SriramNaik Ramavath

SriramNaik Ramavath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SriramNaik Ramavath, Social Media Agency, Hyderabad.

 #రాజ్యాంగ_వ్యతిరేకి,గిరిజనుల ద్రోహి బిజెపి పార్టీని ఓడించండి.కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపియనర్ మాజీ ఎమ్మెల్సీ సభావట్ ...
03/05/2024

#రాజ్యాంగ_వ్యతిరేకి,గిరిజనుల ద్రోహి బిజెపి పార్టీని ఓడించండి.

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపియనర్ మాజీ ఎమ్మెల్సీ సభావట్ రాములు నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్

MLA క్యాంప్ ఆఫీస్
హాలియా;03-05-2024; దేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బిజెపి,నియంతృత్వ బీ ఆర్ ఎస్ పార్టీ లను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపినర్ మాజీ ఎమ్మెల్సీ సపవట్ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపియనర్ మాజీ ఎమ్మెల్సీ సభావట్ రాములు నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ లు గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు

శుక్రవారం హాలియా పాత ఐటిఐ కాలేజ్ లో వివిధ గిరిజన సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీకి 400 సీట్లు ప్రజలు ఇస్తే ఎస్సీ ఎస్టీ, బిసి మైనార్టీలకు వర్తిస్తున రిజర్వేషన్లను రద్దు చేస్తామని బాహటంగా బిజెపి పార్టీ మోడీ చెప్పడం అంటే మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ బిజెపి పార్టీలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు చేయిస్తూ ఉపకులాల మధ్య ఆహార అలవాట్ల పైన గొడవలు పెడుతూ చిచ్చు లేపుతున్నరని అన్నారు బిజెపిని ఓడించి కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని కోరారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి మద్దతు ఇస్తూ మిగిలిన 16 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు

తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ మాట్లాడుతూ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సంపూర్ణంగా మద్దతిస్తూ వారిని గెలిపించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు కోర్ర శంకర్ నాయక్, గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కార్యదర్శి రమావత్ నాగేందర్ నాయక్ కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ రమావత్ నరేష్ నాయక్ సర్దార్ నాయక్ మాజీ సర్పంచ్ బాలు నాయక్ ఎంపీటీసీ తుల్చనాయక్ , గిరిజన సంఘం నాయకులు హనుమంతు నాయక్, రాజు నాయక్, రవి నాయక్ మోతిలాల్ నాగు భగవాన్ ముని దత్తు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

17/04/2024

#ప్రశ్న...అంటే మీ దృష్టిలో దేవుడు లేడంటారా..?

 #సామాజిక_సంఘాల_ఆధ్వర్యంలో...ఈరోజుభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్, ట్యాంక్ బండ్...
14/04/2024

#సామాజిక_సంఘాల_ఆధ్వర్యంలో...ఈరోజు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్, ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న...తెలంగాణ గిరిజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్, రాష్ట్ర నాయకులు ఎం.గోపీ నాయక్, విజయ్ తదితరులు...
#సుందరయ్య_విజ్ఞానకేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి శుభ సందర్భంగా పూలమాల వేస్తున్న సామాజిక ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్,ఇతర ప్రజాసంఘాల నాయకులు..

 #రాజ్యాంగం_ఎదుర్కొంటున్న_సవాళ్లపై_రాష్ట్రసదస్సు.. ప్రధాన వక్తగా ..మాట్లాడుతున్న ప్రముఖ మేధావి ప్రో. కంచ ఐలయ్య గారు.. ఈర...
13/04/2024

#రాజ్యాంగం_ఎదుర్కొంటున్న_సవాళ్లపై_రాష్ట్రసదస్సు.. ప్రధాన వక్తగా ..మాట్లాడుతున్న ప్రముఖ మేధావి ప్రో. కంచ ఐలయ్య గారు.. ఈరోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో #సామాజికసంఘాల_ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం మతోన్మాదాన్ని మట్టుపెడదాం అనే అంశంపై జరిగింది..

