VAMSI NEWS CHANNEL

VAMSI NEWS CHANNEL media, YouTube channel,reporter

19/02/2024

What's your opinion? Vote now: N. Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, Pawan Kalyan, Bode Ramachandra Yadav...

27/01/2024
25/12/2023
APPSC AEE Aspirants AEE Notification Kosam Prepare Ayye Vallu,Our Respectable APPSC Member Sri Sudheer Sir Gariki, Ikkad...
13/12/2023

APPSC AEE Aspirants AEE Notification Kosam Prepare Ayye Vallu,

Our Respectable APPSC Member Sri Sudheer Sir Gariki, Ikkada Mention Chesina Adress Ku Mee Representation Nu Speed Post Dhvara Send Chesthe,

Sudheer Sir Garu Related Department & Govt Of AP Officials Tho Notification Gurchi Discuss Chestharu,

Try To Send Ur Representation To This Adress

*పుంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్ వాడీలను కలిసి మద్దతు ప్రకటించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్**పిల్లలు, తల్ల...
13/12/2023

*పుంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్ వాడీలను కలిసి మద్దతు ప్రకటించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్*

*పిల్లలు, తల్లులు, బాలింతలు, కిషోర బాలికలు.. ఇలా భిన్న వర్గాల సేవల్లో అవసరమైతే 24/7 పనిలో ఉండే అంగన్ వాడీలకు ఈ ప్రభుత్వం మోసగించింది*..

*"బీసీ యువజన పార్టీ తరపున అంగన్ వాడీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.. వారి పోరాటంలో పార్టీ మద్దతు ఉంటుంది.. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వారి డిమాండ్ల మేరకు వేతనాలు పెంచుతాం, పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చాం" అని ఆయన పేర్కొన్నారు.*.




*"గుండెనొప్పి వచ్చినప్పుడు"*            *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా ...
13/12/2023

*"గుండెనొప్పి వచ్చినప్పుడు"* *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !*

*అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !*

*ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?*

*ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !*

*ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా* *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, *మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱*

*అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! 😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* *ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే !* *అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని*
*దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !*

*ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !*

*ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !*

*హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు*

*అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం..!*♥️

13/12/2023

*Press release*

సమానత్వం కోసం నాడే పాటుపడిన వారు శ్రీ రామానుజులు

ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు:- చంద్రబాబు నాయుడు

శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

శ్రీపెంరబదూర్ :- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు..తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తాను అని చంద్రబాబు అన్నారు. ఎపి ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని, 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చంద్రబాబు అన్నారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడు కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

*దుడ్డు వరలక్ష్మికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం.... కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి**ఇజం టీవీ న్యూస్/ కావలి* *కావలి పట్టణం  18...
13/12/2023

*దుడ్డు వరలక్ష్మికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం.... కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి*

*ఇజం టీవీ న్యూస్/ కావలి*

*కావలి పట్టణం 18వార్డ్ నందు దుడ్డు వరలక్ష్మి అనేమహిళ ఇల్లు కాలిపోవడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని కాలిపోయిన ఇల్లును పరిశీలించి 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వరలక్ష్మికి మనోధైర్యాన్ని ఇచ్చి, మీకు సహాయ సహకారాలు మా ద్వారా ఎల్లప్పుడూ ఉంటాయి అని బరోషా ఇచ్చారు*.

*18వార్డ్ కు చెందిన వరలక్ష్మి కి కావలి టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి*..

13/12/2023

*తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన స్కీం మహాలక్ష్మి బస్సు ఫ్రీ స్కీం వీడియో చూడండి*

*వరకవిపూడి పంచాయతీ లో సోమిరెడ్డి పర్యటన*  *తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో గిరిజన కాలనీ లలో మంగళవారం నిర్వహించి...
13/12/2023

*వరకవిపూడి పంచాయతీ లో సోమిరెడ్డి పర్యటన*

*తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో గిరిజన కాలనీ లలో మంగళవారం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*స్థానిక నాయకులు, కార్యకర్తలు,మహిళలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు*

*వైసిపి ప్రభుత్వ అరాచకాలను వివరిస్తూ వీటన్నిటి నుంచి విముక్తి కలిగించేందుకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ తమ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు*

*ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి,గుమ్మడి రాజా యాదవ్,సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ఇంచార్జీ కోడూరు శ్రీనివాసులు రెడ్డి, యూనిట్, బూత్ ఇంచార్జీలు,గ్రామ నాయకులు కార్యకర్తలు, యువత, అభిమానులు పాల్గొన్నారు.*

*Dheeraj Sahu ఝార్ఖండ్👇కాంగ్రెస్ నేత**ఇప్పటికీ ఒక్కసారి కూడా నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు, అయినా రాహుల్ గాంధీ కి...
13/12/2023

