25/09/2023
# #నా అంతరంగం లోనున్న మనసు కలం పడితే అంతు లేని అనంతమైన ఆలోచనలు పరుగులు పెట్టేస్తాయి, కానీ నేనెలా రాసేది, కలం పట్టిన మరుక్షణం నుండి నాలోని ఉద్వేగాలు ఉప్పెనలా మారి నన్ను అల్లుకొని కదలలేకుండా కమ్ముకుంటున్నాయి, అప్పుడు కలం నా వైపు చూసి మొదలుపెట్టవోయి అని సైగ చేసినట్టు అనిపిస్తుంది, ఇంకా ఆలస్యం చేయకుండా రాయడం ఆరంభించాను ఎందుకో తెలుసా "ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక " కాబట్టి, రాసిన ప్రతి పదం మనిషిలో చైతన్యాన్ని నింపుతుంది అనే విశ్వాసంతో....@ శ్రీకాంత్ చారి # #