29/01/2023
అందరూ ఈ మహాశిలలకు ఎందుకు మొక్కుతున్నారో తెలుసా ???
ఈ మహా సాలగ్రామ శిలలతోనే అయోధ్య శ్రీరామజన్మభూమి మందిరం మూలవిరాట్ "రామ్ లలా" (బాల రాముడు) మరియు శ్రీ సీతారామ ధర్బార్ విగ్రహాలను చేయనున్నారు.
వీటిని నేపాల్ లోని కాళీ గండకీ నది నుండి ఒకటి 26 టన్నులు మరొకటి 14 టన్నుల భారీ సైజు రాళ్ళను సేకరించి తరలించడం జరిగింది. ఈ రాళ్లు జనవరి 30వ తేదీ నాడు చేరుకుంటాయి. సాలిగ్రామాలు దొరికే ఏకైక నది గండకినది. బేనీబజార్ సమీపంలోని గండకీనది ఒడ్డున 'క్షమాపూజ' కార్యక్రమం జరిపి శిలలను సేకరించడం జరిగింది. 26వ తేదీ గళేశ్వర్ మహదేవ్ మందిరంలో రుద్రాభిషేకం జరపడం అనంతరం అదే రోజు ఫోకరా లోని విధ్యవాసిని మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇలా వివిధ గ్రామాలలోని మందిరాలలో పూజలు అందుకుంటూ 30వ తేదీ నాటికి అయోధ్య చేరుతాయి. సీతమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించే నేపాల్ ప్రజలు అత్తగారింటికి అయోధ్యకు పంపిస్తున్నామనే భావనతో సంబంధాలు నెరుపుతారు. ఇలా నేపాల్లో తండోపతండాలుగా వచ్చి ఈ సాలగ్రామ శిలలను దర్శనం చేసుకుంటున్నారు.
ఈ రకమైన ధార్మిక సాంస్కృతిక సంబంధాలే నేపాల్ భారతదేశాల మధ్యన ఎల్లప్పుడూ కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు.
#జైశ్రీరామ్🙏🚩