హైదరాబాద్-విజయవాడ హైవే పై సంక్రాంతి సందడి
టోల్ ప్లాజా వద్ద
కిలో మీటర్ల మేర భారీగా స్తంభించిన ట్రాఫిక్
కంకటపాలెం, బాపట్ల - సంక్రాంతి ప్రత్యేకత
కంకటపాలెంలో సంక్రాంతి పండుగను ఘనంగా, ఆనందంగా జరుపుకుంటారు. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, పందెం కోడి పోటీలు ప్రధాన ఆకర్షణలు. పొంగల్ వంటలు, సాంప్రదాయ నృత్యాలు, పాటలతో పండుగ ప్రత్యేకంగా కనిపిస్తుంది. గ్రామస్తుల ఏకతా, ఆనంద భరిత వాతావరణం ఈ పండుగను మరింత మధురంగా మార్చుతుంది. #Bapatla #ChiralaBeach #Congress #TDP #bapatladistrictnews #YCP #TRS #AndhraPradesh #Visakhapatnam #Vijayawada #Guntur #Tirupati #Kurnool #Rajahmundry #Nellore #Anantapur #Kadapa #Srikakulam #Amalapuram #Chirala #Proddatur #Tadepalligudem #Ongole #Chittoor #Hindupur #Machilipatnam #Bhimavaram #Eluru #Hyderabad #Warangal
*హైదరాబాదు నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.*
తిరుపతి ప్రమాద స్థలికి వెళ్ళి ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు..
తొక్కిసలాట ఘటనపై స్పందించిన తిరుపతి కలెక్టర్
Jan 09, 2025,
తొక్కిసలాట ఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. ‘గేట్ సడెన్గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారు. మిగతా వారు వైజాగ్, నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నాం’ అని కలెక్టర్ చెప్పారు.
*తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక!*
తిరుమల - తిరుపతి :
ఏపీలో జనవరి 10-19 వరకు తిరుమల శ్రీవారివైకుంఠద్వార దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.జనవరి 9న ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను తిరుపతిలోని 8, తిరుమలలోని ఓ కేంద్రంలో కేటాయిస్తారని తెలిపింది. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు టోకెన్ల జారీ జరగనుందని వివరించింది.పూర్తి వివరాలను టీటీడీ రిలీజ్ చేసిన పైవీడియో లో చూడొచ్చు.
*నేపాల్ భూకంపంలో 126కు చేరిన మృతుల సంఖ్య*
నేపాల్, టిబెట్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. మరో 188 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.ఈరోజు ఉదయం 7.1 తీవ్రతతో సంభవించిన ఈ విపత్తులో వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భూమికి 10 కి.మీ అడుగున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫార్ములా ఈ రేసులో అర పైసా అవినీతి జరగలేదు
లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని రేపు కోర్టులో కోరుతా
9వ తారీకు ఏసీబీ విచారణకు హాజరవుతా, 16వ తారీకు ఈడీ విచారణకు హాజరవుతా - కేటీఆర్...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కుప్పం నియోజక వర్గంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.
ఈ రోజు టీడీపీ కార్యాలయంలో జననాయకుడు గ్రీవెన్స్ సెల్ ప్రారంభించి ... ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు.
అనంతరం.. కంగుంది గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కుప్పం NTR క్రీడా ప్రాంగణంలో మదర్ డెయిరీ, NTR స్పోర్ట్స్ కాంప్లెక్సు, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మున్సిపాలిటీలో అభివృద్ధి, నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయటంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు
శాంతిపురం మండలంలోని శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనుల పరిశీలించనున్నారు.
రైలు పట్టాలు దాటుతుండగా ఒమహిళకు తృటిలో తప్పిన ప్రమాదం...
ఉత్తర్ ప్రదేశలోని మధుర స్టేషన్లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
*తిరుపతిలో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు*
నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సెఫ్టీ అధికారులు హెచ్చరిక