో తర్పణాలు విడవడం ఖాయం. కాబట్టి, ఎటూ తద్దినాలు తప్పవు. తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలన్నీ నేరుగా మళ్లీ పుట్టడమో లేక ఊర్ధలోక యానం చేయడమో చేస్తాయని పెద్దలు అంటారు. భూమ్మీద బతికి ఉన్నప్పుడు వారు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఇది నిర్ణయమవుతుందన్నది పురాణ కథనం.

ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, పాపం, పుణ్యం వంటివన్నీ నిజంగా ఉన్నాయా? అన్నది వారి వారి విశ్వాసాలను బట్టి నిర్ధారణవుతుంది. తాము మరణించిన తిథినాడు లేదా ఈ పితృపక్షం వేళ పితృవ్యవస్థలోని ఆత్మలన్నీ తమ వారసుల కర్మకాండల కోసం ఎదురు చూస్తాయని, ఇంకా వాయురూపంలో కానీ, మరే జీవుల రూపంలో కానీ వచ్చి తమ ఆకలి తీర్చుకొని వెళతాయన్నది ప్రగాఢ నమ్మకం. కర్ణుడంతటి మహాదానశీలికీ మూలశక్తుల ఆరాధన తప్పలేదంటే దీని విలువను అర్థం చేసుకోవచ్చు. అసలు, మొత్తంగా ఇవన్నీ ఆయా మనుషులను సక్రమమార్గంలో నడిపించడానికి ఉద్దేశించినవిగా అర్థం చేసుకోవచ్చు. గతించిన తమ వంశస్థులను గుర్తు చేసుకోవడానికి పితృపక్షాన్ని ఓ సరైన సమయంగా కూడా భావించవచ్చు. వారి జ్ఞాపకంగా మరే దానధర్మాలైనా చేయవచ్చు. నమ్మకం ఉన్నవాళ్లు తమ కోసమో లేదా తమ వాళ్ల కోసమో పాటిస్తే పోయేదేమీ లేదు. సదరు పిండాలలోని పదార్థాలు ఏవో జీవులకు ఉపయోగపడేవే.

పునర్జన్మల సారం

సాధారణంగా గరుడ పురాణమంటేనే ఎవరైనా చనిపోయినప్పుడు పనికట్టుకొని చెప్పించేదే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చదివేది, వినేది కాదని అనుకుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయమేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఎలాగైతే, భగవద్గీత మానవుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే అద్భుత గ్రంథమని గుర్తించామో అలాగే, గరుడ పురాణాన్ని కూడా మన జన్మకు సార్థకత సిద్ధించే మార్గంగా పరిగణించాలి. అష్టాదశ (18) పురాణాలలో ఒకటైన గరుడ పురాణానికి ప్రాతిపదికే పునర్జన్మ సిద్ధాంతం. మన పెద్దల ఆత్మలు సూక్ష్మశరీరంతో కష్టాలు పడకుండా ఉండాలంటే ఏ చేయాలో, ఏఏ పాపకార్యాలు మనల్ని నరకం వైపు నడిపిస్తాయో వంటి అనేక జీవన సంబంధ విషయాల్ని చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. మొత్తంగా మరణించిన మన తల్లిదండ్రులు, పితృదేవతలకు మనమెలా ఋణపడతామో కూడా అవగతమవుతుంది.

29/09/2024

ద్వారకా తిరుమల( చిన్న తిరుపతి ) గురించి ఆలయ చరిత్ర చాలామందికి తెలిసిందే కానీ ఆలయంలో ఉన్న తెలియని ప్రత్యేకతలు గురించి చెప్తాను.

మాములు ప్రతి ఆలయంలో విగ్రహ మూర్తికి మూల విరాట్ ( దేవుని విగ్రహం ) ఒక్కటే ఉంటుందండి. కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్ లు ఉండి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు.