*Dheeraj Sahu ఝార్ఖండ్👇కాంగ్రెస్ నేత*
*ఇప్పటికీ ఒక్కసారి కూడా నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు, అయినా రాహుల్ గాంధీ కి సన్నిహితుడు కావడంతో మూడు సార్లు రాజ్యసభ ఎంపీ గా ఎంపిక చేశారు.*
*ఆయన ఇంట్లో ఇప్పుడు బయట పడుతున్న డబ్బు కట్టలు చూసి నోరెళ్ళ బెడుతున్న అధికారులు.*
*గత నాలుగు రోజులుగా ఇప్పటికీ దాదాపు 350 కోట్ల పైన లెక్క పెట్టినా ఇంకా చాలా మిగిలి ఉంది అని సమాచారం.*

*" మరో పక్క ఇంత డబ్బు లెక్కపెట్టలేక Counting Machines పాడయి పోతున్నాయి.."*

*కాంగ్రెస్ ఇప్పటిదాకా ఈయన ఇంట్లో దొరుకుతున్న డబ్బుకట్టల విషయంలో ఒక్క కామెంట్ కూడా చేయలేదు,I.N.D.I భాగస్వామ్య పక్షాలు నోరు ఎత్తడం లేదు ఎందుకనో..*

*ఈయన అప్పుడపుడు నేను పెట్రోల్ ధరలు భరించ లేనని Cycle మీద ఫోటోలు పెట్టడం, నోట్ల రద్దు సమయంలో ఇది సామాన్యుల మీద ఉక్కుపాదం అంటూ Hot ట్వీట్స్ వెయ్యడం లాంటివి చేశారు.*

*CORRUPT CONGRESS*😡😡😡😡

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక పదవివైసీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీని నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అధ...
13/12/2023

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక పదవి

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీని నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని నియమించగా.. ఉపాధ్యక్షుడిగా కొండా రాజీవ్ంధీ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు.

64 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన కమిటీని ఎంపిక చేసింది.

కాగా సిద్ధార్థరెడ్డి ఇప్పటికే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్గా ఉన్నారు.

ఈనెల 15వ తేదీన సదుం లో   #రైతుభేరి కార్యక్రమం..!!దోపిడీపై ధర్మయుద్ధం అందరం కలిసికట్టుగా వెళ్లి విజయవంతం చేయాలని పుంగనూరు...
12/12/2023

ఈనెల 15వ తేదీన సదుం లో #రైతుభేరి కార్యక్రమం..!!

దోపిడీపై ధర్మయుద్ధం అందరం కలిసికట్టుగా వెళ్లి విజయవంతం చేయాలని పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలం లో రైతులతో Hari Babu Yadav గారు.!

తాడేపల్లి:తుఫాన్ తో దెబ్బతిన్న పంటలు, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష.. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం...
12/12/2023

తాడేపల్లి:

తుఫాన్ తో దెబ్బతిన్న పంటలు, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై సీఎం జగన్ సమీక్ష..

రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..

రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్ గా ఉండాలి..

సంక్రాంతిలోపు రైతులకు సబ్సీడీ అందేలా చూస్తాం- సీఎం జగన్

👉 పండించిన పంటకు గిట్టుబాటుధర దొరక్కుండా దుఃఖిస్తున్న  రైతన్న🥲👉 అడ్డదారుల దోచేస్తున్న దోపిడీదారులను చెరుకుగడను చేతను బట్...
12/12/2023

👉 పండించిన పంటకు గిట్టుబాటుధర దొరక్కుండా దుఃఖిస్తున్న రైతన్న🥲
👉 అడ్డదారుల దోచేస్తున్న దోపిడీదారులను చెరుకుగడను చేతను బట్టి తరిమి కొడదాం రా
కాదలిరా
👉15వ తేదీ సదుంలో జరగబోయే రైతుభేరికి రా రైతన్న మీకు అండగా మేము మాకు మద్దతుగా మీరు

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, (ఎమ్మెల్యే) *కోనేరు రాంగరావు గారి మనుమరాలు డా" కోనేరు సత్యప్రియ గారు* మన ప్ర...
12/12/2023

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, (ఎమ్మెల్యే) *కోనేరు రాంగరావు గారి మనుమరాలు డా" కోనేరు సత్యప్రియ గారు*
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ.వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని* మర్యాద పూర్వకంగా కలిసి
తాత కోనేరు రంగారావు గారి అశయలకోసం, *తిరువూరు నుంచి 2024 ఎమ్మెల్యే అభ్యర్థి గా* అవకాశం కల్పించాలని కోరడం జరిగింది

తనను అనవసరంగా దూషించారంటూ చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు. అయితే, ...
12/12/2023

తనను అనవసరంగా దూషించారంటూ చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు.

