TJU Magazine

TJU Magazine this page is administered by telanagana journalist union giving you news and updates of 24/7 all ar
(2)

09/09/2022

*బిగ్ బాస్ షో* -- *రాబోవు తరాల సహజీవనం*
*******

ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని
ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?

ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.

కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు.

రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం

*BIG BOSS. BIG BOSS*

*ఎవడీ BIG BOSS ?*
*ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?*
*మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?*
*వీడి విష సంస్కృతి ఏమిటి ?*

ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .

*ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS* .

బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు .

మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు .
మరి
*మీరు ఏ నాడైన ఆలోచించినారా?*
మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .

ఈ BIG BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు .
ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు .
మరి
పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ?
*ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?*
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ?
ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు .
*ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం* .
మరి
భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ?
మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?*
యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా?*
ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు .
మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి .
*మేలుకోండి*
మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి .
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ?
BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .

*చూస్తారా ? చూస్తారా ?*

*🚩👨‍👨‍👦‍👦సగటు భారతీయుడు బాధతో..👨‍👨‍👦‍👦🚩*.జాలి శ్రీనివాస్ రెడ్డి

11/01/2021

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు సోమవారం మృతి చెందారు. ఆయన చెన్నూరు(పాలకుర్తి) నుంచి TRS తరపున ఎమ్మెల్యేగా పని చేశారు.

15/12/2020

కేసీఆర్‌కు దడ పుట్టింది: విజయశాంతి.

ఎప్పుడో ఉద్యమకాలంలో ‘మన నీళ్లు, మన ఉద్యోగాలు’ అంటూ పొలికేక పెట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యోగాలు గుర్తొచ్చాయని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి విమర్శించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు చేసి కేసీఆర్‌కు దడ పుట్టిందని, అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రస్తావన తీశారని ఆమె పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘‘అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు. రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయి. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని ఈ మోసాల ముఖ్యమంత్రిగారు గమనించాలి’’ అని తన ఫేస్‌బుక్ ఖాతాలో విజయశాంతి రాసుకొచ్చారు.

07/12/2020

గాయని సునీతకు మళ్లీ పెళ్లి… నిజమే… ఈ డిజిటల్ పర్సనాలిటీతోనే…


ఇంకా ఊహగానాలు అవసరం లేదు… సింగర్ ఉపద్రష్ట సునీత పెళ్లి చేసుకుంటోంది… ఆమే స్వయంగా తన ఫేస్‌బుక్ పేజీలో చెప్పింది… తను ఆ ఫోటోలు పెట్టి, పోస్టు చేసిన గంట సేపట్లో ఓ ఇరవై వేల మంది ఆశీర్వించి, ఆన్‌లైన్‌లో అక్షింతలు కూడా చల్లారు… తన పోస్టులో మ్యాంగో మీడియా బిజినెస్‌మన్ రామ్‌తో కలిసి జీవితం పంచుకోబోతున్నట్టుగా తను వెల్లడించింది… ఇక రూమర్స్ అవసరమే లేదు… ఆశీర్వదించడమే… ఆమె జీవితం ఆమె ఇష్టం… రామ్ ఇష్టం ఇకపై…

గుంటూరుకు చెందిన ఓ సంగీత కుటుంబంలో పుట్టిన ఆమె మొదట టీవీ యాంకరిణి… తరువాత పదిహేనేళ్లకే సింగర్, ఇప్పటికి దాదాపు 3 వేల పాటలు… పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్… 19 ఏళ్లకే కిరణ్‌తో పెళ్లి,.. ఇద్దరు పిల్లలు, ఆకాష్, శ్రేయ… శ్రేయను సింగర్ చేయాలని అనుకుంటోంది… పెళ్లయిన కొన్నాళ్లకే సెలబ్రిటీల కుటుంబాల్లో కామన్ అయిపోయినట్టుగా విభేదాలు… విడిపోయింది…
తరువాత ఆమెపై అనేక రూమర్లు… కొన్ని ఖండించేది, కొన్ని చదివీచదవనట్టు వదిలేసేది… స్పందించకుండా ఉండిపోయేది… లోతు మనిషి… నిజానికి తనది పెద్ద వయస్సేమీ కాదు… 42 ఏళ్లే… ఐనా ఓ కొత్త తోడు వెతుక్కోవడానికి వయస్సుతో పనేం ఉంది లెండి… రామ్ కనిపించాడు… కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే… ఇప్పుడు ఆమే వెల్లడిస్తోంది… తమ బంధాన్ని అధికారికం చేస్తోంది… నిశ్చితార్థం చేసుకున్నారు…

త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు… పిల్లలకు చెప్పి మరీ… ఈమధ్య పిల్లల సాక్షిగానే జరుగుతున్న పెళ్లిళ్లు ఎన్నిలేవు..? సునీత పెళ్లి కూడా అంతే… ఈ ఫోటో కూడా ఆమె షేర్ చేసుకున్నదే… అనవసర ప్రచారాలు దేనికి..? అంతా నిజమేనోయ్ అని చెబుతున్నట్టుగా ఉంది… గుడ్… నిజానికి ఒక ఫేమస్ డిజిటల్ పర్సనాలిటీతో ఆమె పెళ్లి జరగనుంది అని కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నదే… తెలుగు డిజిటల్ ఫేమస్ పర్సనాలిటీలు చాలామంది ఉన్నారు…
యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లు, ప్రమోషన్ టీమ్స్, కొన్ని సినిమాల హక్కులు…. ఈ డిజిటల్ ప్రపంచం రూటే వేరు… రామ్ ఓ జెమ్… రామ్ చౌదరి ఆస్తుల విలువ కొన్ని వందల కోట్లు… శుభం భూయాత్…

06/12/2020

రేవంతుడికి రాధాకృష్ణుడి హెచ్చరికలు… చర్రున కాలడానికి కారణమేంటబ్బా?!

