Melodious SONGS.

  • Home
  • Melodious SONGS.

Melodious SONGS. “Music gives a soul to the universe, wings to the mind, flight to the imagination
and life to ever

27/08/2022
నువ్వు కావాలిచిత్రం :  కన్నతల్లి  (1972)సంగీతం :  కె. వి. మహదేవన్గీతరచయిత :  ఆచార్య ఆత్రేయనేపథ్య గానం :  ఘంటసాల, సుశీల  ...
15/04/2022

నువ్వు కావాలి
చిత్రం : కన్నతల్లి (1972)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి

చరణం 1 :

అద్దమందు నాకు నేనే... ముద్దువచ్చే వేళలో
ఆపలేని పొంగులేవో... హద్దుమీరే వయసులో

హద్దుమీరే పొంగులాపి... ముద్దు చేసేటందుకు
ముద్దు వొచ్చే నీకు నేనే... అద్దమయ్యేటందుకు

నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ..నే నవ్వుతు ఉండాలి


చరణం 2 :

దుడుకు చేసే దోరవయసు... ఉరకలెత్తే వేళలో
పడుచువానికి పండువెన్నెల... పగైపోయే జాములో
నిమిషనిమిషం వులికిపడుతూ నిదుర చెదరే రేయిలో
నిన్నకలలే కన్నెమనసు నెమరువేసే హాయిలో

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి

చరణం 3 :

వల్లమాలిన వలపులన్నీ... ఒళ్లు విరిచేటందుకు
ఆశలన్నీ అలసిపోయి... ఆవులించేటందుకు
ఒకరి కొకరు వోడిపొయి... ఒక్కటయ్యేటందుకు
పగలురేయి ఒకటిచేసి... పరవశించేటందుకు

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి

15/04/2022

తీయ తీయని నవ్వే నువ్వూ
చిత్రం : కన్నతల్లి (1972)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల

పల్లవి :

తీయ తీయని నవ్వే... నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు... నువ్వూ

తీయ తీయని నవ్వే... నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు... నువ్వూ

తీయ తీయని నవ్వే... నువ్వూ

చరణం 1 :

దేవతలిచ్చిన దీవెనలన్నీతెచ్చిన చల్లని పాపవు నువ్వూ
దేవతలిచ్చిన దీవెనలన్నీ తెచ్చిన చల్లని పాపవు నువ్వూ
తీరిపోని పూర్వజన్మబంధమేదో...
తీరిపోని పూర్వజన్మబంధమేదో...
తీసుకొచ్చి నింపినావు... నా ఒడిలో

తీయ తీయని నవ్వే... నువ్వూ
తేనెలూరే పువ్వే... నువ్వూ
తీయ తీయని నవ్వే... నువ్వూ

చరణం 2 :

నింగిలోన తారకలన్నీ... నీ కన్నులలో మెరిసినవీ
నింగిలోన తారకలన్నీ... నీ కన్నులలో మెరిసినవీ
చందమామ... చలువంతా...
చందమామ చలువంతా... నీ నవ్వులలోనే యిమిడినది
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ

తీయ తీయని నవ్వే... నువ్వూ
తేనెలూరే పువ్వే... నువ్వూ
తీయ తీయని నవ్వే... నువ్వూ

చరణం 3 :

నా యింటి దీపము... నిలిపినావు
నా కంటి పాపవై... వెలసినావు
నా యింటి దీపము... నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
కన్నతల్లి కలలకు... కమ్మని రూపం
కన్నతల్లి కలలకు... కమ్మని రూపం
యిచ్చిన బంగారు... బొమ్మవు నువ్వూ

తీయ తీయని నవ్వే... నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు... నువ్వూ

తీయ తీయని నవ్వే... నువ్వూ

మెరుపులా మెరిసిన చిరునవ్వాచినుకులా మనసున తడిపేయేవాఉరుములా ఉరిమింది తొలి ఆశవరదల ఉన్నదే వరస చిలిపి కౌగిలై చేరుకోనావలపు ఊపి...
21/01/2022

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా
ఉరుములా ఉరిమింది తొలి ఆశ
వరదల ఉన్నదే వరస
చిలిపి కౌగిలై చేరుకోనా
వలపు ఊపిరై ఉండిపోనా
పెదవి కొమ్మపై వాలిపోనా
మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా
రేయిలా తొలి రేయిలా గడుపుదాం
జీవితం...
మరుపుకి మై మరపుకి పలుకుదాం
స్వాగతం ...
నేను నీలో అలా.. నువ్వు నాలో ఇలా....
ఇదెలా ......

