15/05/2022
్రాసిటీ_యాక్ట్_ఆవిర్భావం_గురించి_తెలుసుకుందాం
్రాసిటీ_యాక్ట్_1989_ 2018
#పౌర_హక్కుల_పరిరక్షణ_చట్టం_1954
*( )*
అంటరానితనం నిర్మూలించబడిన సందర్భంలో పౌరులు అందరు సమానులే అనే సామాజిక న్యాయ సూత్రం ఆధారంగా ఈ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 1954లో రూపొందించింది. ఈ చట్టం భారతదేశం నలుమూలలకు వర్తిస్తుంది.
అంటరానితనాన్ని నిర్మూలించటం మూలంగా ఒక వ్యక్తికి సంక్రమించిన హక్కులే పౌర హక్కులు.
* #అంటరాని_తనము_పాటిస్తే_శిక్ష*
ఒక మతానికి చెందిన వ్యక్తిని అదే మతానికి చెందిన సామూహిక ప్రార్థన మందిరం, ప్రార్థనా స్థలం వద్దకు ప్రవేశించకుండా అంటరానితనం పేరుతో నిరోధించినా, సామూహిక ప్రార్థన స్థలాల్లో దైవపూజలు చేయకుండా, చెరువులు జలపాతం, నదుల వంటి పవిత్ర ప్రదేశాలలో స్నానముచేయకుండా వాటిని ఉపయోగించకుండా అంటరాని తనం పేరుతో నిరోధించిన యెడల నెల నుండి ఆరు నెలల వరకు తగ్గకుండా జైలు శిక్ష పదిహేను వందల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.
* #సాంఘిక_అసమానతలకు_శిక్ష*
అంటరానితనం పేరుతో ఒక వ్యక్తిని సాంఘిక అసమానతలకు గురిచేస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది.
అది ఎట్లనగా,,,
👉 దుకాణంలో అన్ని పబ్లిక్ రెస్టారెంట్, పబ్లిక్ వినోద కేంద్రం లోనికి రాకుండా ఆటకాయించడం పబ్లిక్ రెస్టారెంట్లు,హోటల్, ధర్మశాల వంటి ప్రదేశాలలో అందరూ ఉపయోగించే వస్తువులను ఉపయోగించకుండా నిషేధించడం,
👉వృత్తిని లేదా వ్యాపారాన్ని లేక ఉద్యోగాన్ని చేయకుండా నిషేధించడం, కాలువలు చెరువులు, ప్రజా కుళాయిల వద్ద ఘట్టాలలోకి స్మశానంలోకి మరుగుదొడ్ల లోకి ఏదైనా ప్రభుత్వ రహదారుల మీదకు అంటరానితనం పేరుతో ఎవరినైనా రాకుండా వాటిని ఉపయోగించకుండా నిషేధించడం.
👉ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సామాన్య ప్రజల అందరి కోసం ఏర్పాటు చేయబడిన ధార్మిక సంస్థల లో ప్రవేశాన్ని, అవకాశాన్ని అంటరానివారు అనే పేరుతో అటకాయించడం,ధర్మ సంస్థ నుండి ప్రయోజనం పొందకుండా కొందరిని నిరోధించటం, రవాణా సదుపాయాన్ని అంటరానివారు అనే పేరుతో నిరాకరించటం, 👉ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని, ఇళ్లలో నివసించే అవకాశాన్ని అంటరానితనం పేరుతో కొందరికి నిరాకరించడం సహాయంతో నిర్మించబడిన ధర్మశాలలు, మస్కఫిర్ ఖానాలను అంటరానివారు అనే పేరుతో ఉపయోగించకుండా ఆటంకపరచడం.
👉మత సాంస్కృతిక పరమైన ఊరేగింపులలో దళితులకు, గిరిజనులకు ప్రవేశాన్ని నిషేధించడం, ఆభరణాలు ధరించకుండా నిరోధించటం మొదలగు కార్యకలాపాలకు పాల్పడిన వారికి నెల రోజులకు తగ్గకుండా ఆరు మాసాల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు (సెక్షన్ 4 ప్రకారం)
*విద్యాసంస్థలు, వైద్యశాలలయందు వివక్షత*
👉ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మింపబడిన విద్యాలయాలు, వైద్యశాలలు,విద్యార్థి వసతి గృహాలు ప్రవేశం కల్పించబడినప్పటికీ తరువాత వసతులు మొదలైనవి కల్పించడంలో వివక్షత చూపించు ఎవరికైనా, వస్తువులను సరుకులను అమ్మటానికి నిరాకరించిన సేవలందించేందుకు నిరాకరించిన ఒకటి నుండి ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష విధించబడుతుంది. (సెక్షన్-4)
👉భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 క్రింద అంటరానితనం నిర్మూలించబడి ఒక వ్యక్తి తనకు లభించిన హక్కులను అనుభవించకుండా నిరోధించిన, నిషేధించిన, అవమానపరిచిన, గాయపరిచిన, భ్రాంతులకు గురిచేసిన అటువంటి ఆకృత్యాలకు ప్రయత్నించిన లేదా పరోక్షంగా సంకేతాలు పంపిన ప్రోత్సహించిన షెడ్యూల్డ్ కులాలు తెగలు వారిని అంటరానివారుగా ఆవమానించిన, ప్రయత్నించిన ఒకటి నుండి ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష జరిమానా విధించబడుతుంది.
