29/03/2023
*రేపు శ్రీరామ నవమి సెలవు దినం అయినప్పటికీ ఇంటి పన్నుల వసూలు కేంద్రం అందుబాటులో ఉంటుంది*.
*రాయచోటి ప్రజలు సద్వినియోగం చేసుకుని సకాలంలో పన్నులు చెల్లించండి*
*మున్సిపల్ కమీషనర్*
*గంగా ప్రసాద్*
సెలవు దినం అయినప్పటికి ప్రజల సౌకర్యం కొరకు మున్సిపల్ కార్యాలయం నందు ఇంటిపన్నుల వసూలు కేంద్రం అందుబాటులో ఉంటుంది- ప్రజలు ఇంటి పన్నులు,ఖాళీ జాగా పన్నులపై చెల్లించి వడ్డీ పూర్తిగా మినహాయింపు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. ఎం. యస్. నెం. 34 ఎం. ఏ. తేది. 16-03-2023 ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లో అన్ని నగరపాలక మరియు పురపాలక సంఘాలలో ఆస్తి మరియు ఖాళీ జాగా పన్నుల విషయం లో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలు మరియు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను పై విధించిన వడ్డీ ని వన్ టైమ్ మెజర్ గా మాఫీ చేయడం జరిగినది.
అయితే, రాయచోటి మున్సిపల్ పరిధిలో 12 రోజుల వ్యవధిలో 1కోటి 4లక్షలరూపాయలు ఇంటి పన్నుబకాయిలు
చెల్లింపుదారులు బకాయి ఉన్న ఈ ఆర్థిక సంవత్సరం తో ఒకే సారి చెల్లించి వడ్డీ మినహాయింపు పొందారని కోరారు
తేది. 31-03-2023 లోపు చెల్లించినట్లైతేనే ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. కావున, ఆస్తి పన్ను చెల్లింపుదారులు, ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ మినహాయింపు లబ్దిని పొంది మీ యొక్క ఆస్తి మరియు ఖాళీ జాగా పన్ను బకాయిలని వడ్డీ లేకుండా ఒకే సారి తేది. 31-03-2023 లోపు చెల్లించవలసినది గా విజ్ఞప్తి చేశారు.
పన్నులు మున్సిపల్ ఆఫీసు ఇంటి పన్నుల వసూల కౌంటర్ & మీ మీ వార్డు సచివాలయం ల లో చెల్లించవచ్చును. అంతే కాకుండా పన్నులను ఆన్-లైన్ ద్వారా (https://cdma.ap.gov.in/) నెట్-బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ / క్రెడిట్ కార్డు ల ద్వారా కానీ, UPI ద్వారా కానీ చెల్లించవచ్చునని వివరించారు.