ఆమధ్య ఒకసారి చదివినట్టు గుర్తు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు తన కొత్తపలుకు వ్యాసంలో చంద్రబాబు, తెలుగుదేశం పేరు ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టకుండా తమాయించుకోవడం… మళ్లీ ఈరోజు కూడా అలాంటిదే చదివా… కాస్త లేటుగా, తాపీగా… ఆనందం వేసింది… అసలు చాలా గ్రేట్… జగన్‌ను ఆడిపోసుకోకుండా… చంద్రబాబును పొగడకుండా ఒక వ్యాసం రాయడం అంటే అది మామూలు పరీక్ష కాదు… ఆర్కే తొడుక్కున్న పచ్చ అంగీ, పెట్టుకున్న పచ్చటి కళ్లద్దాల పవర్ అలాంటిది మరి… బట్, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు తను ఈరోజు…

రాధాకృష్ణ మార్కు జర్నలిజంలోని బ్యూటీ అదే… జస్ట్, అలా ఏపీ కులరొంపి నుంచి బయటికి వస్తే చాలు, తను మంచి జర్నలిస్టు… ఎటొచ్చీ ఆ పచ్చంగీతోనే పరేషాన్… విషయానికొస్తే… కేసీయార్ ఎందుకు దెబ్బతిన్నాడో కాస్త పెరిఫెరల్‌గానైనా చెప్పుకొచ్చాడు… గొప్పే… ఎందుకు గొప్ప అంటే… తనేదో అద్భుతంగా విశ్లేషించాడని కాదు… ఈమాత్రం రాసే తెలుగు జర్నలిస్టులు అసలు హైదరాబాద్ అడ్డా మీద కనిపించడం గొప్ప… ఎల్బీ స్టేడియంలో కేసీయార్ సభకు వచ్చిందే పిడికెడు మంది… వాళ్లూ కేసీయార్ ప్రసంగం స్టార్ట్ కాగానే లేచి వెళ్లిపోయారు, అప్పుడే అర్థమై పోయింది కేసీయార్ పార్టీకి గ్రేటర్‌లో ఏ రిజల్ట్ రానుందో… ఇలాగే రాసుకొచ్చాడు ఆర్కే, నిజమే… జనం మూడ్ పట్టించేవి ఇలాంటివే… ఆర్కే పట్టుకున్నాడు… తను తప్ప ఇంకెవరూ ఆ కీలక పాయింట్ రాయలేకపోయారు చూశారా..? దటీజ్ ఆర్కే…

సరే, చాలా కారణాలు విశ్లేషించాడు, ఇప్పుడు వాటి జోలికి వద్దుగానీ… కాబోయే పీసీసీ అధ్యక్షుడిగా చెప్పబడుతున్న రేవంతుడికి ఓ హెచ్చరిక చేశాడు తను… నిజానికి రేవంత్‌కు ఆర్కే మంచి సన్నిహితుడే… ఐనా సరే, పేకాట పేకాటే… కాంగ్రెస్‌ను ఓడించటానికి మీడియా సుపారీ తీసుకుందని ఏదో రేవంత్ ఆరోపణ చేశాడు కదా… వోకే, మరెవర్ని తిట్టాలో తెలియక, అప్పటికప్పుడు ఫ్లోలో ఏదో తోచింది చెప్పాడు… రేవంత్ మాటల్ని కూడా అంత సీరియస్‌గా తీసుకుంటే ఎలా..? కనీసం సుపారీ ఇచ్చింది బీజేపీయా, టీఆర్ఎస్సా కూడా చెప్పలేదుగా తను… ఆర్కేకు రోషం వచ్చింది… అబ్బే, తనకు ఆ డబ్బులు రాలేదని కాదు… జర్నలిజాన్ని అలా అవమానపరుస్తాడా అని… అందుకే హెచ్చరిక చేశాడు…

ఏమోయ్ రేవంతూ… ఆ నమస్తే తెలంగాణ ఇతర పత్రికల చందాదారులకు కూడా పుణ్యానికి పత్రికల్ని పదిరోజులు పంచిపెట్టింది, ఏం ఫాయిదా వచ్చింది..? రాలేదు… రాదు… అసలు మీడియాను నమ్ముకుని రాజకీయం చేయడమే వేస్ట్… అవివేకం… కేసీయార్‌కు బోలెడంత మీడియా మద్దతు ఉంది, ఏమైంది..? రాజకీయాల్లో అవకాశం కోసం ఓపికగా వేచిచూడాలే తప్ప ఏదో ఫ్రస్ట్రేషన్‌లో అలా నోరుజారొద్దు… సరికాదు… ఐనా షార్ట్‌కట్‌లో రాజకీయంగా ఎదగాలని అనుకుంటే ఎవరి పొలిటికల్ కెరీర్ అయినా అర్ధంతరంగా ముగిసిపోతుంది…….. అంటూ బోలెడన్ని నీతులు చెప్పాడు…

నిజానికి రేవంత్ ఏదో ఫ్లోలో ఏదో అన్నాడు… ఆ సుపారీ ఆరోపణలు ఎంత అర్ధరహితమో ఆర్కే రాతలూ అలాగే… ఎందుకంటే..?

రేవంత్ షార్ట్‌కట్‌లో రాజకీయంగా ఎదగాలని ఏమీ అనుకోవడం లేదు… తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తింటూనే ఎదుగుతున్నాడు…
షార్ట్ కట్ రాజకీయాలకూ… మీడియా సుపారీకి లింక్ లేదు… ఆర్కే కూడా ఏదో చెప్పబోయే ఇంకేదో రాసుకుంటూ పోయాడు…
అసలు మీడియాను నమ్ముకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం అవివేకం అన్నాడు కదా… దానికి ఆద్యుడు ఇదే ఆర్కే గురుదేవుడు చంద్రబాబు… ఆ మీడియాలో ఆంధ్రజ్యోతి పాత్ర కూడా ప్రముఖమే… తను కూడా మీడియాతో ఫాయిదా లేదోయ్ అని చెప్పడం ఏదైతో ఉందో… అది అల్టిమేట్ ఆత్మవిమర్శ…
ఐనా కేసీయార్, పారా హుషార్ అని స్టార్ట్ చేసి, చివరకు రేవంత్‌కు చురకలు పెట్టి ముగించడం ఏమిటో ఓ పట్టాన అర్థమై చావలేదు… అంటే, ఆర్కే స్టాండర్డ్ రాతల్ని అర్థం చేసుకునే కెపాసిటీ, అంత బుర్ర మనకు లేకపోవడం వల్లే అంటారా..? ఏమో, అదే అయి ఉంటుంది…!!