*రాజ్యాంగంవల్లేదేశ సమైక్యత*
*కార్పొరేట్ దిగ్గజాల కోసమే కమలం పార్టీ*
*అంబేద్కర్ కృషివల్లే బడుగుల అభివృద్ధి*
*ప్రొఫెసర్ కంచ ఐలయ్య*

భారతదేశంలో బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే కమలం పార్టీ పని చేస్తుందని నడిపిస్తుందని హిందుత్వ రాష్ట్ర సాధనకు రాజ్యాంగం అడ్డుగా ఉందని ఆ కంపెనీలు ఆదేశించడం వల్లే ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంటుందని మెజారిటీ ప్రజల అభివృద్ధికి బాటలు వేసిన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ మేధావి సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు
శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పూలే అంబేద్కర్ జన జాతర రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు
కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉడుత రవీందర్ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి అబ్బాస్ లు ఈ సదస్సుకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు
తొలుత అంబేద్కర్ పూలే చిత్రపటాలకు ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాష్ట్ర నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ
నాడు గాంధీకి అండగా నాటి బాడ కార్పొరేట్ కంపెనీలు బిర్లా గోయాంకలు ఉంటే నేడు బిజెపి నరేంద్ర మోడీకి ఆదాని అంబానీలు అండగా నిలుస్తున్నారని ఆదాని అంబానీల ప్రయోజనాల కోసమే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడకుండా, బడా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా కారు చౌకగా అమ్మేస్తున్నారని చెప్పారు అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించిన తర్వాతే మెజారిటీ శూద్రులకు చదువు వచ్చిందన్నారు బ్రిటిష్ ఇండియా కాలంలో కొద్ది మంది మాత్రమే చదువుకున్నారని మెజారిటీ ప్రజలకు మను అధర్మం చదువును నిషేధించిందన్నారు.
దేశము అభివృద్ధి కాకపోవడానికి మెజారిటీ ప్రజలకువేల ఏండ్లు చదువు లేకపోవటమే కారణమన్నారు. రాజ్యాంగం రద్దుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాజ్యాంగ రక్షణ బాధ్యత దేశ ప్రజలందరి పైన ఉందన్నారు బిజెపి అధికారంలో ఉండగా రాజ్యాంగానికి రక్షణ ఉండదన్నారు తద్వారా దేశ ప్రజలకే రక్షణ ఉండదన్నారు. నిత్యం దాడులు దౌర్జన్యాలు గ్యాంగ్ రేపులు మత ఉన్మాద చర్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని చెప్పారు అంబేద్కర్ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అంటే రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో కాంగ్రెస్ వెంట కార్పోరేట్ శక్తులు ఉంటే కమ్యూనిస్టుల వెంట బుర్రలు ఉన్న మేధావులు వచ్చారని చెప్పారు
జిడిపి ప్రకృతి వనరులు ఆ బడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండాలంటే వారికి రాజ్యాంగం అడ్డుగా ఉందని దాన్ని తొలగించి ఆర్ఎస్ఎస్ ను నడిపించే మనుస్మృతి నీ ప్రాచీన భారత రాజ్యాంగంగా ప్రవేశపెడుతున్నారని చెప్పారు. దానివల్ల కొద్దిమంది ప్రయోజనాల కోసం దేశం అనిగిమనిగి ఉండాల్సి ఉంటుందన్నారు భారత రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు *కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ*
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశం పలు సవాళ్లను ఎదుర్కొంటుందని రాజ్యాంగ శక్తులకు మనస్మృతి శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాజిక తరగతులు సామ్యవాద లౌకిక శక్తుల వైపు నిలబడాలని పిలుపునిచ్చారు.
*టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు* మాట్లాడుతూ దేశంలో మూడు వేల ఏళ్లుగా మూడు రాజ్యాంగాల అమల్లోకి వచ్చాయని మనుస్మృతి రాజ్యాంగం, బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఇందులో అత్యంత ప్రగతిశీలమైంది గా, అట్టడుగు పేదల పక్షాన నిలబడ్డ ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం మాత్రమేనని ఆయన కొనియాడారు.
*ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్* మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రజలను మతం ప్రాతిపాదికగా పౌరసత్వం ఇవ్వడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు బిజెపి పదేళ్ల పాలనలో మైనార్టీల పైన దాడులు దౌర్జన్యాలు పెరిగాయని,, అభద్రతలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారని ఇది దేశ సమైక్యతకు తీరని నష్టం చేస్తుందని చెప్పారు *కేవీపీఎస్,తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శులు టీ స్కైలాబ్ బాబులు ఆర్ శ్రీరామ్ నాయక్ లు మాట్లాడుతూ*
ఏప్రిల్ 5 నుండి 14 వరకు పూలే అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు చెప్పారు ఈ సందర్భంగా మతోన్మాద శక్తులను ఓడించడం రాజ్యాంగ శక్తులను గెలిపించుకోవడం తక్షణ కర్తవ్యం అన్నారు అడవి బిడ్డలకు అడవిని దూరం చేయడానికి ప్రకృతి వనరులను ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి బిజెపి కృషి చేస్తుందన్నారు దీనికి ఆదివాసీలు గిరిజనులు సమైక్యంగా అడ్డుకట్ట వేయాలన్నారు పూలే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
*చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర కో కన్వీనర్ ఉడత రవీందర్ మాట్లాడుతూ*
బీసీ కులగలను బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపించిన బీసీ ప్రధానమని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేశాడని విమర్శించారు బీజేపీ ని ఓడిస్తేనే దేశం రక్షించబడుతుందన్నారు.
*ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నపూర్ణ, టి పి ఎస్ కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోరెంకల తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్ ్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేశం, కెవిపిఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం దశరథ్ బి సుబ్బారావు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు*

