ChotaNews

ChotaNews ChotaNews is India's most-read Telugu short news app. Stay informed with the latest news. Follow us.

12/12/2023


07/12/2023

07/12/2023

07/12/2023

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ఇందుకు వేదికైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అని పలికే సమయంలో రేవంత్‌రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

05/12/2023



05/12/2023



05/12/2023



05/12/2023

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ఈ రోజు హత్యకు గురయ్యారు. జైపూర్‌లోని ఆయన స్వగృహంలో ఉండగా.. దుండగులు తుపాకీతో కాల్చిచంపారని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం ఆయన ఇంటి ఆవరణలో నిల్చొని ఉండగా.. స్కూటర్ మీద వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. రాజ్‌పుత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#सुखदेव_सिंह_गोगामेडी

05/12/2023

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం. గండేపల్లి నుంచి మల్లేపల్లి వెళ్లే జాతీయ రహదారిపై. ప్రళయతాండవం సృష్టించిన. సుడిగాలి. ఈ సుడిగుండం ప్రభావంతో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు మరియు తాడిచెట్లు కొబ్బరి చెట్లు.

03/12/2023

గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

03/12/2023



03/12/2023



03/12/2023



03/12/2023



03/12/2023


03/12/2023

BRS అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

02/12/2023

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఈ తరుణంలో మంత్రి హరీశ్ రావు ఓటమిని ఒప్పుకున్నట్లు ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

02/12/2023

TS: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా చూడబోతున్నామని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కంటే ముందే కాంగ్రెస్‌లో సంబరాలు మొదలయ్యాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలవబోతోందని చెప్పారు. ప్రజారంజక పాలన ఎలా ఉంటుందో కాంగ్రెస్ చూపెడుతుందని పేర్కొన్నారు.

01/12/2023

హన్మకొండలో దారుణం జరిగింది. ఓ ఎక్సైజ్ సీఐ కొడుకు కారుతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ అమాయక మహిళను ఢీకొట్టి.. ఆమె ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వైరల్ అవుతోంది.

01/12/2023

జనసేన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీపై పవన్‌కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ భావజాలం లేని పార్టీ అని అన్నారు. జనసేన యువబలం చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారని,ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. తానేం చేసిన దేశ సమగ్రత కోసమే ఆలోచిస్తానని, కార్యకర్తల చిత్తశుద్ధి వల్ల జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. తన భావజాలాన్ని నమ్మే యువత తనవెంట వస్తున్నారని పేర్కొన్నారు.

01/12/2023

చంద్రబాబు హయాంలో నాగార్జునసాగర్ డ్యామ్‌ను తెలంగాణకు వదిలివేశాడు. తెలంగాణ రాజకీయాలతో తమకు సంబంధం లేదు : అంబటిరాంబాబు

01/12/2023

బెంగళూరులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. స్కూళ్లలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని ఆగంతకులు ఆయా స్కూళ్లకు ఈమెయిల్ పంపించారు. వాటిలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న ప్లే స్కూల్ కూడా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ స్కూళ్లలోని విద్యార్థులను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్‌తో స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

01/12/2023

నాగార్జునసాగర్ డ్యాం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఏపీ, తెలంగాణ మధ్య సాగర్ జలాల వివాదం కొనసాగుతోంది. ఆంధ్రా నుంచి బాపట్ల ఎస్పీ సాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఐజీ, నల్గొండ ఎస్పీ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువైపులా చర్చలు జరగనున్నట్లు సమాచారం. చర్చలు విఫలమైతే ఆంధ్రా నుంచి విజయపురి సౌత్ వైపు వెయ్యి మంది బలగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

01/12/2023

కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోటులోని మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

30/11/2023

బీఆర్ఎస్‌కు 25 సీట్లు దాటవు : రేవంత్‌రెడ్డి

30/11/2023

ఎగ్జిట్ పోల్స్‌ నేపథ్యంలో కెసిఆర్ బయటకు రాకుండా కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నాడు అంటే... కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు నుంచే సంబరాలు చేసుకోవచ్చు : రేవంత్‌రెడ్డి

30/11/2023

పదేళ్లుగా తెలంగాణను పట్టిపీడిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఓటమి ఎదురవుతుందని భావించినప్పుడల్లా నియోజకవర్గాలు మారారని.. అయితే, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనదని కామారెడ్డి ప్రజలు నిరూపించారన్నారు. డిసెంబర్ 3నాడు తుదిశ్వాస వదిలిన శ్రీకాంతాచారికి నివాళులర్పిస్తున్నామని రేవంత్ చెప్పారు.

30/11/2023

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించారు. జూబ్లీ పబ్లిక్ స్కూల్‌లో సతీ సమేతంగా ఆయన ఓటు వేశారు.

30/11/2023

ఓటు హక్కు వినియోగించుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి.

30/11/2023

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు అతని భార్య బంజారాహిల్స్‌లో ఓటు వేశారు.

30/11/2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన అల్లు అర్జున్‌ అనంతరం ఓ యువతితో సరదాగా మాట్లాడారు.‘‘నీకు బాగా ఫాలోవర్స్‌ రావాలని మంచి వీడియో తీస్తా’’ అంటూ ఆయన నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

30/11/2023

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కిడ్స్ పాఠశాలలో సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

30/11/2023

కంబాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్ నీ నిలతీసిన గ్రామ ఓటర్లు శంకర్ నాయక్ కి సెగ.

30/11/2023

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లోని ప్రభుత్వ ఉమెన్స్ హాస్టల్‌లో సినీ నటుడు నాగార్జున, అమల, నాగచైతన్య ఓటు వేశారు.

30/11/2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు నాని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

30/11/2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని బూత్ నంబర్ 248లో నిర్మాత బండ్ల గణేష్ ఓటు వేశారు.

30/11/2023

HYD: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో సినీ నటుడు రానా పాల్గొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Address

Plot No. 181, Block B, Kavuri Hills
Hyderabad
500033

Telephone

+918121031061

Alerts

Be the first to know and let us send you an email when ChotaNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ChotaNews:

Videos

Share

Nearby media companies


Other News & Media Websites in Hyderabad

Show All