మధిర రచ్చబండ Madhira RachaBanda

  • Home
  • మధిర రచ్చబండ Madhira RachaBanda

మధిర రచ్చబండ Madhira RachaBanda మధిరలో మేమె అసలైన ప్రతిపక్షం. మా పక్షం: బీద, బడుగు, బలహీన వర్గాల పక్షం.

05/01/2024

*ప్రత్యేక రైళ్లకు మధిరలో హాల్టింగ్ ఇవ్వని రైల్వే శాఖ*

*34 రైళ్ళలో ఒక్క రైలుకు మధిర లో హాల్టింగ్ ఇవ్వని అధికారులు*

*మధిరపై చిన్న చూపు చూస్తున్న రైల్వే శాఖ అధికారులు*

👉మధిర కంటే తక్కువ ఆదాయం వస్తున్న పలు రైల్వే స్టేషన్లో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ ఇచ్చిన అధికారులు మధిరలో మాత్రం ఒక్క రైలుకి కూడా హాల్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో శాతవాహన, ఇంటర్ సిటీ గోల్కొండ, కృష్ణ, రైళ్లకు మాత్రమే మధిర రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఉంచి మిగతా వాటిని తొలగించే ప్రమాదం ఉంది.

*💥 బ్రేకింగ్ న్యూస్**💥 ఆత్కూర్ లో దళిత యువకుడికి చెందిన ద్వి చక్ర వాహనాన్ని దగ్ధం చేసిన దుండగులు**💥 సంఘటన స్థలానికి చేరు...
05/01/2024

*💥 బ్రేకింగ్ న్యూస్*
*💥 ఆత్కూర్ లో దళిత యువకుడికి చెందిన ద్వి చక్ర వాహనాన్ని దగ్ధం చేసిన దుండగులు*
*💥 సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు*
👉 మండలంలోని ఆత్కూరు ఎస్సీ కాలనీకి చెందిన బల్లెపోగు కిషోర్ అనే యువకుడు చెందిన ద్విచక్ర వాహనాన్ని గురువారం అర్ధరాత్రి దుండగులు దగ్ధం చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఉదయం టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈరోజు ఉదయం ప్రగతిభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కలిసిన ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ...మండలంలోని పలు అభి...
04/01/2024

ఈరోజు ఉదయం ప్రగతిభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కలిసిన ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ...
మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారికి మండల కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు* లు వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా ఆర్ అండ్ బి రోడ్లు ఎర్రుపాలెం నుండి వయా జమలాపురం రాజుపాలెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం,పెద్ద గోపారం నుండి గుంటుపల్లి గోపారం వరకు ఉన్న రోడ్డులో కల్వర్టులు,రోడ్డుకివైపులా డ్రైనేజ్ నిర్మించాలని కోరుతూ ఇంకా మండలం లో పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్ధి చేయాలని కోరుతూ రిప్రజెంటేషన్ ఇచ్చినారు.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం గారు.వీరి వెంట నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి,అనుమోలు వెంకటకృష్ణారావు,వేజెండ్ల సాయి కుమార్ ,లక్కిరెడ్డి అయ్యప్ప రెడ్డి తదితరులు ఉన్నారు..

ఆరోజు కేటీఆర్  పైన ఫోటో చూపించి దీని expansion జాయింట్ అని రాహుల్ గాంధీ ని ఎగతాళి చేశారు. @కాళేశ్వరం
04/01/2024

ఆరోజు కేటీఆర్ పైన ఫోటో చూపించి దీని expansion జాయింట్ అని రాహుల్ గాంధీ ని ఎగతాళి చేశారు. @కాళేశ్వరం

మంత్రి ముందు కాలుమీద కాలు వేసుకుంటుందా అని ట్రోల్ చేస్తున్నారు.  వేసుకుంటే,  తప్పేముంది? గతంలో పాలకుల ముందు మోకాళ్ళ మీద ...
03/01/2024

మంత్రి ముందు కాలుమీద కాలు వేసుకుంటుందా అని ట్రోల్ చేస్తున్నారు.
వేసుకుంటే, తప్పేముంది?

గతంలో పాలకుల ముందు మోకాళ్ళ మీద కూచుంటే తప్పు అనాలి. ఇక్కడ అలా మోకరిల్లనందుకు అభినందించాల్సిందే. ఇదేమి రాచరికం కాదు. రాజ్యాంగ పాలన అనే వాళ్ళూ స్మితను ట్రోల్ చేస్తున్నారు.

ఆమె కాలు మీద కాలు వేసుకుంది. అంతే తప్పా ఎదురుగా ఉన్న మనిషికి విలువనివ్వని posture లో కూర్చోలేదు. ఎదురుగా ఉన్న మనిషి చెబుతున్నది శ్రద్ధగా అలకిస్తున్నట్లుగానే ఉంది. పైగా వినయంగా చేతులు కట్టుకునుంది. That's a dignified posture.