*టీ స్కైలాబ్ బాబు* కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కెవిపిఎస్ తెలంగాణ
తేదీ .13.04.2024

 #పూలే_అంబేద్కర్_జయంతుల సందర్భంగా.. సామాజిక సంఘాల ఆధ్వర్యంలో  #రాష్ట్రసదస్సు..13-04-2024 ఉ.10.30 గంటలకు, సుందరయ్య విజ్ఞా...
12/04/2024

#పూలే_అంబేద్కర్_జయంతుల సందర్భంగా.. సామాజిక సంఘాల ఆధ్వర్యంలో #రాష్ట్రసదస్సు..13-04-2024 ఉ.10.30 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు.. అనే అంశంపై. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్. #కంచఐలయ్య గారు ప్రసంగిస్తారు.

 #నేడు_మహాత్మ_జ్యోతిరావు_పూలే_జయంతి ... ఆర్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం 🎉🎊🌹🎊🎉🌹🎊🎉🌹🎊🎉🌹🎊🎉...
11/04/2024

#నేడు_మహాత్మ_జ్యోతిరావు_పూలే_జయంతి ... ఆర్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం 🎉🎊🌹🎊🎉🌹🎊🎉🌹🎊🎉🌹🎊🎉🌹🎊🎉🌹🎊

 #భారత_రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు,గిరిజన మహిళకు  #అవమానం... బీజేపీ మనువాద బలుపు సంస్కృతికి నిదర్శనం..బీజేపీ చెప్పే సనాతన ...
01/04/2024

#భారత_రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు,గిరిజన మహిళకు #అవమానం... బీజేపీ మనువాద బలుపు సంస్కృతికి నిదర్శనం..బీజేపీ చెప్పే సనాతన ధర్మం అంటే ఇదే

25/03/2024

#మిత్రులందరికీ... #హోళీ_పండుగ_శుభాకాంక్షలు.. ఆర్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ గిరిజన సంఘం

 #నేడు.... #షహీద్_భగత్_సింగ్_సుఖ్_దేవ్_రాజ్_గురు ల  #వర్ధంతి_సందర్భంగా_జోహార్లు.. ఆర్ శ్రీరాం నాయక్ , రాష్ట్ర ప్రధాన కార...
23/03/2024

#నేడు.... #షహీద్_భగత్_సింగ్_సుఖ్_దేవ్_రాజ్_గురు ల #వర్ధంతి_సందర్భంగా_జోహార్లు.. ఆర్ శ్రీరాం నాయక్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం (TGS)🌹💐✊🌹💐✊🌹💐✊🌹💐✊🌹💐✊🌹💐✊🌹💐✊

https://youtu.be/7Vp0v-pAlAM?si=KoZOQdxY1-0OQ-jq
21/03/2024

https://youtu.be/7Vp0v-pAlAM?si=KoZOQdxY1-0OQ-jq

ఠానూనాయక్_స్ఫూర్తితో గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడుదాం.. తెలంగాణ గిరిజన సంఘం. ...