👉రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 కింద లభించిన హక్కులను అనుభవిస్తున్నారని కోపము, ప్రతీకారంతో వారికి చెందిన ఆస్తుల పైన దాడి చేయడం నేరం కింద పరిగణించబడుతుంది అటువంటి నేరాలకు రెండు సంవత్సరముల వరకు జైలు శిక్ష జరిమానా లేక రెండు విధించబడుతుంది. (సెక్షన్. 7 *అంటరాని వారిచే నీచకృత్యములు చేయించుట*
👉 అంటరానివారనే కారణం చేత మరుగుదొడ్లు బాగు చేయించుట, వీధులు, శవాలు మృత కళేబరాలను చనిపోయిన జంతువుల చర్మాలను తొలగించవలసిందిగా ఆదేశించటం, అలా చేయని యెడల సాంఘికంగా, ఆర్థికంగా బహిష్కరిస్తామని బెదిరించడం ఇటువంటి నేరాలకు పాల్పడితే మూడు నుండి ఆరు మాసాల వరకు జైలు శిక్ష వేయి రూపాయలు జరిమానా లేదా రెండు విధించబడుతుంది సెక్షన్ 7(ఎ) ప్రకారం.
*అంటరాని వారిచే ఇతరత్రా నీచకృత్యా అంశములు*
ఈ చట్టం కింద శిక్షార్హమైన నేరములను చేయవలసిందిగా ప్రోత్సహించిన వారికి శిక్షార్హమైన నేరము పరిశోధించుటలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దానిని నేరము ప్రోత్సహించుటగానే పరిగణించబడుతుంది (తనను అగ్రకులాలవారు దూషించారంటూ ఒక దళితుడు పోలీసు రిపోర్టు ఇచ్చిన పోలీస్ అధికారి అగ్ర కులాల వారితో లాలూచీ పడి ఆ రిపోర్టర్ పై చర్య తీసుకోకపోవడం మొదలైనవి) (సెక్షన్ 9)
👉శిక్షార్హమైన నేరమునకు పాల్పడిన నేరస్తునికి ఏదైనా లైసెన్స్ లేక పర్మిట్ ఉన్నట్లయితే శిక్ష విధించడంతో పాటు ఆ లైసెన్సు లేక పరిమితులు రద్దు చేయుట లేక తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం న్యాయ స్థానం కలదు. (సెక్షన్ 8)
👉ప్రార్థనా స్థలం లేక విద్యార్థుల వసతి గృహం యొక్క అధికారి ఈ నేరమునకు పాల్పడి నేరం రుజువు కాబడి శిక్ష విధింప బడినట్లయితే ఆ సంస్థకు సహాయం లేక గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయవచ్చు. (సెక్షన్ 9)
👉 ఈ చట్ట పరిధిలో ఒకసారి శిక్ష విధింపబడిన వ్యక్తి తిరిగి రెండవసారి అదే నేరమునకు పాల్పడినట్లు అయితే ఆరు నెలలకు తగ్గకుండా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
👉 అదే నేరము మూడవ సారి ఇదే వ్యక్తి చేసినట్లయితే సంవత్సరం తగ్గకుండా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు (సెక్షన్ 11)
👉 షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వ్యక్తిపై నేరం జరిగినప్పుడు అతను అంటరాని వ్యక్తి అయినందువల్లే ఈ నేరం జరిగిందని న్యాయస్థానం భావిస్తుంది అటువంటప్పుడు తాను నిర్దోషినని ముద్దాయి నిరూపణ చేసుకోవలసి వస్తుంది.(సెక్షన్ 12)
👉ఈ చట్టం నిబంధనలకు విరుద్ధంగా అంటరానితనము నాకు చెందిన ఎటువంటి సివిల్ కోర్ట్ అనుమతించదు. (సెక్షన్ 13)
👉ఈ చట్ట పరిధిలో నేరములన్ని కాగ్నిజబుల్. కనీస శిక్ష మూడు మాసాలకు మించిన నేరము లన్నింటిని మొదటి తరగతి మేజిస్ట్రేట్ లేక మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ చేత విచారించవలసి ఉంటుంది. విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నేరము చేసినట్లయితే సంబంధిత ప్రభుత్వ అనుమతి లేనిదే అతనిపై కేసు దాఖలు చేయరాదు. (సెక్షన్ 15)
*సామూహిక జరిమానాలు*
👉 ఒక ప్రాంతంలో ఉండే స్థానిక ప్రజలు కలిసి నేరం చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కమీషన్ ద్వారా విచారణ జరిపి నేరస్తులను దాసి ఉంచినట్లుగాను నేరస్తులను పట్టించుటలో సహకరించినట్లు గాను, నేరమునకు చెందిన సాక్షాధారాలు లేకుండా చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్లయితే వారందరిపై సామూహిక జరిమానా విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు ఎవరు ఎంత చెల్లించవలసింది కూడా పేర్కొనవచ్చు. ప్రభుత్వం నోటిఫికేషన్ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న ఎడల నిర్దేశించబడిన సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వంనకు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఇటువంటి పిటిషన్ మీద ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అక్కరలేదు.