అలాగే ఆలయ చరిత్ర మనకు తెలిసిందే ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారు. అయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామి వారు ఏ వరం కావాలి అని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాద సేవ చాలు అని చెప్పాడట దానితో ఆ మహర్షి కోరిక మేరకు స్వామి వారు అక్కడ స్వయంభు గా వెలిశారు. అయితే ద్వారకా మహర్షి చాల కలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుండి పై భాగం మాత్రమే దర్శనం ఇచ్చేవారట. దాంతో భక్తులు స్వామి వారిని కొలిచేందుకు కుదిరేదికాదట .. అసలు పాదసేవ ఏ అత్యంత ప్రాధాన్యం అది లేకుండా ఎలా అని అనుకోగా కొంతకాలానికి ఋషులు స్వామి వారిని స్వామి నీకు పూజ ఎలా చేయాలని వేడుకోగా మరొక మూర్తిని ( విగ్రహాన్ని ) ప్రతిష్టించి వలసినదిగా స్వామి వారు అన్నారట దీంతో ఋషులు తిరుమల ( పెద్ద తిరుపతి ) నుండి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంభూ వెలిసిన స్వామి వారి విగ్రహ వెనుక భాగంలో పాద సేవ కోసం ప్రతిష్టించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులు గా స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ద్వారకా మహర్షి తపస్సు వలన ఆవిర్భవించిన విగ్రహం ఒకటి కాగా తిరుమల నుండి తెచ్చిన విగ్రహం మరొకటి ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమల గా ప్రసిద్ధి చెందింది. రెండు మూల విరాట్ లు ఉండటం వలన ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు.

మాములుగా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా తిరుమలలో స్వామి వారు దక్షిణ ముఖంగా ఉంటారు. అలా ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేయడం వలన ఆయనకు ఎదురుగ స్వామి వారు ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామి వారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. మాములుగా ప్రతి దేవాలయంలో విగ్రహానికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు స్వామి వారికీ అభిషేకం చేయరు అది ఎందుకు అంటే స్వామి వారి విగ్రహం కింద ద్వారకా మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి ఉందట అందుకే అభిషేకం చేయరు. అనుకోకుండా అక్కడ చిన్న నీటి చుక్క పడిన కొణిజులు ( ఎర్ర చీమలు ) విపరీతంగా బయటకు వచ్చేస్తాయి.

29/09/2024

కాశీలోని ద్వాదశ ఆదిత్యులు ... దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి.

ప్రతి రోజు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని పూజించడం అత్యంత ఫలదాయకం.

మన ధర్మంలో అన్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!!

ఆత్మవత్ సర్వ భూతాని" నాలో నున్న 'ఆత్మజ్యోతి' అన్ని జీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది !
అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !!

అందుకే చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాడు ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు.. తెలిసి చేసే దివ్యత్వం. అంతటా వున్న భగవంతుడు నేను పూజించే ఈ 'విగ్రహం,లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే..!ఉపాసన !!

మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి ! అందులో 'సూర్యోపాసన' ముఖ్యమైనది !! సూర్యుడు ప్రత్యక్ష దైవం ! ఈ జగత్తుకంతటికీ వెలుగును వేడిమిని ప్రసాదించే పరంజ్యోతి స్వరూపుడు !!

మన భౌతికమైన కనులతో చూడగలిగే 'సూర్యనారాయణుడు' ఆరోగ్య ప్రధాత !
"ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ "అంటుంది శాస్త్రం !
సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు" !!

కాశీలోని ద్వాదశ ఆదిత్యులు, స్థల పురాణం, వారి నిజరూప దర్శనం ఇక్కడ ఉన్నది, మనం అంత దూరం వెళ్ళి ఇప్పుడు చూడలేము కనుక ఇలా అయినా దర్శించుకుందాం. ప్రతి చిత్రం క్రింద ఆ ఆదిత్యుని కథ ఉంది దయచేసి సద్వినియోగం చేసుకోమని ప్రార్ధిస్తూ సాయి సంకల్ప్

కాశీ లోని ద్వాదశ ఆదిత్యుల పేర్లు ఇలా ఉన్నాయి

1. #కేశవాదిత్యుడు

2. #మయుఖాదిత్యుడు

3. #గంగాదిత్యుడు

4. #అరుణాదిత్యుడు

5. #ఖగోళాదిత్యుడు

6. #లోలార్కాదిత్యుడు

7. #సాంబాదిత్యుడు

8. #ద్రౌపది_ఆదిత్యుడు

9. #ఉత్తరార్క_ఆదిత్యుడు

10. #విమలాదిత్యుడు

11. #వృద్దాదిత్యుడు

12. #యమాదిత్యుడు

ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః

15/02/2024

కంచి కామాక్షి బ్రహ్మోత్సవాలు ప్రారంభం :

