Mana mancherial mana jila

  • Home
  • Mana mancherial mana jila

Mana mancherial mana jila తోటివారికి ఏవిధంగా అయిన తోచిన సహాయం ?

చెన్నూరు నియోజకవర్గ బిడ్డగా అక్కడే పుట్టి, పెరిగిన తనకు ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం  కల్పిస్తూ,రాబోయే ఎన్నికల్లో కా...
24/08/2023

చెన్నూరు నియోజకవర్గ బిడ్డగా అక్కడే పుట్టి, పెరిగిన తనకు ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తూ,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను తనకు కానీ, తన భార్యకు కానీ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్, చెన్నూరు నియోజకవర్గ నాయకుడు డాక్టర్ దాసారపు శ్రీనివాస్, ఆయన సతీమణి కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్ కి వెళ్లి,తన దరఖాస్తును అందజేశారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని   ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్...
24/08/2023

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు . బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి బిజెపి శ్రేణులు తరలివచ్చారు .అక్కడే ఉన్న పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. .బిజెపి జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొనే క్రమంలో పోలీసులకు బిజెపి నాయకుల మధ్య తోపులాట జరిగింది .కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది .పోలీసులు బిజెపి నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు .
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ ...
మంచిర్యాల పట్టణంలో గత మూడు సంవత్సరాల నుండి గోదావరి వరదలు వచ్చి పట్టణంలోని రాం నగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, పద్మశాలి నగర్, బాలాజీ నగర్ లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి పెద్ద మొత్తంలో నష్టపోయరని భాదితులకు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం వరదలు వచ్చి మంచిర్యాల పట్టణం ముంపు కు గురవుతుందని దానికి కరకట్ట నిర్మించి ప్రజలను ముంపు నుండి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు . పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల గా పనిచేస్తున్నారని ఆరోపించారు . పోలీసుల వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు .

23/08/2023
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక 02 వార్డులో BRSV నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ గారి ఆధ్వర్యంలో 10 తరగతి...
27/03/2023

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక 02 వార్డులో
BRSV నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ గారి ఆధ్వర్యంలో 10 తరగతి బాలికలకు పరీక్ష పాడ్స్, పెన్నుల పంపిణీ...

ఈరోజు నస్పూర్ మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ ఉన్నత బాలికల పాఠశాలలో రాబోయే బోర్డు ఎక్సమ్స్ ని దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి విద్యార్థినిలకు BRSV నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ గారి ఆధ్వర్యంలో సుమారు 42 మంది బాలికలకు పరీక్ష పాడ్స్ మరియు పెన్నుల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దగ్గుల మధు గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు బాల బాలికల కోసం ఎన్నో పాఠశాలలను ప్రారంభించి ఎందరో పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థిలకు నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజన వసతులను కల్పించడం, యూనిఫామ్, స్కూల్ బ్యాగులు అన్ని వసతులను కల్పిస్తూ విద్యార్థుల ఉన్నత స్థాయిలో చూడాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.మీకు ఏ ఆపద ఉన్న మా దృష్టికి తీసుకు వస్తే BRSV విద్యార్థి విభాగం ముందుండి పోరాడుతుందని అన్నారు.అదే విధంగా గత సంవత్సరంలో వచ్చిన విధంగానే ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా ఫలితాలను మండల,జిల్లా స్థాయిలో తీసుకు వచ్చి నస్పూర్ కస్తూర్బాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలను రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాని అన్నారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య గారు,ప్రిన్సిపాల్ మౌనిక మేడం గారు మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు సాయికిరణ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇండ్ల కిరణ్ నియోజకవర్గ నాయకులు సాజిత్ చోటు నస్పూర్ పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కాటంరాజు యువజన విభాగ సీనియర్ నాయకులు మండల క్రాంతి కుమార్, యువజన విభాగా ఉపాధ్యక్షులు కందుల ప్రశాంత్ , సాయి , జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ సాజిద్ , తాజ్ చింటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Press note05/03/2023మాంచెరియల్ జిల్లా• జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో 05th మార్చ్ 2023 రోజున నస్ప...
05/03/2023

Press note
05/03/2023
మాంచెరియల్ జిల్లా

• జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో 05th మార్చ్ 2023 రోజున నస్పూర్ లోని శ్రీ రామ చంద్ర మిషన్ లో జిల్లా స్థాయి లో డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులు కె.వి ప్రతాప్ గారు సీనియర్ అడ్వకేట్ మరియు డాక్టర్ రాజా రమేష్ ( జి. ఎస్. ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ) పాల్గొనడం జరిగింది.