20/03/2024

#ప్రచురణార్థం.. #కామ్రేడ్_ఠానూనాయక్_స్ఫూర్తితో_గిరిజన_వ్యతిరేకవిధానాలపై_పోరాడుదాం*

*-కామ్రేడ్ ఠానూ నాయక్ ్ధంతి_సందర్భంగా జరిగిన #గిరిజన_హక్కుల_గర్జన_సభలో గిరిజన సంఘాల నేతల పిలుపు.*

రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కామ్రేడ్ ఠానూ నాయక్ 74వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన హక్కుల గర్జన పేరుతో రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సదస్సును సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో గిరిజన సంఘాలు, మేధావులతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్ భంగ్యా భూక్యా, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు దాస్ రాంనాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, ప్రోఫెసర్ శంకర్ , కాంగ్రెస్ యస్ టీ సెల్ నాయకులు విజయబాయి, ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, టోరి గోరి బంజారా ఛానల్ జర్నలిస్ట్ అశోక్ రాథోడ్,కళ్యాణ్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం, ఎం రవి నాయక్,కె శంకర్,భూక్యా హరి,వి.రామ్ కుమార్,బాల్యా నాయక్, వెంకట్రామ్ నాయక్,రఘు నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈసందర్భంగా ప్రొఫెసర్ భంగ్యా భూక్యా మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశానికే ఆదర్శమని అన్నారు. జనగామ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో కమ్యూనిస్టులు రాకముందే ఆ ప్రాంతంలో దొరలు భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా లంబాడి గిరిజనులు పోరాడారని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల అండతో విసునూరు రామచంద్రారెడ్డి దొరల ఆగడాలపై విరోచితంగా పోరాడటంలో ఠానూ నాయక్ ఆరుగురు అన్నదమ్ములు కీలక పాత్ర పోషించారన్నారు. పటేల్ సైన్యాలు పారిపోయిన దొరలను వెంటబెట్టుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వేలాదిమంది పోరాట వీరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పటేల్ సైన్యం ఠానూ నాయక్ ను బంధించి దళాల నాయకులు ఆచూకీ చెప్పాలని ఎంత హింసించినా చెప్పకపోవడంతో అతని ధైర్య సాహసాలను చూసి సైన్యం చంపకుండా వదిలివేశారని అన్నారు.అక్కడే కాచుకుని కూర్చున్న కటారి నర్సింగ్ రావు దొర,అతని గుండాలు ఠానూ నాయక్ ను బండి చక్రానికి కట్టి శరీరం ముక్కలయ్యేదాకా ఈడిపించి చంపి వేయడం బాధాకరమని అన్నారు. మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేడు బిజెపి, ఆర్ఎస్ఎస్ లు వక్రీకరించి ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆదివాసీ గిరిజన తెగల మనుగడ ప్రమాదకరములో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్ శ్రీరాం నాయక్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రాజ్యాంగంలోని గిరిజన హక్కులు, చట్టాలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం దాడిని తీవ్రతరం చేసిందన్నారు. ఆదిమ కాలం నుండి గిరిజన తెగలు కొనసాగిస్తూ వస్తున్న ఆహారాలవాట్లు, సంస్కృతి, ఆచారాలపై ఆధిపత్య మనువాద సంస్కృతిని బలవంతంగా రుద్ది హైందవీకరించే ప్రయత్నం చేసిందన్నారు. గో గుండాల పేరుతో మూక దాడులు చేస్తూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు, హత్యలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా వారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు ఉన్న హక్కులను కాలరాస్తూ గిరిజనేతరులకు భూమిపై హక్కులు కల్పించేందుకు గిరిజన చట్టాలను రద్దుచేసిందుకు సిద్ధపడిందన్నారు. 1/70, పెసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టం2006 ను సైతం కాలరాస్తూ అడవులు, అటవీ సంపాదను అంబానీ ఆదానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతూ అటవీ సంరక్షణ నియమాలు 2023 పేరుతో నూతన చట్టాన్ని చేయడం గిరిజనుల్లో తీవ్ర ఆందోళన, అభద్రతాభావానికి గురవుతున్నారని అన్నారు. ఒక దేశం ఒకే చట్టం ఉండాలనే పేరుతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో గిరిజనులు పోరాడి సాధించుకున్న రాజ్యాంగ హక్కులను కేంద్ర బిజెపి ప్రభుత్వం కాలరాసేందుకు పూనుకున్నది. బీజేపీ మూడోసారి అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఎటువంటి హక్కులు లేని మనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు. రిజర్వేషన్లు క్రమంగా నిర్వీర్యం చేస్తూ రద్దు చేయాలనే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగం సంస్థలను కార్పోరేట్లకు కట్టబెడుతుందన్నారు. ఈ తరుణంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దానికి మద్దతునిస్తున్న పార్టీలను ఒడించాల్సిన బాధ్యత గిరిజన తెగలపై ఉన్నదని విజ్ఞప్తి చేశారు. కొన్ని ముఖ్యమైన గిరిజన డిమాండ్లపై డిక్లరేషన్ను ప్రవేశపెట్టారు.