*షెడ్యూల్డు కులములు, తెగల (SC,ST)వారిపై ఆకృత్యాల నిరోధక చట్టం 1989&2018*
👉పౌరహక్కుల చట్టానికి ఈ చట్టానికి చాలా వ్యత్యాసం ఉన్నది పౌరహక్కుల చట్టం చాలా పురాతనమైనది. మారుతున్న కాలమాన పరిస్థితులలో షెడ్యూల్డ్ కులాల తెగల వారిపై దౌర్జన్యాలు పేరుకుపోతున్నాయి.వాటిని అరికట్టడంలో ఆ చట్టం పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో 1989లో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం ఆచరణలో కొన్ని సందర్భాలలో దళితుల బ్లాక్మెయిలింగ్ కు ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఈ చట్టం ఆధారం చేసుకుని అగ్రవర్ణాల వారిని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని దేశంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీని ఆధారంగా అగ్రవర్ణాల వారిని దళితులు చేస్తున్నారని విమర్శ వాస్తవంగా ఉన్నది దళితుల హక్కుల రక్షణలో ఎంతో కీలకపాత్ర వహిస్తుంది.ఈ మధ్య కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
👉"షెడ్యూల్డ్ కులాలు,తెగలు వారిపై అత్యాచారం నిరోధక చట్టంగా" పిలవబడే ఈ చట్టం జమ్మూ కాశ్మీరు మినహాయించి యావత్ భారతదేశానికి వర్తిస్తుంది
*ఈ చట్టం కింద నేరం శిక్ష*
👉చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి చెందని వారు ఈ తెగల వారిపై జరిపే ఈ క్రింది చర్యలు శిక్షార్హమైన నేరం పరిగణించబడతాయి..
1. అనారోగ్యమైన పదార్థాలను తినిపించడం లేదా తాగించడం వారి ఇళ్ళ పరిసరాలు ముందు మృత కళేబరాలు మలమూత్రాలు అనారోగ్య పదార్థాలను వెదజల్లి అవమానించడం భయభ్రాంతులకు గురి చేయటం,
👉ఈ తెగల వారికి చెందిన వ్యక్తిని వస్త్రాపహరణం చేయడం, ముఖం మీద రంగులు పోయడం, నగ్నంగా ఊరేగించడం చేయుట,
👉ఈ తెగల వారికి చెందిన భూములను లేదా వారికి కేటాయించిన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం లేదా వాటిని అనుభవించడం.
👉ఈ తెగల వారికి చెందిన భూమి లేక గృహము, లేక ప్రదేశం నుండి బలవంతంగా బయటకు గెంటి వేయడం.
👉ఈ తెగల వారి చేత బలవంతంగా వెట్టి చాకిరి చేయించుట మరియు బిక్షాటన చేయించుటచేయించుట,
👉 ఈ తెగలకు చెందిన వారిని ఒక అభ్యర్థికి ఓటు వేయమని లేదా ఓటు వేయవద్దని బలవంతం చేయుట,
👉 ఈ తెగల వారిపై తప్పుడు, నిస్సారమైనస్సారమైనపరమైన సివిల్ లేక క్రిమినల్ కేసులను వేయించుట.