05/12/2020

అభివృద్ది చేయలేదు కాబట్టి బీజేపీకి వేశారు.
కాంగ్రెస్ పత్తాలేదు కాబట్టి బీజేపీకి వేశారు.
కేసీయార్ ఒంటెత్తు పోకడలు సహించక బీజేపీకి వేశారు.
MIMతో లింక్ పెట్టుకుంది గనక బీజేపీకి వేశారు...
ఇలా సవాలక్ష చెప్పండి. నేను నమ్మను. నాకు ప్రత్యక్ష్యంగా పరిచయమున్న జనాల ద్వారా తెలిస్తున్నదేమంటే గత కొన్నేళ్ళుగా చాపకింద నీరులా బీజేపీ హిందుత్వ భావజాలం ప్రతి ఒక్కరికీ నేరుగా జియో ద్వారా అందుతోంది. ఒకప్పుడు అధికారం పట్టాలంటే మనకు వంతపాడే ఈనాడు కావాలి, సాక్షి కావాలి. ఇప్పుడంతా వాట్సాపు, ఫేస్‌బుక్, ట్విట్టర్. వీటికి తోడు వంద ఏళ్ళుగా క్రమశిక్షణతో ఇటుకా ఇటుకా పేర్చుకుంటూ సరస్వతీ విద్యామందిరాలతో మొదలుపెట్టి హిందుత్వ భావజాలంలో పెంచబడిన వారు అన్ని వ్యవస్థల్లో తిష్టవేశారు. వీరిని ఏకం చేసేది "హిందూ జాతీయత". అలాంటి ఏక సూత్రాన్ని ఆధారం చేసుకొని చివరికంటా పోరాడే మరో పార్టీ ఏముంది? ఒకవేళ వున్నా అది ప్రజల్లోకి వెళ్ళొద్దూ?
"నువ్వూ నేనూ ఒకే మతం" అన్నది అకర్షించినట్లుగా "నువ్వూ నేనూ లౌకికవాదులం" లేదా "నువ్వూ నేనూ కార్మికులం" అనేది ఆకర్షించదు. ఎందుకంటే నేడు లౌకికవాది అయినవ్యక్తి నిన్న కాదు, నేడు కార్మికుడు అయితే రేపు కాకపోవచ్చు. మతం/కులం అలా కాదు. దానికి తోడు ఆ మతం అంతటికీ ఒక శత్రువును చూపించడం. ఈ దుర్మార్గపు వాదానికి అధికారం తోడయ్యింది. ఒకదాని వెంట మరొకటి అన్ని వ్యవస్థలూ దాసోహం అన్నాయి. అసలవి బలంగా నిలబడిందెప్పుడు? వాటిని బలోపేతం చేసిందెప్పుడు?
లౌకివాదమే భారత జాతీయత అన్నది ఎక్కడ ఎవరు ఎవరికి నేర్పించారు? మతం ఇంటిగోడలకే పరిమితం అవ్వాలన్నది ఎవరు నిష్టగా పాటించారు?
టీయారెస్ అయినా మరోటైనా ఎంత అభివృద్ది చేసినా మనిషి చివరికి మతం మత్తుకే లొంగిపోతాడు. అభివృద్ది జరిగే చోట అది కాస్తా ఆలస్యం కావచ్చేమో గానీ ఎప్పటికైనా జరిగేదదే. చివరికి దేశమంతా కాషాయం అయ్యాక అందులోంచే శివసేన, బ్రహ్మసేన, విష్ణుసేన, శక్తిసేన అంటూ అదే పలు అవతారాలు దాల్చి తనతో తనే విభేదించుకొని ఘర్షించుకునేదాకా బీజేపీ ఆక్రమణ ఆగదు.

Prasad Charasala

05/12/2020

వార్తల్లోని వ్యక్తి 'బండి'!

