ధనేకుల మల్లి

ధనేకుల మల్లి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి Mallinuveyravali official page

17/01/2025

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు

బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్న ముంబై పోలీసులు

నిండుతుడి కోసం 10 బృందాలు ఎర్పాటు చేసి, గాలించిన పోలీసులు...

17/01/2025

*యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్!*

*5రోజుల పర్యటనలో 50మందికిపైగా ప్రముఖులతో సమావేశాలు*

*30మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేష్*

అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 20నుంచి 24వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. అయిదురోజులపాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ప్రత్యేకించి ఎపి పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశం (Educarion Governors meeting) లో పాల్గొంటారు. ఇంటిలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం (Building the Ecosystem for Intelligent Industries), అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం (AI energy impact), జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ (Gender parity Sprint Champions) అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్ట్స్ జెన్ ఎఐ, డాటా ఫ్యాక్టరీ, ఎఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఎఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎకనామీ స్థితిగతులు - లేబర్ మార్కెట్ పై ఎఐ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావం (The Transmission impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై వైట్ షీల్డ్ తో, భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావంపై (What does the future hold for climate movement) అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో, వార్షిక లీడర్ ఫోరమ్ పునరుద్దరణ (Renew Annual Leader Forum)పై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 5రోజుల సదస్సులో 30మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరిస్తారు. సిఎన్ బిసి – టివి 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. భారత్ – డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతోపాటు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.
******

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగుతున్న కేబినెట్ మీటింగ్..
17/01/2025

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగుతున్న కేబినెట్ మీటింగ్..


తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు దుస్తులను పంపిణీ చేసిన గుంటూరు జిల్ల...
17/01/2025

తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు దుస్తులను పంపిణీ చేసిన గుంటూరు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తాడికొండ శ్రీ గుంటుపల్లి మధుసూదన్ రావు గారు, రాష్ట్ర ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ ధణేకుల నాగమల్లేశ్వరరావు గారు,తాడికొండ మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ తోకల వెంకటేశ్వరరావు గారు, గ్రామపంచాయతీ సెక్రటరీ షేక్ జానీ గారు,గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నెల్లూరి కాంతారావు గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ షేక్ మొహిద్దిన్ గారు, నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు పాలేరు రమేష్ బాబు గారు, తాడికొండ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ భూశెట్టి వెంకటేశ్వరరావు గారు, 12వ మాజీ వార్డు సభ్యులు షేక్ రఫీ గారు,9వ మాజీ వార్డు సభ్యులు షేక్ రఫీ గారు మరియు గ్రామ పార్టీ నాయకులు గంగరాజు గారు ఇతరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ కార్యాలయంలో వర్కర్లుగా పని చేస్తున్నటువంటి వారికి దుస్తులను పంపిణీ చేయడం జరిగింది..

ఎన్నికల సమయంలో పంచిన J-బ్రాండ్ చీప్ లిక్కర్ మందు తాగి ఇద్దరు చనిపోయారు.. ప్రమాద వశాత్తూ జరిగిన తిరుమల తొక్కిసలాటను రాజకీ...
17/01/2025

ఎన్నికల సమయంలో పంచిన J-బ్రాండ్ చీప్ లిక్కర్ మందు తాగి ఇద్దరు చనిపోయారు.. ప్రమాద వశాత్తూ జరిగిన తిరుమల తొక్కిసలాటను రాజకీయం చెయ్యటం కాదు, దమ్ముంటే ఈ చీప్ లిక్కర్ మరణాల మీద మాట్లాడాలి..

17/01/2025
GSDP పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాయలంలో సమీక్ష చేశారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచిం...
16/01/2025

GSDP పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాయలంలో సమీక్ష చేశారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం GSDP పై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు.

కోటి సభ్యత్వాల మార్క్ దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.*కార్...
16/01/2025