జే సి ఐ మంచిర్యాల ప్రెసిడెంట్ ఆరుముళ్ళ రాజు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలో ని వివిధ పాటశాలల్లో లో200 విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

అదే విధంగా జె సి ఐ టాలెంట్ టెస్ట్ లో విఐజయం సాదించిన విద్యార్థుల కు సర్టిఫికెట్ బహుకరించడం
జరిగింది.

వివిధ విభాగాల్లో తరగతులను బేస్ చేసుకుని 1 నుండి 3 వ తరగతి విభాగం లో మొదటి బహుమతి ఎం.శ్రీ లౌక్య కేంద్రీయ స్కూల్ ,
రెండోవ బహుమతి బి.సర్గి, ఆదిత్య హై స్కూల్, మూడవ బహుమతి జి. భవ్య

4 నుండి 6 వ తరగతి విభాగము లో మొదటి బహుమతి అక్షయ , 2వడి కే. లోహిత్. 3వది అశ్విత.

7 నుండి 9 వ తరగతి విభాగం
మొదటి బహుమతి లో హిన్మయి శ్రీ, 2వ జవేర్నియా, 3వ అదీప్ బహుమతులు గెలిచుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి కె.వి ప్రతాప్ గారు మాట్లాడుతూ మొదటి టీచర్ అమ్మ , రెండవ టీచర్ నానా , వారు మంచి సత్ప్రవర్తన తో పెంచితే మంచి విద్యార్థులు గా పెరు పొంది విజయనికి దోదహ పడతారు అని అన్నారు.

మరొక్క అతిధి డాక్టర్ రాజా రమేష్ గారు మాట్లాడుతూ
ఈ పోటీల్లో విజయం సాధించిన వారిని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తామని పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీల్లో విజయం సాధించిన పిల్లలకి ముఖ్య అతిథిగా వచ్చిన GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ గారితో బహుమతులు అందచేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి విద్యార్ధులనకు చదువుతో పాటు ఆటపాటలతో ఉండి మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని అలాగే తల్లి తండ్రులకి మంచి పేరు తీసుకువచ్చి ప్రతీ ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో జెసి ఆకనపల్లి సురేష్,జెసి గున్ రాజు, జెసి వెంకటేష్,జేసీ సుమంత్ చైతన్య, జేసీ వెంకటేశ్వర్లు, లత, మహేష్, ప్రశాంత్, షర్రుక్ తదితరులు పాల్గొన్నారు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో *గౌరవ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు* బిఆర్ఎస...
17/02/2023

మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో

*గౌరవ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు*

బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ గారి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు ....

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు విజిత్ కుమార్ గారు మరియు మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నియోజవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేంద్రం ఢిల్లీ మెడలో వంచి తెలంగాణ సాధించిన మహాయోధుడు దేశ తలమానిక దిశలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోటి ఎకరాల సాగు భూమికి నీరు అందించే మహోత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు శ్రీకారం చుట్టారు ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు రైతు బీమా దళిత సోదరుల కోసం దళిత బంధ మహోత్తర కార్యక్రమం విద్యార్థుల కోసం కేజీ టు పీజీ ఉచిత విద్య రెసిడెన్షియల్ పాఠశాలలో సన్న బియ్యం మధ్యాహ్న భోజన గురుకుల పాఠశాలను మెడికల్ కాలేజీలను భారత దేశ తల మనదిశలోని కెసిఆర్ గారి నాయకత్వం రావాలి అదే మాకు శ్రీరామరక్ష అని ప్రతీ విద్యార్థిని విద్యార్థులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పూర్వ కేసీఆర్ గారి వెనుక ఎలాగైతే ఉన్నామో ఈనాడు కెసిఆర్ గారి వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
బిఆర్ఎస్వి పట్టణ ఉపాధ్యక్షులు చిప్పకుర్తి జగన్, అరుణ్
బిఆర్ఎస్వి నియోజవర్గ నాయకులు మొహమ్మద్ సాజిత్ చోటు ,ఒడిగ కిరీటి, నక్క తిరుపతి చిట్టి బాద్షా, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

*ప్రెస్ 09.02.2023 హాజీపూర్/ మంచిర్యాల*ఈరోజు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని మారుమూర ప్రాంతంలో నివసిస్తున్న   కోలంగూ...
09/02/2023