నిన్న మొన్నటి వరకు కరీంనగర్ కు పరిమితమైన వ్యక్తి. మున్సిపల్ కార్పొరేటర్ తర్వాత లోక్ సభ సభ్యుడుగా తొలిసారి గెలిచారు. ఇప్పుడు తెలంగాణ అంతటా ఆయన గురించే చర్చ. ఆయన పేరు బండి సంజయ్. బీజేపీ లో హేమాహేమీలుగా పేరు పొందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నాయకులందరినీ వెనక్కి నెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని "సర్జికల్ స్ట్రైక్" క్షిపణితో హైజాక్ చేసి అరివీర భయంకర వ్యూహకర్త అయిన కేసీఆర్ కు 'చెక్' పెట్టిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బండి దూకుడుతో ఆ పార్టీలోని కేసీఆర్ 'రహస్య మిత్రుల'కు మింగుడు పడడం లేదు. బండి సంజయ్‌ తనదైన వ్యూహంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కమలాన్ని కొత్తపుంతలు తొక్కించారు. పదునైన అస్ర్తాలను సమయానుకూలంగా బయటకు తీశారు. వాటిని విపక్షంపై గురిపెట్టి విజయం సాధించారు. ప్రధాన ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. సున్నితమైన అంశాలపై మెరుపువేగంతో స్పందించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు. దుబ్బాక ఉప ఎన్నికతో తన సత్తా చాటుకున్న సంజయ్‌, గ్రేటర్‌ ప్రచార హోరులో ఎప్పటికప్పుడు ప్రజానాడికి అనుగుణంగా స్పందిస్తూ సంచలన నేతగా ఎదిగారు.టీఆర్‌ఎస్‌ వ్యతిరేకవర్గాలకు బీజేపీయే వేదిక అన్న స్థాయికి సంజయ్‌ పార్టీని తీసుకెళ్లారు. నిన్నమొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ ఎజెండా నిర్దేశించేది. ఇప్పుడు సంజయ్‌ నిర్దేశిస్తున్నారు అని బీజేపీ ముఖ్యనేతలు కొందరు విశ్లేషిస్తున్నారు. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌, రోహింగ్యాల తరలింపు, వరద బాధితులకు రూ.10 వేల సాయం లాంటి అంశాలతో టీఆర్‌ఎ్‌సకు ఊహించనిరీతిలో దెబ్బకొట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన రెండు రోజులకే ఈ సాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. సంజయ్‌ లేఖ రాయడంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. వరద సాయం అడ్డుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ముఖ్యమంత్రికి సవాల్‌ చేయడం సంచలనం సృష్టించింది.కేసీఆర్‌, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీల మైత్రిని పదేపదే ప్రస్తావించి, తమకు ఎంఐఎంతో పొత్తులేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రకటనను సంజయ్‌ ఎండగట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. ఆక్రమణల అంశంపై మాట్లాడిన మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఎన్టీఆర్‌, పీవీ ఘాట్‌లను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యపైనా సంజయ్‌ మెరుపు వేగంతో స్పందించారు. రెండుగంటల్లో దారుస్సలాంను కూల్చివేస్తామని చేసిన హెచ్చరిక పెను సంచలనానికి దారితీసింది.గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో సంజయ్‌ చేసిన పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రయిక్‌ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మేయర్‌ పీఠం దక్కించుకున్న 24 గంటల్లో రోహింగ్యాలను తరిమివేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్య కేంద్రంగా మిగతాపార్టీలు ప్రచారం కొనసాగడం గమనార్హమని బీజేపీ నేత ఒకరు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు, టీఆర్‌ఎస్‌ వెచ్చించిన రూ. 67వేల కోట్లపై సంజయ్‌ అధికార పార్టీకి విసిరిన సవాల్‌ కూడా ఓటరును బీజేపీకి మరింత చేరువచేసిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విపక్షాల వ్యాఖ్యలను కూడా సంజయ్‌ సమర్థంగా తిప్పికొట్టారు. భైంసాలో, కరీంనగర్‌లో మత విద్వేషాల కారణంగా కర్ఫ్యూ విధించలేదా? అంటూ టీఆర్‌ఎ్‌సను నిలదీయడమేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ మతవిద్వేషాలు జరిగాయో చెప్పాలని ఆయన సవాల్‌ విసిరారు. ఇలాంటివి బీజేపీ పట్ల యువత ఆకర్షితులవ్వడానికి కారణమయినవి.

05/12/2020

ఈ శతాబ్దంలో అందరికంటే గొప్పవాడు స్టీవ్స్ జాబ్స్ వాడి తాతా కాదు. నన్ను అడిగితే ఈ శతాబ్దంలో అత్యంత గొప్ప వ్యక్తి ఒమన్ సుల్తాన్ “ఖబూస్ బిన్ సయిద్” అంటాను. ఒమన్ ఒక ఎడారి అరబ్బు దేశం. 1970 వరకు బాహ్య ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు ఉండేవి కావు. తండ్రి నిరంకుశ పాలనకి అడ్డుకట్ట వేసి 1970 లో ఒమన్ దేశానికి ఖబూస్ బిన్ సయిద్ చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేసాడు.

2010 లో ఐక్యరాజ్యసమితి గడిచిన 40 సంవత్సరాల కాలంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల లిస్ట్ ప్రకటించినప్పుడు ఒమన్ దేశానికి అగ్రస్థానం ఇచ్చింది. దీనికి కారణం ఒకే ఒక్కడు అతనే.. ఒమన్ సుల్తాన్ “ఖబూస్ బిన్ సయిద్”… మిగతా గల్ఫ్ ధనిక పాలకుల్లాగా యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తూ జల్సాగా తిరగకుండా, తను బాగా చదువుకోవాలి అనుకున్నాడు. ఇంగ్లాండ్ లో మాత్రమే కాదు, ప్రపంచం అంతా తిరిగాడు. మన భారతదేశం కూడా వచ్చి మాజీ రాష్ట్రపతి శంకర్ దయళ్ శర్మ దగ్గర కొన్ని రోజులు చదువుకున్నాడు, భారతదేశం అంటే మక్కువ ఎక్కువ. ఇంకా బ్రిటీష్ రాయల్ మిలటరీలో కూడా కొంతకాలం పనిచేశాడు.