రాజ్యాంగం రాజ్యాంగం అంటూనే రాచరికపు అలవాట్లను, బానిసత్వాన్ని కోరుకోకండి. సీతక్కే తనను మేడమ్ అని పిలవద్దని చెప్పిన విషయం మరవద్దు.

అంబేద్కర్ విగ్రహానికి దండేసే ముందు చెప్పులు విడవడమని బలవంతపెట్టడం, ఒకరి ఎదురుగా కాలుమీద కాలు వేసుకోవద్దు అనడమూ, పేరున్నది పిలవడానికే అనేది మరచి మీరూ, గారూ, సారూ అనే అదనపు గౌరవాలు కోరుకోవడం ప్రజాస్వామ్యం కాదని గుర్తెరగండి.

*విషాద వార్త* *కర్నాటి శ్రీధర్ మృతి* *మధిరకు సురపరిచితులు ఇల్లూరు గ్రామానికి చెందిన దామా రామలింగయ్య గారి అల్లుడు ములుగు ...
03/01/2024

*విషాద వార్త*
*కర్నాటి శ్రీధర్ మృతి*
*మధిరకు సురపరిచితులు ఇల్లూరు గ్రామానికి చెందిన దామా రామలింగయ్య గారి అల్లుడు ములుగు జిల్లా మంగపేట ఎంపీడీవో గా పనిచేస్తున్న కర్నాటి శ్రీధర్ మృతి*
*మధిర ఎంపీడీవో ఆఫీసులో సూపరిండెంట్ గా పనిచేసే పదోన్నతితో బదిలీపై మంగపేట ఎంపీడీవో గా వెళ్లారు*.
*కర్నాటి శ్రీధర్ మృతితో మధిరలో విషాదఛాయలు అలుముకున్నాయి*.

*ఎయిడ్స్ బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఆర్కే ఫౌండేషన్* గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చె...
03/01/2024

*ఎయిడ్స్ బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఆర్కే ఫౌండేషన్*
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన నదియా 60 మృతదేహానికి ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు రక్తసంబంధీకులు అందరూ విడిచిపెట్టి అనాధగా జీవిస్తున్న నదియా జీవితం అత్యంత దయనీయం. ఎయిడ్స్ సోకటంతో దగ్గరకు తీసే నాధుడు లేక ఆపై మానసిక వికలాంగురాలు కావడంతో అత్యంత దుర్భర పరిస్థితిలో జీవిస్తున్న ఆ వృద్ధురాలుకు ఆర్కే ఫౌండేషన్ సభ్యులు దోర్నాల రామకృష్ణ జ్యోతి కన్న తల్లి కన్న ఎక్కువగా చూసి చివరకు మరణించిన తరువాత కూడా తమ బాధ్యతను నిర్వహించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎంతోమంది వృద్ధులకు వికలాంగులకు మతిస్థిమితం కోల్పోయిన వారికి ఆర్కే ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు మరెవ్వరు చేయలేరు అంటూ మధిర ప్రజలు వారి సేవలను కొనియాడారు.

✳️🔥 ఈరోజు ఖమ్మం లోని SR కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఖమ్మం మీడియా మిత్రులతో  చిట్ చాట్ కార్యక్రమానికి తెలంగాణ రాష్...
02/01/2024

✳️🔥 ఈరోజు ఖమ్మం లోని SR కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఖమ్మం మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు గారు...

01/01/2024

ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డులో టి స్టాల్ వద్ద టీ తాగిన మంత్రి తుమ్మల
గెలిచిన తర్వాత ఖమ్మంలో తిరుగుతున్న మంత్రి

😂తెలంగాణలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుప్రతి నిరుద్యోగికి ఉద్యోగంభూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడ...
31/12/2023

😂
తెలంగాణలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు
ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం
భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలు, పైగా అదనంగా దళితులకు పది లక్షల దళితబంధు,
దళిత ముఖ్యమంత్రి
బీసీ బంధు
రైతు రాజ్యం
రైతు కూలీలకు భరోసా
అసంఘటిత రంగానికి వెన్నుదన్ను
ప్రపంచ నివ్వెరపోయిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు
పాతబస్తీ ఇస్తాంబుల్
వరంగల్ డల్లాస్
కరీంనగర్ లండన్
మావోయిస్టుల పాలన
పౌర, ప్రజాస్వామిక హక్కుల అమలు
ధర్నా చేసుకునే అవసరమే రాని ధర్నా చౌక్

ఇన్ని చేస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరా... దేవన్ పల్లి కవిత. ఆ కన్ఫ్యూజన్ లోనే ఓడించారు.