*గిరిజన డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు*
=================
*-ఒక దేశం ఒకే చట్టం అనే పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ హక్కులు, చట్టాలను కాలం రాయడాన్ని విరమించుకోవాలి.*

*-గిరిజన హక్కులను కాలరాస్తూ అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023ను ఉపసంహరించుకోవాలి.*

*-రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ ప్రాంతాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు గిరిజనేతరులకు భూమిపై హక్కులు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.*

*-తెలంగాణలో గిరిజన తెగల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిన బిజెపి పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావును కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని తీసుకోవడం గిరిజన తెగల మధ్య మరింత ఆజ్యం పోసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.*

*-అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 లోని కటాఫ్ తేదీని 2020 వరకు పొడిగించాలి. అప్పటివరకు పోడు భూములను సాగు చేస్తున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి. పోడుభూములపై యాజమాన్యహక్కుకల్పించి బ్యాంకురుణాలు ఇవ్వాలి.*

*-వేలాదిమంది గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బయ్యారం ఉక్కుపరిశ్రమను కేంద్రం ప్రభుత్వంఏర్పాటుచేయాలి.*

*-నల్లమల్లలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.*

*- దేశవ్యాప్తంగా పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ను పెంచాలి.*

*-ములుగు లో ఏర్పాటు చేస్తున్న గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్థులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలి.*

*-జాతీయ ఎస్.టి.కమిషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి.*

*-తెలంగాణలో గిరిజనులకు పెంచిన 10 శాతం రిజర్వేషన్ జీవో 33ను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి.*

*-షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3 స్థానంలో అవే హక్కులతో మరో జీవోను జారీ చేసి రాజ్యాంగబద్ధత కల్పించాలి.*

*-ప్రవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి.*
మరో 15 రకాల సమస్యలను డిక్లరేషన్ లో పొందుపరిచారు.

*అభినందనలతో...*

*ఆర్. శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #వీరతెలంగాణ_ధీరత్వం_కామ్రేడ్_ఠానూనాయక్...నేడు 74వ  #వర్థంతి సందర్భంగా.. నవతెలంగాణ దినపత్రికలో ఆర్.  #శ్రీరాంనాయక్ రాసిన...
20/03/2024

#వీరతెలంగాణ_ధీరత్వం_కామ్రేడ్_ఠానూనాయక్...నేడు 74వ #వర్థంతి సందర్భంగా.. నవతెలంగాణ దినపత్రికలో ఆర్. #శ్రీరాంనాయక్ రాసిన వ్యాసం..

 #మార్చి 20న తెలంగాణ సాయుట రైతాంగ పోరాటం యోధుడు  #కామ్రేడ్_ఠానూ_నాయక్ 74 వ  #వర్ధంతి( 20-03-1950) సందర్భంగా  #నివాళులు 🌹...
19/03/2024

#మార్చి 20న తెలంగాణ సాయుట రైతాంగ పోరాటం యోధుడు #కామ్రేడ్_ఠానూ_నాయక్ 74 వ #వర్ధంతి( 20-03-1950) సందర్భంగా #నివాళులు 🌹✊🌹✊🌹✊🌹✊🌹✊🌹✊
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన హక్కుల గర్జన పేరుతో 20-03-2024 ను ఉ.10 గంటలకు సుందర య్య నాన్నకేంద్రం భాగ లింగంపల్లి హైదరాబాద్ లో జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి..ఆర్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం

