Lokal App

Lokal App Lokal app is a news app that wants to bring local news to hundreds of millions of users in India in their regional languages.
(13)

It is a hyper local news platform where you can find district level information completely.

20/05/2024

Join your child in our 𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬𝐚 𝐑𝐚𝐦𝐚𝐧𝐮𝐣𝐚𝐧 𝐂𝐁𝐒𝐄 𝐒𝐜𝐡𝐨𝐨𝐥! Our admissions for 2024 are now open, offering a nurturing environment where every student's individual needs are met with care. With separate hostels for boys and girls and reliable transport facilities, we ensure a safe and convenient learning experience. Give your child the gift of quality education and holistic development

చంద్రబాబు పాలనలో వైసీపీ వాలంటీర్లు కొనసాగుతారు అంటారా ?
05/03/2024

చంద్రబాబు పాలనలో వైసీపీ వాలంటీర్లు కొనసాగుతారు అంటారా ?

04/03/2024

ఇటీవ‌ల వైసీపీకి, నరసరావు పేట ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఇవాళ గురజాలలో జరిగిన ‘రా కదలి రా’ సభలో ఆయ‌న‌కు చంద్రబాబు టీడీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లావుతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా లావు బ‌రిలో దిగ‌నున్నారు.

2024 ఆంధ్ర ఎన్నికల్లో జండా పాతేది ఎవరు..?
04/03/2024

2024 ఆంధ్ర ఎన్నికల్లో జండా పాతేది ఎవరు..?

02/03/2024

సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతున్న జగన్ కి యుద్ధం ఏంటో చూపిస్తాము..

02/03/2024

కర్నూల్ మాజీ కలెక్టర్ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇంతియాజ్ స్వస్థలం కర్నూల్ జిల్లాలోని కోడమూరు. అయితే ఇంతియాజ్ ను కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉన్న పరిచయాలతో గెలవగలరు అని వైసీపీ భావిస్తోంది.

రుషికొండపై అత్యంత విలాసంగా నిర్మంచిన  భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు.అవి అక్రమకట్టడాలుగా ఇప్పటికే నిర్ధారించారు.  సీఎ...
01/03/2024

రుషికొండపై అత్యంత విలాసంగా నిర్మంచిన భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు.

అవి అక్రమకట్టడాలుగా ఇప్పటికే నిర్ధారించారు.

సీఎం క్యాంప్ కార్యాలయానికి బాగుంటుందని రోజా సెలవిచ్చారు.

మీడియాను ఆనుమతించలేదు. ఐ అండ్ పీఆర్ ప్రతినిధులు రోజా వీడియో రికార్డు చేసి రిలీజ్ చేశారు. భవనం దృశ్యాలు రిలీజ్ చేయలేదు.

మొదట మంత్రి అమర్నాథ్ రాలేదు. వివాదం అయ్యే అవకాశం ఉండటంతో మధ్యలో పిలిపించినట్లుగా తెలుస్తోంది.

01/03/2024

‘అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ ఉండదు'
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై మీరేమంటారు?

29/02/2024

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..?

28/02/2024

బాలకృష్ణ ఈసారి హిందూపురంలో ఎమ్మెల్యే గా గెలుస్తాడా ..?

28/02/2024

టీడీపీ లోకి JR.ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఎవరు ..?

27/02/2024

కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారు నిన్న రాత్రి ప్ర‌మాదానికి గురైంది. పెద్దాపురంలో ర్యాలీ జరుగుతుండ‌గా ఎమ్మెల్యే కారుకు ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డురావడంతో అతడ్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో చిన‌రాజ‌ప్ప కారులోనే ఉండగా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది.
.

2024 ఏపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ ఏది..!
27/02/2024

2024 ఏపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ ఏది..!

జనసేన టీడీపీ ప్రకటించిన లిస్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని మీరు నమ్ముతున్నారా?                                     ...
27/02/2024

జనసేన టీడీపీ ప్రకటించిన లిస్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని మీరు నమ్ముతున్నారా?

తొలి జాబితాతోనే యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధం ఎన్నికల క్షేత్రంలో కాదు.. సామాజిక మాధ్యమాల్లో. వైరి శ్రేణుల మధ్య కాదు.. పొత్త...
26/02/2024

తొలి జాబితాతోనే యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధం ఎన్నికల క్షేత్రంలో కాదు.. సామాజిక మాధ్యమాల్లో. వైరి శ్రేణుల మధ్య కాదు.. పొత్తు కౌగిల్లో ఉన్న పారీటెల మధ్య. పొత్తుల మాటున చంద్రబాబుకు అలవాటైన వెన్నుపోటుతో జనసేన నాయకులు, కార్యకర్తలు విలవిల్లాడుతున్నారు. మా నాయకుడ్ని సీఎం కుర్చీపై చూస్తామని అనుకుంటే.. ముష్టి విదిలించినట్లు 24 సీట్లు ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేక.. ఈ కూలి బతుకులు మాకొద్దంటూ.. పవన్కు గ్లాసుకూ ఒక దండం పెట్టేస్తున్నారు. మీ తొత్తు పారీకి 24 సీట్లే ఎక్కువ మూసుకొని బానిసల్లా ఉండడమేనంటూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు మాటలతో రెచ్చగొడుతున్నారు. పావలా వంతు కూడా సీట్లు దక్కించుకోలేని జనసేన, పొత్తు పేరుతో బానిస పారీటెలాగానే జనసేనని చూస్తున్న టీడీపీ కార్యకర్తల మధ్య 'సోషల్' యుద్ధం జరుగుతోంది...

