22/05/2021
రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్క చేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎంజీఎం దవాఖానను మదర్ చైల్డ్ హాస్పిటల్ (MCH) గా మారుస్తామని ప్రస్తుతం వున్న జైలును అక్కడి నుంచి తరలించి అక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం ఇవాళ వరంగల్ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుంటారని కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ శ్రీ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎం ను ఉద్దేశించి, మీరే మా ధైర్యం.. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.
ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దవాఖాన సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారకుల్లో కలియతిరిగి, శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి అభ్యర్థనలను స్వీకరించారు.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉన్నది. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలె. అత్యవసర సేవలను, పాస్ లు ఉన్నవాళ్ళని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు.
అదే సమయంలో ధాన్యం సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి. నేను హెలీకాప్టర్ లో వస్తున్న సందర్భంలో రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతరు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి’’ అని సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పేరు పేరునా సీఎం మాట్లాడారు. కరోనా, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు తదితర అంశాల మీద వారితో సమగ్ర చర్చ జరిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం లాక్ డౌన్ మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందన్నారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని సీఎం కోరారు. లాక్ డౌన్ సమయం ముగిశాక ఉదయం 10.10 గంటల తర్వాత పాస్ హోల్డర్స్ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది? ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది? అని సీఎం ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు.
కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ర్పెడర్స్ (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్) తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వీరందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, ధాన్యం సేకరణ కార్యక్రమం వెంటనే ముగించాలన్నారు. ఈ క్లిష్ట సమయంలో దవాఖానాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.
సెంట్రల్ జైలును తరలించి ఓపెన్ జైలుగా మారుస్తాం, జైలు స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం: సీఎం
వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంజీఎం దవాఖానను మదర్ చైల్డ్ హాస్పిటల్ (MCH) గా మారుస్తామని, వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని, అదే స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాను విస్త్రృత పరిచి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం అన్నారు. ఇక్కడి నుంచి తరలించే సెంట్రల్ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని సీఎం అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్ డౌన్ అమలు పై కూడా సీఎం కూలంకంశంగా చర్చించారు.
ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీలు శ్రీ బండా ప్రకాశ్, శ్రీ పసునూరి దయాకర్, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీలు శ్రీ కడియం శ్రీహరి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీ నన్నపునేని నరేందర్, శ్రీ ఆరూరి రమేశ్, డాక్టర్ టి.రాజయ్య, శ్రీ సతీశ్, హెల్త్ సెక్రటరీ శ్రీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ శ్రీ గంగాధర్, హెల్త్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, డీఎంఈ శ్రీ రమేశ్ రెడ్డి, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, అర్బన్ రూరల్ జెడ్పీ చైర్మన్లు శ్రీ సుధీర్, శ్రీమతి గండ్ర జ్యోతి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్రీ కరుణాకర్ రెడ్డి, టీ.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి ఎం.డి. చంద్రశేఖర్ రెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Chief Minister Sri K Chandrashekar Rao has instructed the DGP, all the district Collectors and Police officers to implement the lockdown guidelines and restrictions strictly, as the state government had imposed the lockdown keeping view the overall health of the people without bothering about incurring heavy revenue losses in the State. The CM instructed the officials concerned to expedite the Paddy procurement programme in the next week or ten days, as a severe summer situation would prevail in the state at the advent of Rohini Karte.
The CM said that the present MGM Hospital will be converted into Mother and Child Hospital and the present Jail premises would be converted into a multi-super specialty Hospital with the latest technology, equipment and medical services. A Jail would be built on the lines of Cherlapally Open Air Jail in a sprawling Campus on Warangal outskirts.
The CM visited Warangal on Friday as part of his programme to monitor and supervise the Corona treatment given, facilities that are available at the government hospitals in the State. The CM, who reached Warangal by helicopter, visited the MGM Hospital. He visited the ICU, General wards and interacted with the patients admitted there. The CM went to each and every bed and spoke with the patients and inquired about the treatment given, medicines administered and the quality of food being supplied. He inquired about their personal details and instilled confidence in them saying they would all get well soon and advised them not to entertain any fear or anxiety over the Covid.
Interacting with the CM, a patient from Matte Wada, Venkatachari said that he is getting good treatment and praised the CM saying, “Sir, you are our confidence, you are our life!” Later, the CM visited the general ward. The CM went around the MGM hospital and inspected the way sanitation is maintained and other facilities there. The CM had inquired with the Doctors about the medical facilities and treatment given to the people. The CM has instructed the Senior Medical and Health Officials to provide the required facilities and treatment to the patients and they should not worry anything about the availability of funds. The CM enquired with the Hospital staff and Nurses and enquired about the problems faced by them. He congratulated them on the services that they are rendering.