👉ఈ తెగలకు చెందిన వ్యక్తి గురించి ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు సమాచారం అందించి అందువలన ఆ సమాచారం ఆధారంగా సదరు ఉద్యోగి విచారణ జరిపి భయభ్రాంతులకు చేయటం,
👉 ఈ తెగలకు చెందిన వారిని బహిరంగ ప్రదేశంలో బుద్ధి పూర్వకంగా అవమానించడం, ఈ తెగలకు చెందిన స్త్రీని అవమాన పరచాలని ఉద్దేశంతో ఆమెపై దౌర్జన్యం చేయుట అధికారం లేదా ఉన్నత స్థాయిని అవకాశంగా తీసుకొని ఈ తెగలకు చెందిన స్త్రీలపై లైంగిక దాడి దోపిడీ చేయడం,
👉ఈ తెగలకు చెందిన వారు ఉపయోగించే జల సంద్రాలను, చెరువులను కుంటలను పాడుచేయుట, ప్రజలందరూ ఉపయోగించే బహిరంగ ప్రదేశాన్ని ఈ తెగల వారు ఉపయోగించుకోకుండా నివారించడము,
👉ఈ వర్గాలకు చెందిన వారిని తమ ఇల్లు,వాకిలి వదిలి పోయేలా భయానక పరిస్థితులు కల్పించడం.
👉ఈ వర్గాల వారిపై నేరాలకు పాల్పడిన వ్యక్తికి, ఆరు నెలలకు తగ్గకుండా ఐదు సంవత్సరముల వరకు జైలు శిక్ష జరిమానా విధించబడుతుంది.
*మరికొన్ని ఇతరత్రా నేరములు*
👉ఈ వర్గాల వారికి చెందని వ్యక్తి ఈ వర్గాలకు చెందిన వ్యక్తికి వ్యతిరేకంగా అబద్ధం సాక్ష్యం చెప్పి ఉండవచ్చు లేక సృష్టించి ఉండవచ్చు, అందువలన షెడ్యూల్డ్ కులాలు-తెగలకు చెందిన వ్యక్తికి మరణశిక్ష విధించే అవకాశం ఉన్నట్లయితే అబద్ధం సాక్ష్యము సృష్టించిన లేక చెప్పిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష జరిమానా విధించబడుతుంది అబద్దం చెప్పడము వలన అమాయకుడైన షెడ్యూల్డ్ కులాలు,తెగలకు చెందిన వ్యక్తికి మరణించి శిక్ష విధించబడి లేదా అమలు చేయబడే ఉంటే ఆబద్ధము చెప్పిన వ్యక్తి కూడా మరణశిక్ష విధించబడుతుంది.
👉 అబద్ధపు సాక్ష్యం వలన షెడ్యూల్డ్ కులం లేక తెగ ఒక వ్యక్తికి 7 సంవత్సరముల కన్నా ఎక్కువ కారాగార శిక్ష వేయించే అవకాశం ఉన్నట్లయితే అబద్ధపు సాక్ష్యం సృష్టించిన లేక చెప్పిన వ్యక్తికి ఆరు మాసాలకు తగ్గకుండా ఏడు సంవత్సరములు లేక అంతకన్నా ఎక్కువ శిక్ష విధించబడుతుంది, జరిమానా కూడా విధించబడుతుంది.
👉 షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందని వ్యక్తి బుద్ధిపూర్వకంగా పేలుడు పదార్థాలను ఉపయోగించి షెడ్యూల్డ్ కులం లేక తెగల చెందిన వ్యక్తులకు చెందిన ఆస్తులను నష్టం కలిగించినట్లయితే ఆరు నెలలకు తగ్గకుండా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
👉ఈ వర్గాలకు చెందని వ్యక్తి బుద్ధిపూర్వకంగా అగ్ని లేక పేలుడు పదార్థాలను ఉపయోగించి వారికి చెందిన ప్రార్థనా స్థలాలను, నివాస భవనాలు లేక ఆస్తిని భద్రపరిచే ప్రదేశాన్ని గాని నష్టం కలిగించినట్లయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది.
👉షెడ్యూల్డ్ కులం లేక తెగకు చెందిన వారు అన్న కారణంపై గాని ఏదైనా ఆస్తి ఆ వ్యక్తికి సంబంధించిన కారణంతో గాని లేక చెందని వ్యక్తి చెందని వ్యక్తి వ్యక్తిపై గాని లేక అతని ఆస్తి పై గాని భారతీయ శిక్షాస్మృతి కింద 10 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష విధించబడుతుంది. అమలు చేసినట్లయితే ఆ వ్యక్తికి యావత్ జీవ కారాగారశిక్ష శిక్ష విధించబడుతుంది.
