PRADEEP G FACTS

  • Home
  • PRADEEP G FACTS

PRADEEP G FACTS voice of people

మార్పు " చేడు వదిలేస్తూ " మంచిని స్వికారించాడామే నూతనం "ద్వేషం, ఈర్ష్య, అంహం, మూడు వదిలేసి మానవత్వ ప్రేమ, సహనం,అనేమూడు  ...
02/04/2022

మార్పు " చేడు వదిలేస్తూ " మంచిని స్వికారించాడామే నూతనం "

ద్వేషం, ఈర్ష్య, అంహం, మూడు వదిలేసి

మానవత్వ ప్రేమ, సహనం,అనే
మూడు సంపద పేరిగి ....🤝

దేశ ప్రజల అందరూ సమా సమాజ దిశగ పరుగెడూతూ సర్వ సంపదలతో ఉండాలని మా సమయం ఫౌంఢేషన్ స్వచ్ఛంద సంస్థ తరుపున దేశ ప్రజల అందరికీ

"శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...🙏🎊🎊🪴💐💐🌾🌾🪴

ఇట్లు
జై హింద్ ప్రదీప్ జీ 🇮🇳
(సామాజిక రచయుత&కార్యకర్త వ్యవస్థాపక అధ్యక్షులు సమయం ఫౌంఢేషన్ స్వచ్ఛంద సంస్థ ల ఐక్య వేదిక )

|🇮🇳భారత గణతంత్ర దినోత్సవ🇮🇳             శుభాకాంక్షలు_____________________________(భారత దేశం యొక్క రాజ్యాంగ అమలు ప్రారంభమై...
26/01/2022

|🇮🇳భారత గణతంత్ర దినోత్సవ🇮🇳
శుభాకాంక్షలు
_____________________________

(భారత దేశం యొక్క రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజు)

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు[1]. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.

భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు.

చరిత్ర
~~~

1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు.ఆ రోజును స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు.

వేడుకలు
~~~~~

గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశరాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు.

దేశ ప్రజలందలరికి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹

ఇట్లు
జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
సామాజిక రచయుత&కార్యకర్త వ్యవస్థాపక అధ్యక్షులు సమయం పౌంఢేషన్

🌹🌹 *సంక్రాంతి శుభాకాంక్షలు*🌹🌹ప్రత్యక్షదైవం మకరరాశిలోకి అడుగిడు వేళ పుణ్యకాలమైన ఉత్తరాయణం ఆరంభంలో, మనలోని చెడుని భోగి మంట...
15/01/2022

🌹🌹 *సంక్రాంతి శుభాకాంక్షలు*🌹🌹

ప్రత్యక్షదైవం మకరరాశిలోకి అడుగిడు వేళ పుణ్యకాలమైన ఉత్తరాయణం ఆరంభంలో, మనలోని చెడుని భోగి మంటలలో మసి చేసి, జీవితాలు పంచిన పెద్దలను స్మరించుకుంటూ, ధాన్యపు సిరులు మన ఇల్లను చేరిన వేళ, పసుపు కుంకుమతో పాడి పంటలకు పూజచేసి,

ఆనందాల విరులు అంబరాన్ని తాకేలా ఇంటిల్లపాది సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని మనసా వాచా కోరుకుంటూ...!!

I love the society

ఓం నమో వేంకటేశాయ 🙏


ఇట్లు
జై హింద్ ప్రదీప్ జీ🇮🇳
సామాజిక రచయుత&కార్యకర్త వ్యవస్థాపక అధ్యక్షలు సమయం ఫౌంఢేషన్

https://youtu.be/sUEtwB1pb0A  రాష్ట్రల ప్రజల అందరికీ మా సమయం ఫౌంఢేషన్ స్వచ్ఛంద సంస్థ తరుపున మొదటి ధన్య రాసులు భోగిమంటల  ...
14/01/2022

https://youtu.be/sUEtwB1pb0A

రాష్ట్రల ప్రజల అందరికీ మా సమయం ఫౌంఢేషన్ స్వచ్ఛంద సంస్థ తరుపున మొదటి ధన్య రాసులు భోగిమంటల "భోగి" శుభాకాంక్షలు
🌾🌾🌾🌾

