![కోసల రాజ్యాన్ని వీర కేశవుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రాజ్యంలో ఏలాంటి బాధలు లేకుండా ప్రజలు సంతోషంగా జీవ...](https://img3.medioq.com/891/221/1098912178912210.jpg)
03/02/2025
కోసల
రాజ్యాన్ని వీర కేశవుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రాజ్యంలో ఏలాంటి బాధలు లేకుండా ప్రజలు సంతోషంగా జీవిస్తూన్నారు
మహారాజు కూడా ప్రజల క్షేమమే తన క్షేమముగా తలచి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు
ఆ రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నారు కానీ ఆ మహారాజు మాత్రం సంతోషంగా లేడు , దానికి కారణం తమ రాజ్యానికి పక్కగా ఉన్న పాంచాల రాజ్యం
ఆ పాంచాలా రాజ్యాధినేత మహేంద్రవర్మకు రాజ్యకాంక్ష ఎక్కువ, ప్రపంచాన్నీ తనొక్కడే చక్రవర్తిగా పరిపాలించాలి అనేది ఆయన కోరిక
అందుకోసం తన చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలను అన్నింటిని తన సైనిక బలగంతో యుద్ధంలో ఆ దేశాల రాజులను ఓడించి అక్కడ ఉన్న ధన, వస్తు, సామాగ్రిని కొల్లగొట్టి తీసుకొని వెల్లెవాడు
అతను చాలాసార్లు కోసల మీద దండెత్తినప్పుడు విరకేశవున్నీ జయించలేకపోయాడు. అయిన తన ప్రయత్నం మాత్రం వదులుకోవడం లేదు
వీర కేశవ మహారాజుకి తన తర్వాత తమ దేశ సింహాసనాన్ని అధిష్టించడానికి ఆయనకు కొడుకులు లేరు
ఆయనకు ఒక్కగానొక్క కూతురు సువర్ణ సుగుణాల సౌదర్యరాశి, తండ్రికి తగిన కూతురు, తండ్రి ఎలా చెబితే అలా నడుచుకుంటుంది
ఇప్పుడున్న పరిస్థితులలో మహేంద్ర వర్మతో పోల్చుకుంటే , అతని సైనిక బలం ముందు వీర కేశవుడు సైనికబలం తక్కువ
వీర కేశవుడు ఏ విధంగా అయినా సరే ఆ మహేంద్రవర్మ బారినుండి తన రాజ్య ప్రజలను , సంపదను కాపాడుకోవాలి అని ఆయన ఎంత ఆలోచిస్తున్నా ఆయనకు అర్థం కావడం లేదు
ఆ మహేంద్రవర్మ చాలాసార్లు తన రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు వీర కేశవుడు అతని సైనికబలం కలిసి చాలాసార్లు తిప్పికొట్టారు. మహేంద్రవర్మ దండెత్తి వచ్చినవుడు ఎక్కువగా నష్టపోయింది వీరకేశవుడే
కానీ ఇప్పుడు వీర కేశవుడికి వయసు అయిపోతున్నది. వీర కేశవుడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తన తర్వాత తన రాజ్యాన్ని మహేంద్రవర్మ బారి నుంచి ఎవరు కాపాడగలరు
ఇప్పుడున్న పరిస్థితులలో మహేంద్రవర్మ దండెత్తి వస్తే నేను ఓడిపోవడం ఖాయం , మహేంద్రవర్మను ఎలాగైనా సరే ఆపాలి నా రాజ్యంలో అడుగు పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటూ , తన సిబ్బందిని మంత్రులను అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు
వీర కేశవుడు : సభలో అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ మన వేగులు సమాచారం ప్రకారం ఆ మహేంద్రవర్మ మళ్ళీ మన రాజ్యం మీద ఎప్పుడైనా దండెత్తి రావచ్చును
అతను వచ్చిన ప్రతిసారి మనము అతన్ని తరిమి కొడుతూనే ఉన్నాము కానీ అతని కంటే మనమే సైనిక బలగాన్ని ఎక్కువగా కోల్పోతున్నాము మనం సైనిక బలగాన్ని కోల్పోతూ ఉంటే అతడు మాత్రం తన సైనిక బలగాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు
అంతేకాకుండా ఇప్పుడు అతనికి అతని కొడుకు ఇంద్రవర్మ తొడయ్యాడు వాళ్లిద్దరూ కలిసి వస్తే వాళ్ళని ఆపడం మన వల్ల కాదు
ఇప్పుడున్న పరిస్థితులలో అతనితో యుద్ధం చేస్తే మనం ఓడిపోవడం ఖాయం కానీ అలా జరగడానికి వీల్లేదు జరగబోయే ప్రమాదాన్ని మనం ఎలాగైనా ఆపాలి
మన భవిష్యత్ తరాలు సంతోషంగా జీవించాలి అంటే ఆ మహేంద్రవర్మను మన రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వకూడదు మనం ఏమి చేయాలో సలహా ఇవ్వండి
మహామంత్రి : మహారాజా ఇప్పుడు మనము అతనిని ఎదిరించడం కంటే అతనీతో రాజీపడటమే మేలు
వీర కేశవుడు : ఏమంటున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా మహామంత్రి నేను వాళ్ళతో రాజీపడటం కంటే చావడం మేలు
మంత్రి : అంత మాట అనకండి ప్రభు మనం వాళ్ళతో ఇప్పుడు యుద్ధం చేసిన జరిగేది అదే మనం వాళ్లతో రాజీ కుదుర్చుకుంటే వాళ్లు మన రాజ్యం మీదికి దండెత్తిరారు అలాగే మన సంపదను తీసుకోలేరు మన సైనిక బలం మనకు అలాగే ఉంటుంది
వీర కేశవుడు : అంటే ఇప్పుడు వాళ్లకు భయపడి మన పరాజయాన్ని ఒప్పుకోమంటావా
మంత్రి : ప్రభువు ఒక్కొక్కసారి గెలుపు కంటే ఓటమే మనకు మేలు కలిగిస్తుంది
వీర కేశవుడు : మంత్రిగారు రాజీ పడడం తప్ప వేరే ఏదైనా ఉపాయం ఉందేమో చెప్పు
మంత్రి : ప్రభు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాజీ పడడం తప్ప ఏమీ చేయలేము మన సామంత రాజులు కూడా ఆ మహేంద్రవర్మతో చేతులు కలిపి మనల్ని ఒంటరి వాళ్లను చేసేశారు
ఈ సమయంలో అతనితో యుద్ధం చేస్తే పూర్తిగా నష్టపోతాము నష్టం జరగకూడదు అంటే మన ముందున్న ఏకైక లక్ష్యం రాజీకి వెళ్లాడమే కాబట్టి మీరు దాని గురించి ఆలోచించండి
వీర కేశవుడు : సరే మంత్రిగారు నా నిర్ణయం ఏమిటి అనేది రేపు చెబుతాను మీరు వెళ్ళండి ఈలోపు ఎవరికైనా ఏదైనా ఉపాయం తట్టినట్లైతే నాకు కబురు పంపండి ఇక నేను ఉంటాను అంటూ ఆయన సభ నుండి లేచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు
అంతఃపురంలో ఉన్న తన భార్య సులోచన , కూతురు సువర్ణ అంతఃపురంలోకి వస్తున్న వీర కేశవుడుని చూశారు వాళ్లకి వీర కేశవుడు ముఖములో దిగులు కనిపించింది
సువర్ణ : తన తండ్రికి ఎదురుగా వెళుతూ నాన్నగారు ఏమైంది ఎందుకలా ఉన్నారు
వీర కేశవుడు : ఏమీ లేదు అమ్మ నాకు వయసు అయిపోతుంది కదా నా తర్వాత ఈ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారు అని దిగులుగా ఉంది
సువర్ణ : మీకు ఆ దిగులు అవసరం లేదు నాన్నగారు మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిస్టించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన కొనసాగిస్తాను
వీర కేశవుడు : నువ్వు సింహాసనాన్ని అధిష్టించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నీకు ఏదో ఒకరోజు పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిందే కదా
సువర్ణ : నాన్న మీరు బాధపడవద్దు మీరు నా పెళ్లి గురించి అంత బాధ పడితే నేను అసలు పెళ్లి చేసుకోను