 #అందరికీ_ఆహ్వానం..🙏🌹
19/03/2024

#అందరికీ_ఆహ్వానం..🙏🌹

 #ఆహ్వానం..🙏
18/03/2024

#ఆహ్వానం..🙏

 #మార్చి 20 న  #కామ్రేడ్_ఠానూనాయక్ 74 వ  #వర్ధంతి సందర్భంగా  #గిరిజన_హక్కుల_గర్జన..=రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడు...
12/03/2024

#మార్చి 20 న #కామ్రేడ్_ఠానూనాయక్ 74 వ #వర్ధంతి సందర్భంగా #గిరిజన_హక్కుల_గర్జన..
=రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం..
=కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దాం.. #తెలంగాణ_గిరిజన_సంఘం (TGS)

 #మార్చి 20 న  #కామ్రేడ్_ఠానూనాయక్ 74 వ  #వర్ధంతి సందర్భంగా  #గిరిజన_హక్కుల_గర్జన..=రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడు...
12/03/2024

#మార్చి 20 న #కామ్రేడ్_ఠానూనాయక్ 74 వ #వర్ధంతి సందర్భంగా #గిరిజన_హక్కుల_గర్జన..
=రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం..
=కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దాం.. #తెలంగాణ_గిరిజన_సంఘం (TGS)

 #మార్చి 20 న కామ్రేడ్  #ఠానూ_నాయక్ 74వ వర్థంతి సందర్భంగా  #గిరిజన_హక్కులగర్జన**- గోడ పత్రం ను విడుదల చేసిన తెలంగాణ గిరి...
11/03/2024

#మార్చి 20 న కామ్రేడ్ #ఠానూ_నాయక్ 74వ వర్థంతి సందర్భంగా #గిరిజన_హక్కులగర్జన*

*- గోడ పత్రం ను విడుదల చేసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నేతలు.*

రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందాం, కేంద్ర బీజేపీ ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దాం అనే నినాదాలతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్ 74వ వర్థంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మార్చి 20 వతేదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు గిరిజన హక్కుల గర్జన ను జయప్రదం చేయాలని సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో గోడ పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలు నాయక్, రమావత్ పాండు నాయక్,వి.రామ్ కుమార్, గోర్యా నాయక్,సభావట్ పాండు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రమావత్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గిరిజన సమస్యలను రాజకీయ పార్టీల అజెండాలోకి తీసుకురావడం కొరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్ 74వ వర్ధంతి సందర్భంగా "గిరిజన డిమాండ్లపై డిక్లరేషన్ ప్రకటించడం కొరకు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో "గిరిజన హక్కులకై గర్జన" పేరుతో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రజా ప్రతినిథులు, మేధావులు పాల్గొంటున్నారని తెలిపారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన తెగల తిరుగుబాట్ల ఫలితంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయన్నారు. చరిత్రలో ఎన్నడులేని విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాటన్నిటినీ కాలరాసేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 1/70 చట్టం, పెసాచట్టాలను అమలు చేయకుండా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నదన్నారు. తరతరాలుగా అటవీభూములను సాగు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 నీరుకారుస్తూ బిజెపి ప్రభుత్వం గత డిసెంబర్ లో అటవీ సంరక్షణ నియమాలు 2023 పేరుతో కొత్త చట్టం చేసిందని విమర్శించారు. దీనివలన అడవులు, అటవీ సంపదను అంబానీ, అదానీ లాంటి బడా కార్పోరేట్లు లూటీ చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ చట్టం వలన కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు భూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే చట్టం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన ఆర్టికల్ 371 (ఎ) నుండి (హెచ్) వరకు ఈశాన్య రాష్ట్రాల గిరిజన హక్కులు, ఆర్టికల్ 275(1), విద్య, ఉద్యోగాల్లో 100 శాతం స్థానిక గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే జి.ఓ. నెం. 3వంటి వాటిని న్యాయస్థానాల ద్వారా రద్దు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించిందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా హక్కులు, సంస్కృతి, ఆహార అలవాట్లపై దాడి జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.గత 10 సంవత్సరాల కాలంలో గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించి, ఖర్చు చేయాల్సిన నిధులను లక్షల కోట్లు రూపాయలను ఇతర పథకాలకు దారిమళ్ళించిందన్నారు. దేశంలో ఎరిగిన గిరిజన జనాభా ప్రకారం 7 శాతం నుండి 12 శాతానికి గిరిజన రిజర్వేషన్ ను పెంచకుండా అగ్రవర్ణ పేదల పేరుతో 10శాతం పెంచిందన్నారు. గిరిజన తెగల భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం లేదు, తెలంగాణలో పెంచిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ జి.ఓ. 33ను 9వ షెడ్యూల్ చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. వేలాదిమంది గిరిజన యువతకు ఉపాధి కల్పించే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం అవకాశవాదానికి నిదర్శనమన్నారు. గిరిజనులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని కేవలం 7శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. యురేనియం తవ్వకాలతో నల్లమల అడవులను ధ్వంసం చేసేందుకు సిద్ధపడిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి గిరిజనులు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే గిరిజన హక్కుల గర్జనను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

