Bisbo Telugu

Bisbo Telugu #బిస్బోఅంటే? #ఇంగ్లీష్ వార్తలు, #ఇంగ్లీష్ లో వార్తలు, #కామిక్ వార్తలు, #తాజా ఇంగ్లీష్ వార్తలు,

Bisbo Telugu  సరికొత్త వీడియో: మధుబాలను అమితంగా ప్రేమించిన ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్, ఒకే ఒక్క షరతు ఇద్దరినీ విడదీసిం...
16/07/2021

Bisbo Telugu సరికొత్త వీడియో:
మధుబాలను అమితంగా ప్రేమించిన ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్, ఒకే ఒక్క షరతు ఇద్దరినీ విడదీసింది.

https://youtu.be/yXdDjibFBuE

30/04/2021

Bisbo Telugu Archive:
Vodafone-Idea (ఇప్పుడు Vi) ఎదుర్కొంటున్న సమస్య నేపధ్యంలో, AGR అంటే ఏమిటో, గత ప్రభుత్వ విధానాలు భారతదేశంలో Telecom కంపెనీల మనుగడను ఎలా ప్రభావితం చేశాయో, ప్రస్తుతం బ్రతికి బట్ట కట్టడానికి Vi ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఈ వీడియోలో విశదంగా వివరించబడింది. ఐతే Airtel మరియు Jio కంపెనీల నుండి వచ్చే గట్టి పోటీ వలన, Vi అలాంటి చర్యలు తీసుకోగలదా? AGR పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన, TRAI యొక్క మొండి వైఖరి వలన, భారతదేశపు డిజిటల్ భవిష్యత్తును ఎలా నాశనం కాగలదో కూడా ఈ వీడియో లో వివరించబడింది.

29/04/2021

2020 డిసెంబర్‌లో బ్రెజిల్ మరియు US దేశాలలో 737 MAX 8 తిరిగి గగనతలంలో విహరించడం మొదలుపెట్టింది. 2021 లో వైమానిక పరిశ్రమ కోలుకోవడంతో, MAX మరోసారి లక్షలాది ప్రయాణికులను ప్రపంచపు నలుమూలలకు చేరవేస్తుంది. మరి వారు ఎంత సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారు? ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన Boeing తన వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందాలి. అలా చేయగలదా? ఈ విషయంపై కూలంకషంగా చర్చించిన ఈ బిస్బో వీడియో మీకు తప్పక నచ్చుతుంది. ​ ​ ​

28/04/2021

Bisbo Telugu Archive:

గత 50 ఏళ్లుగా రాజ్యమేలుతున్న మయన్మార్ మిలిటరీ జనరల్స్‌, ఓంగ్ సాన్ సూ చీ ని మూడుసార్లు పదవి నుండి తొలగించారు. మయన్మార్ యొక్క ఇటీవలి చరిత్రను, చైనా పట్ల దానికి ఉన్న ప్రేమతో కూడిన ద్వేషపూరిత సంబంధాన్ని, భారతదేశానికి దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఈ వీడియో తెలియజేస్తుంది.

27/04/2021

Bisbo Telugu Archive:
ఆర్టికల్ 370 ను రద్దుచేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మొదటి ఎన్నికలు - ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య ప్రక్రియగా అభివర్ణించబడ్డాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. పరస్పర విరుద్ధ భావాలు ఉన్నా, ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్న ఆరు ప్రాంతీయ పార్టీల గుప్కర్ కూటమి, మరియు BJP. పోటాపోటీగా జరిగిన ఈ DDC ఎన్నికలు భారతదేశపు ప్రజాస్వామ్య ప్రక్రియలో కాశ్మీరీల విశ్వాసాన్ని పునరుద్ధరించగలవా?
​ ​ ​&K

Bisbo Telugu Archive:

26/04/2021

Bisbo Telugu Archive:-
అంతరిక్షాన్ని జయించి, గురుత్వాకర్షణ లేకుండా, లేదా మైక్రోగ్రావిటీతో మానవులు జీవించవచ్చా, లేదా అని తెలుసుకోవడానికి అగ్రరాజ్యాలు కలసికట్టుగా చేసిన ప్రయత్నమే - అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) - ISS. కానీ ఇటీవల ఈ ప్రాజెక్ట్ వల్ల భారీ ఖర్చే తప్ప ఒనగూరే పెద్ద ప్రయోజనం లేదని పేర్కొంటూ ఆ ప్రాజెక్ట్ ను స్క్రాప్ చేయడానికి కాల్స్ వచ్చాయి. మరి ఆ కేంద్ర నిర్వహణలో వెచ్చించిన సమయం, కృషి మరియు దానిపై ఖర్చు చేసిన 100 బిలియన్ డాలర్ల నిజంగా నిష్ప్రయోజనమేనా? ఈ బిస్బో కధనంలో చేసిన తులనాత్మక విశ్లేషణ లో తెలుసుకోండి.

25/04/2021

𝗕𝗶𝘀𝗯𝗼 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗮𝗿𝗰𝗵𝗶𝘃𝗲:
వైట్‌హాట్ జూనియర్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం ఇటీవల పిల్లల పట్ల చాలా హానికారకంగా మారిందని, FOMO (Fear of missing out) అంటే “ఏదో పోగొట్టుకుంటున్నామేమో” అన్న భయాన్ని కలిగించి, దాని ద్వారా పిల్లల మనస్తత్వాలతో ఆడుకుంటున్నదని ఆరోపించారు. కొనుగోలుదారులు తమ products ను కొనేలా చేసేందుకు, ఉత్పత్తిదారులు కొన్ని మానవ భావోద్వేగాలను ఉత్తేజపరచి, ఎలా డబ్బు చేసుకుంటున్నారో, ఈ వీడియో లో బిస్బో మీకు చూపిస్తుంది. అన్నీ చట్టబద్ధమైన మార్గాలే...కానీ కొన్ని జనాలను దోచుకుంటున్నాయి.
𝗕𝗶𝘀𝗯𝗼 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗮𝗿𝗰𝗵𝗶𝘃𝗲

24/04/2021

చాలాకాలం నుంచి, హిందీ సినిమా పట్ల అనవసరమైన శ్రద్ధ కనబరుస్తూ, ప్రాంతీయ భాషా చిత్రాలను చిన్నచూపు చూడడం జరుగుతోంది. బాలీవుడ్ పాపులర్ మ్యాగజైన్లలో అధికమైన ప్రచారం, కవరేజి పొందుతోంది. ఇటీవల కాలంలో స్ట్రీమింగ్‌, OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో, హిందీ చిత్ర అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, ప్రాంతీయ భాషా చిత్రాల అగ్రశ్రేణి కధనాలకు, కొత్త తరహా content కు ముగ్ధులౌతున్నారు. చివరికు ప్రాంతీయ భాషా చిత్రాలు, బాలీవుడ్ కు గల ప్రజాదరణను అధిగమిస్తాయా?

Address


Alerts

Be the first to know and let us send you an email when Bisbo Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bisbo Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share