16/05/2024
పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు వచ్చేస్తే…. అనే చిన్న ఆలోచన ఫలితమే ఈ పోస్టు… దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ పరిశీలనలు లేవు.. కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్ మాత్రమే ఇది… ఈ క్రింద ఇవ్వబడిన అంచనా ఫలితాలలో ఏదో ఒకటి నిజం కావచ్చు… నిజం కాకపోవచ్చు… జూన్ 4 న వెలువడే ఫలితాలు ఎవరూ ఊహించని విధం గా మాత్రం ఉంటాయని చెప్పవచ్చు.. వివిధ ఆప్షన్ల ను ఎంపిక చేసుకొని ఫలితాల అంచనా వేయడం జరిగింది. మరొక్క సారి చెప్పేది ఏంటంటే… ఇవి కేవలం సాధారణ అంచనా మాత్రమే… ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇక ఫలితాల విశ్లేషణ లోనికి వెళ్ళిపోదామా… (AP General Elections Results 2024)
ఆప్షన్ -1 ఫలితాలు:
YSRCP – 121 సీట్లు
TDP + JSP + BJP కూటమి – 54 సీట్లు . (TDP-49, Janasena- 4, BJP – 1)
విశ్లేషణ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా మళ్ళీ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఓడిపోతారు. మంత్రి వర్గం లోని కొందరు మంత్రులు అనూహ్యం గా ఓటమి పాలౌతారు. నవరత్నాలు ప్లస్ అమలు పై దృష్టి పెడతారు. విశాఖ పట్నం నుండి పాలన ప్రారంభిస్తారు. వైసీపీ వ్యతిరేక శక్తులపై ఉక్కు పాదం మోపుతారు. కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వానికి ఎప్పటిలాగానే లోపాయికారీ మద్దతు కొనసాగిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంటే ప్రత్యేక హోదా అంశం, తనపై కేసుల మాఫీ వంటి అంశాలు తెరమీదకు తీసుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి. కేంద్రం లో ప్రభుత్వ ఏర్పాటు కు ఇండియా కూటమి కి తన మద్దతు అవసరం అయితే మాత్రం జగన్ ప్రత్యేక హోదా, కేసుల అంశం తో మద్దతు ఇస్తారు. (Vijay News Telugu)
ఆప్షన్ -2 ఫలితాలు:
TDP +JSP+ BJP కూటమి – 112 సీట్లు (TDP – 99, JANASENA- 12, BJP – 1)
YSRCP – 63 సీట్లు
విశ్లేషణ: కేవలం 63 సీట్లు సాధించి వైసీపీ ఓటమి పాలౌతుంది. 112 సీట్లు గెలుచుకున్న కూటమి అధికారం లోనికి వస్తుంది. కూటమి తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాల్గవ సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్, లోకేష్ అసెంబ్లీ కి ఎన్నికవుతారు. కాబట్టి వారికి మంత్రివర్గం లో చోటు లభిస్తుంది. జనసేన నుండి పవన్ కళ్యాన్ తో పాటు మరొక ఇద్దరు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ నుండి ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు కు స్పీకర్ పదవి లేదా మంత్రి పదవి లభిస్తుంది. బీజీపీ నుండి ఎన్నికైన ఒకరికి కూడా మంత్రివర్గం లో చోటు లభిస్తుంది.
అమరావతి అంశాన్ని తెరమీదకు తెస్తారు. అన్నా క్యాంటీన్ లు తెరుస్తారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒకటి రెండేళ్ళు కూడా గడవక ముందే జగన్ అసెంబ్లీ కి గుడ్ బై చెప్పేసి ప్రజలలో తిరగడానికి ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తం గా మరొక పాదయాత్ర కు అంకురార్పణ జరుగుతుంది. కానీ ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి కేంద్రం లో బీజేపీ సహకారం తో జగన్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి. దానితో వైసీపీ ప్రాధమిక నాయకత్వ లోపం తో (షర్మిల, విజయమ్మ జగన్ తో లేరు కాబట్టి) బొత్స, పెద్దిరెడ్డి వేరే గ్రూపులు నడిపే అవకాశాలు ఉంటాయి…
ఆప్షన్ -3 ఫలితాలు:(AP General Elections Results 2024)
YSRCP – (98 – 105 సీట్లు)
TDP + JSP + BJP కూటమి – (70 – 77 సీట్లు)
విశ్లేషణ : కేవలం అత్తెసరు సీట్లు పొంది వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ నంబర్ 88 కి కేవలం 10 లేదా 15 సీట్ల తేడా వద్ద కూటమి నిలిచి పోతుంది. దీనితో అధికార ప్రతిపక్షాల మధ్య ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం తెర మీదకు వస్తుంది. కూటమికి బీజేపీ అండ ఉండటం తో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి వేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కనీసం 20 – 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి కూటమి తో చేతులు కలుపుతారు. దానితో వైసీపీ ప్రభుత్వం కనీసం రెండేళ్ళు కూడా పాలించ కుండానే అధికారాన్ని కోల్పోతుంది.
బీజేపీ యేతర రాష్ట్రాలలో ప్రాంతీయ ప్రభుత్వాలను ఏ విధం గా అయితే కూల్చి వేస్తున్నారో అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్లయి చేసే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వైసీపీ ప్రయత్నించడమే కాకుండా కూటమి లోని ఎమ్మెల్యే లను ఆకర్షించ డానికి ప్రయత్నం చేస్తుంది. ముందుగానే ప్రయత్నం చేస్తే ఫలితాలు బాగుంటాయి. కానీ ఊహించని విధంగా బీజేపీ డైరక్షన్ లో వైసీపీ ప్రభుత్వం కూల్చివేత కు కుట్ర జరుగుతుంది. ఈ ఐదేళ్ళు ఇటువంటి రాజకీయాలతో ప్రజలు విసుగు చెందే పరిస్థితి ఉంటుంది.. సంక్షేమం అని వైసీపీ, అభివృద్ధి అని కూటమి ప్రయత్నిస్తారు కాని ఎవరూ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేరు.