ఖబూస్ బిన్ సయిద్ ఒమన్ దేశాన్ని ఆధునీకరించిన ఒక దార్శనికుడు మాత్రమే కాదు, ఒక కర్మ యోగి. 1976 లో పెండ్లి చేసుకొని మూడు యేండ్ల తర్వాత కుటుంబ కలహాల కారణంగా విడాకులు తీసుకొన్నాడు. దేశాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని, ఇక మళ్ళీ పెండ్లి చేసుకోలేదు. ఒమన్ లో పనిచేయటానికి వెళ్ళిన ప్రతి బయటి దేశ కార్మికుడూ ఇప్పుడు మా దేవుడు లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు అంటే అతను ఎంత గొప్పవాడో అర్దం చేసుకోవచ్చు (కోలాన్ క్యాన్సర్ వలన జనవరి 10, 2020 న ఈ ఆధునిక మానవ చక్రవర్తి ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు (at the age of 79)…
ఎక్కడ ఉన్న దేశాన్ని ఎక్కడికి తీసుకువచ్చాడు తను, ఈ ముస్లిం సుల్తాన్ పెండ్లి చేసుకోకుండా, పిల్లలని కనకుండా దేశం అంతా తన కుటుంబం అనుకున్నాడు. ముస్లిం దేశం అయినా కొన్ని చర్చ్ లు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు. ఇంకా విశ్వవిద్యాలయాలు కట్టించాడు. దేశంలో ఉండే ప్రజలకి మత స్వేచ్ఛ ఇచ్చాడు. ఒమన్ లో 90% అక్షరాస్యత. 4% మాత్రమే సాగుభూమి, మిగతా అంతా ఎడారి అయినా ఆ 4% లో ప్రతి ఇంచు ఉపయోగించుకోగలిగితే చాలు అనేవాడు. ఎడారి దేశాల్లో తాగటానికే సరిపడా మంచి నీళ్ళు ఉండవు కానీ ఒమన్ లోని పురాతన అఫ్లజ్ ఇర్రిగేషన్ సిస్టంని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
సామాన్య కార్మికుడు ట్యాక్స్ కట్టే పని లేదు, సోషల్ సెక్యూరిటీ కోసం కొంత మొత్తం కడితే చాలు. ప్రతి కార్మికుడూ కాలర్ ఎగరేసుకొని గర్వంగా బతికే దేశం ఒమన్. ప్రపంచంలో one of the best టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఒమన్. ప్రాచీన మానవుడు అడుగుపెట్టిన కొన్ని ప్రదేశాల్లో ఒమన్ ఒక్కటి. చాలా నీట్ గా ఉండే దేశాల్లో ఒమన్ ఒకటి. మన దేశం, మన రాజకీయ నాయకులు జీవితాంతం చదవాల్సిన పుస్తకం ఒమన్ మరియూ ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్…
ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ లేడు అన్న విషయం ఒమన్ కి మాత్రమే కాదు, ఈ శతాబ్దపు అత్యంత గొప్ప మనిషి లేడు అని ఈ ప్రపంచానికి తీరని లోటు. కొన్ని రోజులు యూరప్ లో చికిత్స కోసం వెళ్ళి, ట్రీట్ మెంట్ చేస్తే ఇంకా బతకొచ్చు అని చెప్పినా నా దేశ కార్మికులు చిందించిన చెమట, రక్తంతో ఇంకా నేను బతకాల్సిన అవసరం లేదు అని స్వదేశానికి వచ్చి చనిపోయిన ఖబూస్ బిన్ సయిద్ నిజంగా ప్రస్తుత ప్రపంచానికి గర్వకారణం. సెల్యూట్ సార్… ఈ శతాబ్దపు గొప్ప మనిషి ఖబూస్ బిన్ సయిద్ అనే చక్రవర్తి బతికిన కాలంలో నేను కూడా బతికాను అని గర్వంగా చెప్పుకుంటా…

04/12/2020

అక్షరాలా నిజం… ఈ దేశంలో అన్నదాత ప్రాణాలకు విలువ లేదు, తన కష్టానికి గిట్టుబాటు లేదు… తన బతుకంటే ఎవడికీ గుర్తింపు లేదు… పోరాడాల్సిందే… కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం నిజంగా మొన్నటి చట్టాలపైనేనా..? లేక స్థూలంగా రైతు సమస్యలపైనా..? అలాగైతే సమాజంలోని అన్ని సెక్సన్లూ మద్దతు పలకాల్సిందే… కానీ నాణేనికి మరోవైపు చూడలేకపోతున్నామా..? అవును, కేవలం రైతు సమస్యల మీద కాదు… అది రాజకీయాలు మిళితమై సాగుతున్నట్టుగా ఉంది ఆందోళన… తన పంటను రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కొత్త వ్యవసాయ చట్టాల్లోని అంశం రైతులకు మేలు చేసేదే… పైగా కనీస మద్దతు ధర గానీ, వ్యవసాయ మార్కెట్ల ఎత్తివేత గానీ ఆ చట్టాల్లో లేవు… సరే, ఇప్పుడు ఆ చర్చలోకి వద్దు గానీ… క్రమేపీ ఢిల్లీ చుట్టూ మొహరించిన రైతు శ్రేణుల పోరాటం ఎటువైపు వెళ్తోంది..? ఎవరు ఈ ఆందోళనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..? అదీ ఆలోచించాల్సిన పాయింట్…
ఎందుకంటే… అక్కడక్కడా ఖలిస్థాన్ బ్యానర్లు, యాంటీ పౌరసత్వచట్టం ప్లకార్డులు కనిపిస్తూ…, అవే నినాదాలు వినిపిస్తూ… ఆర్టికల్ 370 ఎత్తివేత, ఇమ్రాన్ హమారా దోస్త్ వంటి కేకలు… మరీ కొన్నిచోట్ల ‘ఇందిరకే పాఠం చెప్పాం, మోడీకి చెప్పలేమా’ అనే స్లోగన్స్ వినిపిస్తూ… కాస్త అదుపు తప్పుతున్నట్టే కనిపిస్తోంది… పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదే ఉంది… అక్కడ రాజకీయాల్లో సెగ మొదలైంది… ఆల్‌రెడీ అంతకుముందు రాజకీయంగా చేదు అనుభవాలు మూటగట్టుకున్న అకాలీదళ్ ఇదే అదునుగా మోడీని, అనగా ఎన్డీయేను విడిచిపెట్టేసి, రైతు పోరాటాల్లో దిగింది…