👉ఈ చట్ట పరిధిలో శిక్షార్హమయిన నేరం చేసి శిక్ష పడకుండా తప్పించుకోవాలని ఉద్దేశంతో ఆ నేరానికి సంబంధించిన సాక్షాన్ని దాచిపెట్టిన, కనపడకుండా చేసిన లేక ఆ నేరం గురించి తప్పుడు సమాచారం అందజేసిన ఆ నేరానికి ఎంత శిక్ష పడుతుందో అంతే శిక్ష విధించబడుతుంది.
👉ప్రభుత్వ ఉద్యోగి ఈ చట్ట పరిధిలో ఒక నేరం చేసినట్లు అయితే ఒక సంవత్సరమునకు తగ్గకుండా ఆ నేరమునకు ఎంత శిక్ష నిర్దేశింపబడింది ఆ మేరకు శిక్ష విధించబడుతుంది...
*ఇతరత్రా అంశాలు మరియు నేరములు, శిక్షలు, జరిమానాలు*
👉ఈ వర్గాలకు చెందని ప్రభుత్వ ఉద్యోగి నిర్వర్తించవలసిన బాధ్యతలను చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అయితే ఆరుమాసాలకు తగ్గకుండా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు.
👉రాజ్యాంగంలోని 244 వ ఆర్టికల్ లో సూచించిన షెడ్యూల్డ్ ఏరియా మరియు ట్రైబల్ ఏరియాలో ఒక వ్యక్తికి పైన వివరించిన నేరములు ఉన్నట్లు పోలీసులు ఆ విషయమును న్యాయస్థానం తెలియజేయాలి.
👉అప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రదేశం నుండి వెళ్ళి పోవలసిందిగా వచ్చు ఉత్తర్వులు జారీ చేయబడిన తేదీ నుండి రెండు సంవత్సరముల వరకు ఆ వ్యక్తి ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు ఈ విధంగా ఈ చట్టం క్రింద కూడా ఆదేశాలు విధించవచ్చు..
👉ఈ చట్టం కింద నేరం చేసిన ముద్దాయి 18 సంవత్సరముల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వాడైతే అతనికి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం వర్తించదు.
*ప్రత్యేక న్యాయస్థానంలు*
షెడ్యూల్డ్ కులం లేక తెగల వారిపై జరుగు నేరముల విచారణకై ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానంలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది చేయవలసి ఉంటుంది. కేసులను న్యాయస్థానంలో దాఖలు చేయవలెను. ఆ న్యాయస్థానము మాత్రమే విచారణ జరుపవలయును.
*ముందస్తు బెయిల్ లభించదు*
ఈ చట్టం అంతటి చట్టాలలోకి దుర్మార్గమైనదిగా,అందరినీ భయబ్రాంతులకు గురిచేసేదిగా ఈ నిబంధన ఉందనేది వాస్తవం. ఎందుకంటే హత్య నేరాల్లో కూడా ముద్దాయి ముందస్తు బెయిల్ పొందవచ్చు. అయితే ఈ చట్టం క్రింద ఆ అవకాశం లేదు. ఈ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిల్ కు సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 438 క్రింద అనుమతించదు. చట్ట పరిధిలో తప్పనిసరిగా కోర్టుకు హాజరై బెయిల్ లభించే వరకు శిక్ష అనుభవించవలసి ఉంటుంది...
*ప్రధాన సూచనలు*
అత్యంత దారుణంగా దుర్వినియోగం కాబడుతున్న చట్టాలలో ఈ చట్టం మొదటి స్థానంలో ఉంది. స్వార్థ శక్తులు రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను అణచివేసేందుకు ఈ చట్టంలోని కఠినతరమైన నిబంధనలను తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఆ క్రమంలో ఎందరో అమాయకులు కూడా తమ హక్కులను అన్యాయంగా షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందినవారు మరియు చెందనివారు రెండు వైపుల నుండి పోగొట్టుకుంటున్నారు. 👉సుప్రీం కోర్టు 2018 మార్చిలో ఈ అంశంపై ఆలస్యంగా స్పందించింది.
👉ఈ చట్టం దుర్వినియోగం కాకుండా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది ఈ చట్టం క్రింద ఫిర్యాదు దాఖలు అయినప్పుడు తక్షణమే అరెస్టు చేయరాదని ఫిర్యాదుపై కొంత విచారణ జరిపి ఆ తర్వాత అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయవలసిందిగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈ నోటీసులలో పేర్కొంటూ 100 మంది దోషులకు శిక్ష పడకపోయినా ఇబ్బంది లేదు,కానీ ఒక నిర్దోషి కూడా శిక్షకు గురి కాకూడదు అనే న్యాయ సూత్రం ప్రాతిపదికగా ఈనాటి ఈ సలహాలు చూసి ఇస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.