26/02/2024

కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ప్రమాదం తప్పింది. చిన‌రాజ‌ప్ప‌కు చంద్రబాబు టికెట్ ఖ‌రారు చేయ‌గా, పెద్దాపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ జరుగుతుండ‌గా MLA కారుకు ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డురావడంతో అతడ్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో చిన‌రాజ‌ప్ప కారులోనే ఉండగా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

26/02/2024

టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల తొలి జాబితాలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్‌కు నిరాశ ఎదురైంది. కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో ప‌ర్య‌టిస్తుండ‌గా త‌న‌కు టికెట్ రాలేద‌ని తెలిసి ఆయ‌న తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ.. అస్వస్థతకు గురై, ఒక్క‌సారిగా కుప్పకూలి పోయారు. దీంతో ఆయ‌న‌ను కార్యకర్తలు పాండ్రాక ఆసుపత్రికి తరలించారు.

2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్ల...
24/02/2024

2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు సీఈఓ తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య , ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య , ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా వారి చాంబరులో మంగళవారం కలిసింది.

ఈ సందర్బంగా సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 79.77% పోలింగ్ నమోదు అవ్వగా, జాతీయ స్థాయిలో 69% పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు అయ్యే లక్ష్యంతో స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు పర్చడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి, ఓటరునికి ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన కలిగించి, రానున్న ఎన్నికల్లో వారిని పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వీప్ కార్యక్రమాలను ప్రణాళికా బద్దంగా అమలు చేయడం జరుగుచున్నదన్నారు.

షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు.. రాజకీయం తెలియదు అంటూ సెటైర్!చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా...
24/02/2024

షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు.. రాజకీయం తెలియదు అంటూ సెటైర్!
చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారన్నారు. వాళ్లు ఎంత మంచోళ్ళో…. వాళ్ల కుటుంబానికి పవన్ చెప్పాల్సి ఉందని విమర్శించారు.

23/02/2024

కుప్పం కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని అన్నారు. ‘చంద్రబాబుకు ఓటేస్తారా? నాకు ఓటేస్తారా?’ అని భువనేశ్వరి సరదాగా కార్యకర్తలను అడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఏపీ రెవిన్యూ, రిజిస్ట్రేషన్ , స్టాంప్ ల శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు (Dharmana Prasadarao)వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్...
23/02/2024

ఏపీ రెవిన్యూ, రిజిస్ట్రేషన్ , స్టాంప్ ల శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు (Dharmana Prasadarao)వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లు అంటే బయటి వ్యక్తులు కాదు బాధ్యతయుతమైన వ్యక్తులు అని మాట్లాడిన ధర్మన ప్రసాదరావు రాబోయే ఎన్నికల్లో అవసరమైన పోలింగ్ బూత్ లో కూర్చొని ప్రజలతో వైసీపీకి ఓట్లు వేయించే బాధ్యత కూడా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల పేరుతో విష ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పేరుత...
23/02/2024

ఎన్నికలు సమీపిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల పేరుతో విష ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నట్లుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు పరస్పరం వీడియోలను రూపొందించి రాజకీయ పార్టీల పరువు తీయాలని చేస్తున్నట్లుగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

22/02/2024

శ్రీకాకుళంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న బంగారం షాపులో నిన్న అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చొరబడి భారీగా బంగారాన్ని దొంగిలించారు. మంగళవారం ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ చెక్ చేశారు. ఇద్దరు వ్యక్తులు షాపులోకి చొరబడి దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.

‘డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. 2029 నాటికి డబ్బులతో ఓట్లు కొనే పరిస్థితి ఉండకూడదు.’’ పవన్ కల్యా...
22/02/2024

‘డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. 2029 నాటికి డబ్బులతో ఓట్లు కొనే పరిస్థితి ఉండకూడదు.’’ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు?

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవురాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని TDP అధినేత చంద్రబాబునాయుడి సతీమ...
22/02/2024

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవు

రాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని TDP అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ధ్వజమెత్తారు.

వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూరిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జ...
22/02/2024

వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ
రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని చెప్పారు.

ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పార...
21/02/2024

ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు విమర్శించారు.


21/02/2024

విశాఖ వేదికగా సోమవారం 'మిలాన్-2024' విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు. తర్వాత హెలికాప్టర్లతో ఎయిరో ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు పలు ప్రదర్శనలు చేయనున్నాయి. మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రెండేళ్లకోసారి ఇండియన్ నేవీ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తోంది.

20/02/2024

చంద్ర‌బాబుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న త‌న అభిమానాన్ని చాటుకున్నారు. త‌న ర‌క్తాన్ని ఫ్లెక్సీలో చంద్రబాబు కాళ్ల వద్ద పూశారు. త‌ర్వాత తన ఇంటి గోడ‌పై 'CBN జిందాబాద్.. నా ప్రాణం మీరే' అని రాశారు. "చంద్ర‌బాబు అంటే నాకు స్వామి భ‌క్తి. స్వామి భ‌క్తిని చాటేందుకే ఇలా చేస్తున్నా. చంద్ర‌బాబు నాకు దేవుడు. టికెట్‌పై చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకున్నా నేను విమ‌ర్శించను." అని మీడియాతో బుద్దా వెంకన్న తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న శుక్రవారం ...
20/02/2024

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి కాగా ఆ తర్వాత 9న రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి.

Address


Alerts

Be the first to know and let us send you an email when Lokal App posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokal App:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share