*ప్రెస్ 09.02.2023 హాజీపూర్/ మంచిర్యాల*
ఈరోజు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని మారుమూర ప్రాంతంలో నివసిస్తున్న కోలంగూడ
వాసులకు ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తరపున
బ్లాంకెట్స్ మరియు హైజినిక్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా *చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి* మాట్లాడుతూ మాలుమూర గిరిజన గ్రామమైన కోలంగూడలో నివసిస్తున్న నిరుపేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ తరపున బ్లాంకెట్స్ మరియు హైజినిక్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా వారికి నాగరికత బయటి ప్రపంచం ఎలా ఉంటుంది. అని పరిశుభ్రంపై, విద్య పై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగినది. వారికి అతి త్వరలోనే వంట చేసుకునే సామాగ్రిని ఇండియన్ రెడ్ క్లాస్ సొసైటీ తరఫున అందజేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగినది. మీ యొక్క జీవనశైలిలో మార్పు రావాలని వారిని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, ఎస్.నాగేందర్, రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పత్రిక ప్రకటణ , మంచిర్యాల తేది: 30-12-2022ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆనంద నిలయంలో వైకుంఠ రతం ప్రారంభోత్సవ కార్యక్రమం నల్...
30/12/2022

పత్రిక ప్రకటణ , మంచిర్యాల
తేది: 30-12-2022

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆనంద నిలయంలో వైకుంఠ రతం ప్రారంభోత్సవ కార్యక్రమం

నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీ *నల్ల శంకర్* గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖకు వైకుంఠ రతంను డొనేట్ చేయడం జరిగింది, ఈ వైకుంఠ రతంను ఈ రోజు తేదీ: 30-12-2022 నాడు ఉదయం10.30 లకు ఆనంద నిలయంలో శ్రీ *నల్ల శంకర్* గారు ప్రారంబించడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వార అయితేనే అందరికీ ఈ సేవ అందుబాటులొ కి వస్తుంది అని గుర్తించి వీరికి ఈ వైకుంఠ రథాన్ని ఇవ్వటం జరిగింది అని,అదేవిధంగా వీరు ఎన్నో రకాల సేవలు అనగా వరదల సమయంలో వరద బాధితులకు అన్నదానం, వస్తువుల దానం, దుప్పట్లు పంపిణీ, కిరాణా సామాను ల పంపిణి, తర్ఫిలిన్ కవర్స్ పంపిణి, హైజెనిక్ కిట్ల పంపిణీ, కారొన సమయంలో అన్నదానం, మాస్కుల పంపిణి, ORS పంపిణీ,POLICE సిబ్బందికి సబ్బుల పంపిణి, మాస్కుల పంపిణి, ఫ్రుటీస్ పంపిణి, MUNICIPAL సిబ్బందికి సబ్బుల పంపిణి, మాస్కుల పంపిణి, ఫ్రుటీస్ పంపిణి ఇలాంటి సేవలతో పాటు అనాద ఆశ్రమం, వృద్దా ఆశ్రమం,blood సెంటర్ లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యెక ధన్యావాదాలు అని నల్ల శంకర్ గారు తెలుపడం జరిగింది . అనంతరం వృద్దులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది.

ఈ ప్రారంభోత్సవ క్యాక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి గారు, జిల్లా వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్ గారు, కోశాధికారి పడాల రవీంధర్ గారు, జిల్లా కమిటీ సబ్యులు V. మధుసూదన్ రెడ్డి గారు, కాసర్ల శ్రీనివాస్ గారు, S. నాగేంధర్ గారు, యెడ్ల కిషన్ గారు, జెట్టి చరణ్ గారు, గొగుల రవీందర్ రెడ్డీ గారు ,ఇస్కమల్ల శంకర్ గారు , విష్ణు గారు , ఏర్రం ప్రభాకర్ గారు పాల్గొన్నారు.