సులోచన : అంటే ఏమిటే నీ ఉద్దేశం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోదాము అనుకుంటున్నావా
సువర్ణ : హా అవును ప్రజల క్షేమం కంటే నా పెళ్లి అంత ముఖ్యం కాదు
వీర కేశవుడు : సువర్ణ నీ నిర్ణయము సరైనదే కాదనను కానీ మాకు ఈ వయసులో నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఆశగా ఉంటుంది కదా నువ్వు దాని గురించి ఆలోచించాలి కదా
సువర్ణ : సరే మీరు నాకు పెళ్లి చేయాలి అనుకుంటే నన్ను పెళ్లి చేసుకోబోయే అతను ఇక్కడే మన రాజ్యంలోనే ఇల్లరికం ఉండేలాగా చూడండి
సులోచన : ఏంటే అలా మాట్లాడుతున్నావు ఇల్లరికంకి ఎవరు వస్తారు అని నువ్వు అనుకుంటున్నావు ఎవరి రాజ్యాలను వాళ్ళు చూసుకోవడమే భారమైపోతుంది అలాంటిది వాళ్ల రాజ్యాలను వదిలిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతారని అనుకుంటున్నావా
సువర్ణ : అమ్మ నువ్వు అలా అంటే నేను ఏమీ చెప్పలేను కానీ మన రాజ్య ప్రజల క్షేమం కూడా ముఖ్యమే కావున వెంటనే నా స్వయంవరం ప్రకటించి మన రాజ్యంలో ఇల్లరికం ఉండే రాకుమారున్నీ వెతకండి అంటూ మరో మాటకు తావివ్వకుండా తన మందిరంలోకి వెళ్ళిపోయింది
సులోచన : ఏంటండీ అది అలా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు
వీర కేశవుడు : ఏం మాట్లాడమంటావు సులోచన ఇంతవరకు నాకు రాని ఆలోచన తనకు వచ్చింది తను తీసుకున్న నిర్ణయం సరైనదే ఇక మనం ఎక్కువ రోజులు కాలయాపన చేయకుండా తనకు తగిన , సరైన వరున్నీ వెతికి తీసుకురావాలి
సులోచన : మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఇల్లరికం వచ్చేవారు ఎవరుంటారు
వీర కేశవుడు : వెతికితే ఎవరో ఒకరు దొరకకపోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాజ్యాన్నీ సరైన దిశలో నడిపించే ఒక వ్యక్తి అవసరం
ఎందుకంటే ఆ మహేంద్రవర్మ మన రాజ్యం మీదకి ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును అతన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం మన వల్ల కాదు
కావున అమ్మాయి చెప్పిన దాని ప్రకారం రేపు తనకి స్వయంవరం ప్రకటించి వచ్చిన రాకుమారులలో తనకు తగిన అబ్బాయిని ఎంపిక చేసుకొని తన వివాహం జరిపించి మన అల్లుడికి రాజ్యభారాన్ని అప్పగిస్తే సరిపోతుంది
సులోచన : సరే ఏం చేసినా ఆలోచించి చేయండి ఎందుకంటే ఇది మన అమ్మాయి జీవితానికి సంబంధించినది
వీర కేశవుడు : అలాగే సులోచన తన సంతోషమే కదా మనకు కావాల్సింది రేపే సభ ఏర్పాటు చేసి రాకుమారికి స్వయంవరం ప్రకటిస్తాను
వీర కేశవుడు అనుకున్నట్లుగానే మరుసటి రోజు తన రాజ్య సభను ఏర్పాటు చేసి మహామంత్రి నా కూతురుకి నేను వివాహము చేయదలచాను కావున మన పక్క ఉన్న రాజ్యాల రాకుమారుల అందరికీ స్వయంవరానికి ఆహ్వానం పంపించండి
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నా కూతుర్ని పెళ్లి చేసుకున్న అతను ఇక్కడే ఇల్లరికం ఉండి మన రాజ్యపాలన చూసుకోవాలి అలా వుండగలవారు మాత్రమే స్వయంవరానికి రావలసిందిగా కబురు పంపించండి
