సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో జననివాసాల మధ్య బుధవారం రాత్రి 11గంటల సమయంలో కొండచిలువ కలకలం రేపిన సంఘటన గురువారం వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన కోట సమీపంలో కొండచిలువ వెళుతున్న దృశ్యాలను అక్కడ ఉన్న యువకులు గుర్తించి దానిని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.దీంతో గ్రామస్తులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలాన్ని చేరుకొని గాలించారు. కొండచిలువ కనిపించకపోవడంతో మరోసారి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామస్తులకు తెలిపారు.
కారంచేడు గ్రామ సచివాలయం వద్ద బుధవారం పింఛను కోసం లబ్ధిదారులు పడిగాపులు కాశారు.వాలంటీర్లను ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ నుండి తప్పించడంతో సచివాలయాల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు క్యూ కట్టారు.అయితే మధ్యాహ్నం వరకు నగదు రాక పింఛన్లు ఇవ్వకపోవడంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు.కాగా సచివాలయాల వద్ద పించనుదారుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు సచివాలయ అధికారులు వెల్లడించారు.
చీరాల లో కుందేరును ఆక్రమించుకొని నిర్మించిన పిల్లల పార్కును తాము పడగొడతామని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మంగళవారం ప్రకటించారు. ముందుగా ఆయన ఈ విషయమై డ్రైనేజీ ఈ.ఈ మురళీకృష్ణ ను వివరణ కోరగా అసలు ఆ స్థలం తమది కాదని,అది పంచాయతీరాజ్ ధని బదులు ఇవ్వడంతో పాలేటి శివాలెత్తారు.మురుగు కాలువ మీ శాఖ కిందకు రాధా అంటూ ఆయన నిలదీశారు.తానేమీ చేయలేనని ఈ.ఈ చెప్పడంతో తామే ఆ పార్కును పడగొడతామని పాలేటి చెప్పారు.
చీరాల అసెంబ్లీ టికెట్ ను ప్రధాన పార్టీలు స్థానిక బీసీలకే ఇవ్వాలంటూ నియోజకవర్గంలో సాగుతున్న సభలు,సమావేశాలలో వైసీపీ నేతలు చురుకుగా పాల్గొనడం చర్చనీయాంశమైంది.చీరాల వైసిపి టిక్కెట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం వెంకటేష్ కు ఖరారు అయ్యాక ఈ ఉద్యమ ఉధృతి పెరగడం విశేషం.ఆదివారం రాత్రి జరిగిన సభలో పార్టీ జడ్పిటిసిలు ఆకురాతి పద్మిని,బండ్ల తిరుమలాదేవి,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పాల్గొన్నారు.
వీసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్, పాలిసెట్,ఈసెట్ లకు సంబంధించిన ఉచిత కోచింగ్ శిబిరం సోమవారం చీరాల తెల్లగాంధీ బొమ్మ సెంటర్ లోని అవ్వారు నివాస్ లో ప్రారంభమైంది.బి.సి కమీషన్ మాజీ సభ్యుడు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ గత 17 ఏళ్ళు గా ఈ కోచింగ్ శిబిరాన్ని నిర్వహిస్తూ 3500 మంది బడుగు,బలహీన వర్గాల పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించామని చెప్పారు.విద్యాబోధనతో పాటు ఉపాధి కూడా తామే చూపుతామన్నారు.
చీరాల 216వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.అక్కాయపాలెం నుండి పాపాయిపాలెం కు ఒక ట్రాక్టర్ కూలీలతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.అధిక వేగం కారణంగా ట్రాక్టర్ రెక్కలు ఊడటంతో వాటి మీద కూర్చున్న కూలీలు జారిపడగా నలుగురు గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.
చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు.తద్వారా ఆయన రేపటి ఎన్నికల్లో తన పాత్రను చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇప్పటికే ఆమంచికి చీరాల వైసీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ హోరెత్తుతున్న విషయం తెలిసిందే.ఈపూరుపాలెంలో కూడా గ్రామస్తులు ఇదే డిమాండ్ చేశారు.వైసీపీ జడ్పిటిసి ఆకురాతి పద్మినితో సహా గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
చీరాలలో స్థానికులైన బీసీలకే ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తో ఆదివారం సాయంత్రం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో భారీ బహిరంగ జరగనున్నది.బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభ నిర్వహణకు నిర్వాహకులు హైకోర్టు నుండి అనుమతి తెచ్చుకున్నారు.చీరాల నియోజకవర్గ సమస్యలు స్థానిక నాయకులకు తెలుస్తుంది కానీ వలస నేతలకు ఏమి తెలుస్తుందని వారు ఈ సందర్భంగా అన్నారు.
కారంచేడు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు టిడిపి మద్దతుదారుడిని సూచించిన పర్చూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి ఎడం బాలాజీ: మండల పార్టీ కన్వీనర్ దండా చౌదరి ఆరోపణ
పర్చూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి యడం బాలాజీ పై భగ్గుమన్న కారంచేడు ఎంపీపీ నీరుకట్టు వాసు బాబు!