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా

నెలకి చిరు గాలికి నడుముండే క్షణం
వెలుగుకి మరి మసకకి ముడులు వేద్దాం మనం
నేను నువ్వవ్వగా....
నువ్వు నేనేఅవ్వగా....
ఇలాగా ....

కలిసే ఉన్నామనుకున్నా కళలను కంటూ కూర్చున్నానిజమయ్యె క్షణమెదురయ్యే సరికి ఇంతగ మారాలానీలోనే జీవిస్తున్నా నీతో జీవితమనుకున్న...
21/01/2022

కలిసే ఉన్నామనుకున్నా కళలను కంటూ కూర్చున్నా

నిజమయ్యె క్షణమెదురయ్యే సరికి ఇంతగ మారాలా

నీలోనే జీవిస్తున్నా నీతో జీవితమనుకున్నా

బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బ్రతకాలా

ఇరువురు కన్నా ఈ కళలో చెరి ఒకరైనా ఈ కథలు

నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్నై మిగలాల

మనదనుకున్న రేపటిలో మనమేమయ్యాం ఇంతటిలో

సాయం చేసే బంధం బందించేస్తే వద్దని చెప్పాలా

మేమేం చేసాము ప్రేమించేసాము

తప్పేం చేసాము మా కధ రాసాము

మేమేం చేసాము ప్రేమించేసాము

తప్పేం చేసాము మా కధ రాసాము

చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం :  బాలు, సుశీల పల్లవి ...
21/01/2022

చిత్రం : పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

పరుగులు తీసే....అనురాగం

దానికి లేదే... ఆటంకం

పరుగులు తీసే... అనురాగం

దానికి లేదే... .ఆటంకం..

పరువపు వలపుల..సంగీతం

ఉరకలు వేసే..జలపాతం

చరణం 1 :

లైలా..ఆ... ఆ.. ఆ..

లైలా..ఆ... ఆ... ఆ

మజునూ... ఊ.. ఊ.. ఊ..

మజునూ... ఊ.. ఊ.. ఊ

లైలా మజును దేవదాసులా కాలం చెల్లిపోయిందీ

జులీ..బాబీ..లవ్... నిలిచేకాలం వచ్చింది

నువ్వూ నేనూ ఒకటై... వెలిగే కాలం వచ్చింది

పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

చరణం 2 :

పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పెద్దలు ప్రేమకు అడ్డంపడితే... పిన్నలు పాఠం చెపుతారు

మనసులేకమై నిలుచువారలకు చేతికందగలదాకాశం

గడుపుమాని ముందడుగు వేయమని... యువతరానికిది సందేశం

పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం..

Pelleedu Pillalu Movie Songs, Pelleedu Pillalu Songs, Pelleedu Pillalu Film Songs, Paruvapu Valapula Song, Paruvapu Valapula Video Song From Pelleedu Pillalu...

చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత : శ్రీశ్రీనేపథ్య గానం :  బాలు, సుశీల పల్లవి :వయసే ...
21/01/2022

చిత్రం : పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : శ్రీశ్రీ

నేపథ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

వయసే వెల్లువగా..ఆ... ఆ

వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా

వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ

మనసు నేడే కలత తీరి... ఊగిందిలే ఉయ్యాలగా

చరణం 1 :

చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ

చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ

వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు

వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు..

చెలిమి నిండి కలలు పండి... చేరాలిలే చేరువగా

వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా

చరణం 2 :

మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా

మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా

హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

గులాబీలే గుభాళించె... మురిపించెలే దీవెనలై

వయసే వెల్లువగా... ఆ.. ఆ

వలపే వెన్నెలగా... ఆ.. ఆ

పులకరించి పరిమళించి... ఊగేనులే ఉయ్యాలగా

Suresh Vijayasanthi Sai Chand Sumalatha's Pellidu Pillalu Telugu Movie SongMusic : M S ViswanadhanLyrics : Sri Sri AthreyaComedy Videos http://w...