తెలంగాణ ప్రజలంతా త్వరలోనే పూర్తి క్లారిటి వచ్చి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్నే గెలిపిస్తారు. బాధవడకు.
- Arunank Latha

*బ్రేకింగ్ న్యూస్...*మధిర మండలం సిరిపురం లో అర్ధరాత్రి దొంగల హల్చల్... పెట్రోల్ బంక్ పక్కన ఉన్న బిస్మిల్లా ఐరన్ షాప్ లో ...
31/12/2023

*బ్రేకింగ్ న్యూస్...*
మధిర మండలం సిరిపురం లో అర్ధరాత్రి దొంగల హల్చల్... పెట్రోల్ బంక్ పక్కన ఉన్న బిస్మిల్లా ఐరన్ షాప్ లో తాళాల పగలగొట్టి డబ్బులు, సామాన్లు దొంగిలించిన దొంగలు.

30/12/2023

నన్ను మేడం అని పిలవకండి ! సీతక్క అని పిలవండి !
సీతక్క కూడా డిప్యూటీ సీఎం అవుతే బాగుండేది! Seethakka Request to people | Kaloji TV

టిఆర్ఎస్ వాళ్లు రాపిచ్చిన న్యూస్ ఐటెం లాగా ఉందే....
30/12/2023

టిఆర్ఎస్ వాళ్లు రాపిచ్చిన న్యూస్ ఐటెం లాగా ఉందే....

హెలికాప్టర్ ద్వారా ఎర్రుపాలెం  మండలం చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ జిల్లా నాయకులు కోటా రాం...
30/12/2023

హెలికాప్టర్ ద్వారా ఎర్రుపాలెం మండలం చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ జిల్లా నాయకులు కోటా రాంబాబు...

*▪️తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాల కార్యక్రమాన్ని  సద్వినియోగం చేసుకోండి: మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత...
30/12/2023

*▪️తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత*
*▪️మధిర మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డ్ రామాలయం సమీపంలో వార్డ్ కౌన్సిలర్ కోన ధని కుమార్ గారి అధ్యక్షత వహిస్తూ ప్రజాపాలన కార్యక్రమమును ప్రారంభించిన మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత గారు*
👉ఈ సందర్బంగా మాట్లాడుతూ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత ఐదు గ్యారెంటీ పథకాలకి సంబంధించి అర్హులైన పేదల నుండి ఒకే దరఖాస్తు ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది, కావున 15వ వార్డు ప్రజలు ఈ కార్యక్రమమును సద్వినియోగం చేసుకోగలరని తెలియజేస్తున్నాము.

👉ఈ కార్యక్రమంలో 17వార్డ్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరావు గారు ,మునిసిపల్ కమీషనర్ రమాదేవి గారు, ఎర్రగుంట రమేష్ గారు , మునిసిపల్ RI రాము గారు,వార్డ్ ఆఫీసర్స్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*💫హెలిఫ్యాడ్ దిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న వైరా ఏసిపి రహమాన్, మధిర సీఐ వసంత్ కుమార్*👉నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి వి...
30/12/2023

*💫హెలిఫ్యాడ్ దిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న వైరా ఏసిపి రహమాన్, మధిర సీఐ వసంత్ కుమార్*
👉నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఎర్రుపాలెం మండలంలో పర్యటించనున్న సందర్భంలో హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా ఎర్రుపాలెం మండలంను చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పెద్ద గోపవరం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ దిగే ప్రదేశాన్ని మధిర సీఐ వసంత్ కుమార్ తో కలిసి వైరా ఏసిపి రహమాన్ పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులకు పలు సూచనలు చేశారు.హెలిఫ్యాడ్ పనులను మధిర టౌన్ ఎస్ఐ రాజేష్, ఎర్రుపాలెం ఎస్సై సురేష్ లు పరవేక్షిస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు.అనంతరం మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన అనంతరం
హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రయాణం.

30/12/2023

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గా మల్లాది వాసు?
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్న మల్లాదివాసు

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పగ్గాలు మల్లాది వాసుకు ఇచ్చే దిశగా అధినాయకత్వం ఆలోచన?

*12వ వార్డులోని ప్రభుత్వ స్థలమును ఆక్రమిస్తున్న BRS నాయకులు గద్దలరూతయ్య*... 12వ వార్డు నందు (లేటు) గద్దల బాలయ్య s/o సుధా...
29/12/2023

*12వ వార్డులోని ప్రభుత్వ స్థలమును ఆక్రమిస్తున్న BRS నాయకులు గద్దలరూతయ్య*...
12వ వార్డు నందు (లేటు) గద్దల బాలయ్య s/o సుధాకర్ రావు ఇంటి నెంబర్ 4-44 గల స్థలము ఇట్టి స్థలమునకు ఇంతవరకు ఎవరు వారసులు లేనందున నాటి మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ ప్రభుత్వ స్థలముగా గుర్తించి ప్రభుత్వ స్థలము అని బోర్డు ఏర్పాటు చేశారు అట్టి స్థలంలో ఈరోజు BRS పార్టీలో కొంతమంది నాయకులు అండదండలతో గద్దలరూతయ్య ఆ స్థలాన్ని జెసిబితో బాగు చేయించి ఆక్రమిస్తున్నాడు దీనిపై..? అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు🙏....

