VSB TV

VSB TV We started this page in September 2018. All the updates related to education, entertainment , social

02/02/2025

పెద్దిరెడ్డి అక్రమాల గురించి...? నాగబాబు

02/02/2025

జీవితంలో ముందుకెళ్ళాలి , గెలవాలి, బాగుండాలి అనుకునేవాడు పక్క వాళ్ళ విషయాలు గురించి ఆలోచించడు. కేవలం తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తాడు.. మన ఇంట్లో గిన్నెలు మనం తోముకోడానికి ఓపిక ఉండదు... కానీ చుట్టుపక్కల వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అడగకపోయినా వాళ్ళ ఇంట్లో గిన్నెలు అన్ని తోమేస్తారు కొంతమంది...(పక్క వాళ్ళ విషయాల గురించి ఆలోచించడం అంటే గిన్నెలు తోమడం లాంటిదే...)
జీవితంలో మనం చేయలేని, మన కంట్రోల్లోలేని, మనం మార్చలేని విషయాల గురించి ఆలోచిస్తూ, బాధపడుతు ఉన్న కాలాన్ని వృధా చేయటం కంటే, మనం చేయగలిగి, మన కంట్రోల్లో ఉండి, మనం మార్చగల విషయాల గురించి ఆలోచిస్తూ, అర్ధం చేసుకుంటూ, సాధిస్తూ ముందుకు వెళ్లడం ఉత్తమం. ఆలోచనలు, ఆశయాలు గొప్పవైనపుడు నీ ప్రగతిని, స్ఫూర్తిని ఎవ్వరూ ఆపలేరు. అవే ఆలోచనలు, ఆశయాలు చెడ్డవైనపుడు నీ వినాశనాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ప్రతీ నిన్న ఒక జ్ఞాపకం, ప్రతీ రేపు ఒక కల్పన, ప్రతీ క్షణం భగవంతుడు నీకు ఇచ్చిన అద్బుతమైన అవకాశం... కాలం చాలా విలువైనది అనవసర విషయాల కోసం ఆలోచించి వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనేది పెద్దల మాట...

02/02/2025

🚀 "DeepSeek AI: The Chinese AI That Shook Nvidia & OpenAI! 🤖🔥" || VSB TV

📌 Video Description:
🌟 DeepSeek AI is China’s latest breakthrough in artificial intelligence, directly competing with ChatGPT and OpenAI! With ultra-low development costs and cutting-edge performance, DeepSeek AI is changing the global AI landscape and even impacting Nvidia's stock market! 📉💥

🔹 What is DeepSeek AI?
🔹 How is it different from ChatGPT?
🔹 Why did Nvidia lose $600 billion because of this AI?
🔹 Will China dominate the AI world?

Watch till the end to find out! 🎥🔥

02/02/2025

LIVE🔴: Grand Opening of New Venture KKR GARDENS | Sri Aditya Developers | Rajahmundry || VSB TV

01/02/2025

శ్రీ ధర్మపురి క్షేత్రం 🙏🙏 ఇచ్చట అందరి దేవుళ్ళ దర్శనం లబించును

01/02/2025

Live streaming of సురేష్ వి.ఎస్.బి

01/02/2025

సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ... || VSB TV

01/02/2025

శ్రీ వారాహీ అమ్మవారి ఆలయం కొవ్వూరు | Varahi Ammavaru Kovvuru || VSB TV

01/02/2025

ఆచమనం అంటే ఏంటి ..?

🌸సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు తెలుసుకుందాం…

🌿ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం.

ఎలా చేయాలి .. ?

🌸చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా (ఉర్ధరిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు, బోర్లు లేదా మంచినీటి పంపుల్లో పట్టుకవచ్చిన నీరు తీసుకొని సిద్ధం చేసుకోవాలి

ఆచమనం ఎందుకు చేస్తాము...?

🌿పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనం అని నీళ్ళని తీసుకుంటాం. అలా ఎన్ని నీళ్ళు తీసుకోవాలి?
చేయి ఎలా ఉండాలి? దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది.

🌸 ‘గోకర్ణాకృతి హస్తేన’ అని మనం నీళ్ళు పుచ్చుకునేటప్పుడు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం అంటే బొటనవేలు వెళ్ళి మధ్య వేలి ప్రారంభ స్థానాన్ని తాకాలి. దానిమీద చూపుడు పెట్టాలి. దీనిని గోకర్ణాకృతి అంటారు.

🌿 ఇందులో మినపగింజ పెడితే అది మునగడానికి ఎన్ని నీళ్ళు పోస్తావో అన్ని నీళ్ళే పోయాలి. అంతకన్నా ఎక్కువ నీళ్ళు పోయకూడదు. క్రింది పెదవిని అమృతమార్గమునందు చేర్చి శబ్దం రాకుండా తీసుకోవాలి.