18/12/2022

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బంగారు తల్లికి జన్మదిన శుభాకాంక్షలు

*బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి జన్మదినం సందర్భంగా బీజేపీ హాజీపూర్ మండల శాఖా ఆధ్వర్యంలో దొనబండ గ్రామం ద...
15/12/2022

*బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి జన్మదినం సందర్భంగా బీజేపీ హాజీపూర్ మండల శాఖా ఆధ్వర్యంలో దొనబండ గ్రామం దళిత బస్తీలో ఏర్పాటు చేసిన సహాపంక్తి భోజనంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారు*

10/12/2022
*మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా ఎలక్షన్ ఈసీ ఆమో...
09/12/2022

*మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా ఎలక్షన్ ఈసీ ఆమోదం తెలిపిన సందర్భంగా సంబరాలు చేయడం జరిగింది*

మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా ఎలక్షన్ ఈసీ ఆమోదం తెలిపిన సందర్భంగా సంబరాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో రానిచ్చి అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ చేస్తున్నటువంటి నీచపు రాజకీయాన్ని ఎండగట్టే విధంగా
బీఆర్ఎస్ అని జాతీయ పార్టీ ఆవిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది బిఆర్ఎస్వి విద్యార్థి లోకం మొత్తం గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వెంట ఉంటామని ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే కెసిఆర్ గారి వెంట ఉన్నాము దేశ రాజకీయాల్లో విద్యార్థులమంతా ఏకతాటిగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పట్టణ ఉపాధ్యక్షులు చిప్పకుర్తి జగన్ గారు టిఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు మొహమ్మద్ సాజిత్ చోటు చిట్టి బాద్షా విద్యార్థులు టిఆర్ఎస్వి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పత్రిక ప్రకటణ, మంచిర్యాల జిల్లాతేది: 04-12-2022తేది: 04-12-2022 నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల రక్త నిధి కేంద...
04/12/2022

పత్రిక ప్రకటణ, మంచిర్యాల జిల్లా
తేది: 04-12-2022

తేది: 04-12-2022 నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల రక్త నిధి కేంద్ర 14 వ వార్షికోత్సవ దినోత్సవం

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అనేది అంతర్జాతీయ సేవ సంస్థ, ఈ సంస్థ ద్వారా అనేక పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిన విషయమే, ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రక్త నిధి కేంద్ర 14 వ వార్షికోత్సవ దినోత్సవం.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖా అదర్యంలో జిల్లా పాలనాధికారి అధ్యక్షతన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమాలలో బాగంగా 4 వ డిసెంబర్ 2008 లో రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవటం జరిగింది, మన రక్త నిధి కేంద్రాన్ని దిగ్విజయంగా నిరంతర సేవలు అందించడంలో మాకు సహకరిస్తున్న సింగరేణి సంస్థ లోని శ్రీరాంపుర్ ఏరియా, మందమర్రి ఏరియా మరియు సింగరేణి పవర్ ప్రాజెక్టు వారు అనేక వైధ్య పరికరాలు, 33 లక్షల విలువ గల అంబులెన్స్ మరియు అనేక రక్త దాన శిబిరాల ద్వారా ఈరోజు వరకు బ్లడ్ యూనిట్లు అందిస్తూ వస్తున్నారు.

అదేవిదంగా NTPC రామగుండం, ఓరియంట్ సిమెంట్ కంపనీ దేవాపూర్, మంచిర్యాల సిమెంట్ కంపని, ప్రాజెక్టు అఫ్ఫిసర్ ITDA ఉట్నూర్ గారు లక్షల రూపాయల విలువ గల వైధ్య పరికరాలను రక్త నిధి కేంద్రానికి అందించడం జరిగింది.

మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోలికేరి గారు ఎన్నో రక్త దాన శిబిరాలను తన హోదా ద్వారా ఇప్పించడంతో పాటు DMFT ఫండ్స్ నుండి డీప్ ఫ్రీజెర్స్ మరియు ఫ్యుజిఫిల్మ్ బయో కెమెష్ట్రి మిషిన్ ను సమకూర్చడం జరిగింది వారికి ఈ సందర్బంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

అదేవిదంగా జిల్లా పోలీసు శాఖ, పోలీసు భేటాలియన్, CISF, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వైద్య శాఖ, TRASMA, రవాణా శాఖ (RTA), ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు, స్వచ్ఛంద సేవ సంస్థలు, స్వచ్ఛంద రక్త దాతల ద్వారా నిర్వహించిన 1089 క్యాంపుల ద్వారా 88,783 యూనిట్లు రక్తాన్ని, 618 ప్లేట్లెట్స్ (SDP) లను సేకరించడం జరిగింది, తద్వారా 89,076 యూనిట్ల రక్తాన్ని, FFP (ప్లాస్మా) 2531 యూనిట్ల సరఫరా చేసి అందులో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 20,960 యూనిట్లు, సబ్ సెంటర్ కు 4025 యూనిట్లు, తలస్సేమియా సికిల్ సెల్ పిల్లలకు 17,893 యూనిట్లు ను ఉచితంగా అందించడం జరిగింది.

