25/08/2022
ఆపరేటర్లు కాదంటే .. కేబుల్ టీవీ ఇక కార్పొరేటర్లదే?
- గుంటూర్లో తాజా కేబుల్ వార్? - తెలీకుండానే ఉచ్చులోకి కార్పొరేటర్లు?
- నగరంలో తాజా కేబుల్ వార్? మళ్లీ మళ్లీ కేబుల్ లొల్లి!
- సగం సగం’ ఆయన గళం! ... ఆపరేటర్ల గరం గరం?
- ఆపరేటర్లు కాదంటే .. కేబుల్ టీవీ ఇక కార్పొరేటర్లదే.. డిప్యుటే మేయర్?
- లెక్క తేలాల్సిందేనన్నఆయన బాల వజ్ర సంకల్పం సఫలమయ్యేనా?
- నాడు చంద్రన్న కేబుల్ ... నేడు రాజన్న వారసులమంటున్న టీడీపీ ఎంఎస్‌ఓ’ లకు ఓ వర్గం వైసీపీ అండ?
- తిలా పాపం తలా పిడికెడు? – అన్నీ ఎంఎస్‌ఓ లకు వాటాలు ఇవ్వాలంటున్న అడ్రసు లేని సంక్షేమ సంఘం నాయకులు
సామాన్యుడి వినోదమైన కేబుల్ టీవీ పై నాయకుడి కన్ను పడింది. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా గతంలో పార్టీలపరంగా నడిచే కేబుల్ వార్ ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయకుల పలు కేబుల్ టీవీల నెట్’వర్క్ ల మద్య జరుగు తుంది. ఐతే ఈ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలితో అదే వృత్తిగా జీవిస్తున్న సగటు కేబుల్ ఆపరేటర్ అడ్డంగా నలిగిపోతున్నాడు. వాస్తవానికి నగర కేబుల్ ఆపరేటర్లలో అత్యధికులు వైసీపీ మద్దతుదారులే. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న కేబుల్ పేరిట ఏపీ ఫైబర్నెట్ అంటూ ఇదే ఆపరేటర్లపై ప్రచ్చన్న యుద్దం చేసిన నాటి టీడీపీ నాయకులు, వారి మద్దత్తు దారులు ఒక పధకం ప్రకారం అప్పట్లో నగరంలో సిటీ కేబుల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి మరీ దెబ్బ కొట్టారు. వాళ్ళల్లోని ముఖ్యులు ఎన్నికల అనంతరం వైసీపీలోకి వచ్చేసి తొలిఏడాదిలోనే ఏకంగా రాజన్న కేబుల్ అంటూ ఓ సంస్థ స్టాపించామంటూ, మళ్ళీ అదే ఆపరేటర్లపై జులుం ప్రదర్శించారు. వైసీపీ పెద్దలదే ఈ సంస్థ అంటూ ప్రచారం చేసిన శ్రీనివాస రెడ్డి అలియాస్ పొట్టి రెడ్డి కేబుల్ ఆపరేటర్లపై పోలీసుల వత్తిడితెచ్చి మరీ కనెక్షన్స్ వేయించారని ప్రచారం. ఐతే పొట్టి రెడ్డి గత కేబుల్ వ్యాపార చరిత్ర అంతా మోసపూరితమే కావటం, ఇంకా సదరు కంపెనీ నాణ్యమైన ప్రసారాలు ఇవ్వలేకపోవటంతో ఎస్‌ఎస్‌సి అనే పొట్టి రెడ్డి సంస్థ చతికిల పడింది. ఊపిరిపీల్చుకుంటున్న నగర ఆపరేటర్లపై మాజీ హోమ్ మంత్రి పేరు చెప్పుకుని మరో టీడీపీ నేత జియో హాత్’వే అంటూ మళ్ళీ దాడి మొదలెట్టారు. కనీసం 40 శాతం పైబడి కేబుల్ కనెక్షన్లను తమ సంస్థకే అప్పచెప్పాలనటం ఇవ్వాలనటం, హోమ్ మంత్రి సొంత కేబుల్ వ్యాపారం అంటూ చేసిన ప్రచారం వల్ల తొలిదశలో కొంత మేర వ్యాపారం పొందగలిగినా ఈ సంస్థ వినియోగదారుడి మన్ననలు పొందలేకపోవడంతో, వేసిన కేబుల్ కనెక్షన్లు క్రమేపీ తగ్గిపోయాయి. ఆతర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలుగురు ఎంఎల్‌ఏ లు నేరుగా రంగంలోకి దిగినా వారికి కేబుల్ వ్యాపారం పెద్దగా ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. ఆతరువాత వైఎస్ కుటుంబానికి నేరుగా సన్నిహితులున్నారని చెప్పుకోస్తున్న ఓ స్టానిక ఎంఎస్‌ఓ జిటిపిఎల్ అంటూ హడావిడిచేసినా లోకల్ చానల్స్, ప్రసార నాణ్యతాలోపం అన్నిటికి మించి వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేని వైనంతో ఆ సంస్థ కూడా అరకొరగానే మిగిలిపోయింది.