మంత్రి : అలాగే ప్రభు మీరు చెప్పినట్లుగానే రాకుమారి స్వయంవరానికి త్వరలోనే ఏర్పాటు చేస్తాం అంటూ మంత్రి తమ దేశ రాయబారులు దగ్గరకు వెళ్లి మహారాజు మాటగా కోసల దేశం రాజ్యం చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 నుంచి 25 రాజ్యాల రాకుమారులకు స్వయంవరానికి కబురు పంపమని చెప్పాడు
కోసల రాజ్యానికి 60 యోజనాల దూరంలో దట్టమైన అడవి అలాంటి దట్టమైన అడవిలో నెమల్ల గడ్డ అనే చిన్న గిరిజన గ్రామం ఉన్నది ఆ గ్రామంలో 150 నుంచి 200 దాకా గడపలు ఉంటాయి
ఆ గ్రామానికి గ్రామ పెద్ద ప్రతాపుడు ఆ ఊరి ప్రజలకి ఆయన మాటే వేదవాక్కు ఆయన ఏమి చెబితే అది చేస్తారు ఆయన కూడా తన గ్రామ ప్రజల సుఖ సంతోషంగా ఉండేలాగా వారి అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటాడు
అందుకే అక్కడ ఉన్న ప్రజలకు ఆయనంటే అందరికీ చాలా ఇష్టం మరియు గౌరవం
ఆ ఊరి గురించి చెప్పుకోవాలంటే ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న చిన్న గ్రామము ఆ గ్రామంలోకి వచ్చే పక్షులను , సాధు జంతువులను వాళ్లు వారితో పాటు సమానంగా చూసుకుంటారు
ప్రతాపుడు ఆ ఊరికి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు పైనే అవుతున్నది ప్రతాపుడు రాకముందు ఆ గ్రామంలో ఉన్న వారికి తినడానికి గింజలు దొరకక పక్కనున్న నగరాలకు వలస పోయేవారు
కానీ ప్రతాపుడు వచ్చిన తర్వాత తన తెలివితేటలతో ఆ గ్రామ ప్రజలకు కావలసినటువంటి వ్యవసాయ పరికరాలను , రాళ్ళగుట్టలను వ్యవసాయ భూములుగా తయారు చేసి ఆ గ్రామంలో పంటలు పండేలాగా చొరవ తీసుకున్నాడు
దానివల్ల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తినడానికి కావలసిన ధాన్యం దొరికింది అంతేకాకుండా పక్క నగరాల నుంచి కూడా ఆ ఊరికి నాణ్యమైన ధాన్యాన్ని కొనుక్కోవడానికి వర్తకులు వస్తూ ఉంటారు
హానికరమైన క్రూరమృగాలు ఆ గ్రామం వైపు రావు ఎందుకంటే ప్రతాపుడు రైతే కాకుండా యుద్ధ విద్యలు తెలిసినవాడు
అక్కడున్న యువకులకు యుద్ధ విద్యలు నేర్పించి తన గ్రామం చుట్టూ ఎలాంటి క్రూరమృగాలు , బందిపోటు దొంగలు ఇతర ఎవరైనా ప్రమాదం కలిగించేవారు రాకుండా అహర్నిశలు కాపలా కాసేలాగా ఒక రక్షక దళాన్ని సిద్ధం చేసి ఉంచాడు
ఇక ప్రతాపుడు విషయానికి వస్తే అతని భార్య సౌదామిని కొడుకు అదిత్యుడు వాళ్ళు కూడా ప్రతాపుడు లాగానే మంచి మనసున్న వాళ్ళు ఇంకా యుద్దవిద్యాల్లో ఆరితేరినవారు ప్రతాపుడికి తన కుటుంబం అంటే ప్రాణం
ప్రతాపుడు తన కొడుకుకి వివాహము చేయదలచిన ఆదిత్యుని జాతకచక్రం తీసుకుని అదే ఊరిలో ఉన్న రాఘవాచారి అని పిలవబడే ఆ ఊరు పూజారిగారి వద్దకు వెళ్ళాడు
రాఘవాచారి : ప్రతాపుడిని చూడగానే ఆయనకు ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి అయ్యా ఈ సమయంలో మీరు ఇలా వచ్చారు నాతో నీకేమైనా పని పడినదా కబురు పంపితే నేను మీ ఇంటి వద్దకు వచ్చేవాడిని కదా
లింక్ పై క్లిక్ చేసి పూర్తి కథను చదవండి.
కోసల రాజ్యాన్ని వీర కేశవుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన రాజ్యంలో ఏలాంటి బాధలు లేకుండా ప్రజలు సంతోషంగా ...