*అభివందనములతో..*

*ఆర్. శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణగిరిజన సంఘం.

 #నేడు_అంతర్జాతీయ_మహిళా_దినోత్సవ_శుభాకాంక్షలు..🎉🌹🎉🌹🎉🌹🎉🌹  #తెలంగాణ_గిరిజన_సంఘం (TGS)  #ఆర్_శ్రీరాం_నాయక్,రాష్ట్ర ప్రధాన క...
08/03/2024

#నేడు_అంతర్జాతీయ_మహిళా_దినోత్సవ_శుభాకాంక్షలు..🎉🌹🎉🌹🎉🌹🎉🌹 #తెలంగాణ_గిరిజన_సంఘం (TGS) #ఆర్_శ్రీరాం_నాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

 #ట్యాంక్_బండ్_పై_ఠానూనాయక్_విగ్రహాన్ని_ఏర్పాటు చేయాలి* #తెలంగాణ_గిరిజన_సంఘం_డిమాండ్.*హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కొం...
04/03/2024

#ట్యాంక్_బండ్_పై_ఠానూనాయక్_విగ్రహాన్ని_ఏర్పాటు చేయాలి*

#తెలంగాణ_గిరిజన_సంఘం_డిమాండ్.*

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కొంతమంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు ఒక ప్రకట నలో డిమాండ్ చేశారు.

భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని జరిగిన విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరమరణం పొందిన గిరిజన యోధుడు కామ్రేడ్ జాటోత్ ఠానూ నాయక్ అని గుర్తు చేశారు. అటువంటి పోరాట యోధుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడం ద్వారా నేటి సమాజానికి ప్రేరణ నిస్తుందని అన్నారు. ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నదని గుర్తు చేశారు.1944 నుండి 1951 వరకు సాగిన సాయుధ రైతాంగ పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని సమాధి చేసి, రజాకార్లు,దొరలు, దేశ్ ముఖ్ ల ఆగడాలను అంతమందించిందని తెలిపారు.అటువంటి వీరోచిత పోరాటంలో లంబాడీ గిరిజనుల తిరుగుబాటు మరింత ప్రేరణ ఇస్తుందని తెలిపారు. జనగామ ప్రాంతంలోని ధర్మపురం, ముండ్రాయి చుట్టుపక్కల తండాలలో తమ భూములను సాగు చేసుకుంటు జీవిస్తున్న భూములను లంబాడీ గిరిజనుల విసునూరు దొరలు రామచంద్రారెడ్డి ,కటారు నర్సింగరావు వారి గుండాలు ఆక్రమించడంతో తిరుగుబాటు ప్రారంభమైందని తెలిపారు. తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ జాటోత్ రానూ నాయక్' ఆరుగురు అన్నదమ్ములు ఆ ప్రాంత దొరలను కంటిమీద కునుకు లేకుండా చేశారని తెలిపారు. మరింత రెచ్చిపోయిన దొరలు ఎలాగైనా ఠానూ నాయక్ కుటుంబాన్ని మట్టు పెట్టడమే లక్ష్యంగా కిరాయి గుండాలు, నిజాం రజాకార్లను వెంటబెట్టుకొని తండాల మీద పడి గిరిజన మహిళలు, వృద్ధులను సైతం మంటల్లో తగులబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత రెచ్చిపోయిన దొరలు ఠానూ నాయక్ అన్నదమ్ములైన నలుగురిని ఒకే చోట పట్టుకొని వారి చితిని వారి చేతనే పేర్పించి వారే నిప్పు అంటించుకునే విధంగా చేసి అతి కిరాతకంగా చంపారని అన్నారు. దొరలను ముప్పు తిప్పలు పెట్టిన ఠానూ నాయక్ ను ఎలాగైనా చంపాలని కటారు నర్సింగరావు అతని గుండాలు, భారత సైన్యాలను వెంటబెట్టుకుని తీవ్రంగా గాలించి ద్రోహి ఇచ్చిన సమాచారంతో 1950 మార్చి 20వ తేదీన ముండ్రాయి తండాలో ఠానూ నాయక్ ను పట్టుకొని బంధించారని అన్నారు. కటారి నర్సింగరావు దొర నేతృత్వంలో అక్కడే బండి చక్రానికి కట్టి మొక్కలు అయ్యే వరకు ఈడ్పించి అతి క్రూరంగా చంపి కసి తీసుకున్నారని తెలిపారు. ఠానూ నాయక్ వంటి పోరాట యోధుడి చరిత్రను నేటి గిరిజనులు తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాదులో మ్యూజియంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

