08/09/2022
**ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా**
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Voter Helpline' యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
Step 2- యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'Voter Registration' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
Step 3- ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయండి.
Step 4- ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
Step 5- 'Yes I have voter ID' ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయాలి.
Step 6- మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.
Step 7- 'Fetch Details' పైన క్లిక్ చేయాలి.
Step 8- ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
Step 9- ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 'Done' పైన క్లిక్ చేయాలి
మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. www.nvsp.in వెబ్‌సైట్‌లో కూడా ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. లేదా మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి తేదీ ఏమీ లేదు.!!!