After lunch, the CM visited the Warangal Central Jail. He examined the Handloom and Steel and other products made by the prisoners. He went around the Barracks and interacted with the prisoners serving sentences there. The CM asked them for which offense they are sentenced? From where they came from? What is their family status? The CM gave the patient a hearing to the problems of Prisoners. He had inquired about the facilities they are getting inside the Jail. He had accepted their petitions.
From there he came to the district Collector’s office and held a video conference with the DGP, District Collectors, Commissioners of Police and SPs. He enquired with them about the actual situation of Corona in the district and what is the action plan being implanted to curtail its spread. The CM instructed them to impose the lockdown strictly. He also instructed the officials to complete the procurement of Paddy within ten days.
Speaking on the occasion, the CM said,” The state government has decided to impose lockdown not bothering about the heavy revenue loss to the State. In the present situation, it is the responsibility of the DGP and the Collectors to implement the lockdown in true letter and spirit under the Disaster Management Act guidelines. Except for the four hours relaxation period, lockdown should be implemented for the rest of the 20 hours. Only people having emergency passes and essential services should be exempted. Don’t show any laxity or lenience. But at the same time, the Paddy procurement should be done on a fast track. While I was coming here by Helicopter I have seen Paddy stocks dried in open. Since Rohini Karte is entering in four or five days, farmers would be busy with the agricultural operations. Hence the Paddy procurement should be completed quickly.”
The CM interacted with each district Collector on a one-to-one basis. He held an in-depth discussion with them on Corona, paddy procurement and implementation of the Lockdown. He gave them suggestions and issued instructions on the measures to be taken to curtail the spread of Corona. The CM expressed his unhappiness over lockdown not being implemented properly in some districts. He made it clear that lockdown should be implemented in toto. He said in villages, Sarpanches and other public representatives are implementing the lockdown voluntarily and in the cities of the urban area, it should be implemented more effectively. The CM wanted officials concerned to focus on this. The CM wanted stringent measures should be taken so that no one except the pass holders to be seen on roads after 10.10 AM. The CM also inquired about the supply of medicines and Oxygen in the districts. The CM wanted the implementation of the second household Fever Survey as an extension of the first survey. He instructed the Collectors to take special care about sanitation in the hospitals. The CM instructed the GHMC Commissioner and the Collectors to ensure that the garbage at the Corona hospitals should be cleared at regular intervals.
The CM announced that the problems of all categories of outsourcing employees would be solved at the Cabinet meeting. The CM urged the medical staff to work with the same zeal. The CM also instructed the district collectors to prepare a list of super spreaders like RTC Drivers, Conductors, Sales personnel, and vegetable vendors. He said the state government has decided to conduct a special drive for them. The CM has instructed Principal Secretary (Medical and Health) Sri S.A.M. Rizvi to personally visit Yadadri, Nagar Kurnool and other districts where there is no decrease of the Covid Cases and reviews the situation there. The CM also instructed the District Collectors bordering other States to pay special attention to the curtailment of Corona. The CM congratulated each and every medical and health staff working in the hospitals for their services during this difficult period.
Will shift the Jail and set up Multi Super Specialty Hospital:
-----------------------------------------------------------------
After visiting the MGM Hospital, Videoconference with the Collectors, the CM had an exclusive meeting with the Ministers, MLAs, and Public Representatives from the district. Speaking on the occasion, the CM said that the Warangal Central Jail would be shifted to the outskirts and an open jail would be set up there. He said it would be developed in a sprawling campus like the Cherlapally Open Air Jail and it would be like a Correctional Centre. In the present jail premises, a multi-super specialty hospital would be developed with all the facilities. He said the present MGM Hospital would be converted into Mother and Child Health Centre (MCH). The CM said that all the District primary health care centres should be strengthened.
Along with the CM, Ministers Sri E Dayakar Rao, Ms. Satyavathi Rathod, MPs Sri B Prakash, Sri P Dayakar, Chief Secretary Somesh Kumar, MLCs Sri Kadiam Srihari, Sri Palla Rajeshwar Reddy, Sri Srinivas Reddy, Government Chief Whip Sri D Vinay Bhaskar, MLAs Sri N Narender, A Ramesh, Dr. T Rajaiah, Sri Satish, Health secretary Sri Rizvi, CM OSD Sri Gangadhar, Health Director Srinivas Rao, DME Sri Ramesh Reddy, TSMSIDC MD Chandrasekhar Reddy, Kaloji Health University VC Karunakar Reddy, Warangal Mayor Ms. Gundu Sudharani, Urban and Rural ZP Chairpersons Sri Sudhir, Ms. G Jyothi, district leaders participated.