Svbcttd

Svbcttd Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Svbcttd, TV Channel, .

శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష      తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారివార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కం...
27/09/2024

శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష

తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి
వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను, టీటీడీలోని అన్ని విభాగాలపై టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కూడి సమీక్షించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం మరియు ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. "అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని అని ఆయన సూచించారు.

అనంతరం ఇంజినీరింగ్‌ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, గార్డెన్‌ మరియు ఫారెస్ట్‌లు, నృత్యం మరియు భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్‌ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

26/09/2024

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు-2024
వాహన సేవ వివరాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం - లోక క‌ల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం - టీటీడీ ఈవో...
23/09/2024

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం

- లోక క‌ల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు శాంతి హోమం

- టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు

- భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి

లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది.

శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చు అన్నారు.

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ, యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు.

ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.... ''ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ'' లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు.

సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం- శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల సంతృప్తి- టీటీడీ ఈవో శ్రీ జె.శ...
23/09/2024

సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

- శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల సంతృప్తి

- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 23న శాంతి హోమం నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో, అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,
- ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించాము.

- సర్వపాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.

- ఇదివరకే ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు టీటీడీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు చెప్పారు.

- లడ్డూల రుచిని మెరుగుపరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరిస్తూ, టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, స్వచ్ఛమైన ఆవునేయిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి అనేక రెట్లు మెరుగుపడిందని, భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో వివరించారు.


ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానంఅమరావతి:- పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరి...
22/09/2024

తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి:- పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి...బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

NO COMPROMISE IN GHEE QUALITY WE WILL ENSURE SANCTITY OF LADDUS PRASADAMS USING PURE COW GHEE-TTD EOTIRUMALA, 20 SEPTEMB...
20/09/2024

NO COMPROMISE IN GHEE QUALITY

WE WILL ENSURE SANCTITY OF LADDUS PRASADAMS USING PURE COW GHEE-TTD EO

TIRUMALA, 20 SEPTEMBER 2024: Asserting that TTD will ensure the sanctity of the most sought after Laddu Prasadam offered to Sri Venkateswara Swamy by using pure cow ghee, TTD EO Sri J Syamala Rao said there will not be any compromise on the quality of ghee used for making laddus as millions of pilgrims from across the globe visit Tirumala temple to have darshan of Sri Venkateswara Swamy with utmost devotion and there is every need to protect the sanctity and divinity of Tirumala Divyakshetram and Laddu prasadam.

Addressing media persons at the Meeting Hall of Annamaiah Bhavan in Tirumala on Friday, the EO said, the Honourable CM of AP Sri Nara Chandra Babu Naidu has clearly stated that the quality and taste of laddu prasadam needs to be ensured and sanctity to be restored by using pure cow ghee as it involves the sentiments of millions and millions of devotees across the globe. Following this, we started focussing on improving the quality and taste of laddus ever since the new TTD Administration has taken over. After receiving feedback from pilgrims over the poor quality of laddus in the last few years and also interacting with the Potu workers(laddu makers), for the first time TTD sent ghee supplies to an outside lab for adulteration testing.

There were 5 suppliers of Ghee to TTD and the rates were between Rs 320 to Rs 411. Names are Premier Agri Foods, Kriparam Diary, Vaishnavi, Sri Parag Milk and AR Dairy. Prima facie these rates are not viable rates for supplying Pure Ghee.
All have been warned by the new Administration to ensure good quality Ghee otherwise samples will be sent to outside labs for testing for adulteration and will be blacklisted if found positive.
Even after warning, 4 Ghee tankers sent by AR Foods were prima facie found to be of substandard quality.
The S-value analysis carried out on the sample sent to the reputed NDDB CALF Anand, fell outside the standard limits, suggesting the presence of foreign fats such as soya bean, sunflower, palm kernel fat or even lard and beef tallow. The acceptable S-value range for pure milk fat is between 98.05 and 104.32, but the tested sample showed values ranging from 23.22 and 116, reflecting significant deviations. These samples also indicated presence of Vegetable Oil contamination.
Now the reason for the lack of quality is not having an in-house lab. The suppliers took advantage of these deficiencies. The NDDB has come forward to donate Ghee adulteration testing equipment which will cost Rs.75 lakh equipment which is likely to come up by December or January next as a permanent solution", he maintained.

TTD temporarily stalls cow based products used for making Srivari Prasadams.
The EO also stated that complaints are pouring in from the devotees over the taste and quality of Anna Prasadams. Therefore TTD has formed a committee of experts and found that there are deficiencies in quality. Supplies were temporarily suspended After a thorough examination with experts a decision will be taken whether to restore the same or not.