విశ్వశాంతి కోసం,ప్రేమ నిండిన సమాజ స్థాపన కోసం శిలువనెక్కి క్రీస్తు తన రక్తాన్ని చిందించిన గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు బోధనలను మననం చేసుకుందామని చీరాల టిడిపి,జనసేన బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ అన్నారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు పట్టణం లో జరిపిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.జీసస్ బోధనల నుండి మానవాళి ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవాలని కొండయ్య కోరారు.
అనుచరులతో ఎమ్మెల్సీ సునీత భేటీ,చీరాల వైసీపీలో మరో సంచలనం
---------------------------------------------------
చీరాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ,పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత గురువారం రాత్రి తన అనుచరులతో సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు.చీరాలలో వైసిపి బీసీ అభ్యర్థిని నిలబెడుతుందని ఆశించానని,ఇందుకు భిన్నంగా జరిగినందున తమ గళాన్ని పార్టీ అధిష్టానానికి వినిపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానని ఆమె వారికి చెప్పారు.రెండు రోజుల్లో ఏ విషయమూ తేల్చి చెబుతానన్నారు.
బాపట్ల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన కావూరివారిపాలెం లోని రాయల్ మెరైన్ ఫ్యాక్టరీ లో గురువారం రాత్రి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది.పక్కాగా అందిన సమాచారంతో బయట నుండి ఆ ఫ్యాక్టరీ కి వచ్చిన ఓ కంటైనర్ లోని 200 పెట్టెలను సోదా చేయగా ఓ పెట్టెలో భారీగా నగదు దొరికిందని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి షేక్ ఖాదర్ బీ తెలిపారు.విచారణ పూర్తికానందున ఆ నగదును చీరాల ట్రెజరీలో భద్రపరుస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చినగంజాం పరిధిలోని టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం భారీగా నగదు పట్టుబడింది.కందుకూరు నుండి చీరాల వైపు వస్తున్న ఓ కారును పోలీసులు తనిఖీ చేయగా 2.63 లక్షల రూపాయల నగదు దొరికింది.సరైన ఆధారాలు చూపనందున ఆ నగదును సీజ్ చేసినట్లు చినగంజాం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.నగదు దొరికిన ఐ ట్వంటీ కారును సీజ్ చేసి అందులో ఉన్న నలుగురిని విచారిస్తున్నారు.
చీరాల అసెంబ్లీ టిడిపి,బిజెపి, జనసేనల ఉమ్మడి అభ్యర్థి కొండయ్య యాదవ్ బుధవారం సాయంత్రం దేవినూతలలో ఎన్నికల ప్రచారానికి పూజా కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు.బాపట్ల ఎంపీ అభ్యర్థి టి.కృష్ణ ప్రసాద్,బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి నరేంద్ర వర్మలు కూడా హాజరు కాగా గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.మూడు పార్టీల జెండాలతో ఆ వూరు కళకళలాడింది.తామంతా జనానికి సదా
అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నేతలు చెప్పారు.
చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్యపై అనుచిత విమర్శలు చేసిన యువ చేనేత చాట్రాసి రాజేష్ కు కౌంటర్ గా బుధవారం ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.రాజేష్ మామ,మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.ఇదే శ్రీనివాసరావు గతంలో చీరాల టిడిపి టికెట్ కోరారని,చీరాలలో అల్లుడు టిడిపిని దెబ్బతీస్తున్నారని కొండయ్య వర్గీయులు అంటున్నారు. cbn #NaraLokesh
చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్య యాదవ్ పై అదే పార్టీకి చెందిన యువ చే'నేత' చాట్రాసి రాజేష్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో గెలుపు ఓటముల నిర్ణయించే చేనేతలను కొండయ్య కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు.ఇందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని,జాకీలు పెట్టి లేపినా కొండయ్య చీరాలలో గెలవలేడని ఆయన వ్యాఖ్యానించారు.యాదవులలోనే స్థానికులకు టిక్కెట్ ఇచ్చినా బాగుండేదన్నారు. #CBN #NaraLokesh
గిద్దలూరు నుండి అసెంబ్లీకి పోటీ చేయడం తన జీవితాశయమని,ఖచ్చితంగా తాను ఆ పని చేస్తానని చీరాల కు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు స్పష్టం చేశారు.ఆదివారం గిద్దలూరు లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిందే గిద్దలూరు ప్రజల కోసమని చెప్పారు.వెనుకబడిన గిద్దలూరు కు న్యాయం చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకత్వం పై కూడా ఉందన్నారు. #pavankalyan
చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు కు మద్దతు తెలుపుతూ శనివారం రాత్రి చేనేత సామాజిక వర్గీయులు నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయలు గైర్హాజర్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అవ్వారు ముసలయ్య,మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ హాజరు కాలేదు. #CMJagan
చీరాల నియోజవర్గం వైసీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు కేటాయించాలనే డిమాండ్ తలెత్తింది.ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని కొత్తపేట పంచాయతీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న స్థానికుడైన ఆమంచి కృష్ణమోహన్ కే సీట్ కేటాయించడం సముచితమన్నారు.వైసీపీ అధిష్టానం పునఃపరిశీలించాలని కోరారు. #AmanchiKrishnaMohan