ఇట్లు
జై హింద్ ప్రదీప్ జీ 🇮🇳
సామాజిక రచయుత&కార్యకర్త వ్యవస్థాపక అధ్యక్షలు సమయం ఫౌంఢేషన్

do subscribe PRADEEP JI OFFICIAL YOUTUBE channel and send me your motivation one minute videos 📹

అంతర్జాతీయ మానవ హక్కుల దినం: మనిషిగా మీకున్న హక్కులు ఏమిటో మీకు తెలుసా... ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది?ఈ రోజు ...
10/12/2021

అంతర్జాతీయ మానవ హక్కుల దినం: మనిషిగా మీకున్న హక్కులు ఏమిటో మీకు తెలుసా...
ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది?

ఈ రోజు మానవాళి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈరోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది.

ఐక్యరాజ్యసమితి 'సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ -యూడీహెచ్‌ఆర్)'ను ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబరు 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.

మానవ హక్కుల చరిత్రలో- ఈ డిక్లరేషన్ ఒక ప్రధానమైన పత్రం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండేళ్లలో దీనిని రూపొందించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు.

అన్ని దేశాలు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా ఈ పత్రాన్ని నిర్దేశిస్తూ 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచమంతటా పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించింది. డిక్లరేషన్‌ ఏం చెబుతోంది?

పీఠికలో ఏముంది?

మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతిలకు పునాది.

మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు క్రూరమైన దుష్కృత్యాలకు కారణమయ్యాయి. ఇవి మానవాళి అంతరాత్మకు గాయం చేశాయి. భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష.

నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా)తో రక్షించాలి.

దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం.

ఐక్యరాజ్యసమితి ప్రజలు ఈ పత్రంలో ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువపై, స్త్రీ,పురుషుల సమాన హక్కులపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. వీరు విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించటానికి సంకల్పించారు.

ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు ప్రతిన బూనాయి.

ఈ ప్రతిజ్ఞను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైనది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తోంది.

ప్రతి వ్యక్తీ, సమాజంలోని ప్రతి విభాగమూ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ, విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించటానికి కృషి చేయాలి.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన, ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి.

_ సమయం ఫౌంఢేషన్

--------------------------------------నేను మేధావినని నాకు తెలుసు.        ఎందుకంటే....నాకేమి తెలియదని తెలుసుకాబట్టి.     ...
18/11/2021

--------------------------------------
నేను మేధావినని నాకు తెలుసు.
ఎందుకంటే....
నాకేమి తెలియదని తెలుసుకాబట్టి.
- సోక్రటీస్. --------------------------------------

ప్రతిభ అనేది ఒక్క శాతం ప్రేరణ, తొంభైతొమ్మిది శాతం అవిరళకృషి." ఇతరులనుండి నీవు ఏమిఆశిస్తావో దానినే నీవు ఇతరులకు చేయడం నిజ...
18/11/2021

ప్రతిభ అనేది ఒక్క శాతం ప్రేరణ, తొంభైతొమ్మిది శాతం అవిరళకృషి.

" ఇతరులనుండి నీవు ఏమిఆశిస్తావో దానినే నీవు ఇతరులకు చేయడం నిజమైన మానవధర్మం."

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరిం...
04/11/2021

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి,భారతదేశ ప్రజల అందరికీ మా సమయం ఫౌంఢేషన్ తరుపున.

దీపావళి శుభాకాంక్ష లు
🎉🎉🎉🎊🎉🎉🎉🎉

ఇట్లు
______

జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
సామాజిక రచయుత & కార్యకర్త వ్యవస్థాపక అధ్యక్షులు సమయం ఫౌంఢేషన్(UFNC)

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍__27/10/2021Wednesday  '__ప్రియమైన హుజురాబాదు ఓటరు మ...
27/10/2021