కోటి సభ్యత్వాల మార్క్ దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

*కార్యకర్తే అధినేత*

ప్రాణసమానమైన కార్యకర్తలకు అభినందనలతో,

విశ్వ విఖ్యాత శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు *కోటి* మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది. సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహించారు. ఊరూవాడా జై టిడిపి నినాదాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. గత రికార్డులు తిరగరాస్తూ *కోటి సభ్యత్వాలతో* సరికొత్త చరిత్ర సృష్టించాం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి *బలం, బలగం* . పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్.
పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టిడిపి అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య గారు నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధులు ఉన్మాదుల్లా మీద పడుతుంటే మీసం మెలేసి, తొడకొట్టి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ నాకు నిత్యస్ఫూర్తి. సార్వత్రిక ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా ఉండటానికి వీలు లేదని ప్రత్యర్థి మూకలు గొడ్డలి వేటు వేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్ బూత్ లో కూర్చొని రిగ్గింగ్ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల గారి ధైర్యం గురించి గుర్తుచేసుకున్న ప్రతిసారి నాకు గర్వంగా ఉంటుంది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రతి గ్రామంలో ప్రాణం ఎక్కువా? పార్టీ ఎక్కువా? అంటే పార్టీనే ఎక్కువ అని జైకొట్టే చేతులు అనేకం. ఏమి ఇచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టిడిపి కి మాత్రమే సొంతం. అలానే ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుంది.
అధినేత చంద్రబాబు గారు పార్టీలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కార్యకర్తలతో చర్చించిన తరువాతే ప్రకటిస్తారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం మాత్రమే. మంచి నిర్ణయం తీసుకుంటే పొగిడేది మీరే, ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ప్రశ్నించేది మీరే. అందుకే పార్టీలో ప్రతి కార్యకర్త *అధినేతే*. కార్యకర్తల సంతోషమే చంద్రబాబు గారికి ఆనందం. ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి కార్యకర్తల చర్చ ఖచ్చితంగా ఉంటుంది. కార్యకర్తలకు ఉపాధి, వైద్యంతో పాటు వారి పిల్లల చదువుకు సాయం చెయ్యాలని చెబుతుంటారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పవిత్రమైన బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించాం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందజేసాం. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించాం. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేసాం. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించాం.
చదువు పూర్తయిన వారికి ఉపాధి..ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచాం. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే నా ఎజెండా. కొన్ని నియోజకవర్గాల నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షకు పైగా సభ్యత్వాలు చెయ్యడంతో పాటు లైఫ్ టైమ్ సభ్యత్వాలు కూడా ఎక్కువగా చేశారు, వారికి నా ప్రత్యేక అభినందనలు. లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యకర్తకు భరోసా ఇచ్చే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని
కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
..మీ నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.

16/01/2025

ఇలా అసత్యాలు ఇంకా ఎన్నాళ్ళు ప్రచారం చేస్తావ్ 11 మోహన్ రెడ్డి

16/01/2025

స్పేస్ డాకింగ్ సక్సెస్.. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్..

గత నెల 30న ఇస్రో స్పాడెక్స్ ప్రయోగం

చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు

మూడు సార్లు డాకింగ్ ప్రయత్నాలు

తాజాగా డాకింగ్ ప్రయోగం విజయవంతం

డాకింగ్ సాంకేతిక కలిగిన నాలుగో దేశంగా భారత్

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ నారాయణన్

అమరావతి  ఈనెల 18న సీఎం చంద్రబాబు  గారు గుంటూరు, కడప జిల్లాల పర్యటన -గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న...
16/01/2025

అమరావతి
ఈనెల 18న సీఎం చంద్రబాబు గారు గుంటూరు, కడప జిల్లాల పర్యటన -

గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం

వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు - కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..

*రికార్డు స్థాయిలో టీడీపీ సభ్యత్వ నమోదు - కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు - 1.49 లక్షల సభ్యత్వాలతో తొలిస్థానంలో మంత్రి నారా...
16/01/2025

*రికార్డు స్థాయిలో టీడీపీ సభ్యత్వ నమోదు - కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు - 1.49 లక్షల సభ్యత్వాలతో తొలిస్థానంలో మంత్రి నారాయణ నియోజకవర్గం - రెండు, మూడు స్థానాల్లో మంత్రులు ఆనం, నిమ్మల నియోజకవర్గాలు - 1.38 లక్షల సభ్యత్వాలతో ఐదో స్థానంలో సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం - 1.06 లక్షలతో తొమ్మొదో స్థానంలో మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరి*

కోడి పుంజులకు బదులుగా కోడి పెట్టలు తీసుకెళ్లి11 రూపాయలు పందెం అన్నాడంట..గెంటేహారు😂😆🤣🙏
16/01/2025

కోడి పుంజులకు బదులుగా కోడి పెట్టలు తీసుకెళ్లి

11 రూపాయలు పందెం అన్నాడంట..గెంటేహారు😂😆🤣🙏

గోరంట్ల మాధవ్ బట్టలు విప్పేసిన న్యూడ్ వీడియో మీద, ఆఘమేఘాల మీద స్పందించిన ఐపీఎస్ సునీల్ కుమార్ లాంటి ఉద్ధండుడు లేదనుకొంటా...
16/01/2025

గోరంట్ల మాధవ్ బట్టలు విప్పేసిన న్యూడ్ వీడియో మీద, ఆఘమేఘాల మీద స్పందించిన ఐపీఎస్ సునీల్ కుమార్ లాంటి ఉద్ధండుడు లేదనుకొంటా.