👉చట్టం యొక్క మౌలిక స్పూర్తిని ఇచ్చే నీరుగార్చేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని అగ్రవర్ణాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు వత్తాసు పలుకుతోందని, షెడ్యూల్డ్ కులాలు,తెగలకు చెందిన ప్రజల నుండి తీవ్ర విమర్శలు బయలుదేరే ఈ అంశం రాజకీయపరంగా దేశవ్యాప్తంగా ఈ రంగు పులుముకుంది.
👉షెడ్యూల్డ్ కులాలు,తెగలకు చెందిన తమ ఓటు బ్యాంకుగా భావిస్తున్న పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శ కాలు పై దేశవ్యాప్తంగా ఆందోళనతో వ్యతిరేకించాయి.
👉చివరకు ఈ చట్ట నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. అన్ని పార్టీలు కూడా మరల ఈ చట్ట సవరణకు ఆమోదం తెలపడంతో ఈ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభలు మద్దతు తెలపడంతో రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు కేంద్ర ప్రభుత్వ అధికార పత్రంలో కూడా ప్రచురించబడింది.
👉ఈ సవరణ చట్టం ద్వారా ఈ చట్టంలో సెక్షన్ 18 తర్వాత సెక్షన్ 18 (ఏ)అదనంగా చేర్చబడింది.
*ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్*
*ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 మరియు 2018 వ్యత్యాసం ఏమిటి?*
*ముందుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ 1989 గురించి విశ్లేషించుకుందాం*
ఈ (1989)యాక్ట్ లో కేసు నమోదు చేయాలంటే ముందుగా ఓసి, బీసీల సాక్ష్యము తప్పనిసరిగా ఉండాలి.
*యాక్ట్ లో కేసు నమోదు చేసే ముందు విచారణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత కేసు నమోదు చేయబడుతుంది.
*ఈ యాక్ట్ లో న్యాయ విచారణ అధికారి ఏ కుల-మత వర్గానికి చెందిన వారయినా ఉంటారు.
*ఈ సంవత్సరం చట్టంలో నమోదైన కేసునకు సంబంధించిన విషయములను వివరాలను ఏ కులానికి మతానికి వర్గానికి చెందిన వారైనా వాదోపవాదాలను పరిశీలించి తీర్పు ఇవ్వవచ్చును.
*ఈ సంవత్సరం చట్టంలో నమోదైన కేసులో పూచీకత్తు బెయిలు పొందే అవకాశం ఉంటుంది.
*ఈ సం.చట్టంలో నమోదైన కేసులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)నమోదై విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే అదుపులోకి (అరెస్ట్) తీసుకునే వీలు కల్పించబడింది.
&&&&&&&&&&&&&&&&&&
*ప్రస్తుతము యస్ సి,ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ 2018 లో మార్పు చేసిన విషయాలను పరిశీలిద్దాం.*
1).ఈ సంవత్సరం(2018) యాక్టు లో కేసు నమోదు చేయాలంటే కేవలం ఎస్సీ ఎస్టీ సాక్ష్యాలు మాత్రమే తప్పనిసరిగా ఉండాలి.
2). ప్రస్తుతం ఈ చట్టంలో ముందుగా ఎఫ్ఐఆర్ నమోదుచేసి వెనువెంటనే జైలు శిక్ష విధించడం ఆ తర్వాత పూర్తి కేసు విచారణ చేపట్టడం జరుగుతుంది.
3). ప్రస్తుతం ఈ చట్టంలో కేసును విచారణాధికారిగా ఎస్సీ ఎస్టీ వారిని మాత్రమే నియమించబడింది.
4). ప్రస్తుతం ఈ చట్టంలో కేసు యొక్క న్యాయ వాదనలు వినడానికి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తిని మాత్రమే నియమింపబడుతుంది.
5). ప్రస్తుతం ఈ చట్టములో ముందస్తు లేదా పూచీకత్తు బెయిలుకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడదు.
6). ప్రస్తుతం ఈ చట్టంలో దాడి తీవ్రతను బట్టి ప్రస్తుతం ఆరు నుండి ఎనిమిది నెలల వరకు బెయిలు లభించే అవకాశంనకు ప్రాధాన్యత తిరస్కరించబడుతుంది.