ఇక గత చరిత్రలోకి వెళితే గత ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి ఆలపాటి నేతృత్వంలో ఓ వర్గం హెచ్‌సివి/ ఏసిటి కంపెనీలు విడివిడిగా కలివిడిగా వ్యాపారం చేసి, ప్రభుత్వ జులుం ప్రదర్శించి సగటు కేబుల్ ఆపరేటర్ జీవితాన్ని దెబ్బకొట్టింది. ఐతే వారేమీ వ్యాపారంలో స్తిరపడ్డ ధాఖలాలు కూడా లేవు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా ఎదోవిధంగా కేబుల్ ఆపరేటర్ జీవనం మీద అధికారంలో ఉన్న ప్రభుత్వం పేరు చెప్పుకుని దెబ్బ కొట్టడం అలవాటైపోయిన కొంతమంది వ్యక్తులే కంపెనీలు మార్చుకొని, మరలా మరలా సగటు కేబుల్ ఆపరేటర్ ను నాశనం చేస్తున్నారు. కరోనా సమయంలో రోద్దు ప్రక్కన దొర్కే టీ’ కూడా రూ. 5/- నుంచి రూ.10/- కి మారిపోగా – మోసపూరిత ఎంఎస్‌ఓ కేబుల్ క్రీడలో సగటు ఆపరేటర్ బలైపోతున్నాడు. గత పదేళ్లుగా కేబుల్ టీవీ వినోదపు బిల్లు గరిష్టం రూ. 300/- దాటి వసూలు చేయలేక, కొత్త టెక్నాలజీ, కొత్త ఎంఎస్‌ఓ నెట్వర్కులను అందిపుచ్చుకోలేక నలిగిపోతున్నాడు.
తాజాగా నగరంలో వైసిపి పేరుమీద 6 లేదా 7 నెట్వర్కులు తమ కేబుల్ అంటే తమ కేబుల్ వేయాలంటూ మాజీ మంత్రుల నుండి డిప్యూటీ మేయర్ వరకు చేస్తున్న హడావిడి ఆపరేటర్లను గందరగోళానికి గురిచేస్తుంది. వాస్తవానికి వైసిపి ప్రభుత్వం గాని, అధిస్థానం నాయకులుగానీ నేరుగా ఏ కేబుల్ నెట్వర్క్ కు మదత్తు తెలిపిన ధాఖలాలు లేకపోయినా, ఏకంగా పార్టీలోని అతిముఖ్యుల పేర్లతోనే స్థానిక నాయకులు ఆ పెద్దల పేర్లతో నేరుగా ఆపరేటర్లపై వత్తిడి తేవడం, వీరికి తోడుగా అడ్రసు లేని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అంటూ కొంతమంది ఫలానా నెట్వర్క్ కు ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందానా పర్సెంటేజ్ ప్రకారం ఉన్న వ్యాపారంలో వాటాలు ఇవ్వాల్సిందే అంటూ వ్యవహారం నెరపడం సర్వసాధారణం అయ్యింది.
- బాలవజ్ర సంకల్పం నెరవేరెనా?