సోషల్మీడియా పోస్టుల మీద కేసులు పెట్టే సిల్లీ స్థాయికి సీఐడీని తీసుకు వచ్చే పీవీ సునీల్ లాంటి వారు లేరనుకొంటా.

గుండె ఆపరేషన్ చేసుకొన్న ఎంపీ గుండెలపై ముసుగులో కూర్చోని కొట్టించి సైకోను ఆనందపెట్టి ప్రమోషన్ కొట్టిన ప్రబుద్ధుడు లేదు కదా.

పాపం పండి విజయ్ పాల్ నోరు విప్పితే ఊచలు లెక్కట్టబోయే పీవీ సునీల్ పెట్టిన తప్పుడు కేసులో నోరు విప్పి ఎపి సీఐడీ దాని ప్రతిష్ట దిగజార్చుకోలేదని సాక్షి ఏడ్చింది ఈ రోజు.

కామెడీ ఏమిటంటే తమ సాక్షిలో తుంపర సేద్యం చేసే సోకాల్డ్ జర్నలిస్టు తిలక్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని చెప్పకుండా.. ఆయన పిటీషన్ను తిరస్కరించింది అని చివరి లైనులో అచ్చేసింది.

5 రూపాయల కోసం సిగ్గు దాచేసి పడుతున్న పాట్లకు నవ్వుతున్నారు జనం.ప్రతి జిల్లా రెండయ్యింది. అన్ని జిల్లాల ప్రజలు జగనన్న పంప...
16/01/2025

5 రూపాయల కోసం సిగ్గు దాచేసి పడుతున్న పాట్లకు నవ్వుతున్నారు జనం.

ప్రతి జిల్లా రెండయ్యింది. అన్ని జిల్లాల ప్రజలు జగనన్న పంపే విమానాల కోసం ఎగజూస్తా వెళుతూ రోడ్లల్లోని గోతుల్లో పడ్డారు.

అంతా ఉమ్మేస్తా వుండారని ఎవరు చెప్పారో ఏమో గానీ.. జగన్లో.. తొలిసారి సిగ్గు వచ్చింది.

రోషంతో.. వానాకాలం పోనీయబ్బా.. రోడ్లు వేసేద్దాం అన్నాడు.

ఒక మాట అంటే మడమ తిప్పుడు అనే ఒక డైలాగ్ చెప్పేసే అసమర్థ జగన్ పాలనలో.. కాంట్రాక్టర్లను ఎన్ని సార్లు టెండర్లకు పిలిచినా.. ఒక్కడూ రాలేదు.

అన్ని వానాకాలాలు పోయాయి, ఆ ఐదేళ్లలో.

మండిన జనం నీకు పోయేకాలం అని ఎన్నికల రోజు సైలెంట్ గా వైలెంట్ తీర్పు ఇచ్చారు.

అయినా ఏజెంట్లు రారని ఫలితాల ముందు కూడా వైనాట్ 175 అన్నాడు ప్రగల్భాలు పలుకుతూ.

తీర్పు రోజు ఆ అవ్వాతాతల ప్రేమ ఏమయ్యిందో అని ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీకి వెళ్లని బడుద్దాయి కోసం..

సిగ్గు దాచేది 5 రూపాయల గాళ్లు దిగి

తాజాగా వేసిన రోడ్లు గ్రాఫిక్స్ అంటూ.. అవి హైవే రోడ్లు అంటూ.. రకరకాలుగా అబద్దాలతో మొదలెట్టారు.

జనానికి వీరికి మల్లే సిగ్గులేదు అనుకోవడం వీరి వెఱ్రి భ్రమ.

కడపలో కూడా గుంతలు పూడ్చలేని అసమర్థుడి నరకాన్ని ఆ జనానికి తప్పిస్తూ.. తపిస్తూ నాయుడు రోడ్లు వేస్తున్నాడు.

ఈ సారి కడపలో ఆ 2 సీట్లు కాపాడుకోవడం వైకాపాకు పెద్ద సవాల్...

Address

Ameerpet , Nagarjuna Colony
Hyderabad
500053

Alerts

Be the first to know and let us send you an email when ధనేకుల మల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ధనేకుల మల్లి:

Videos

Share