7). ప్రస్తుతం ఈ చట్టంలోని కేసులో వాదోపవాదాలు విని పరిశీలించిన తర్వాత కేసు అక్రమ అని నిర్ధారణ తేలితే నేరబాధితునికి పరువు నష్టం కింద ఐదు లక్షల నుండి పది లక్షల వరకు జరిమానా మరియు ఒకటి నుండి మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష లేదా రెండు ( జరిమానా మరియు జైలు శిక్ష ) విధించబడతాయి.
8). ప్రస్తుతం ఈ చట్టంలో ఓసి మరియు బీసీలు అయిఉండి నకిలీ కులమతాల ధ్రువీకరణ ఆధార పత్రాలు సృష్టించుకొని ఎస్ సి ఎస్టీ యాక్ట్ కింద ఓసి బీసీల వ్యక్తులపై కక్ష లేదా కుట్రపూరితంగా న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించే విధంగా దుశ్చర్యలకు పాల్పడి కేసు బనాయిస్తే మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు మోసపూరిత కేసు క్రింద జైలు శిక్ష విధించబడుతుంది. పరువు నష్టం 5 నుండి 10 లక్షల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయి.
*ఈ (యస్ సి,యస్టీ 2018 చట్టం)చట్టంలో తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు నమోదైతే నేరబాధితుల తరపు నుండి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి ??*
ఐపిసి 153ఏ ప్రకారం విభిన్న వర్గాల మధ్య ద్వేషం పెంచుట.
ఐపిసి 153బి సెక్షన్ ప్రకారం జాతీయ భావం చట్టం పేరుతో భంగపరిచే చర్యలు చేపట్టుట.
ఐపీసీ 182 సెక్షన్ ప్రకారం మరొకరికి హాని తలపెట్టాలని ఉద్దేశంతో ఆ శాఖ అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చుట.
ఐపీసీ 191 సెక్షన్ ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పుట.
ఐపిసి 192 సెక్షన్ ప్రకారము అబద్ధపు సాక్ష్యం సృష్టించడం.
ఐపిసి 193 సెక్షన్ క్రింద తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు శిక్ష.
ఐపీసీ 195 సెక్షన్ ప్రకారం అమాయకులను జైలుకు పంపాలని లేదా సమస్యలు కలిగించాలనే ఉద్దేశంతో అబద్ధపు సాక్ష్యం చెప్పుట.
ఐపిసి 196 సెక్షన్ ప్రకారం అబద్ధపు సాక్ష్యం ఉపయోగించుకొనుట.
ఐపిసి 197 సెక్షన్ ప్రకారం దొంగ సర్టిఫికెట్లు జారీ చేయుట.
ఐపిసి 198 సెక్షన్ ప్రకారం దొంగ సర్టిఫికేట్ ను అసలు సర్టిఫికెట్టు గా ఉపయోగించుట.
ఐపిసి 199 సెక్షన్ ప్రకారం అబద్ధపు వాంగ్మూలం ఇచ్చుట.
ఐపీసీ 200 సెక్షన్ ప్రకారం వాంగ్మూమూలాలను వినియోగించుట.
ఐపిసి 201 సెక్షన్ ప్రకారం సాక్షాలు సాక్షాధారాలను తారుమారు చేయుట.
ఐపిసి 203 సెక్షన్ ప్రకారం అబద్ధపు సమాచారం అందజేయుట.
ఐపిసి 211 సెక్షన్ ప్రకారం అక్రమ నేరారోపణ చేయుట.
ఐపిసి 290 సెక్షన్ ప్రకారం ఇతరత్రా అక్రమ ఆధారాల ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించటం.
ఐపిసి 291 సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఇతర వ్యక్తులకు అసౌకర్యం కలిగించుట.
ఐపిసి 464 సెక్షన్ ప్రకారం నకిలీ పత్రములను తయారుచేయుట.
ఐపిసి 465 సెక్షన్ ప్రకారం నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసినందుకు శిక్ష.
ఐపిసీ 471 సెక్షన్ ప్రకారం నకిలీ ధ్రువపత్రంలను అసలైనవిగా వినియోగించుట.
ఐపిసీ 500 సెక్షన్ ప్రకారం తప్పుడు ఆధారాలతో పరువు నష్టం కలిగించినందుకు శిక్ష.
???????????????????????
*ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ అంటే ఏమిటి??*
*ఏ ఏ పరిస్థితులు, సందర్భాల్లో యస్ సి యస్టీ అట్రాసిటీ ఆక్ట్ ఉపయోగిస్తారు*
*ఆర్టికల్ 17. అంటరాని తనం నిర్మూలన*
అంటరానితనాన్ని నిర్మూలించి దాన్ని ఆచరణలో పెట్టడాన్ని నిషేధించడం జరిగింది. అంటరానితనాన్ని చట్టప్రకారం శిక్షించాలి.