ఐతే గతానికి భిన్నంగా నేడు నగరంలో కొత్త కేబుల్ లొల్లి నడుస్తుంది. నగర డిప్యూటీ మేయర్ బాల వజ్ర బాబు నగరానికి తాజాగా తీసుకొని వచ్చిన ఎన్‌ఎక్స్‌టి’ నెట్వర్క్ ఇటీవలే వేరే నిర్వహణలో మూతబడిన సంస్థ కావడం, దాని నూతన సారధులుగా వున్నవారు టిడిపి మద్దతుదారులు కావడం, వెరసి అన్నిటికి మించి ప్రస్తుతం కేబుల్ వ్యాపారం చేస్తున్న అందరూ ఆపరేటర్లూ సగం వాటా లో తన కేబుల్ నెట్వర్క్ వెయ్యల్సిందేనన్న ఆయన వ్యవహారశైలి ఒక నాటి ఆయన సహచర కేబుల్ ఆపరేటర్లను సైతం ఒకింత అసహనానికి గురిచేస్తుందన్నది వాస్తవం. డిప్యూటీ మేయర్ కూడా గత పాతికేళ్లుగా ఒక కేబుల్ ఆపరేటర్ అవ్వడం, గత ప్రభుత్వంలో టిడిపి పెద్దల కేబుల్ విషయాల్లో ప్రత్యక్ష భాదితుడైవుండికూడా ఇలా ఆపరేటర్లపై వత్తిడి తెస్తున్న ఆయన నినాదం’ సగం’ సగం’ పై ఆపరేటర్లు గరం గరం అవుతున్నారనటంలో సందేహం లేదు. పైకెవరూ నోరెత్తకపోయినా డిప్యూటీ మేయర్ తన సొంత వ్యాపారంలో సిటీ డిజిటల్ నెట్వర్క్ నడుపుకొంటూ, తన కొత్త వ్యాపార ప్రయోగాన్ని ఆపరేటర్లపై విసిరెయ్యడం ఏమిటన్నది పలువురు ఆపరేటర్ల ప్రశ్న?
- తెలీకుండానే రొచ్చులోకి మేయర్? అత్యుస్తాహంలో కార్పొరేటర్లు?
ఏ వ్యాపారానికైనా రాజకీయ అండ సహజం. కేబుల్ టీవీ వంటి వాటికైతే పార్టీలు మారినప్పుడల్లా పంచాయితీ కొత్తేమీ కాదు. గతంలో నరసరావుపేటలో కోడెల పుత్రుడి అరాచకాల మొదలు, చిలకలూరిపేటలో ఇద్దరు వైసీపీ పత్యర్ధులవరకు, ఇంకా టీడీపీ ఆలపాటి మొదలు చంద్ర కేబులంటూ జరిగిన ఏపీ ఫైబర్లో పొట్టి రెడ్డి వరకు ఇప్పటి ఈ నెట్వర్క్ కు మద్దతు గా నిలిచారని చెప్పుకోవడం నిర్వాహకుల వటు అయితే నివ్వెరపోవడం వైసీపీ మద్దతుదారులైన ఆపరేటర్ల వైనం గా మారటం వెనుక పెద్ద ప్రహసనమే ఉన్నదన్నది నిర్వివాదాంశం. అయితే డిప్యూటీ మేయర్ వ్యాపారం ఇంతగా ప్రాచుర్యం పొందటం వెనుక, ఆయన చాతుర్యం ఉందని నగర కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. ఆయన తన నెట్వర్క్ ప్రారంభ సభలో స్టానిక కేబుల్ ఆపరేటర్లతో పాటుగా గుంటూర్ నగర ఎంఎల్‌ఏ లు, మేయర్, కార్పొరేటర్లను అందరితో ఒకే సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేటర్లు తన నేయ్వర్క్ కాదంటే నగర కార్పొరేటర్లకే అన్న నినాదం వాడటం వివాదాస్పదం అవ్వడమే కాదు, తనకు తెలీకుండానే కేబుల్ రంగం తో ఏ సంభందం లేని నగర మేయర్ ను ఈ రొచ్చులోకి దింపితే, ఇదేదో లాభసాటి వ్యవహారమనుకుని కార్పొరేటర్లు కొంతమంది, ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లుగా మారిపోయారు.
- ప్రభుత్వం పరువుపోతుంది? ... వైసీపీ ఆపరేటర్ల ఆవేదన!