🌸ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం పృష్ఠ భాగం పీటని కానీ, నేలను కానీ తాకకూడదు. గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధమైన ఆచమనం. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసే విధానాన్ని చూస్తే రెండు మోకాళ్ళ మీద కూర్చుని పృష్ఠ భాగం నేలకి తగలకుండా రెండు మోచేతులు రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టి నీళ్ళు కుడిచేతిలో వేసుకొని అమృతమార్గంలోంచి లోపలికి పుచ్చుకుంటారు.

🌿భగవన్నామ స్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. కేశవాయ స్వాహా అని ఒకమాటు తీసుకుని గుటక పడి లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత నారాయణాయ స్వాహా అని మళ్ళీ పుచ్చుకోవాలి. మాధవాయ స్వాహా అని మూడవ మాటు పుచ్చుకోవాలి. తర్వాత మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకు అలా ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరములయందు ఉండే ఉద్రేకములు అలా పుచ్చుకుంటే చల్లారి శాంతితో ఏ విషయం గురించి ధ్యానం/ఆలోచన చేస్తున్నారో అవి చేయడానికి కావలసిన బాహ్య, ఆంతర శౌచమును ఇస్తుంది.

🌸ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు. మనస్సు సూక్ష్మ శరీరం. అది నిలబడాలి అంటే ఆచమనం ఉండాలి. ఆచమనం పూజ ప్రారంభంలోనే కాక ఒక రోజు మొత్తంలో అనేకమార్లు ఆచమనం చేస్తారు.

🌿ఎందుకంటే ఎప్పుడూ బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది. రామనామం తారకం కదా! రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు అనవచ్చు. దాని వెనక ఒక రహస్యం ఉంది.

🌸84 లక్షల జీవరాశులలో స్వరపేటిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. స్వర స్థానములను వేదం గుర్తించింది. నాలుక పైభాగం, క్రింది భాగం, కంఠం యొక్క అంచులు, పెదవులు, అంగిడి, దవడలు, ఇవన్నీ స్వర స్థానములు.

🌿 ఈ స్వర స్థానములయందు వాయువు కదిలి నాలుకచేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి. అక్షరముల యందు అనంతమైన జ్ఞానం ఉండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన విషయం చెవుల గుండా శ్రోతలోకి వెళ్ళి వీరిలో జ్ఞానం అవతలి వాడిలోకి వెళ్తుంది.

🌸కాబట్టి ఆ స్వరపేటిక చాలా గొప్పది. అది ఒక్కటి ఉన్న మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు. రామనానం అలవాటు అయితే చేసిన పాపాలు కాలిపోతూ ఉంటాయి.

🌿అంటే పాపాలు చేసి రామనామ చెప్పమనడం ఉద్దేశ్యం కాదు. అంత గొప్పది స్వరపేటిక. అది ఉన్నది కాబట్టి మంచి మాట మాట్లాడతావు. ఇతరుల కష్టాన్ని తీరుస్తావు. మంచిమాట అలవాటు అయినవాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు.

🌸అంత గొప్ప మాట మనుష్యునకే ఇవ్వబడింది. ఆ స్వరపేటికని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. స్వరపేటికని నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైన యంత్ర పరికరాలను కాపాడడానికి కందెన వేస్తారు. సైకిల్ చక్రంలో చైన్ కి ఆయిల్ వేస్తే అది సాఫీగా తిరుగుతుంది. break వేసే చోట grease పెడతాం. తుప్పు పట్టకుండా మెత్తగా పడుతుంది బ్రేక్ వేయగానే. కందెన అది సున్నితంగా పని చేసేటట్లు ఎలా చేస్తుందో యంత్రాన్ని మినపగింజ మునిగినంత నీటితో స్వరపేటికని కాపాడతారు.

🌿 స్వర పేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానంగా ఉత్పత్తి అయ్యే అక్షరముల దంతముల వెనుక భాగంలో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి. కేశవాయ స్వాహా అన్నప్పుడు ఆ నీళ్ళు ఈశ్వరుడికి వెళ్తున్నాయి.

🌸లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాను. స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటటువంటి స్థానముల యొక్క శక్తి ద్విగుణీకృతం చేయడానికి, స్వరపేటికని కాపాడుకోవడానికి కేవలం అక్షరోచ్ఛారణ చేయకుండా భగవన్నామములను ఉచ్ఛరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్ర పట్టి ఆ నీటిని క్రింది పెదవి

మీంచి పుచ్చుకుని గుటక వేసి నామాన్ని చెప్తే దానివల్ల స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది.