అయితే, విచారణ సందర్భంగా తమిళ నటుడికి కోర్టు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది.

"మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది ప్రతిసారి వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడ్ని అనడం మీకు పరిపాటిగా మారింది" అంటూ న్యాయస్థానం మన్సూర్ అలీఖాన్ ను తప్పుబట్టింది. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకోవాలని న్యాయమూర్తి హితవు పలికారు.

12/12/2023

ఎన్టీఆర్ జిల్లా :

తిరువూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి మానస
పుత్రిక ఆడుదాం ఆంధ్ర ఈనెల
15వ తారీకు నుండి ప్రారంభం
సందర్భంగా మండల ప్రజా
పరిషత్ కార్యాలయం
ఆవరణలో ఎంపీపీ గద్దల
భారతి ఆధ్వర్యంలో ఎంపీడీవో
నాగేశ్వరావు కలిసి ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్లు పంపిణీ సచివాలయ సిబ్బందికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జి భారతి, ఏఎంసీ చైర్మన్ శీలం నాగ నర్సిరెడ్డి, జడ్పిటిసి
రామచంద్రారెడ్డి, పిఎసి ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి పాల్గొన్నారు.

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ చావలి అంజు యాదవ్ గ...
12/12/2023

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ చావలి అంజు యాదవ్ గారు.
ఈమె స్వగ్రామం వేంపల్లి గ్రామం, పులివెందుల నియోజకవర్గం కాగా వీరి భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ గారి స్వగ్రామం మైదుకూరు నియోజకవర్గం లోని దువ్వూరు మండలం, మానేరాంపల్లి గ్రామం. బి సి సామాజిక వర్గంకు చెందిన వీరికి నియోజకవర్గం లో మంచి బలమైన వర్గం, బంధుత్వం, బలమైన స్నేహితులు కలిగి ఉన్నారు. స్వంతంగా వీరికి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో భర్త కోరికతో శ్రీమతి అంజు యాదవ్ రానున్న 2024 ఎమ్మెల్యే ఎన్నికలో బరిలోకి దిగే పరిస్థితి ఉందని సమాచారం.

ఈరోజుమన భారత చైతన్య యువజన పార్టీ పుట్టపర్తి నాయకుడు బాలా అంజి యాదవ్ ఈనెల 30 వ తారీఖున మన పార్టీ జాతీయ నాయకుడు బోడె రామచం...
11/12/2023

ఈరోజుమన భారత చైతన్య యువజన పార్టీ పుట్టపర్తి నాయకుడు బాలా అంజి యాదవ్ ఈనెల 30 వ తారీఖున మన పార్టీ జాతీయ నాయకుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నగారు పుట్టపర్తిలో పార్టీ కార్యాలయం రోడ్ షో వచ్చుచున్న సందర్భంగా పర్మిషన్ కోసం సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కలిసి ప్రోగ్రాం గురించి వివరించి పర్మిషన్ తీసుకోవడం జరిగినది

11/12/2023

👉 చైనా అంతరిక్షంలోకి 'జూక్-2 వై-3 క్యారియర్ రాకెట్'ని విజయవంతంగా ప్రయోగించింది.

👉 'విష్ణు దేవ్ సాయి' చత్తీస్‌గఢ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అయ్యారు.

👉 గ్లోబల్ లీడర్ల అప్రూవల్ రేటింగ్ లిస్టులో ప్రధాని 'నరేంద్ర మోదీ'కి మొదటి స్థానం లభించింది.

👉 'మానవ హక్కుల దినోత్సవం' (మానవ హక్కుల దినోత్సవం 2023) డిసెంబర్ 10న జరుపుకుంటారు.

👉ఇగ్నో విద్యార్థి మరియు అధ్యాపకుల చలనశీలతను ప్రోత్సహించడానికి అలాగే బోధన కోసం అత్యాధునిక సాంకేతికతను పొందుపరచడానికి ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కెన్యా (OUK)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

👉'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఆరోగ్య సంరక్షణ మరియు విద్య కోసం UPI పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది.

👉 యూనియన్ బ్యాంక్ డిజిటల్ పరివర్తన కోసం 'యాక్సెంచర్' కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'రాజమండ్రి విమానాశ్రయం'లో టెర్మినల్ భవనానికి పునాది రాయి వేయబడింది.

👉 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023' (GPAI సమ్మిట్) న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది.

👉 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి 'సుఖ్విందర్ సింగ్ సుఖు' 'చేంజ్ మేకర్స్ ఆఫ్ ది ఇయర్-2023' జాబితాలో పేరు పొందారు.

Address

Bobbili

Alerts

Be the first to know and let us send you an email when VAMSI NEWS CHANNEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VAMSI NEWS CHANNEL:

Videos

Share

Category


Other Bobbili media companies

Show All