రైతుల పోరాటం మెల్లిమెల్లిగా కాస్తా సిక్కుల జాతి పోరాటంగా మారుతోందా..? పోనీ, కొన్ని శక్తులు అలా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా..? ఇదే అదునుగా యాంటీ -మోడీ పార్టీలు, భక్తులు సంఘీభావం తెలిపి, ఈ పోరాటాల్లో కలిసిపోయారా..? అచ్చం, ఆమధ్య ఢిల్లీలో రోజుల తరబడీ సాగిన పౌరసత్వ చట్ట వ్యతిరేక పోరాటం యాంటీ -మోడీ పోరాటంగా ఎలా మార్చారో చూశాం కదా… ఎక్కడ చాన్స్ దొరికితే చాలు, దొరక్కపోయినా దొరికించుకుని మరీ… యాంటీ- బీజేపీ ఉద్యమాల్ని నిర్మించడానికి ఢిల్లీ ఓ వేదికగా మారింది… ఇవన్నీ నిర్హేతుకమైన సందేహాలు ఏమీ కావు… యాంటీ-బీజేపీ రాజకీయ శక్తుల సమీకరణ కూడా తప్పుకాదు… రాజకీయాల్లో ఇవన్నీ పరిపాటే… కానీ…
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు సాగుతుంటే… టర్కీలు, పాకిస్థాన్‌లు, మలేషియాలు మద్దతు ప్రకటిస్తాయి… ఇప్పుడు రైతుల పోరాటానికి కెనడా ప్రధాని ట్రూడా, బ్రిటిష్ ఎంపీలు మద్దతు ప్రకటిస్తారు… ఎందుకంటే, అక్కడ సిక్కుల జనాభా ఎక్కువ కాబట్టి, ట్రూడా కేబినెట్‌లో కూడా సిక్కు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి…! పాత ఖలిస్థాన్ మద్దతుదార్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నారు కాబట్టి… యాంటీ-మోడీ, యాంటీ-బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని కాస్త సిక్కుల జాతి ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయా…? టీవీ డిబేట్లలోనూ ఈ ప్రస్తావనలు వస్తున్నయ్…
అవార్డుల వాపసీ, ప్రభుత్వ ఉపేక్ష- జాతి సమగ్రతకే ప్రమాదకరం అనే పిలుపులు… ఇవన్నీ ఏదో తేడా కొడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి… ఢిల్లీకి పాలు, కూరగాయలు, ధాన్యాలు, సరుకులు అన్నీ వచ్చేవి పంజాబ్, హర్యానాల నుంచే… చివరకు ఢిల్లీ పరిసరాల్లో పంటల అవశేషాలు కాలబెడితే ఆ కాలుష్యంతో తల్లడిల్లేది కూడా ఢిల్లీయే… అసలు ఢిల్లీ అంటేనే పంజాబ్, హర్యానావాసులు… కల్చర్, వ్యాపారాలు, ఇండస్ట్రీలు ఎక్కువగా వాళ్లే… అందుకే రైతు ముట్టడి ఉధృతి కనిపిస్తోంది… లక్షల మందిని సమీకరించడం అక్కడ సుసాధ్యమైంది… వేరే రాష్ట్రాల్లో ఇవే చట్టాల మీద చడీచప్పుడూ లేదు… మొన్నటి కేంద్ర చట్టాల మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఈ పోరాటాలు లేవు… రైతులు బజారుకెక్కడం లేదు…
ఎలాగూ యాంటీ-బీజేపీ కాబట్టి కేజ్రీవాల్ వాళ్లకే మద్దతు… పైగా శాంతి భద్రతలు తన ప్రభుత్వం పని కాదు కదా… అది కేంద్రం పరిధిలోనిది… ఈ పోరాటంలో ఎవరిది పైచేయో నిరూపించుకునే ఎత్తుగడల్లో రాజకీయ పార్టీలు… సో, దీంతో సమస్య జటిలమైపోతోంది… కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమవుతోంది కానీ… సామ, దాన, భేద, దండోపాయాల్లో దేన్నీ సమర్థంగా ప్రయోగించలేని పరిస్థితి… ఎందుకంటే..? రైతుల పేరిట సాగుతున్న ఉద్యమం కాబట్టి…! చివరకు ఇది ఏ టర్న్ తీసుకోనుందనేది అసలైన ఆందోళన కలిగించే అంశం…

03/12/2020

బిగ్‌బాస్ ఔట్… వదినమ్మకు జై… వంటలక్కకు బై బై… ఏంటో తెలుసా..?
DECEMBER 1, 2020 BY M S R

‘‘ఫోఫోవయ్యా, ఉద్దరించావు గానీ… మధ్యలోనే చెప్పాపెట్టకుండా మాయమవుతావు,.. పట్టించుకోవు… అందుకే బిగ్‌బాస్ రేటింగ్స్ ఇలా తగలడ్డాయి’’ అని బిగ్‌బాస్ నిర్మాతలు హోస్టు నాగార్జునను పరోక్షంగా దెప్పిపొడిస్తే ఎలా ఉంటుంది…?

‘‘ఎహె, ఊరుకో… తలాతోకా తెలియని టీంను పెట్టి, జనమెరుగని కంటెస్టెంట్లను చీప్ రేట్లకు పట్టుకొచ్చి, సీజన్ మొత్తాన్ని నాశనం చేసింది మీరు… నడుమ నా ఇజ్జత్ పోయింది… మళ్లీ మాట్లాడితే స్టూడియో బయటికి నెట్టించేస్తాను…’’ నాగార్జున సీరియస్ అయితే ఎలా ఉంటుంది..?

జస్ట్, ఓసారి థింక్ చేయండి… కల్పనా, నిజమా వదిలేయండి… కానీ జరుగుతున్నది మాత్రం దాదాపుగా ఇదే… నాగార్జున మాటిమాటికీ 9.5 కోట్లు, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సరే… ఈ షో నిర్మాతలు Endemol Shine India వాడికి వైరాగ్యం వచ్చినట్టుంది… ఇక చాప చుట్టేస్తున్నాడు… తొక్కలో రేటింగ్స్ ఇక పెరగవు, షో లేవదు అని తీర్మానించేసుకున్నట్టున్నాడు…

ఇక రెండుమూడు వారాలేగా… చూసేవాడు చూస్తాడు, లేకపోతే లేదు… ఇప్పుడు ఇక ఉద్దరించబడేది ఏమీ లేదు అని ఫిక్సయిపోయాడు… స్టార్ మాటీవీ వాడిదీ అదే ఫీలింగు… దాంతో షో టైమును రాత్రి 9.30 గంటల నుంచి మార్చిపారేశారు… ఇకపై అది 10 గంటలకు ప్రసారం అవుతుంది… చూడాలనే తీట ఉన్నవాడు చూస్తాడు… లేదంటే లేదు… అంతే…