ఈ ఐదేళ్ళ లో జగన్ పై మతపరమైన దాడి చేస్తూ బీజేపీ రాష్ట్రం లో వేళ్ళూను కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవసరమైన ప్రతి చోటా మత పరమైన అంశాలతో వైసీపీ ని ఇరుకున పెడుతుంది. జగన్ క్రైస్తవుడు అంటూ ప్రచారం చేసి అనేక పాదయాత్రలు, రధయాత్రలు చేసి ఆంధ్రప్రదేశ్ లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసి చాలా వరకు విజయం సాధిస్తుంది.
ఆప్షన్ -4 ఫలితాలు
TDP + JSP + BJP కూటమి : (140 + సీట్లు)
YSRCP : (30 – 35 సీట్లు)
విశ్లేషణ : ఫలితాలు ఏకపక్షం గా ఉంటాయి కాబట్టి కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. లోకేష్, పవన్, రఘు రామ వంటి వారికి మంత్రి పదవులు లభిస్తాయి. అమరావతి అంశం తెర మీదకు తెస్తారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం లో ఉంటుంది కాబట్టి కొంత వెసులుబాటు లభిస్తుంది. బీజేపీ పూర్తి స్థాయి లో ఆంధ్రప్రదేశ్ లో తన కార్య కలాపాలు విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది.(AP General Elections Results 2024)
ఆప్షన్ -5 ఫలితాలు
YSRCP : (140 +)
TDP + JSP + BJP కూటమి : (30 – 35 సీట్లు)
విశ్లేషణ : వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. పధకాలు అన్నీ కొనసాగుతాయి. అవసరాన్ని బట్టి కేంద్రానికి మద్దతు కొనసాగిస్తారు. తెలుగుదేశం పార్టీ నుండి వలసలను ప్రోత్సహిస్తారు. బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు అవసరం లేకపోతే మాత్రం అడుగడుగునా అవాంతరాలు ఏర్పడతాయి. చివరికి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినట్టు జగన్ ను కూడా అరెస్టు చేయవచ్చు. ద్వితీయ శ్రేణి నాయకత్వ సమస్య తో వైసీపీ లో లుకలుకలు సృష్టించడమే ప్రధాన ధ్యేయం గా పనిచేస్తారు. (Vijay News Telugu)
ఐదు ఆప్షన్ లపై విశ్లేషణ – Final Verdict:(AP General Elections Results 2024)
అధిక మెజార్టీ తో అధికారం లోనికి వచ్చినా, అత్తెసరు మెజార్టీ తో అధికారం లోనికి వచ్చినా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారం లో కొనసాగడం మాత్రం కష్టం అనేలా చేస్తారు. మూడు రాజధానులు ముందుకు తీసుకు పోతారు గానీ కేంద్రం నుండి సరైన సహకారం లభించక పోవచ్చు. బీజేపీ జగన్ ను వ్యక్తిగతం గా టార్గెట్ చేసి బద్నాం చెయ్యడానికి ప్రయత్నం చేస్తుంది. గడచిన ఐదేళ్ళు (2019-2024) పాలనే బాగుంది అని అనుకునేలా చేస్తారు అందరూ….. మధ్యలో ప్రజలే ఇబ్బందులు పడతారు.
తెదేపా కూటమి అధిక మెజార్టీ తో అధికారం లోనికి వచ్చినా, కొద్దిపాటి మెజార్టీ తో అధికారం లోనికి వచ్చినా అమరావతి అంశాన్ని ప్రధానం గా తీసుకొని చెయ్యవలసిన చట్టాలు అన్నీ చేసి ఏకైక రాజధాని గా చేస్తారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తారు. దీనితో నిధుల లేమి అంశం తెర మీదకు వస్తుంది. అప్పులు దండిగా తెచ్చి పధకాలు అమలు చేస్తారు. ప్రస్తుత వాలంటీర్లు తొలగించబడి కూటమి కి చెందిన వాలంటీర్లు నియమింప బడతారు.. కొన్ని పథకాలు అమలు పట్ల మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు గానీ రెండు మూడేళ్ళ కే వాటిని ఎత్తివేసే పరిస్థితి రావచ్చు. ఒకవేళ చంద్రబాబు ఏదైనా అనారోగ్య సమస్య లేదా కోర్టు తీర్పుల వలన ముఖ్యమంత్రి పదవికి దూరమైతే మాత్రం కూటమి లో లుకలుకలు వస్తాయి. నాయకత్వ సమస్య తో కూటమి లో చీలికలు వస్తాయి. బీజేపీ ఈ పరిస్తితులన్నింటినీ తనకు అనుకూలం గా మార్చు కోవడానికి ప్రయత్నం చేస్తుంది. (AP General Elections Results 2024)
PS: ఈ పోస్టు లో వివరించిన అంశాలు అన్నీ ఊహాగానాలే….. దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తూ రాయబడిన పోస్టు మాత్రమే ఇది. ప్రస్తుత పరిస్థితులను బట్టి పైన ఇవ్వబడిన మూడవ ఆఫ్షన్ (Option -3) జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఏ ఆప్షన్ రావచ్చు అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. (Vijay News Telugu)
-విజయ్ కుమార్ బోమిడి, ఎడిటర్, విజయ్ న్యూస్ తెలుగు
(14- 05 – 2024)