రక్త దాన శిబిరాలు నిర్వహించి వెలకట్టలేని సేవలు అందిస్తున్న శిబిరాల దాతలందరికి హృదయపూర్వక దాన్యవాదాలు.

దాదాపు రక్త నిధి కేంద్ర నిర్వహణకు నెలకు సిబ్బంది జీతాలు, కిట్ల కొనుగోలు, బిల్డింగ్ మరం మత్తులకు రూ. 7,40,000/- వరకు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది.

అదే విదంగా 2012 వ సంవత్సరం నుండి తలస్సేమియా మరియు సికిల్ సెల్ వ్యాదిగ్రస్తులకు ఉచితంగా హిమోగ్లోబిన్ పరిక్షలు చేస్తూ వ్యాది తీవ్రతను బట్టి రక్తాన్ని ఎక్కించడం జరుగుతుంది

వారి తల్లి తండ్రులకు తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది పట్ల అవగాహనా కల్పించడం తో పాటు DNA క్యాంప్స్ ద్వారా 202 మందికి ఆరోగ్యశ్రీ లబ్ది పొందడం జరిగింది, ప్రతి 3 నెలలకు ఒక్కసారి నిపుణులైన హిమోటాలజిస్ట్ హైదరాబాద్ వైద్యునిచే మెరుగైన వైద్యం మరియు అవగాహణ కల్పించడం అందించడం జరుగుతుంది,

తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది నివారణలో బాగంగా మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత కళాశాలలు, MVTC ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ లలో, ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు మరియు వివిద ప్రాంతాలలో తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది నివారణ కొరకు పెళ్ళికి ముందే HBA 2 టెస్టు చేయించుకోవాలని అవగాహన కల్పించడం తో పాటు ఉన్నత అధికారులకు ప్రతి ప్రాతమిక పాటశాలలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మ్యారేజి కేర్టిఫికేట్ ఇచ్చే సమయాలలో HBA 2 టెస్టును తప్పని సరి చేసినట్లయితే తలస్సెమియా సికిల్ సెల్ వ్యాది నివారణకు చర్యలు తీసుకొని ఈ వ్యాది ని బావి తరాలకు శోకకుండ నిర్మూలించ వచ్కని ఉన్నత అధికారులకు వినతి పాత్రలు అందించడం జరిగింది.

అదే విదంగా అనాద పిల్లల కోసం 2009 వ ఆనంద నిలయంను స్టాపించి అప్పటి నుండి 249 మంది పిల్లలకు నివాసం, విధ్య, వైద్యం మరియు ఇతర సదుపాయాలను అందచేయడం జరిగింది. ప్రస్తుతం 18 మంది పిల్లలకు ఆశ్రయం పొందుతున్నారు. అలాగే 2014 వ సంవత్సరం నుండి అబాగ్యులైన వృద్దులు మరియు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆనాద వృద్దులకు ఆశ్రయం, భోజన, వైద్య మొదలగు సేవలు కల్పించడం జరుగుతుంది. దాదాపు 189 మంది వృద్దులైన స్త్రీ పురుషులకు ఆశ్రయం అందించడం జరిగింది. ప్రస్తుతం 15 మంది స్రీలు మరియు 12 మంది పురుషులకు ఆశ్రయం పొందుతున్నారు.

దాదాపు నెలకు రూ. 1,16,400/- వరకు ఖర్చు అవుతుంది అందుకు సహకరిస్తున్న దాతలకు దాన్యవాదాలు.

మంచిర్యాల జిల్లా లో ఉన్న 344 ఉన్నత పాఠశాల నుండి 42,292 మంది విధ్యార్థులను జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులుగా మరియు 89 ఇంటర్, డిగ్రీ కళాశాలల నుండి 27,841 మంది విధ్యార్థులను యూత్ రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవడం జరిగింది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి 6 మంది Patrons, 1 Vice-Patrons మరియు 3846 మంది Life Members గా మొత్తం 3853 మంది శాశ్వత సబ్యులుగా నమోదు అవడం జరిగింది.

విపత్తూలు సంబవించినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడుట కొరకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ (Social Emergency Response Volunteer) క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది.
నిరంతరం అందించే పై సేవలే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు హెల్త్ కంప్స్ ద్వారా 5073 మంది బాదితులు లబ్ది పొందడం జరిగింది.