అసలు 9.30 గంటల టైమ్ అనేదే టీవీలకు సంబంధించి ఆడ్ టైమ్… ఇక అరగంట ముందుకు జరపడం అంటే… అనగా 10 గంటలకు మార్చడం అంటే… ఈ షో మీద మాకు కూడా ఇంట్రస్టు పోయిందోచ్ అని చెప్పేయడమే… ప్చ్, ఫాఫం నాగార్జున… ఫాఫం సీజన్-4… చివరకు దాని దుస్థితి అదీ… ఇప్పటికీ షో స్పానర్సర్లు పంకజ కస్తూరి బ్రీత్ ఈజీ, స్కంధాంశి, ఒప్పో తాలూకు స్పెషల్ యాడ్ స్కిట్స్ కూడా చేయించేసి వదిలేశారు… ఇక ఏదో ఫినాలె వరకూ నెట్టుకొస్తారు… వీకెండ్ షోలు మాత్రం సేమ్ 9 గంటలకు ప్రసారం చేస్తారు… ఇదీ కథ… ఇక్కడ ఓసారి సీన్ కట్ చేయండి…

వంటలక్క తెలుసు కదా… కార్తీకదీపం… మధ్యలో పరిటాల నిరుపమ్ దెబ్బకు కాస్త తేడా కొట్టింది… సీరియల్ కూడా పరమ బోరింగుగా మారింది… దిక్కూమొక్కూలేని కథనంతో ఉసూరుమనిపిస్తోంది… ఏదో స్టార్‌మాటీవీ వాడికి ఈ బార్క్ మాయామర్మాల్లో కాస్త పట్టుంది కాబట్టి ఏదో రేటింగ్స్‌లో నెట్టుకొస్తున్నట్టున్నాడు… కానీ జనంలో ఇంట్రస్టు పోయింది… హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ కూడా ఏదో సినిమా ప్రయత్నాల్లో పడింది… సో, చాప చుట్టేసే రోజులు దగ్గరపడ్డయ్… బహుశా డిసెంబరు చివరికల్లా గుమ్మడికాయ కొట్టేస్తారేమో…

అందుకే వదినమ్మను లేదా గ‌ృహలక్ష్మిని పైకి లేపే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు స్టార్ మాటీవీ వాడు… ఇక వంటలక్క ప్రేమిని ప్రేమించడం మానేయండి… ఇప్పుడిక సుజిత లేదా కస్తూరి… వాటికి పంపింగ్ కార్యక్రమం ఉండబోతోంది… వదినమ్మ సీరియల్‌ను ప్రత్యేకంగా పైకిలేపే కసరత్తు ఆరంభమైంది… మొదట్లో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేది, దాన్ని సాయంత్రం ఏడుకు మార్చారు… ఇప్పుడు బిగ్‌బాస్ స్లాటులోకి… అంటే రాత్రి 9.30కు మార్చనున్నారు… వచ్చే సోమవారం నుంచి ఈ మార్పులు…

మరి వదినమ్మ స్లాటులోకి ఎవరు అంటారా..? గుప్పెడంత మనసు అని ఓ కొత్త సీరియల్… దాన్ని తీసుకొస్తున్నారు… రాబోయే రోజుల్లో ఇక స్టార్ మాటీవీ బార్క్ రేటింగుల్లో వంటలక్క టాప్ ప్లేసులో ఉండబోవడం లేదు… వదినమ్మ లేదా గృహలక్ష్మి… మరీ తిక్కలేస్తే గుప్పెడంత మనసు… బార్క్ మీద పట్టుంటే ఏదైనా చేయొచ్చు… మరి బిగ్‌‌బాస్ రేటింగ్స్ విషయంలో ఈ తెలివి ఎక్కడ పోయింది అంటారా..? అసలు బొత్తిగా సరుకులోనే నాణ్యత లేనిది ఎంత ప్రమోట్ చేసి ఏం లాభం చెప్పండి…

30/11/2020

ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
డిసెంబర్ 1నుంచి 7 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్
- కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ , 30 -11 -2020 :
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1 ఉదయం 8 గంటల నుండి 7 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైటు www .knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Z category news:----------"జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ...
28/11/2020

Z category news:
----------

"జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. ఒక బక్క జీవి అయిన కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం గారు ప్రశ్నించారు. కేసీఆర్ గారి మాటలు వింటుంటే... ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో... తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది.

జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ గారు అరిచి గీపెడుతున్నారు. సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే... దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుంది"?

-విజయశాంతి.

28/11/2020

బయటి జిల్లాల నుండి చెన్నై వైపుగా ఎవరు
అయిన వ్యక్తి గత పనుల మీద రావాలి అను
కునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వయా
నెల్లూరు మీదుగా రావొద్దు మరో రెండు రోజుల
వరకు.. నెల్లూరు మీద రావడానికి ప్రయత్నిస్తే
ఖచ్చితంగా ఇరుక్కు పోతారు.. వెనక్కి వెళ్ళలేరు
ముందుకి వెళ్ళలేరు.. గూడూరు ఆది శంకర కాలేజ్
వద్ద చెరువు తెగి హైవే మీద ఒక మనిషి హైట్ లో
నీరు ప్రవహిస్తుంది.. నెల్లూరు నుండి చెన్నై వరకు
వాహనాలు ఆగి పోయి ఉన్నాయి.. మరీ అర్జంట్
అయితే వయా కడప తిరుపతి రూట్ లో వెళ్ళండి..
భారీ వర్షాల కారణంగా హైవే లో హోటల్స్ కూడా
చాలా మూసేసి ఉన్నాయి.. ఫుడ్ కూడా దొరకదు..
పెళ్లిళ్లు ఎక్కువ ఉండడం వల్ల లాడ్జ్ లలో కూడా
రూమ్స్ దొరకడం లేదు.. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్
ఫ్రెండ్స్.. ఎవరైనా వచ్చి ఇరుక్కుంటే మాత్రం మేము
కూడా వారి దగ్గరికి రీచ్ అవడం కష్టం అవుతుంది..
నెల్లూరు మిత్రులం మేము కూడా హెల్ప్ చేయలేము.
నిన్న రాత్రి కేవలం కార్లు వరకు కొన్నిటిని కృష్ణపట్నం
పోర్టు మీదుగా రూట్ ఇచ్చి నెల్లూరు సిటీకి చేరేలా
చేశారు పోలీసు అధికారులు.. ఈ రోజు అది కూడా
ఉండదు.. కానీ ఇప్పుడు ఉన్న భారీ వర్షం వలన
ఆ రూట్ లో 25 నుండి 30 KM స్పీడ్ కంటే స్పీడ్
వెళ్ళలేరు.. దాదాపు 4 నుండి 5 గంటలు పట్టొచ్చు
ఒకవేళ కృష్ణ పట్నం పోర్టు మీదుగా రూట్ ఇచ్చినా
కూడా ప్రాబ్లెమ్ వస్తుంది.. సో బెటర్ టేక్ డైవర్షన్..

