VSR Journalist

VSR Journalist About Political News And Local News

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశ...
17/01/2025

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఈ టీమ్లో ఉన్నారు....

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొ...

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాంగ్రెస్ లో ...
08/01/2025

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా వ్యవహారిస్తున్నారు. అయితే హుంగు ఆర్భాటాలకు దూరంగా అనంతపురం జిల్లాలో తన స్వగ్రామంలో నివాసముంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటు కాలం గడుపుతున్నారు. ఆయనే డాక్టర్ ఎన్. రఘవీరారెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా రఘవీరారెడ్డి అంత క్రియాశీలకంగా లేదు. స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయం చేస్తు నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజా గా ఆయన ఆర్టీసీ బస్సులో బెంగళూరు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రఘవీరారెడ్డి మంత్రిగా అత్యంత కీలక పాత్ర పోషించారు.

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాం...

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ...
05/01/2025

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని ఆయన అన్నారు. సివిల్స్ కు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కు సింగరేణి తరుపున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి మరింత మంది సివిల్ సర్వీస్ లకు ఎంపిక కావాలని ఆశించారు. సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశంతోనే వారిని ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు....

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్....

రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు ఆరు వేల చొప్పున ...
05/01/2025

రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు ఆరు వేల చొప్పున రైతులకు అందజేయనున్నారు. వ్యవసాయ కూలీలకు యేడాది కి 12 వేలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన స్పష్టం చేశారు. "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో భాగంగా రైతు కూలీలకు 12 వేలు అందజేస్తారు. ...

రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు...

హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్...
01/01/2025

హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్ణయం డీపీఆర్ సిద్ధం చేయవలసిందిగా సీఎం ఆదేశం : హెచ్ఏఎంఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు); జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్ ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....

హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్ లకు మెట్రో పొడగిం...

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార...
30/12/2024

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైద‌రాబాద్‌లోని స‌త్య నాదెళ్ల నివాసంలో ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమ‌వారం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌ను స‌త్య నాదెళ్ల ప్ర‌శంసించారు. నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు....

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మై.....

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో చేవెళ్ల  బీజేప...
28/12/2024

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లా సమస్యల పైన చర్చించినట్లు ఆయన తెలిపారు. పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించాలని కోరానని ఎంపీ వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో...

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. మన్మ...
27/12/2024

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పిం...

తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప...
26/12/2024

తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. తెలుగు సినిమా ముఖ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది సినిమాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించామన్నారు. ...

తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవం....

అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి  అనుగుణంగ...
13/12/2024

అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అరెస్టు లో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. రాష్ట్ర హోం మంత్రి గా తనకు అరెస్ట్ సమాచారం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. భారతదేశంలో సల్మాన్ ఖాన్ , సంజయ్ దత్ లాంటి వారు కూడా అరెస్టయ్యారని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు చేశామని అడుగుతున్నారు తప్ప మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు....

అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాని...

యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ...
11/12/2024

యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్​ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వీరికి చెక్కులు పంపిణీ చేశారు....

యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్...

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ ఐదు వందల మందికి ఒక సర్వేయర్ 31వ తేదీ నాటికి ప‌రిశీల‌న‌ పూర్తి చేయాలి సామ...
11/12/2024

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ ఐదు వందల మందికి ఒక సర్వేయర్ 31వ తేదీ నాటికి ప‌రిశీల‌న‌ పూర్తి చేయాలి సామాజిక స‌ర్వేకు తుదిగ‌డువు 13వ తేదీ 14వ తేదీన సంక్షేమ హాస్ట‌ల్ విద్యార్ధుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం 15,16 తేదీల్లో జ‌రిగే గ్రూప్ -2 ప‌రీక్ష‌ల‌కు విస్తృత ఏర్పాట్లు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ ,హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని రెవెన్యూ ,హౌసింగ్‌....

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ ఐదు వందల మందికి ఒక సర్వేయర్ 31వ తేదీ నాటికి ప‌రిశీల‌న‌ పూర్తి...

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రస...
11/12/2024

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు మంత్రులు సభ్యులకు తమ అనుభవాలను వివరించారు. గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒరియెంటెషన్ కార్యక్రమాలను నిర్వహించలేదని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రమాణస్వీకారం రోజునే ఐడి కార్డ్ తో పాటు రూల్స్ అండ్ రెగులేషన్స్ పుస్తకాలు ఇస్తాం కానీ వాటిని ఎవరు కూడా చదవడం లేదు. లేజిస్లేచర్ కి సంబంధించిన పుస్తకాలు తప్పకుండా చదవాలన్నారు....

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ.....

బీఆర్ఎస్, బీజేపీ లకు సీఎం రేవంత్ రెడ్డి ఒకే సారి షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు ఆ పార్టీకి గుడ్ ...
05/12/2024

బీఆర్ఎస్, బీజేపీ లకు సీఎం రేవంత్ రెడ్డి ఒకే సారి షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరికి గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కాంగ్రెస్ లో చేరుతున్నానని బాపు రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన అన్నారు....

బీఆర్ఎస్, బీజేపీ లకు సీఎం రేవంత్ రెడ్డి ఒకే సారి షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం...

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ తో క‌ల...
05/12/2024

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ తో క‌లిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించ‌న్లు, రెవెన్యూ, త‌దిత‌ర‌ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైద‌రాబాద్ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో పాటు ఇత‌ర‌ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు....

  హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమా....

రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం ...
01/12/2024

రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారని ఆయన మహబూబ్ నగర్ రైతు సభలో అన్నారు. వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నారు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది11వేల కోట్లేనని, ఈ 11 వేల కోట్లలో రూ....

రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ.....

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్...
01/12/2024

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థతి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు....

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధిక.....

హైదరాబాద్ లో గత ఆరునెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గణనీయమైన వ్రుద్ది కనిపించింది. గత కొంతకాలంలో పలు అభిప్రాయాలు వ్య...
24/11/2024

హైదరాబాద్ లో గత ఆరునెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గణనీయమైన వ్రుద్ది కనిపించింది. గత కొంతకాలంలో పలు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ప్రముఖ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపార వ్రుద్ది బాగుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ -సెప్టెంబరు మధ్య కాలం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్యకాలంలో ఎక్కువ వ్రుద్ది రేటు, ఆదాయం ఉన్నట్లు ఆ సంస్థలు తేల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్షల్టెన్నీ సంస్థ అన్ రాక్ వెల్లడించింది....

హైదరాబాద్ లో గత ఆరునెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గణనీయమైన వ్రుద్ది కనిపించింది. గత కొంతకాలంలో పలు అభిప్...

Address

Hyderabad
500085

Alerts

Be the first to know and let us send you an email when VSR Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share