కల కందామా... నువ్వూ నేనూ చిత్రం :  ఆడపులి (1984)సంగీతం : చక్రవర్తి  గీతరచయిత : ఆత్రేయ నేపథ్య గానం :   బాలు, జానకి   పల్ల...
21/01/2022

కల కందామా... నువ్వూ నేనూ
చిత్రం : ఆడపులి (1984)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : ఆత్రేయ

నేపథ్య గానం : బాలు, జానకి

పల్లవి :

కల కందామా... లలలలల

నువ్వూ నేనూ... లలలలల

కలిసి కాపురం చేస్తున్నట్టు

కలిసుందామా... లలలలల

నువ్వూ నేనూ... లలలలల

గంగా యమునలు ఒకటైనట్టు

రాగాలలో అనురాగాలలో

రాగాలలో అనురాగాలలో

నీదీ నాదీ నేడూ రేపూ ఓ బాటగా

కల కందామా... నువ్వూ నేనూ

కలిసి కాపురం చేస్తున్నట్టు

చరణం 1 :

పలకరించు నీ చూపులు... అహా

అవి పగలే పొడిచే చుక్కలు

కథలు పలుకు నీ స్నేహము... అహా

నా నుదుట నిలుపు సింధూరము

తేనెలు చిలుకు నీ పలుకే... ప్రేమకే సుగంధం

నీ చిరునవ్వులు నా సిరులే ... నీవు నా వసంతం

నీవే నాకై ఇలలో వెలిగే బృందావనం

కల కందామా... నువ్వూ నేనూ

కలిసి కాపురం చేస్తున్నట్టు

కలిసుందామా... నువ్వూ నేనూ

గంగా యమునలు ఒకటైనట్టు

చరణం 2 :

ప్రేమ అన్నదొక వేదము... అహా

అది అంతము లేని గీతము

జీవితమన్నది పెన్నిధి... ఓహో

అది దొరికె నాకు నీ సన్నిధి

పున్నమి చలువలు నీ ఒడిలో నన్ను ఒదిగిపోనీ

ఊహలకందని కౌగిలిలో ఈ ఊపిరాగిపోనీ

నీలో శ్రుతిగా ఎదలో స్మృతిగా నేనుండనీ

కల కందామా... నువ్వూ నేనూ

కలిసి కాపురం చేస్తున్నట్టు

కలిసుందామా... నువ్వూ నేనూ

గంగా యమునలు ఒకటైనట్టు

Watch And Enjoy Telugu Super Hit Songs Of AADA PULI Telugu Movie, KALAKANDHAMA Video Song On TELUGU MOVIE CAFEStarring Jayasudha, Mohan Babu, Prasad Babu, Su...

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికిచిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981)సంగీతం : జె. వి. రాఘవులు   గీతరచయిత :  వేటూరినేపథ్య గానం ...
21/01/2022

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

చిత్రం : శ్రీరస్తు-శుభమస్తు (1981)

సంగీతం : జె. వి. రాఘవులు

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా

శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

కవ్వింతల నుంచి కౌగిలింతల దాక

కౌగిలింతల నుంచి కల్యాణం దాకా

శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

చరణం 1 :

ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు

ప్రేమకు వచ్చే పెళ్ళీడు... పెద్దలు మెచ్చే మా జోడు

లగ్గం కుదిరేదెన్నటికో... పగ్గాలెందుకు ముద్దాడు

మనసు మనసు మనువాడె... మనకెందుకులే తెరచాటు

నీ అరముద్దులకే విజయోస్తు... నీ అనురాగానికి దిగ్విజయోస్తు

శ్రీరస్తు శుభమస్తు శ్రీమతికి

కాల్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి

Sri Rasthu Shubamasthu Movie Songs, Sri Rasthu Shubamasthu Video Songs, Chiranjeevi, Saritha Video Songs Song: Srirasthu ShubamasthuMovie: Sri Rasthu Shubama...

ఎటు చూసిన ఉన్నది నువ్వే కదాచెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదాఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలామారిపోయానులే ఏటిలో చేపలానువ్వే లేన...
20/01/2022

ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా
చెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదా
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
నువ్వే లేనిదే ఏమీ తోచదే
నిన్నే తలవనీ రోజే ఉండదే

సెలయేరు చేసే గలగల సవ్వడి వింటే .. నీ పిలుపే అనుకుంటా
చిరుగాలి తాకీ గిలిగింతలు పెడుతుంటే .. నువ్వొచ్చావనుకుంటా
మైమరపేదో కమ్మిందో ఏమో !

నా మనసుకి కదలిక నీవల్లనే
నా కనులకి కలలూ నీవల్లనే

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

వెలుగుల్ని పంచే మిణుగురు పురుగుల పైనా .. నీ పేరే రాశాలే
నువ్వొచ్చే దారుల్లో నవ్వుల పువ్వులు పోసీ .. నీ కోసం చూశానే
చెలియా ఎప్పుడు వస్తావో ఏమో !

నా చెరగని గురుతువి నువ్వే కదా
నా తరగని సంపద నువ్వే కదా

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Melodious SONGS. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share