28/11/2020

ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా...!?
ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ... మితి మీరు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని... నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనకేం అవుతుంది? మనం మద్ధతు ఇచ్చేది అధికారంలో ఉన్న వారికే కదా అని భావిస్తూ కొందరు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అధికారంలో లేని వారికి సైతం వంతపాడుతూ వస్తున్నారు. రెండూ తప్పే! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు రాజకీయ ప్రకటనలు చేయడం, ఎన్నికల్లో ప్రచారం చేయడం, మద్ధతు ప్రకటించడం సీసీఏ రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘనే అవుతుంది. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టే శాశ్వతంగా అధికారంలో ఉండదు కదా! ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పక్షం భవిష్యత్తులో అధికారంలోకి రావొచ్చు. బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు. అధికారంలో లేని పార్టీకి మద్ధతు ఇస్తే వెంటనే వేటు పడుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మద్ధతు ఇచ్చే వారు తమ పబ్బం గడుపుకోవడానికి..... సొంత పనులు చక్కబెట్టుకోవడానికి తాత్కాలికంగా పనికి వస్తుందేమో కానీ, ఎప్పుడో ఒకప్పుడు వారికి ఇబ్బందులు తప్పవ్! ఇది గ్యారంటీ. రాసి పెట్టుకోండి! ఎందుకంటే అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవ్ కదా! తాము ఇప్పుడు భజాలకెత్తుకొని ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీ తమకు ఇబ్బంది కలిగినప్పుడు పట్టించుకుటుందన్న పూచీ కూడా లేదు. ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తు పెట్టుకుంటే వారికే మంచిది.
గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనను ఉద్యోగ, ఉపాధ్యాయులు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. సరిగ్గా ముప్పై ఐదేళ్ల క్రితం.... అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సుని 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించింది. రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విపత్తుని ఏమాత్రం ఊహించని పలువురు ఉద్యోగులు గుండె ఆగి చనిపోయారు. వయస్సు తగ్గింపుతో ఉద్యోగులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక కడుపుమండిన ఒక ఉద్యోగ నాయకుడు ఆవేశంలో ప్రభుత్వాన్ని ఒక్క మాట అన్నాడు. ఆ మాటను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వ పెద్దలు సదరు ఉద్యోగనేతపై కత్తి కట్టి వేటు వేశారు. ఆ వేటు సస్పెన్షన్ కాదు, రిమూవల్ ఫ్రొం సర్వీస్ కూడా కాదు. సర్వీస్ నుంచి ఏకంగా డిస్మిస్ చేసింది. నాలుగేళ్ల తర్వాత.... 1989లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఉద్యోగ నేతను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారనుకోండి. అది వేరే విషయం.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సమస్యలున్నది నిజం. ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నదీ వాస్తవమే! 18 సమస్యలను పరిష్కారం చేస్తానని స్వయంగా సీఎం రెండున్నర ఏళ్ళ క్రితం విలేఖరుల సమావేశంలో ఇచ్చిన హామీలే నేటి వరకూ అమలుకు నోచుకోలేదు. సీఎం సచివాలయానికి రారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులకు ప్రగతిభవన్కు ఎంట్రీ లేదు. భవిష్యత్తులో సీఎం అవుతారని ప్రచారంలో ఉన్న మంత్రి కేటీ రామారావు గారైనా జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దుతారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు కూడా అడియాసలయ్యాయ్. దాంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఈ ప్రభుత్వంపై... ప్రభుత్వ పెద్దలు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం ఉందన్నది నూటికి నూరు శాతం నిజం. అయితే, కోపాన్ని ప్రదర్శించడం కోసం సామాజిక మాధ్యమాల్లో పాలక పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తగదు. దానికి రూల్స్ ఒప్పుకోవు. వాటిని ప్రభుత్వం, అధికారులు సీరియస్ గా తీసుకుంటే రాజకీయ ప్రచారం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. రాజకీయ పోస్టింగులు, మద్ధతు ప్రచారం, లేఖలపై ఫిర్యాదులు వెళ్లి విచారణ జరిగితే సదరు ఉద్యోగ, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ సహా తీవ్ర చర్యలు తీసుకునే ప్రమాదముంది. దాంతో సర్వీస్ పరమైన సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అందుకే రాజకీయ ప్రచారం వంటి దుస్సాహసానికి ఉద్యోగ, ఉపాధ్యాయులెవరూ పాల్పడకూడదు.
కింకర్తవ్యం....!?
కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఏళ్ళ తరబడి సమస్యలను పెండింగులో పెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దశల వారీగా ఉద్యమాలు నిర్మించడమే ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమాలే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం. దీనికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజల మద్ధతు సైతం కోరాలి. కూడగట్టాలి. ఒంటెద్దు పోకడలతో పోతున్న ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తమ నిరసనను ఆ విధంగానే తెలియజేయాల్సి ఉంది. అంతే కానీ, రాజకీయ ప్రచారానికి దిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!
-మానేటి ప్రతాపరెడ్డి!

Address

Karimnagar
505001

Telephone

9963867559

Alerts

Be the first to know and let us send you an email when TJU Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TJU Magazine:

Share