సమస్త భూమండలానికి నాభిస్థానం కంచి. సప్త మోక్షపురాల్లో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో కంచికామాక్షి ప్రసిద్ధమైనది. అంతేకాకుండా పంచభూత లింగాల్లో భూతత్వానికి ప్రతీక అయిన ఏకామ్రేశ్వరుడు కొలువైన క్షేత్రమూ కంచియే. పార్వతీదేవి స్వయంగా మట్టితో లింగాన్ని తయారు చేసుకుని, తపస్సు చేసిన ప్రాంతమిది. ఆమె భక్తిని పరీక్షించడానికి, శివుడు కంబనది ప్రవాహాన్ని పెంచి లింగాన్ని ముంచెత్తగా, దేవి తన రెండుచేతులతో లింగాన్ని అలల నుంచి కాపాడింది. కామాక్షీ దేవి విగ్రహం పద్మాసనంపై కూర్చుని ఉంటుంది. దేవి చేతులలో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలుంటాయి. ఇదే లలితా దేవి సంపూర్ణ స్వరూపమని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే జీవన్ముక్తి లభిస్తుందని, మళ్లీ జన్మించవలసిన అవసరం ఉండదని చెబుతారు. కామాక్షి ఆలయంలో మకర - కుంభ మాసాల నడుమ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలకు ముందురోజు ఉదయం చండీహోమం నిర్వహించిన అనంతరం కామాక్షీదేవి ఆయుధమైన అంకుశం వెంటరాగా ఆలయంలోని బిల్వవృక్షం వద్ద మృత్ సంగ్రహణం (యాగశాలలో మట్టిసేకరణ) చేస్తారు. మరునాటి ఉదయం ఆ మట్టిని కామాక్షీ ఆలయం ధ్వజస్తంభం వద్ద, మృత్తేశ్వరాలయం ధ్వజస్తంభం వద్దకూడా అంకురార్పణ నిర్వహిస్తారు. అనంతరం ధ్వజారోహణం ఉంటుంది. ఆనాటి సాయంకాలం వెండి మూషిక వాహనంపైన అమ్మవారిని ఊరేగిస్తారు. అప్పటినుంచి ప్రతిరోజూ ఉత్సవ కామాక్షీదేవి పురవీధుల్లో ఊరేగుతుంది. పగటి సమయంలో వరుసగా రజత వృషభం, మకరం, స్వర్ణసింహం, స్వర్ణ సూర్యప్రభ, బంగారు మేనా, ముత్యాల పల్లకి, రథం, భద్రపీఠం, గాంధర్వ మేనా, శరభ వాహనాల్లో అమ్మవారిని ఊరేగిస్తారు. రాత్రివేళల్లో వరుస రోజుల్లో రజత మూషికం, స్వర్ణహరిణం, చంద్రప్రభ, గజవాహనం, స్వర్ణ హంస, నాగ, స్వర్ణశుక, అశ్వ, రజత రథం, కల్పకోద్యానం, స్వర్ణకామకోటి విమాన సేవలుంటాయి. వాహనాలను బట్టి సరస్వతీ, లక్ష్మీమూర్తులు కూడా దేవిని అనుసరిస్తాయి. నాలుగు రాజవీధులలోనూ బాణసంచాలు, మేళతాళాల నడుమ వాహన సేవలుంటాయి. ప్రధానాలయం నుంచి కచవేశ్వరాలయం వరకు ఈ వాహన సేవలుంటాయి. నాగవాహనం ధరించిన రోజున మాత్రం శంకరమఠం వరకు వచ్చి వెనక్కు మళ్లిపోతుంది. 6వ రోజున రథోత్సవంలో భాగంగా వచ్చిన అమ్మవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు శంకరమఠం వద్దనే ఉంటుంది.

02/01/2024

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా...
ఒక గొప్ప సీతారాముల సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను... ప్రొడ్యూసర్ కావాలి... ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పగలరు...
మనోజ్ కుమార్ చింతల
9908810671

Address

JAMALAPURAM
Khammam

Alerts

Be the first to know and let us send you an email when Jamalapuram Venkateswara Swami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jamalapuram Venkateswara Swami:

Videos

Share