🌿ఆచమనం: దైవాన్ని పూజించడానికి ముందు ఆచమనం చేస్తారు.
మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా పూజించడానికి అర్హులవుతారు. మనసును శుద్ధిచేయడమే ఆచమనములోని ప్రధానఆశయం. అంతే కాకుండా దేవునిపూజ చేయకుండ ఏవిధమైన పానీయాలు త్రాగరాదు.

🌸అందుకే పూజ చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దము రాకుండా నోటిలోనికి తీసుకుంటే దివ్యఔషధంగా కూడా పనిచేస్తుంది...స్వస్తి..🌞

31/01/2025

"ఓ ప్రకృతి లోకమా!!"

ఓ ప్రకృతి లోకమా...
నామొర ఆలకించు!!...
నా చిన్ననాటి జ్ఞాపకాలు దాచుకున్న
ఆనాటి కాలాన్ని రప్పించి ఒప్పించి
ఆ తియ్యతేనియ మాటలు వినాలని
ఆ నడక నడతలు చూడాలని ఉంది!!...
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని
చూపించమని చెప్పగలవు...

విశ్వంలో జీవించే ప్రతి ప్రాణికి
ఆనాటి జ్ఞాపకాలుంటాయి...
ఇప్పటి ఆధునిక సాంకేతిక
ప్రవాహంలో మునిగి పోతున్నారు....
మితిమీరిన తెలియని వ్యాపకాలు
ఏమి జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు...

మానసిక ప్రశాంతత కొరకైనా
ఆనాటి జ్ఞాపకాలను
నెమరు వేసుసుకోవాలి!!
ఆనాడు ఆత్మ విశ్వాసం మెండు..
తమ శక్తి సామర్థ్యాలకు పదునెక్కువ!!
ఆనాటి కాలం నేటి తరానికి తలమానికం...

ఆ చైతన్య రీతులు
అత్యంత ప్రసిద్ధి చెందినవి...
ఆనాటి మనషుల ఘనత
ఎంత విశిష్టమైనదో!!...
ఆనాడు పసిపిల్లల సంరక్షణ
ఎంతో గొప్పగా ఉండేది..
సంఘీభావంతో బాధ్యతలను నిర్వర్తించేవారు...
ఆత్మీయ స్పర్శతో ఆదరించే వారు...

కులాలతో కొట్టుకోలేదు..
మతాలతో మంటలు పెట్టలేదు..
ఐక్యమతమే మహాబలంగా బతికారు!!
మనసు నిండా ప్రేమ గుండె నిండా ఆప్యాయత
నిలువెల్లా అల్లుకున్న ప్రేమామృతమే!!
అక్షరం రాకున్నా వాళ్ళ మెదడులో
మంచి ఆలోచన దీపం వెలుగుతూ ఉండేది...
అందుకేగా జ్ఞాపకాల కాంతిలో వెలగాలని ఉంది...
కనిపించని బాల్యాన్ని దర్శించాలని ఉంది...
ఆనాటి స్నేహ భావాల్ని స్పర్శించాలని ఉంది!!...

మనసు సంబంధాలు
గుండె అనుబంధాలు దర్శించాలని ఉంది...
ఆనాటి నవ్వుల్ని ఒంపుకోవాలని ఉంది...
మౌనపాద ముద్రికల్ని స్పర్శించాలని ఉంది...
నవనీతమైన హృదయ స్పందనల్ని గుర్తుచేసుకోవాలి...
అప్పటి నా హవాభావాల్ని దర్శించాలని ఉంది...

వెలుగులు నింపిన జ్ఞానం...
ప్రేమను పంచిన జ్ఞాపకం...
ఆనాటి మట్టి సారవంతం!!..
ఈనాటి మట్టి విషపూరితం!!..
ఆనాటి పంటలు శక్తివంతమైనవి...
ఈనాటి పంటలు అనారోగ్యవంతమైనవి!!.
అందుకే ప్రకృతి లోకమా...
ఆనాటి మనషుల పచ్చని బతుకులను చూపించు!!...

31/01/2025

మనీ పంచతంత్ర | Money Panchatantra | Life Transforming Videos by Dr.Nandika Mahalakshmi Kumar | Psychologist & Gold Medalist || VSB TV

Dr. N.Mahalakshmi Kumar M.Sc., (Psy) M.S., (SC), MBA., M.Th., M.D., (AM), Ph.D., D.Litt, P.G., D.L.S.G., R.D., & UD, DBFR, DNHE, DAFE, CLS, MRHS. FRHS., MPNLP (USA) GOLD MEDALIST

31/01/2025

LIVE🔴: శ్రీ వారాహీ అమ్మవారి ఆలయం కొవ్వూరు | Varahi Ammavaru Kovvuru || VSB TV

30/01/2025

LIVE🔴: Minister Nara Lokesh | ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు ప్రారంభం | CM Chandrababu || VSB TV

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when VSB TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSB TV:

Videos

Share