Navodaya Book House

Navodaya Book House A Telugu bookstore with largest collection of Telugu books. https://www.telugubooks.in/

‼️ HYD Book Fair 2024 ‼️
16/02/2024

‼️ HYD Book Fair 2024 ‼️

Thank you Kuppili Padma garu for your kind words  !! రంగురంగుల సాహిత్యామృత  హృదయాలు -నవోదయ సాంబశివరావు గారు... నవోదయ కోట...
12/06/2023

Thank you Kuppili Padma garu for your kind words !!

రంగురంగుల సాహిత్యామృత హృదయాలు -
నవోదయ సాంబశివరావు గారు... నవోదయ కోటేశ్వరరావు గారు...................
రచయిత్రి గా నవోదయ బుక్ హౌస్ తో నా అనుబంధం నా తొలి ప్రేమలేఖలు "అమృత వర్షిణి" మొదటి కథా సంపుటి 'మనసుకో దాహం' నుంచి ఆ మధ్య వచ్చిన మోహనదీ తీరమ్మీద నీలి పడవ" వరకు బోలెడంత అపురూపం.

పాఠకురాలిగా "జమీల్యా" నుంచి నిన్నటి "రంగురంగుల కవిత్వం" వరకు బోలెడన్ని పుస్తకాలు కొనుకున్నాను...
నీట్ గా బౌండ్ చేసిన "అమ్మ" రెండు రూపాయలు.

యెన్ని పుస్తకాలు యిచ్చాను... యెన్ని వున్నాయి యిలాంటివి మెయింటైన్ చెయ్యటం రాదు... చదువుకున్నది లెక్కలే అయినా చిట్టాపద్దులు అస్సలు చేతకాదు... బరువుగా వుంటుంది... మన
నవోదయ వారు మాత్రం యేదో వో మధ్యాహ్నం ఫోన్ చేసి ''మీ బుక్స్ అన్నీ సేల్ అయిపోయాయి... మరి కొన్ని కాపీలు పంపిస్తారా...'' లేదా ''మీ బుక్స్ మరో తొమ్మిది కాపీలు వున్నాయి... మరి కొన్ని పంపుతారా... మీ చెక్ రెడీ గా వుంది.. పంపిస్తున్నాం'' అని చెప్పినప్పుడు వారి శ్రద్ధకి... పుస్తకాల పట్ల... రచయితల పట్లా వారికి వున్న గౌరవం కి ఆశ్చర్యమేసేది. నిక్కచ్చిగా రచయితలకి వారి వారి చెక్స్ ని యిచ్చే విలువలున్న వారు నవోదయ బుక్ హౌస్ వారు.

అలాగే పాఠకులకు యెలాంటి పుస్తకాలు యిష్టమో భలే తెలుసు వీరికి. నా అభిరుచి కి దగ్గరగా వున్న పుస్తకం వొస్తే కాల్ చేసి చెపుతారు. మనం అడిగిన పుస్తకం ఆ రోజుకి లేకపోతే వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మనకి యింఫామ్ చేస్తారు. పాఠకులని యెంతగానో గౌరవించే వీరంటే రచయితలకి పాఠకులకు బోలెడంత యిష్టం... గౌరవం.

"యీ కొత్త పుస్తకం వచ్చిందండి" అని వారు ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని మనకి చూపించే టప్పుడు చూడాలి వారి కళ్ళల్లోని చమ్మక్... అద్భుతం.

అప్పటికి యిప్పటికీ యీ బుక్ స్టోర్స్ కి వెళ్ళే దారుల్లో బోలెడంత మార్పులు వచ్చాయి. నవోదయ బుక్ షాప్ యిప్పుడు వున్న షాప్ కి యెదురుగా వున్న షాప్ లోకి మారుతున్నారు అనివార్య కారణాలు వల్ల.

'మా రచయితలం వొచ్చి యీ షిఫ్టింగ్ లో మీకు తోడుగా వుండాలి సర్ ' అని వారిద్దరితో అన్నాను.

నిండుగా నవ్వారు.

లైబ్రరీల్లో నా పుస్తకాలు వున్నాయంటే ఆ క్రెడిట్ వారిదే... ఆ ప్రొసీజర్ అంతా చేసే వారు... పాఠకులంటే అంతిష్టం వారికి.

