ఐదేళ్లలో కరీంనగర్కు నువ్వు ఏం తీసుకొచ్చావ్ బండి: సీఎం రేవంత్
ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో బండి సంజయ్ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.‘అయ్యో పాపమని ఓటేస్తే అక్కడ గుండు (ఎంపీ అర్వింద్), ఇక్కడ అరగుండు (బండి సంజయ్) ఏం చేశారని నిలదీశారు. తెలంగాణకు మీరు తెచ్చింది, కేంద్ర బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు' అని జమ్మికుంట జనజాతర సభలో విమర్శించారు.
జగిత్యాల జిల్లాలో లేగ దూడకు బారసాల
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరగోని సత్యనారాయణ అనే వ్యక్తి సోమవారం తన ఇంట్లోని లేగ దూడకు బారసాల నిర్వహించి, నామకరణం చేశారు. 21 రోజుల క్రితం తనకు ఇష్టమైన ఆవుల్లో ఒకటి లేగ దూడకు జన్మనిచ్చింది. సోమవారం దానికి మహాలక్ష్మి రేణుక అని నామకరణం చేసి, కొత్త బట్టలు తొడిగి, స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ తతంగాన్ని వారు ఆసక్తిగా తిలకించారు.
మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను అన్యాయంగా డిటైన్ చేశారంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు.. వారికి మద్దతు తెలిపారు. ముందస్తుగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి.. మరో 4 రోజులే గడువు: బండి సంజయ్
కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మల్యాలలో ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. కోటిన్నర మంది మహిళల అకౌంట్స్లో రూ.2500 జమ చేయాలన్నారు. 50లక్షల మందికి రూ. 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మంది కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. ఇళ్లు లేని 25 లక్షల మందికి స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు సాయం చేయాలని సూచించారు. 6గ్యారంటీల అమలుకు 4 రోజులే గడువన్నారు.
ఆప్యాయంగా స్వీట్లు వడ్డించిన రాధిక మర్చంట్
ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లో అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక నివాసితులకు గుజరాతీ వంటకాలతో అన్నసేవ చేస్తున్నారు. అయితే గ్రామస్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ రాధిక వారికి స్వీట్లు వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బిలియనీర్లు అయినప్పటికీ అంబానీ కుటుంబసభ్యులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
బండి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం
ఉదయం లేస్తే మద్యం, మాంసం లేనిదే బండి సంజయ్కి పొద్దు గడవదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తన దయ, దక్షిణ్యాల పైన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా బండి గెలిచారని వివరించారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి.. ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది.
అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది.
చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.
ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న ఆమె సోదరి నివేదిత గుండెలవిసేలా రోదించారు. 'సారీ రా' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అటు సికింద్రాబాద్లోని ఆమె నివాసంలోనూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అక్కడికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మహిళా ప్రీమియర్ లీగ్(WPL)కు మహిళా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. తొలి మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్తో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ముచ్చటించారు. మైదానంలో వారితో సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో షారుఖ్ సిగ్నేచర్ మూమెంట్ను క్రికెటర్ మెగ్ లానింగ్ అనుకరించారు. ఈ వీడియో వైరల్ అవుతోండగా.. 'వీడియో ఆఫ్ ది డే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కరీంనగర్ ప్రజలు తరిమితే.. KCR మహబూబ్‌నగర్ వచ్చారు!
కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఎంపీగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదరించకపోవడంతో ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కోసం వలస వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి నేడు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల వలసలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. ఆయన సభకు రాకుండా విశ్రాంతి తీసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
పెట్రోల్ పోసుకొని యువతి నిరసన..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం శివ కుమారి అనే యువతి ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. ఐదు నెలలుగా ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేక పోవడంతో ఆత్మహత్య కు ప్రయత్నించి కార్యదర్శి మమతతో వాగ్వివాదానికి దింగిన శివకుమారిని స్థానికులు సర్ది చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఇరువురు మహిళలు కావడం గమనార్హం.
భారతీయులారా.. వేడుక చేసుకుందాం: మాక్రోన్
గణతంత్ర దినోత్సవానికి భారత్ కు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయులకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో ఉండటం గర్వంగా ఉందని, వేడుక చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. కాగా.. ప్రధాని మోదీతో కలిసి ఆయన నిన్న రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి మసాలా చాయ్ తాగారు. అనంతరం యూపీఐ ద్వారా ఆయన డబ్బులు చెల్లించడం విశేషం.
భారతీయులారా.. వేడుక చేసుకుందాం: మాక్రోన్
గణతంత్ర దినోత్సవానికి భారత్ కు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయులకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో ఉండటం గర్వంగా ఉందని, వేడుక చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. కాగా.. ప్రధాని మోదీతో కలిసి ఆయన నిన్న రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి మసాలా చాయ్ తాగారు. అనంతరం యూపీఐ ద్వారా ఆయన డబ్బులు చెల్లించడం విశేషం.
ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూలవర్షం
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో మరో అద్భుత ఘట్టం జరిగింది. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. దీంతోపాటు రాముడికి హారతి ఇచ్చే సమయంలో 30 మంది కళాకారులు వివిధ భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తుంటే అతిథులందరూ స్వయంగా గంటలను మోగిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తికాగానే హాజరైన వారిని వరుసగా దర్శనానికి పంపిస్తారు.
#RamMandir #PranPratishtha #Ayodhya #JaiShriRam #HistoricDay #Hinduism #India
జై శ్రీరామ్: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు
కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు.
#RamMandir #PranPratishtha #Ayodhya #JaiShriRam #HistoricDay #Hinduism #India
నేను అత్యంత అదృష్టవంతుడిని: అరుణ్ యోగిరాజ్
భూమిపై తాను అత్యంత అదృష్టవంతుడినని భావిస్తున్నట్లు రామ్‌లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ తెలిపారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు అయోధ్యకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'నా పూర్వీకులు, కుటుంబ సభ్యులతో పాటు రామ్ లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది' అని చెప్పారు.
#RamMandir #PranPratishtha #Ayodhya #JaiShriRam #HistoricDay #Hinduism #India