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍
__27/10/2021Wednesday '__

ప్రియమైన హుజురాబాదు ఓటరు మహశ్రాయా ఆలోచించు ఒక్క నిమిషాం ,ఓటు మనందరి గొప్ప ఆయుధం ఒకప్పుడు కొందరికి మాత్రమే అంకితమైన ఓటు భారత దేశ పవిత్ర గ్రంథం రాజ్యాంగం ద్వార డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఇచ్చిన గొప్ప వరం ఇప్పుడు 18 సంవత్సరాల నిండినా ప్రతి ఒక్కరికి తమ ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు ఇష్టమైన వారిని తమ కోసం,తమ తమ పరిపాల కోసం నాయకులను ఎన్నుకునే హక్కు ఈ ఓటు హక్కు, ఒక్క ఆలోచన తమ భవిష్యత్ కార్యాచరణ దిశగ చేసుకో నిజాయతి గా ఓటు వేసి నిర్భయంగా ప్రశ్నించు 🤝

ఓటు వెయడం మాత్రం మరిచిపోకు
*30/10/2021* నీ హక్కును విస్మరించాకు
730 రోజుల నీ భవిష్యత్ అని మరువకు .

" ఏలాంటి అపోహ లకు, నోనుకాండా ఎన్నికల అధికారులకు ఎన్నికల సిబ్బందికి సహకారించి మీ
విలువైనా ఓటు వేసి ప్రశాంతంగా ఈ ఉప ఎన్నికల జరుపుకోవాలని సమప్త హుజూరాబాద్ ప్రజల కు , యువత అందరూ ముందుకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మా సమయం ఫౌండేషన్ సచ్చంద సంస్థ ద్వార విజ్ఞప్తి చేస్తున్నం "

ఇట్లు
________
జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
సామాజిక రచయుత&కార్యకర్త
వ్యవస్థాపక అధ్యక్షులు సమయం ఫౌండేషన్
9866674412,

దేశ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమిశుభాకాంక్షలు 'రాఖీ , రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో *శ...
22/08/2021

దేశ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమిశుభాకాంక్షలు

'రాఖీ , రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో *శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ* అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర , పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు , అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.

*రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే*

పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను , లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

*రాఖీపౌర్ణమి చరిత్ర*

*ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం*

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.

*శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి*

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ *" యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల"* భావం - ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)

*అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ*

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి , అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.

*హయగ్రీవావతారం*

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు.

రక్షా బంధన్ శుభాకాంక్షలు 💐💐💐

జై హింద్ ప్రదీప్ జీ
Social writer&activist founder and chairman samayam Foundation pg news social media Rythu ikyatha karyacherana vedica

Yes trying is best option for success then once you one day
26/07/2021

Yes trying is best option for success then once you one day

గురవంటే కేవలం చదువు మాత్రమే కాదు జీవిత సారశం నెర్పేవారు కూడామనకు మంచిని ,నిజాయతి, ప్రేపేను భోదించేవి ఏవైనా ఎవరైనావాటికి ...
24/07/2021

గురవంటే కేవలం చదువు మాత్రమే కాదు జీవిత సారశం నెర్పేవారు కూడా

మనకు మంచిని ,నిజాయతి, ప్రేపేను భోదించేవి ఏవైనా ఎవరైనా
వాటికి వయస్సు తో పని లేదు మన గురువులే నువ్వు నేర్చకోవలనుకుంటే ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకమే.....1

నాకు జ్ఞానోదయనికి మూలం మైనా
నా ముగ్గురి గురివులకీ నమసుమంజనాలు
గురు పౌర్ణిమ శుభాకాంక్షలు
🪴🪴🪴🪴🪴🪴🪴⚘

జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
Social writer&activist
Founder and chairman samayam Foundation pg news social media Rythu ikyavedika karyacherana vedica

నా దేశ ప్రజల అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు💐💐సహనం అంటే దండించే అధికారం ఉన్న దండించకపోవడం, ప్రేమ అంటే వదిలిపెట్...
20/07/2021

నా దేశ ప్రజల అందరికీ
తొలి ఏకాదశి పర్వదిన
శుభాకాంక్షలు💐💐

సహనం అంటే దండించే అధికారం ఉన్న దండించకపోవడం, ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని వున్నా మారకుండా ఉండడం.

