Andhra today

Andhra today news and entertainment

పేరు : పిట్లూరి వెంకాయమ్మ వయసు : 75 - 80 ప్రాంతం  :  పిట్టలవానిపాలెం, బాపట్ల జిల్లా, ఆటోడ్రైవర్ అయిన ఆమె కొడుకు సాంబశివర...
24/10/2025

పేరు : పిట్లూరి వెంకాయమ్మ
వయసు : 75 - 80
ప్రాంతం : పిట్టలవానిపాలెం, బాపట్ల జిల్లా,

ఆటోడ్రైవర్ అయిన ఆమె కొడుకు సాంబశివరావు ఆమెను శారద కాలనీ మెయిన్ రోడ్లో వదిలేసి వెళ్లిపోయాడు!

24/10/2025

*రాజమండ్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం*
- మాజీ ఎంపీ భరత్

అనునిత్యం రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం ఏమిటి ?

ప్రభుత్వ చేతగానితనం మరియు నిర్లక్ష్యమా లేక పెరుగుతున్న టెక్నాలజీయా.

రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న పోలీసులు.

వైస్సార్సీపీ మహిళా నాయకురాలు అనుయాదవ్ అక్రమ ఆరెస్ట్.

కూటమి ప్రభుత్వంలో రోజురోజుకి దిగజారిపోతున్న పోలీస్ వ్యవస్థ..

కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న 3 టౌన్ సీ.ఐ..

రాజమండ్రిలో ఆడపిల్లపై జరిగిన అత్యాచార ఘటనలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం ఒక మహిళ అని చూడకుండా అక్రమంగా అరెస్టు చేసి ఏదో మర్డర్ చేసి తప్పించున్నట్లు హంగామా చేస్తున్నారు..

ఎమ్మెల్యే డైరెక్షన్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబు నిరంకుశ ధోరణి ప్రజలు అంతా గమనిస్తున్నారు.

రాజమండ్రి నగరంలో టీడీపీ నేత లీకైన ఆడియోలో మద్యం సిండికేట్ల వ్యవహారం, అలాగే అధిక ధరలకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులను అరెస్ట్ చేయకుండా ప్రజల పక్షాన పోరాడుతున్న వైస్సార్సీపీ మహిళా నాయకులను , కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గు చేటు ...

24/10/2025

*తెనాలి సీఐ సమయస్ఫూర్తి*
*ఆత్మహత్యాయత్నం విరమించుకున్న ఓ వ్యక్తి*

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు లాడ్జిలు తనిఖీ చేస్తున్న సమయంలో ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని గుర్తించి అతని ప్రాణాన్ని తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు రక్షించారు.

📍 గుంటూరు జిల్లా పరిధిలో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మార్గదర్శకత్వంలో పోలీస్ అధికారులు హోటళ్లు, లాడ్జిలు, ఇతర ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

🚩 ఈ క్రమంలో తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ఒక లాడ్జ్‌లోని రూములో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా, తీవ్ర ఆందోళనగా ప్రవర్తించడం గమనించి అతనిని విచారించారు. సోదా జరపగా అతను ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు తెచ్చుకున్న విషయం బయటపడింది.

🔰 సమయస్ఫూర్తితో స్పందించిన సీఐ సాంబశివరావు, పోలీస్ సిబ్బంది అతని ప్రాణాన్ని రక్షించారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అతనికి ధైర్యం చెప్పి, అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి, వారి సంరక్షణలోకి అప్పగించారు.

🔰 పోలీస్ అధికారుల ఈ మానవతా చర్యతో ఒక ప్రాణం నిలబడింది. తెనాలి త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది చూపిన ఈ అప్రమత్తత, సేవాభావం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

24/10/2025

*అక్కడ పులి తిరుగుతోంది*
*తస్మాత్ జాగ్రత్త*

*శ్రీశైలం డ్యామ్ సమీపంలోని కెవి స్విచ్ యార్డ్ వద్ద చిరుత పులి సంచరిస్తోంది. గత రెండు రోజులుగా అక్కడి కుక్కలపై దాడి చేస్తుంది. దీనిపై స్విచ్ యార్డ్ సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువైపు సంచరించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.*

*బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌(20) మృతి*శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపుబైక్...
24/10/2025

*బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌(20) మృతి*

శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు

బైక్‌ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లిన బస్సు

పెళ్లిచూపులు చూస్తున్న సమయంలో శివ మృతిపై కుటుంబంలో విషాదం

ఎందుకు బయటకు వెళ్లాడో తెలియదని చెప్పిన కుటుంబసభ్యులు

24/10/2025

కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం, పలువురి మృతిపై మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందనని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

*కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు*• బస్సు దగ్ధమైన ఘటనలో పలువుర...
24/10/2025

*కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
• బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
• ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు
• సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం
• ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం
• క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం
• మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచన.

*మృత్యుశకటం**కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డ...
24/10/2025

*మృత్యుశకటం*

*కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

*హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.*

*24 వ తేది తెల్లవారుజామున 3, 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది*

*21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగింది.*

*మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం*

*డా. ఏ. సిరి, జిల్లా కలెక్టర్, కర్నూలు*

20/10/2025

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

20/10/2025

కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత దీపావళి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు...

20/10/2025

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకున్న ప్రధాని మోడీ💐

20/10/2025

జీజీహెచ్‌లో అలంకారంప్రాయంగా op కౌంటర్లు

ఉదయం 8:40 గంటలకు కూడా ప్రారంభం కాని op సేవలు

సర్వర్ సమస్యతో మోరాయిస్తున్న కంప్యూటర్లు

ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అంటే ఇంతేనా... అంటూ తలలు పట్టుకుంటున్న రోగులు

Address

Guntur

Telephone

+917207665999

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share