13/03/2018
మహరాష్ట్ర లో రైతుల సమస్యలను పరిష్కారించాలని దాదాపు 30 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబై వరకు దాదాపు 180 కి.మీ తమ పాదయాత్ర చేస్తూ ఈ రోజు ముంబై నగరం చేరుకున్న సందర్భంగా..... తీసీన ఫోటోలు ఇవీ. అన్న దాత అంటూ , రైతే-రాజూ అంటూ భాకాలుదే పాలకులారా...సిగ్గు పడండి.
చాలా మంది రైతులకు కనీసం చెప్పులు కూడా లేక పోవడంతో తమ " లాంగ్ మార్చ్ " యాత్ర లో కాళ్ల నుంచి నెత్తురు కారుతున్న , తమ పాదల పై బొబ్బలు వస్తున్న , తము నిత్యం ఏదుర్కోనే నఖీలీ విత్తనాలు , పురుగుల మందులు , గిట్టుబాటు ధర , అప్పులు , ఆత్మహత్యలు అనేవి తమ జీవితాలను హేళన చేస్తుంటే , విసిగి వేసారి తమ భాధలను ' పంటి బిగువు' పై భరిస్తూ తమ సమస్యలను పరిష్కారించాలని , మార్చి 05 నుంచి మొదలు పెట్టిన రైతుల ' లాంగ్ మార్చ్ ' వాగులు , వంకలు , ఘట్ రోడ్డులు దాటుతూ ...అరికాళ్ళ నుంచి నెత్తురు ఓడుతున్న , తమ పాదల కింద బోబ్బలు వస్తున్న ఆ నొప్పిని అదిమిపట్టుకోని.....అర్థకాలితోనే తమ 'లాంగ్ మార్చ్ .'..ఈరోజు ముంబై కి చేరుకుంది.
ఓక సారి ఆ..."పాదయాత్రలో పాల్గొన్న అన్నదాతలకు - సెల్యూట్ చేద్దాం.".
ఇదే ఉద్యమం మన తెలంగాణా లో....ఏవరైనా పిలుపినిస్తే...
పర్మీషన్ లేదనే పేరుతో బైండోవర్ లు , అక్రమ అరెస్టులు , బెదిరింపులు , వెలాది మంది పోలీసులతో చెక్ పోస్టులు , ముళ్ల కంచెలతో...నిండి ఉండేది కాదా..? కనీసం ప్రజాస్వామ్యం పేరుతో జరిగే ఈ పాలనలో ప్రశ్నించడం ..కూడా నేరమే అన్నట్లు , తమ గోస ని కూడ వినే ఓపిక లేని..పాలకులు ఉన్న ఈ సమాజంలో .... ఏది ఏమైనా మహరాష్ట్ర లోని ఫఢ్నవీస్ సర్కార్ ' లాంగ్ మార్చ్ " పిలుపు మొదలు నుండి నేటి వరకు ఆంక్షల పేరిట అక్రమ అరెస్టులు , బైండోవర్లు , బెదిరింపులు , ముళ్ళకంచెలు , చెక్ పోస్టులతో ఉద్యమన్ని అణిచివేసే కుట్రలు చేయక పోవడం కొంత అభిమానించదగినదే......
ముంబై వాసులు కూడా రైతుల పక్షనా నిలబడి ..స్వచ్ఛందంగా ఆ..రైతులకు నీళ్లు , టీఫీన్ లు , బిస్కెట్ లు , చెప్పులు ఏర్పటు చేయడం...మనలో ఇంకా ఏంతో కోంత మనవత్వం దాగి ఉందనే ఆత్మ సంతృప్తిని కలిగించింది.
ఈ సందర్భంగా లాంగ్ మార్చ్ లో పాల్గొన్న రైతులకు.... సెల్యూట్ '
#కీసన్_లాంగ్_మార్చ్