Note: మాస్క్ ధరించుట భౌతిక దూరం వ్యక్తిగత పరిశుభ్రత 😷🤿 పాటించి కరోనాను అరికాడుదాం

MUST BE FOLLOW
COVID-19 PRECAUTIONS
SMS
SOCIAL DISTANCE
MASK
SANITIZATION

జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
Social writer&activist
Founder and chairman samayam Foundation pg news social Rythu ikyavedika karyacherana vedica

15/07/2021

లోకం తీరు✖️✔️

ఉన్నపుడు లేని ఆప్యాయతలు , ప్రేమలు , పోయక ఎందుకు హృదా గుట్టలకు రోడ్లకు పెట్టే నీ అహరాలేందుకు ??

విలైతే బ్రతికున్నపుడే అందరిని పలకరించు మిత్రమా

_సమయం ఫౌండేషన్

Do not alienate those who hate you, those who wait for them, those who admire and admire you. _samayam Foundation jai hi...
15/06/2021

Do not alienate those who hate you, those who wait for them, those who admire and admire you. _samayam Foundation jai hind |🇮🇳

Happy  Sunday
13/06/2021

Happy Sunday

26/05/2021

సమస్త లోకలకు సత్యం, శాంతి,అహింస ధర్మ బోదన చేసిన మహర్షి గొప్ప తత్వవేత్త గౌతమ బుద్ధ జయంతి సందర్భంగా నా దేశ ప్రజలకు బుద్ద పౌర్ణమి శుభాకాంక్షాలు_
సమయం ఫౌంఢెషన్

జై హింద్ ప్రదీప్ జీ|🇮🇳
Founder and chairman samayam Foundation pg news social media

ఈద్ ముబారక్క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనలతో నెల రోజుల ఉపవాస దీక్షను ముగించుకొని షవ్వాల్ మాస నెలవెంక దర్శనంతో నేడు ...
14/05/2021

ఈద్ ముబారక్
క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనలతో నెల రోజుల ఉపవాస దీక్షను ముగించుకొని షవ్వాల్ మాస నెలవెంక దర్శనంతో నేడు అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరువుకుంటున్న తెలుగు రాష్ట్ర,ల ముస్లిం సోదరి సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్..



ఇట్లు.
జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
Founder and chairman samayam Foundation pg news social media social activist

విలైతే మొక్కలు  నాటాండి డూడ్స్
13/05/2021

విలైతే మొక్కలు నాటాండి డూడ్స్

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍____________01/may/2021_________________మే 1ఈ రోజు అ...
01/05/2021

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍
____________01/may/2021_________________

మే 1ఈ రోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1886, మే 1న షికాగోలని హే మార్కెట్లో జరిగిన పోరాటాన్నే నేడు ‘మే డే’గా నిర్వహిస్తున్నారు. నాడు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణకాండను నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు జరిగాయి. షికాగో మారణకాండలో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ.. ఏటా మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మే డే వేదికగా మారింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. 1923 నుంచి ఇండియాలో ‘మే డే’ను పాటించారు. కరోనా వల్ల గతేడాది నుంచి ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం. వారిలో ధైర్యాన్ని నింపడంతోపాటు మే 1న ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ.. శ్రామిక సోదరులకు

కరోనా పై పోరులో కవచాలై నిలుస్తున్న కార్మిక లోకానికి,

శ్రమను గౌరవిద్దాం- శ్రమను గుర్తిద్దాం
శ్రమనే ఆయుధంగా మలుచుకుందాం.
జయహో...శ్రామికుడా🙏

‘మే డే’ శుభాకాంక్షలు

⚘⚘⚘⚘⚘⚘⚘⚘

సమయం ఫౌంఢేషన్

జై హింద్ ప్రదీప్ జీ|🇮🇳
Founder and chairman of samayam Foundation &pg news social media &pradeep G facts

25/04/2021

ప్రాణం ఒక్క సారే పోతాది కానీ ప్రాణం కాంటే విలువైనది మాట,నమ్మకం అవి పోతే ప్రాణం ఉన్న కూడా నిర్జీవే ప్రేమించిన నేర్చుకో ద్వేషిచడం కాదు సమయం ఫౌండేషన్ Good morning .....😁

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍happy Ugadi _____13/April/2021_____ప్లవ నామ సంవత్సర ...
13/04/2021

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍happy Ugadi
_____13/April/2021_____