*అభినందనలతో..*
*ఆర్. శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #రైతులపై_మోడీ_ప్రభుత్వం_కాల్పులు_రైతు_మృతి...
22/02/2024

#రైతులపై_మోడీ_ప్రభుత్వం_కాల్పులు_రైతు_మృతి...

 #సేవాలాల్_స్ఫూర్తితో_గిరిజన_హక్కులను_సాధించుకోవాలి..  #ఆర్_శ్రీరాంనాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం
18/02/2024

#సేవాలాల్_స్ఫూర్తితో_గిరిజన_హక్కులను_సాధించుకోవాలి.. #ఆర్_శ్రీరాంనాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం

 #సేవాలాల్_స్ఫూర్తితో_గిరిజన_హక్కులను_సాధించుకుందాం...*-టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రమావత్ శ్రీరాం నాయక్ పిలుపు.*...
17/02/2024

#సేవాలాల్_స్ఫూర్తితో_గిరిజన_హక్కులను_సాధించుకుందాం...

*-టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రమావత్ శ్రీరాం నాయక్ పిలుపు.*

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని కెపిహెచ్ బి కాలనీలో తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రమ్య గ్రౌండ్ నుండి జేఎన్టీయూ మీదుగా ఐదవ ఫేస్, కమ్యూనిటీ పార్కు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఉస్మానియా యూనివర్శిటీ గిరిజన జేఏసీ నాయకులు డాక్టర్.కొర్ర ఈశ్వర్ లాల్ పాల్గొనగా మేడ్చల్ జిల్లా తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు జర్పలా శివ,ఆర్.చిరంజీవి,ఉపాధ్యక్షులు కే.కృష్ణ నాయక్,కూకట్ పల్లి మండల నాయకులు ఆర్.శ్రీను,పి.గోపాల్, ఎ. లక్ష్మా,భోజ్యా , జానూ,భాష, మత్రు,బాలు, పి.శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కే.కృష్ణ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరా స్తున్న తరుణంలో వాటిని కాపాడుకునేందుకు సేవాలాల్ స్పూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్న బంజారాలను తండాలను ఏర్పాటు చేసుకుని స్థిరవ్యవసాయం చేయడం ద్వారానే అభివృద్ధి చెంతుతారని చైతన్యం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.ఐక్యతా సిద్ధాంతాన్ని బలంగా బోధిస్తూ బంజారా సమాజ ఉనికిని చాటిచెప్పిన మహనీయుడని అన్నారు. చెల్లా చెదురుగా ఉన్న బంజారాలను దశ దిశ ను చూపిన నవసమాజ నిర్మాత సేవాలాల్ అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి కావస్తున్నా గిరిజన శాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం గిరిజనులను అవమాన పరచడమేనని విమర్శించారు. సేవాలాల్ స్ఫూర్తితో ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విధంగా అన్ని గిరిజన సంఘాలు ఐక్య ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

*అభినందనలతో..*
*కె. కృష్ణా నాయక్*
ఉపాధ్యక్షులు, మేడ్చల్ జిల్లా.
తెలంగాణ గిరిజన సంఘం.

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SriramNaik Ramavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SriramNaik Ramavath:

Videos

Share


Other Social Media Agencies in Hyderabad

Show All

You may also like