బట్టిన్న మీ వెంటే మేము అంటున్నా కమల్ అన్న సైన్యం అధికార కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి పావులు కదుపుతున్న STO ఉద్య...
29/12/2023

బట్టిన్న మీ వెంటే మేము అంటున్నా కమల్ అన్న సైన్యం అధికార కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి పావులు కదుపుతున్న STO ఉద్యోగి గద్దలరజనీకాంత్ వారి తమ్ముడు మున్సిపల్ ఉద్యోగి &11వార్డ్ కౌన్సిలర్ వారి కుటుంబ రాజకీయ భవిష్యత్తు కొరకు అధికారంలో లేని BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్న STO ఉద్యోగి గద్దల రజనీకాంత్ అతను చేసే ఉద్యోగానికి ఇటువంటి ఆటంకం కలకూడదు కలక్కుండా ఉండాలి అంటే అధికార పార్టీలోనే ఉంటే అవి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన దరఖాస్తులో భాగంగా  *గృహ జ్యోతి  స్కీం* లో *2...
29/12/2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన దరఖాస్తులో భాగంగా *గృహ జ్యోతి స్కీం* లో *200 యూనిట్ల* ఉచిత కరెంట్ కోసం అప్లై చేసేటప్పుడు USC NUMBER ను పైన తెలిపిన విధంగా అప్లికేషన్లు ఫామ్ లో నమోదు చేయగలరని విద్యుత్ శాఖ వారు తెలియజేస్తున్నారు....

29/12/2023

*6 గ్యారంటీలకు కుల ఆధాయ దృవీకరణ పత్రాలు అవసరం లేదు : జిల్లా కలెక్టర్*
*ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్ల అవసరం లేదు. ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చడం సవరణలు అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ మాత్రమే సమర్పించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు*

డియర్ కల్వకుంట్ల కవిత సారీ దేవన్‌పల్లి కవితఅంటే, హిందూ ధర్మంలో ఇంటి పేరు మారడం ఉన్నది. మా అమ్మా మార్చుకుంది. ఇక విషయానిక...
28/12/2023

డియర్ కల్వకుంట్ల కవిత సారీ దేవన్‌పల్లి కవిత

అంటే, హిందూ ధర్మంలో ఇంటి పేరు మారడం ఉన్నది. మా అమ్మా మార్చుకుంది.

ఇక విషయానికి వస్తే, యకార్దింగ్ టూ సనాతన ధర్మం నువ్ మూసుకుని ఇంట్లో వంట చేసుకుంటూ, మొగడికీ, అత్తా మామలకు సేవ చేస్తూ ఉండాలి. రాజకీయం చేయడం, మగ తోడూ లేకుండా ఇల్లు దాటి అడుగు బయటపెట్టడం చేయరాదు.

ఇవాళ మహిళా, శూద్రులకు మానవ హక్కులను నిరాకరించిన మనుస్మృతి దహన దినం. ఎందుకు తగలబెడుతున్నానో బాబాసాహెబ్ చెప్పి మరీ కాల్చేశాడు. 'హిందూమతం చిక్కుముడులు" అనే తన గ్రంథంలో ఈ విషయాన్ని రాశాడు.

సనాతన ధర్మం కనీస మానవ హక్కులను మహిళలకు, శూద్రులకు నిరాకరించింది. భగవద్ గీత మహిళలకు శూద్రుల స్టేటస్ ఇచ్చింది. ఏ రకంగా చూసినా నువ్ శుద్రురాలివే. ఇప్పుడు నువ్ తిడుతున్న రాహుల్ నీకు హక్కులను ఇచ్చిన రాజ్యాంగనీతి (Constitution morality) కావాలి అంటున్నాడు. సనాతన ధర్మాన్ని అంటే వివక్షను ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తున్నాడు. (ఇటీవల అతను మాట్లాడుతున్న మాటల ప్రకారం)

నిజానికి కాంగ్రెస్ డీఎన్ఏ సనాతన హిందూ డీఎన్ఏ. నెహ్రూ కాశ్మీరీ పండిట్. కాశ్మీరి పండిట్లు అంటే సనాతన ధర్మం తన అధికార భాషగా చెప్పుకునే సంస్కృతాన్ని మాతృభాష గా క్లెయిమ్ చేసుకునే తెగ.