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం🙏
వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది.
శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది.
ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం?
ప్లవ అంటే, దాటించునది అని అర్థం.
*"దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం......."* దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.
వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా.
ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.
అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం🙏🏻🙏🏻🙏🏻 మితృలందరికీ ఉగాది శుభాకాంక్షలు🙏🏻🥣

సామాజిక రచయుత ✍️
జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳
సమయం ఫౌంఢేషన్
నేరేళ్ల ఐక్యత అభివృద్ధి

Do subscribe PRADEEP G STUDIO 👇👇👇👇👇👇👇👇👇👇👇👇రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు దానికి తోడు ప్రమాదాలు,వాహనాల డ్యామేజ్, వ...
07/04/2021

Do subscribe PRADEEP G STUDIO
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు దానికి తోడు ప్రమాదాలు,వాహనాల డ్యామేజ్, వాటి వాడకం కోసం పూర్తి వీడియో చూడండి
https://youtu.be/oNR0BoIxTFg

all two wheels pickup mileage caring about video please support me

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍_____28/march/2021________హోళీ రంగుల కేళీ______HAPPY...
28/03/2021

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍
_____28/march/2021________

హోళీ రంగుల కేళీ
______HAPPY HOLI______

వసంత రుతువు ఆరంభం ఈరోజుననే కాబట్టి హోళీ పండుగ ఈరోజునే జరుపుకుంటారు.
దుష్ట శక్తులపై విజయాలకు సంకేతంగా కూడా హోళీ జరుపుకుంటారు.
హిరణ్యకశిపుడు సోదరి అయిన *హోళిక* యొక్క దహనమైన రోజు నుండే హోళీ పండుగ ప్రారంభమైంది.
విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడిని శిక్షించేందుకు తండ్రి హిరణ్యకశిపుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు.
అందులో బాగంగానే తన సోదరి హోళిక ఒడిలో చితిపై కూర్చోవాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు.
హోళికకు నిప్పు వల్ల ఎలాంటి హాని కలగదనే వరంతోపాటు ఆమె ధరించే శాలువా లాంటి వస్త్రం రక్షణ కల్పిస్తుంది.
తండ్రి ఆదేశాల ప్రకారం ప్రహ్లాదుడు ఆమె(మేనత్త)ఒడిలో కూర్చుని శ్రీహరిని ప్రార్థిస్తాడు.
చితిమంటలు ప్రారంభం కాగానే అనూహ్యంగా రక్కసి హోళిక కప్పుకున్న రక్షణ వస్త్రం ఎగిరి ప్రహ్లాదుడిని కప్పడంతో ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది.
మంటల్లో కాలకుండా ఆమెకు వరం ఉన్నప్పటికీ విష్ణుభక్తుడికి కీడు తలబెట్టే ప్రయత్నం చేసింది కనుక హోళిక దహనమైంది.
దానికి గుర్తుగానే హోళీ పండుగ జరుపుకుంటున్నాం.

హోళీ పండుగ శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐

జై హింద్ ప్రదీప్ జీ|🇮🇳
సమయం ఫౌంఢేషన్
Share your amazing thoughts with samayam foundation whatsapp 📱9866674412

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍_____23/march/2021______ఎందరో మహనీయుల త్యాగల గణతే మన...
23/03/2021

Respecteders and Dear and Near followers friends Think Be positive ✍
_____23/march/2021______

ఎందరో మహనీయుల త్యాగల
గణతే మన దేశ చరిత్ర
వారిని స్మరించుకోని
అచరించించడామే మన భవిత.🙏🙏🙏🙏🙏

దేశం కోసం బ్రిటిష్ వారిని గడగడలాడించిన ప్రముఖ విప్లవ అమరవీరులు భగత్ సింగ్,సుఖ్ దేవ్,రాజ్ గురుల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ,ఆ మహనీయులకు మా ఫౌంఢేషన్ పక్షాన జోహార్లు తెలియజేస్తున్నాం..🙏🙏🙏
జోహార్లు అమరవీరులకు జోహార్లు..✊

జై హింద్ ప్రదీప్ జీ|🇮🇳
సమయం పౌంఢేషన్
Share your amazing ideas with samayam Foundation whatsapp phone 📱

Address


Alerts

Be the first to know and let us send you an email when PRADEEP G FACTS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PRADEEP G FACTS:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share