The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary was also present.

Today Addl EO TTD inspection in VQC 2 in Tml
19/09/2024

Today Addl EO TTD inspection in VQC 2 in Tml

EO reviewed the preparations and arrangements for nine-day celebrations of the annual Brahmotsavams at the Meeting Hall ...
19/09/2024

EO reviewed the preparations and arrangements for nine-day celebrations of the annual Brahmotsavams at the Meeting Hall in TTD ADM BLDG in Tirupati with the District Joint Collector, SP, Tirupati Municipal Commissioner, and heads of all TTD departments.

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
18/09/2024

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ ఈ ఏడాది  అక్టోబ‌ర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగన...
18/09/2024

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

ఈ ఏడాది అక్టోబ‌ర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.

సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకునేందులో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.

రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు సి వి ఎస్ ఓ శ్రీ శ్రీధర్ లతో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణతిరుపతి, 2024 సెప్టెంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి...
17/09/2024

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2024 సెప్టెంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు      టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తి...
17/09/2024

తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు

టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని సిఆర్‌ఓ జనరల్ మరియు నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు.

వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్‌లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందన్నారు.

అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సి ఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత, ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.

అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం      తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ప...
17/09/2024

అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంత‌రం చక్రస్నానం నిర్వహించారు.

శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం తిరుపతి, 2024 సెప్టెంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ...
17/09/2024

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 సెప్టెంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.

అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా ముగిసిన గణేశ నవరాత్రులు - సెప్టెంబర్ 16న గణేశ నిమర్జనం    ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ...
15/09/2024

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా ముగిసిన గణేశ నవరాత్రులు

- సెప్టెంబర్ 16న గణేశ నిమర్జనం

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం మహా పూర్ణాహుతితో తొమ్మిది రోజుల పాటు జరిగిన గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

సెప్టెంబర్ 7న వినాయక చవితి రోజున ఈ నవాహ్నిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రోజు శ్రీ వినాయకుడిని వేర్వేరు అలంకారాలతో వేర్వేరు వాహనాలపై పూజించారు.

వాహన సేవకు ముందు అంకురార్పణం, పుణ్యాహ వాచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠాపన, వరసిద్ధి వినాయక స్వామి పూజ, సూర్యపూజ, సోమనాథ పూజ, ద్వారపూజ, గణపతి హోమం, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వంటి అనేక క్రతువులు ప్రతిరోజూ నిర్వహించారు.

ఇందులో భాగంగా సెప్టెంబరు 7న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తిరుచ్చిపై దర్శనమిచ్చారు. సెప్టెంబరు 8న ఉదయం బాల గణపతిగా, సాయంత్రం సృష్టి గణపతిగా గజ వాహనంపై, సెప్టెంబర్ 9న ఏకాక్షర మరియు ఏకాదంత గణపతిగా మయూర వాహనంపై, సెప్టెంబర్ 10న దుర్గాగణపతి మరియు దుండి గణపతిగా పులి వాహనంపై దర్శనమిచ్చారు. సెప్టెంబరు 11న శ్రీ రుణ విమోచక మరియు విజయ గణపతిగా
హంస వాహనంపై, సెప్టెంబర్ 12న యోగ మరియు క్షిప్రగణపతిగా
అశ్వ వాహనంపై, సెప్టెంబరు 13న సింహ వాహనం వీరగణపతిగా, సెప్టెంబరు 14న మహా గణపతి, వృషభంపై, చివరి రోజైన సెప్టెంబర్ 15న ఆదివారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతి మూషిక వాహనంపై అనుగ్రహించారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కెఎస్‌ఎస్‌ అవధాని ఆధ్వర్యంలో వేద విద్యార్థులు గణేశ విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేశారు. విద్యార్థులు నిర్వహించే వివిధ పూజల ఏర్పాట్లు, నిర్వహణను అధ్యాపకులు పర్యవేక్షించారు.

కాగా ఆదివారం సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. గణపతి విగ్రహానికి ప్రత్యేక పంచామృత అభిషేకం చేసిన అనంతరం సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య నిమర్జనం నిర్వహిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌     తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత...
15/09/2024

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌ రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ            కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్...
15/09/2024

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టిటిడి తరఫున ఈవో శ్రీ జె. శ్యామల రావు పట్టువస్త్రాలు సమర్పించారు.

కాణిపాకంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు ఆల‌య ఈవో శ్రీ గురుప్రసాద్, ఏఈవో శ్రీ విద్యా సాగర్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ద‌ర్శ‌నానంత‌రం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ ఈ సందర్భంగా టీటీడీ ఈఓ ను కలసి సన్మానించారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Svbcttd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share