ఇక నువ్ జోకుతున్న హిందూ ధర్మ పీనల్ కోడ్ (మనుస్మృతి) ఏం చెబుతున్నదంటే "Gautama (18-21).—‘A girl should be given in marriage before puberty.’
“Even in her own home, a female – whether she is a child, a young woman or an old lady – should never carry out any task independently. As a child, she must remain under her father’s control, as a young woman, under her husband’s; and when her husband is dead, under her sons.” - Manusmriti (chapter 5, shlokas 148, 149)

నీవు స్వతంత్రంగా కొన్ని వ్యాపారాలు ఏవో చేస్తున్నట్లున్నావు. ఆమధ్య ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పినట్లూ గుర్తు. కాని హిందూ ధర్మం స్త్రీ స్వతంత్ర్యంగా ఉండడానికి అర్హురాలు కాదు అంటోంది. యవ్వన ప్రాయంలో (బహుశా, నీవిప్పుడు ప్రౌఢవి అనుకుంటా) భర్త సంరక్షణలో ఉండాలి. ఆయన పోయాక కొడుకుల సంరక్షణ ఉండాలి.

ఉదయనిది స్టాలిన్ అన్నట్లు "సనాతన ధర్మం ఒక వ్యాధి లాంటిది. వ్యాధిని వ్యతిరేకించం. నిర్మూలిస్తాం. డెంగ్యూనో, మలేరియానో వస్తే వ్యతిరేకించం కదా." అదీ సంగతి.

అన్నట్టు, హిందూ - హిజాబ్ అంటూ విద్వేషపు రాజకీయాలు చేసి పచ్చని తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అధికారం పొందే విధానం కాదు. బళ్ళో పెరేక్కియ్యని బండి సంజయ్ లాగా, ఉన్మాదపు రాజాసింగ్ లాగా మాట్లాడితే ఎట్లా? పైగా డీఎంకే ఇవాళ మాట్లాడుతున్నది కొత్త విషయాలు ఏమీ కాదు. దాని వ్యవస్థాపకుడు కరుణానిధి ఇంతకు పదుల వందల రెట్లు మాట్లాడాడు. రాముడి దిష్టిబొమ్మలను దహనం చేసిన పెరియార్ అనుచరుడు కరుణానిధి. ఇవన్నీ చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి. అవి తెలిసినా మీ నాన్న స్టాలిన్ తో పొత్తుకు ప్రయత్నం చేశాడు. మద్రాస్ పోయి మరీ కలిసి వచ్చాడు.

Grow-up women. you can do better politics and make better arguments. Don't fall into cheap religious bigotry.

Kalvakuntla Kavitha

PS: మా అక్కను ఏకవచన సంబోధన చేస్తావా? అని ఉన్నొక్క జత చించకుంటూ రావొద్దు. తెలంగాణ భాషలోనే ఏకవచనం ఉన్నది. అది గౌరవప్రదమైనదే అనే చర్చ తెలంగాణ ఉద్యమకాలంలో చేశాం. కొత్త ఉద్యమకారులకు తెల్వకపోతే దేశపతిని అడగండి. చెబుతాడు. టీవిల్లో ఆయనే చించుకుంటూ మరీ చెప్పేవాడు.

28/12/2023

*రాత్రి వేళల్లో తెలంగాణ నుండి ఆంధ్రకు ఇసుక అక్రమ రవాణా...*

*మధిర -రాయపట్నం పొలిమేర వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో రాత్రిపూట దొంగతనంగా ఏటి నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు*

*ఆంధ్ర సరిహద్దు గ్రామాలైన మాచినేనిపాలెం, జొన్నలగడ్డ రామిరెడ్డిపల్లి, కొనతమాతకూరు లకు అక్రమంగా రాయపట్నం , మధిర సాయిబాబా గుడి దగ్గరలో గల రేవు నుండి రాత్రులు ట్రాక్టర్ ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు..*

*ఇన్ని రోజులు అధికారులు ఎలక్షన్ నడవడిలో ఉన్నారు సరే...మరి ప్రస్తుతానికి ఎటువంటి హడావుడు లేనప్పటికీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..*

*ఈ అక్రమ రవాణా ఇసుక దారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మధిర, రాయపట్నం రేవుల నుండి ట్రాక్టర్లు ద్వారా ఆంధ్రకు అక్రమ రవాణా జరుగుతున్నాయి వాటిని వెంటనే అరికట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.*.

*క్రిస్మస్ పండగ  సందర్భంగా ఆదరణ సేవ ఫౌండేషన్ లో   అన్నదానం*................ మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ...
25/12/2023

*క్రిస్మస్ పండగ సందర్భంగా ఆదరణ సేవ ఫౌండేషన్ లో అన్నదానం*................
మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవ ఫౌండేషన్ లో *సకినివీడు గ్రామానికి చెందిన సింగంశెట్టి వెంకట రామరావు శ్రీమతి వాణి కూతురు హారిక గార్ల సహకారంతో క్రిస్టమస్ సందర్భంగా* ఈరోజు వృద్ధుల కి మతిస్థిమితం లేని వారికి కేక్ కటింగ్ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి భోజనం అందజేసిన వెంకట రామరావు గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమం లో వెంకట రామరావు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

మధిర రెస్క్యూ టీం.
ఆదరణ సేవ ఫౌండేషన్
9963115303 నిస్సి

*మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు**మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్...
24/12/2023

*మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు*

*మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు*

*గౌరవ సలహాదారు ఆదూరి అబ్రహం గారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు సెలబ్రేట్ చేయడం మన స్విమ్మింగ్ అసోసియేషన్ కి సాధ్యం సభ్యులందరూ కలిసి క్రిస్మస్ వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉందని అందరికీ క్రిస్మ స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన విరాళంగా అసోసియేషన్ కు 1000 రూపాయలు ప్రకటించారు*

*మిడ్ స్ట్రీట్ బేకరీ అబ్దుల్ హనీఫ్ గారు ఈ కార్యక్రమానికి కేకు స్పాన్సర్ చేశారు*

*అనంతరం సభ్యులందరికీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో పల్లపోతు ప్రసాద్ రావు, జంగా శ్రీనివాస్ రెడ్డి, చల్లా సత్యనారాయణ, కోలగాని ప్రసాద్, భూక్య హనుమ, చుక్కా రాంబాబు, కంచిపోగు ఆదాం, బజాజ్ సాంబిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, లింగంపల్లి అప్పారావు, వేముల నవీన్ కుమార్, ఊటుకూరి భాస్కరరావు, బనిగండ్లపాటి మూర్తి, మాచర్ల శ్రీనివాసరావు*

*షేక్ సుకూర్, గండూరి రాంబాబు, ఇన్ స్టైల్ రాము, గద్దల కోటయ్య, తూములూరి రాజా, షేక్ జానీ, మార్త శ్రీనివాసరావు, పున్నయ్య, వట్టే సైదులు, దాచేపల్లి రాము, అమరనేనీ నవీన్, కోలా ప్రసాద్, కొత్తూరు నరసింహారావు, కొత్తూరు రమేష్, ఎల్వీ రెడ్డి, మస్తాన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, సముద్రాల ఉపేంద్ర, రెహమాన్, వరుణ్, శర్వాన్, సాబిర, గౌతమి, అనిత, బన్నీ తదితరులు పాల్గొన్నారు*

ఇది కదా సమాజ హితం కోరుకునే నాయకుని లక్షణం
24/12/2023

ఇది కదా సమాజ హితం కోరుకునే నాయకుని లక్షణం

పాలేరు లో పొంగులేటి.....
24/12/2023

పాలేరు లో పొంగులేటి.....

ఈ రోజు అనగా తేది 23.12.2023 న మధ్యాహ్నం నుండి మధిర రైల్వే స్టేషన్ లో పై ఫోటో 4-5 సం// వ్వయస్సు గల అమ్మాయి తిరుగుతుండగా మ...
23/12/2023

ఈ రోజు అనగా తేది 23.12.2023 న మధ్యాహ్నం నుండి మధిర రైల్వే స్టేషన్ లో పై ఫోటో 4-5 సం// వ్వయస్సు గల అమ్మాయి తిరుగుతుండగా మధిర ప్రభుత్వ రైల్వే పోలీస్ వారు సంరక్షించి ఖమ్మం child care వారికి అప్పగిస్తున్నారు. ఆ అమ్మాయి కి మాటలు రావడం లేదు, ఏ భాష ను అర్దం చేసుకోవడం లేదు. పై ఫోటో లో అమ్మాయి ని గుర్తు పట్టిన యడల క్రింది ఫోన్ నంబర్స్ కి సంప్రదించగలరు.
GRP SI, Khammam Sri P. Bhaskara Rao 8712658589.

23/12/2023

మార్కెట్ కమిటీ మైనార్టీ రేస్ లో షేక్ జహంగీర్?

*పసుర గ్రూప్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల కు బట్టల పంపిణీ కార్యక్రమం**పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి రవి సహక...
23/12/2023

*పసుర గ్రూప్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల కు బట్టల పంపిణీ కార్యక్రమం*
*పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి రవి సహకారంతో మధిర మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు క్రిస్టమస్ పండుగ సందర్భంగా పబ్బతి రవి గారి మిత్రుడు మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రంగా హనుమంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మునిసిపల్ చైర్మన్ లత జయకర్ మొండితోక, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్స్ చేతుల మీదుగా బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగా హనుమంతరావు గారు మాట్లాడుతూ..... మా మిత్రుడు పబ్బతి రవి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మునిసిపాలిటీ లో పనిచేస్తున్న సుమారు 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ లత జయకర్ మొండితోక, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్స్ సిబ్బంది పాల్గొన్నారు.*

23/12/2023

ప్రమాదకరంగా మారిన బోనకల్ ఆర్.అండ్.బి బ్రిడ్జి.పట్టీ పట్టనట్లుగా వదిలేస్తున్న అధికారులు.
ప్రమాదాలు జరుగుతున్న చూచి చూడనట్లుగా ఉంటున్న అధికారులు
ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలి
బోనకల్ మండలలోని ఫ్లైఓవర్ ప్రమాదకరంగా మారింది. అధికారులు సైతం పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా తిరుగుతున్నారు.
నిత్యం రవాణా జరుగుతూ ఉన్న ఈ బ్రిడ్జి మీద ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకోవచ్చని మండలంలోని ప్రజలందరూ కోరుతున్నారు.
ఇకనైనా బ్రిడ్జిని మరమ్మతులు చేయించి ప్రమాదాలను అరికట్టాలని కోరుతున్నారు.వైరా నుండి జగ్గయ్యపేట వరకు నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు సాగుతుండగా అధికారులు సైతం పట్టించుకోకుండా వారి పనులు వారే చేసుకుంటూ తిరుగుతున్నారు.