జగన్నపధకాలు వాలంటీర్లనడగండి! కేబుల్ టీవీ సీరియల్ రాకపోతే నన్నడగండి అని నిన్నిటి నాడు నగరంలో ఓ కార్పొరేటర్ చేసిన వాఖ్య వివాదానికి తెర తీస్తుంది. పాత గుంటూర్ ప్రాంతంలో తన కేబుల్ తీసుకోకపోతే పధకాలు కట్ చేస్తానన్న కార్పొతెరర్ పై ఓ మహిళా గుస్సు మని లేచిందని, తనకు పధకాలు లేవు, నీ కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకుంటే ఏం పఢాకాలు ఇప్పిస్తావో ఇప్పుడే చెప్పు అంటూ అక్కడి కార్పొరేటర్ ను నిలదీసిన తీరును ఆపరేటర్లు హాస్యాస్పదంగా చర్చించు కోవడం గమనార్హం. ఇదిలా వుండగా అదే వేదిక మీద వున్న ఓ ఎంఎల్‌ఏ అప్పటికి మిన్నకున్నా, ఒకింత ఆలస్యంగా కళ్ళు తెరిసి తనకు ఒక కేబూల్ తీవే వుందని, మొత్తం 50% డిప్యూటీ మేయర్ ఎత్తుకెళితే తన వాటా తెచ్చాల్సిందేనని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంగ నాయకుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ వ్యవహారాల నేపద్యంలో తొలుత ఒక్కటిగా కనిపించిన నగర వైసిపి నాయకులు ఒక్కరోక్కరుగా ఈ వివాదం తాలూకు రొచ్చు తమకు అంటకుండా కేవలం డిప్యూటీ మేయర్ వ్యవహారంగానే ప్రచారం చేస్తుండటం ప్రస్తుత పరిణామం. ఐతే అధిష్టానానిని అత్యంత సన్నిహితంగా మెలిగే సీనియర్ ఎంఎల్‌సి తో పాటుగా, ఎన్నికల్లో ఓడిన పార్టీ కన్వీనర్ గా తన పట్టు కోల్పోని నాయకుడు మరోకరు, మొదటి నుంచి ఈ వివాదానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇప్పటికే వారిరువూరు తమ మార్గాల ద్వారా పార్టీ అధిష్టానానికి గుంటూరు నగర కేబుల్ రొచ్చుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరగనున్న, జరుగుతున్న నష్టాలపై ఒక నివేదిక విడివిడిగా ఇచ్చారనే భావిస్తున్నారు. చివరగా ఒక్కసారిగా అయిదారుగురు అధికార పార్టీ వారే! తమ కేబుల్ అంటే తమకేబుల్ విస్తరించాలని వత్తిడి తెస్తుంటే ఎవరి నెట్వర్క్ కు వ్యాపారం చేయాలో తెలీని అయోమయంలో ఆపరేటర్ల విషయంలో పార్టీ అధిష్టానం ఒకింత చొరవ తీసుకొని సమస్యను జటిలం కాకుండా ఆశిస్తున్నామని ఆపరేటర్ల అభిలాష. ప్రసార నాణ్యత, సమాచార సంపుటి వుంటే సహజంగానే వినియోగదారులు ఆకర్షితులవుతారని, కొత్తగా కేబుల్ నెట్వర్కు లతో వ్యాపారం చేయాలనుకుంటున్న నాయకులు ఇది గమనించాలని, ఎవరో వచ్చి అధికార పార్టీల నాయకులను ముందుపెట్టి బెదరింపుల వ్యాపారం చేయాలని చూస్తే అటు వ్యాపారాల్లో డబ్బులతో పాటుగా పార్టీ పరుపు తీసే నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారని వైసీపీకి చెందిన కేబుల్ ఆపరేటర్లు భావిస్తున్నారు. సమస్య మరింత జటిలం ఐతే జర్నలిస్టు సంఘాల సాయంతో ప్రభుత్వ మీడియా మరియు ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి గుంటూరు కేబులు ఇబ్బందులను వివరించాలని నగర సీనియర్ ఆపరేటర్ల మనోగతాలకు ధీటుగా సగం’సగం నాదేనంటున్న ఆయన బాలవజ్ర సంకల్పం నెరవేరెరేనా? అన్నది వేచి చూడాల్సిందే!