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లాక్ డౌన్ విదించిన సందర్బంగా వివిద ప్రాంతాలలో నిరుపేదలు, వలస కూలీలు, నిరాశ్రయులైన వారికి భోజన సదుపాయం, నిత్యవసర సరుకులు అందించడం తో పాటు , కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసు సిబ్బందికి, పురపాలక సిబ్బందికి, వైధ్య సిబ్బందికి మాస్క్ లు, సానిటైజర్ లు , గ్లౌస్ల్ లు, హైజినిక్ కిట్లు అందించడం మరియు కోవిడ్ 19 వ్యాది సోకిన వారికి కోవిడ్ కిట్ల తో పాటు ఆక్సిజన్ కన్సన్ ట్రేటర్ లను అందించడం జరుగుతూ ఉంది.

అతిబారి వర్షాల వల్ల గోదావరి నీరు పొంగి వరద ముంపుకు గురైన మాతాశిశు ఆసుపత్రి బాదితుల తరలింపులో యూత్ రెడ్ క్రాస్ సబ్యులు ఆసుపత్రిలో ఉన్న గర్బిని స్త్రీలను మరియు శిశువులను జనరల్ ఆసుపత్రికి తరలించడంలో తమవంతు పాత్ర పోసించడం జరిగింది, అలాగే లోతట్టు ప్రాంతాలలో ఇండ్లు మునిగిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి బోజనం, నిత్యవసర సరుకులు, తార్పాలిన్ షీట్లు, దుప్పట్లు, హైజినిక్ కిట్లు, వంట పాత్రలు అందించడం జరిగింది.

2023 సంవత్సరంలో చేయవలసిన లక్షాలు:-

 జూనియర్ రెడ్ క్రాస్ & యూత్ రెడ్ క్రాస్ ను విధ్యా సంస్థలలో విస్తృత పరచడం. వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ (Social Emergency Response Volunteer) పై అవగాహణ కల్పించడం.
 మండల స్తాయి కమిటీలను ఏర్పాటు చేయడం.
 HBA2 టెస్టు క్యాంపులు విధ్యా సంస్థలలో నిర్వహించడం.
 సెల్ఫ్ ఎంప్లోయీమెంట్ (స్వయం ఉపాది పతకం) క్రింద కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాలు నిర్వహించడం.


జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి గారు, జిల్లా వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్, జిల్లా కోశాధికారి పడాల రవీంధర్ గారు, స్టేట్ మేనేజింగ్ కమిటి సబ్యులు వి. రాధా క్రిష్ణ గారు, జిల్లా కమిటి సబ్యులు వి. మధుసూదన్ రెడ్డి గారు, కాసర్ల శ్రీనివాస్ గారు, కె. సత్యపాల్ రెడ్డి గారు, S. నాగేంధర్ గారు, ఎడ్ల కిషన్ గారు పాల్గొన్నారు

*మంచిర్యాల పట్టణానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చిన ఎయిమ్స్ వైద్యులు డా|| శ్రీనివాస్ యెగ్గన*ఆర్థోపెడిక్స్ విభాగం...
04/12/2022

*మంచిర్యాల పట్టణానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చిన ఎయిమ్స్ వైద్యులు డా|| శ్రీనివాస్ యెగ్గన*

ఆర్థోపెడిక్స్ విభాగం లో అత్యాధునిక శస్త్ర చికిత్సలలో నైపుణ్యం ప్రదర్శించినందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావ వంతమైన 22 మంది వ్యక్తులలో ముఖ్య వ్యక్తిగా 2022 డిసెంబర్ 5 మరియు 6 తేదీలో దుబాయ్ లో జరిగే అంతార్జాతీయ ఆర్థోపెడిక్స్ సదస్సులో మీరు ఎంపిక అయ్యి ఆహ్వానించబడినందుకు గాను మా హృదయపూర్వక అభినందనలు.

వైద్యరంగంలో తెలంగాణ లోని మన మంచిర్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు వచ్చినందుకు గాను గర్వపడుతున్నాము.

ఈ సదస్సు ద్వారా మీ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరగాలని అకాంక్షిస్తున్నాము.

ఇట్లు

మీ శ్రేయోభిలాషులు మరియు మిత్రులు

Address


Alerts

Be the first to know and let us send you an email when Mana mancherial mana jila posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share