భారతదేశంలో అంటరానితనం అనేది సాంఘికంగా ఉన్న కళంకము. ఆర్టికల్ 17 లో అంటరానితనాన్ని నిర్మూలించి దాన్ని ఆచరణలో పెట్టడం నిషేధించడం జరిగింది. ఏ రూపంలోనైనా ఆచరణలో పెట్టినట్లయితే దాని ప్రకారం శిక్షించాలి. అంటరాని తనమును రాజ్యాంగంలో నిర్వచించలేదు.ఇంకా ఏ ఇతర చట్టాలలోను నిర్వచన చేయలేదు. నిమ్న జాతికి చెందిన వ్యక్తులను అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారు. వాళ్లని కులభ్రష్టులుగా పరిగణిస్తున్నారు.అగ్ర జాతికి చెందిన వ్యక్తులు నిమ్మజాతికి చెందిన వ్యక్తులతో పరస్పర సంబంధాలను మొన్న మొన్నటి వరకు కలిగి లేరు. హరిజనులను దేవాలయాలలోకి రానివ్వడాన్ని, బావి నుంచి నీళ్లు తీసుకోవడాన్ని నిషేధించారు.
ఈ ఆర్టికల్ ని ఆచరణలో పెట్టడానికి 1955లో అంటరానితనం (నేరాల) చట్టం 1955 పార్లమెంటు మెంటు అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత *పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1955* గా దానిని మార్పు చేసింది. కానీ సామాజిక న్యాయం పూర్తిగా అమలు చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లనే ఈ ఆర్టికల్ ను అనుసరించి మొదటి సారి 1989 సం.లో దీనిని (యస్ సి యస్టీ అట్రాసిటీ ఆక్ట్) అమలులోకి తెచ్చారు.
*1989 లో ప్రవేశ పెట్టిన ఈ చట్టంలో అటు న్యాయ వ్యవస్థ, ఇటు బాధ్యత చూపడంలో బాధితులకు న్యాయం పూర్తిగా పోలీస్ శాఖ నుండి సరియైన విధులు నిర్వహించే అవకాశం ఉండి సరిగ్గా ప్రయోగించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా 2018 లో మార్పు రావడానికి ఈ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ చట్టం న్యాయ, పోలీస్, బాధితులకు ఒకే రకంగా విధానం ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టం అమలులోకి తేవడం జరిగింది.
*********************
*యస్ సి యస్టీ అట్రాసిటీ ఆక్ట్ ఏ ఏ విషయంలలో పరిగణనలోకి తీసుకుని పరిగణిస్తున్నారు ??*
ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్ళిన తరువాత వారికి కుల,మత, జాతి పేరిట దూరం చేసి దూషించడం.
ప్రభుత్వ , ప్రభుత్వేతర విద్య రంగాలలో నిర్వహించే సంస్థలు అయినా పాఠశాలలో దళితులు, గిరిజనులు అంటూ నిమ్న వర్గాలు ప్రజలను దూషించడం లేదా ద్వేషించడం,, విద్యాలయాలకు దూరంగా ఉంచడం చేసేటటువంటి అనుచిత కార్యకలాపాలు.
ప్రభుత్వ స్థలాలలో లేదా భూములలో నిర్మించిన బావులు లేదా చెరువులు ప్రజా ప్రయోజనాల కోసం మంచి నీటి వనరులు కల్పించిన ప్రదేశాలలో కులం మతం పేరిట దూషించడం లేదా దుర్భాషలాడడం వంటి అనుచిత వాఖ్యలు చేసిన ఎడల ఈ యాక్ట్ ను ఉపయోగించవచ్చు.
*ఇంకా ఏ ఇతరత్రా కారణాలతో ఈ యాక్ట్ ను ఉపయోగించవచ్చు లేదా ప్రయోగించవచ్చు ??*
వ్యాపార లావాదేవీలు మరియు వ్యక్తిగత వాదోపవాదాల్లో వచ్చిన గొడవల్లో యాక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.. అది కేవలం పబ్లిక్ సెక్యూరిటీ లేదా పర్సనల్ సెక్యూరిటీ కేసు కింద మాత్రమే కేసు నమోదు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం వారి వారి వ్యక్తిగత మరియు ఇద్దరు భాగస్వాములు మధ్య వచ్చిన వివాదం కనుక ఇటువంటి సందర్భంలో ఈ యాక్ట్ ను ఉపయోగించరాదు.