బ్రిడ్జి నిర్మాణం జరిగి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా దానిమీద జరిగే ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా వదిలేశారు.ఇకనైనా ఈ వంతెనకు మరమ్మత్తులు నిర్వహించి ప్రమాదాలను అరికట్టవలసిందిగా మండలంలోని ప్రజలు అధికారులను కోరడమైనది.
ఆర్ అండ్ బి బ్రిడ్జి నందు గుంతలుగా ఉండి పైన సువ్వలు బయటికి వచ్చిన పరిస్థితి కానొస్తుంది ఆ గుంతల వలన వాహనదారులు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది.

ఇంత మటుకు దానిని పట్టించుకోని దాఖలాలు లేవు ఆర్.అండ్.బి అధికారులు ఇప్పటికైనా దానిని గమనించి తగిన మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

గమనిక
23/12/2023

గమనిక

*గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు భట్టి విక్రమార్క గారికి మడుపల్లి గ్రామ ప్రజల మనవి.*అయ్యా మంత్రి గారు మడుపల్లి లో తాతల క...
22/12/2023

*గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు భట్టి విక్రమార్క గారికి మడుపల్లి గ్రామ ప్రజల మనవి.*
అయ్యా మంత్రి గారు మడుపల్లి లో తాతల కాలం నుండి ఉన్న జాగాలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న మాకు ఇంటి స్థలాల పేపర్లు లేవు కనుక ఇప్పుడు మడుపల్లి లో ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను కడతూ ఉన్నాం. ఈ ఇంటి పన్ను తీసుకొని మా యొక్క ఇంటిని రిజిస్ట్రేషన్ చేయమని అధికారుల్ని కోరగా వారు రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని చెప్పటం జరుగుతుంది కావున మంత్రిగారు సంబంధిత అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చూడాలని మడుపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు..

*మీ అన్నవరపు*

*ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం*అందరికీ సుపరిచితులు ఆర్కే ఫౌండేషన్ నిత్యాన్నదాత శ్రీ వేమూరి సునీల్ గారి మనవడు చిన...
21/12/2023

*ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం*
అందరికీ సుపరిచితులు ఆర్కే ఫౌండేషన్ నిత్యాన్నదాత శ్రీ వేమూరి సునీల్ గారి మనవడు చిన్నారి కార్తీక్ ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు చంద్రశేఖర్ హిమబిందు చెల్లి లాస్య గార్లు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో మహోన్నతమైన అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న కార్తీక్ ఆదిత్యాకు అభినందనలు తెలియజేస్తూ అన్నదానం నిర్వహించిన వారి తాతయ్య వేమూరి సునీల్ గారికి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే సుదర్శన్ రత్న భూషిత కృతజ్ఞతలు తెలియజేశారు

🚼ఈరోజు మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, స్టాఫ్ నర్స్ దుర్గ  గారి ఆధ్వర్యంలో సాధారణ ప...
21/12/2023

🚼ఈరోజు మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, స్టాఫ్ నర్స్ దుర్గ గారి ఆధ్వర్యంలో సాధారణ ప్రసవం నిర్వహించారు.
🚼ఈరోజు సిద్ధినేనిగూడెం (మర్లపాడు) గ్రామానికి చెందిన కొంగల సంధ్యారాణిw/o ప్రదీప్ మొదటి కాన్పు ఈరోజు ఉదయం 9.50 నిమిషములకు పిహెచ్సి నందు సాధారణ ప్రసవం జరిగింది.3.50kg ఉన్న పాప జన్మించింది. తల్లి బిడ్డ క్షేమం.మెడికల్ కిట్ ఇవ్వడం జరిగింది.
🩺 ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్ పాతూరి శ్రీనివాసరావు,CHO సుభాషిని, ఏఎన్ఎం మరియమ్మ, సిహెచ్పి రాజ్యలక్ష్మి, సత్యవాణి, శోభారాణి, ల్యాబ్ టెక్నీషియన్ పుత్తిలి బాయి ఆశా కార్యకర్త సుభాషిని పాల్గొన్నారు.