యీ ముప్పై మూడేళ్ళ ల్లో నవోదయాకి బోలెడన్ని సార్లు వెళ్ళాను. On line సేల్స్ మొదలయ్యాక on line ఆర్డర్ స్నేహితుల కోసం... కాల్ చేసి కావలసిన పుస్తకాలని తేవడానికి యెవరినైనా పంపటం... లేదా యిన్స్టంట్ కొరియర్ లో యింటికి తెప్పించుకోవటం...

లాక్ డౌన్ అయ్యాక వొక్కో షాప్ మెల్ల మెల్లగా తెరు చుకుంటున్నప్పుడు నేను వెళ్లిన మొట్టమొదటి షాప్ నవోదయ. అప్పుడు ఖాళీగా వున్న షాప్ లో వీరిద్దరూ మాస్కులతో వున్నారు.
ఆ పుస్తకాల చుట్టూ తిరుగుతుంటే నా మాస్క్ వనవాసి ఆకుపసిమి పరిమళపు శ్వాసను ఆపలేకపోయింది.

చాలా కాలం తర్వాత నిన్న మళ్ళీ నవోదయాకి వెళ్ళాను... హాయిగా నవ్వుతూ వాళ్లిద్దరి పలకరింపు. మెల్ల మెల్లగా యెదుటి షాపులోకి వెళుతున్న పుస్తకాలు.

"రంగురంగుల కవిత్వం" ని చేతుల్లోకి తీసుకున్నాను.

నా పుస్తకాలు వున్న రాక్ దగ్గర నిలబడి జ్ఞాపకాన్ని పదులపరుచుకున్నాను.
అమృత హృదయులు సాంబశివరావు గారు... కోటేశ్వరరావు గారి తో వొక ఫోటో.

నవోదయ బుక్ షాప్ అనేది కేవలం పుస్తకాలు అమ్మి కొనుక్కునే వొక వ్యాపార సంబంధిత ప్లేస్ కానే కాదు యెవ్వరికి.

నవోదయ వొక పర్సనల్ యెమోషన్ రచయితలకి పాఠకులకి కూడా. యిటువంటి అమృత హృదయుల చేతుల్లో పుస్తకం యెప్పుడూ చిరంజీవే.

నవోదయ ప్రాంగణం మాకు పంచిన జ్ఞానానికి... సౌందర్యానికి... ఆనందానికి... సంతోషాలకి వొక్కసారి నవోదయాకి వెళ్ళాలి అనిపించేట్టు వుండే మీ చిరునవ్వుల పలకరింపుల ఆహ్వానంకి మీ యిరువరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు... నమస్సులు.......
కుప్పిలి పద్మ
11-06-2023.......

23/04/2023
Thank you all the Book lovers 🙏🏻🙏🏻🙏🏻
23/02/2023

Thank you all the Book lovers 🙏🏻🙏🏻🙏🏻

23/02/2023

" మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచిమిత్రులు వెంటలేని లోటు కనిపించదు."

-- మహాత్మా గాంధీ

మా వెబ్సైట్లో https://www.telugubooks.in అనేక విభాగాల్లో పుస్తకాలను కనుగొనగలరు.

Books have the power to transform our lives in countless ways, and if you're a fan of Telugu books, you can explore a vast collection of books in various categories on our website, https://www.telugubooks.in/. You can find books on every topic imaginable and experience the joy of reading in Telugu.

!! నవోదయ బుక్ హౌస్ !!

https://trendingtelugunews.com/2022/12/04/navodaya-a-book-revolution/h
05/12/2022

https://trendingtelugunews.com/2022/12/04/navodaya-a-book-revolution/h

(భూమన్) హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆర్య సమాజం ఎదురుగా ఉన్న నవోదయ పుస్తక షాపుకు పోయి రావడం నాకు ఒక వ్యసనం. 1971లో కోట....

02/12/2022

  visiting   today to buy some film & literature booksRana Daggubati 😎
02/12/2022

visiting today to buy some film & literature books

Rana Daggubati 😎

Address

3-3-865, Opp Arya Samaj Mandir
Hyderabad
500027

Opening Hours

Monday 10am - 8:30pm
Tuesday 10am - 8:30pm
Wednesday 10am - 8:30pm
Thursday 10am - 8:30pm
Friday 10am - 8:30pm
Saturday 10am - 8:30pm

Telephone

+919000413413

Alerts

Be the first to know and let us send you an email when Navodaya Book House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navodaya Book House:

Videos

Share

Nearby media companies


Other Book & Magazine Distributors in Hyderabad

Show All