12/10/2024
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవి గారికి సాదర స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు గారు భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.