21/12/2023

విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ చేసిన అప్పులు* విద్యుత్ రంగం అప్పు - 81,516 కోట్లు డిస్కంల అప్పు - 28,673 కోట్లు వివిధ శాఖలు - 29 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి ఇరిగేషన్ శాఖ - 14,190 కోట్లు

🏃🏃🏃🏃 ఈరోజు జరిగిన ఖమ్మం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ UNDER 20  8 కిలోమీటర్ల విభాగంలో P షారుక్ ఖాన్ గోల్డ్ మెడ...
20/12/2023

🏃🏃🏃🏃 ఈరోజు జరిగిన ఖమ్మం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ UNDER 20 8 కిలోమీటర్ల విభాగంలో P షారుక్ ఖాన్ గోల్డ్ మెడల్ అదేవిధంగా UNDER 18 6 కిలోమీటర్లు భాగంలో SK పర్వేజ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అదేవిధంగా ఈనెల 22 23 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది ఈ ఎంపిక పట్ల TMRS &JC MADHIRA BOY'S 1 ప్రిన్సిపల్ మేడం ఎస్కే షమీం మేడం PET సైదులు ఉమ్మడి ఖమ్మం జిల్లా RLC మేడం అరుణ కుమారి మేడం ఉమ్మడి ఖమ్మం జిల్లా విజిలెన్స్ అధికారులు కే సీతారాములు సార్ జమీల్ సార్ అదేవిధంగా టీచింగ్ బృందం నాన్ టీచింగ్ బృందం విద్యార్థులను అభినందించారు 💐💐💐💐💐💐💐

జెడ్పిహెచ్ఎస్ నిదానపురం పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేస్తూ ..అకాల మరణం చెందిన వి.నాగరాణి గారి జ్ఞాపకార్థం, భర్త సునీల్, ...
20/12/2023

జెడ్పిహెచ్ఎస్ నిదానపురం పాఠశాలలో సోషల్ టీచర్ గా పని చేస్తూ ..అకాల మరణం చెందిన వి.నాగరాణి గారి జ్ఞాపకార్థం, భర్త సునీల్, కుమార్తె హిమబిందు, అల్లుడు చంద్రశేఖర్ గార్లు పాఠశాలకు మంచినీళ్లు శుద్ధి చేసే యంత్రాన్ని వితరణగా అందజేసినారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన దాతలను సత్కరించి వారి దాతృత్వాన్ని కొనియాడారు. నాగరాణి గారి సేవలను స్మరించారు. దాతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణదాసు గారు,సర్పంచి బాదా కృష్ణారెడ్డి గారూ,SMC చైర్మన్ నర్సిరెడ్డి గారూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం k. కృష్ణ ప్రసాద్ , A. సత్యావతి,
R.రంగారావు, M.కృష్ణయ్య , రమాదేవి పాల్గొన్నారు.

కృష్ణ మాదిగన్నా!దండోరా ఉద్యమం మాలాంటి ఎందరికో స్ఫూర్తి. ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని మేం కొట్లాడుతున్నం. నువ్వేమో వెన్...
20/12/2023

కృష్ణ మాదిగన్నా!
దండోరా ఉద్యమం మాలాంటి ఎందరికో స్ఫూర్తి. ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని మేం కొట్లాడుతున్నం. నువ్వేమో వెన్ను నిమిరించుకుని హెలికాప్టర్ కట్టుకొని డప్పులు దరువేయించి బీజేపీకి ఓట్లేయించినవ్. మనువాద పార్టీని నమ్ముకొని వర్గీకరణ సాధిస్తానంటివి.. కడుపు రగిలినా మౌనం పాటించినం. ఏదీ నీ మాట??

ఇవాళ అంతమంది ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులన్నీ పాస్ చేయించుకుంటున్నారు గదా.. మరి మీ వర్గీకరణ బిల్లు ఏదే! కనీసం కాలయాపన కమిటీ కూడా వేయించుకోలేక పోతివేమి! ఇట్లా అందర్నీ బక్రాలను చేస్తున్నావా!?

రేపు 2024లో కూడా నువ్వు బీజేపీని గెలిపిస్తే- డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకు ఇచ్చిన దన్ను, ధైర్యమైన భారత రాజ్యాంగానికి గ్యారంటీ నువ్వు ఇస్తావా? రేపు మళ్ళీ బీజేపీ గెలిస్తే రాబోయే మనువాద రాజ్యంలో మాదిగల, బహుజనుల రక్షణకు, సంక్షేమానికి పూచీ నువ్వు పడతావా? భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేది ఎలాగా?? ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేది ఎట్లా??? చెప్పన్నా జర!

రాష్ట్ర రెవెన్యూ,గృహ,సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేసిన PRTU నాయకులు లంకె...
18/12/2023

రాష్ట్ర రెవెన్యూ,గృహ,సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేసిన PRTU నాయకులు లంకెల మోహన్ రెడ్డి, రేగళ్ల బ్రహ్మా రెడ్డి, కోట జయరాజు, తుమాటి కృష్ణారెడ్డి, జంగా గురునాద రెడ్డి తదితరులు

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when మధిర రచ్చబండ Madhira RachaBanda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share