Spot News Channel

  • Home
  • Spot News Channel

Spot News Channel Spot News Channel reaches audience with interesting Political, Movie, Sports, Business and Featured

TTD Tirumala Tirupati Devasthanam Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్‌ - తిరుపతి (Tirupati)లోని తిరుమల తిరుపతి దేవస్థానం (Ti...
19/12/2023

TTD Tirumala Tirupati Devasthanam Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్‌ - తిరుపతి (Tirupati)లోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా TTD ఏఈఈ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ AEE పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 19వ తేదీ సాయంత్రం వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు

ముఖ్యసమాచారం :
టీటీడీ ఏఈఈ(ఎలక్ట్రికల్‌): 04 పోస్టులు
అర్హత: బీఈ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణత ఉండాలి. ఏపీకి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వేతనం: ఈ AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 ఉంటుంది.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ ఆభ్యర్థులకు అయిదేళ్లు; పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఈ AEE పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 19, 2023.

UPI Payments: గుడ్‌న్యూస్.. యూపీఐతో ఇక రూ.5 లక్షలు పంపొచ్చు!UPI Payments: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్...
19/12/2023

UPI Payments: గుడ్‌న్యూస్.. యూపీఐతో ఇక రూ.5 లక్షలు పంపొచ్చు!
UPI Payments: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ కేవలం చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్లకే అనే రోజులు పోయాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త అందించింది. యూపీఐ పేమెంట్స్ పరిమితిని పెంచుతూ డిసెంబర్ 8, 2023 న కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ముఖ్యమైన ట్రాన్సాక్షన్లకు యూపీఐ పేమంట్స్‌ను రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. అందులో హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పంపించేందుకు వీలుండేది. ఇక పై ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది ఆర్‌బీఐ.
మానీటరీ పాలసీ కమిటీ సమావేశాలకు సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను వెల్లడించారు. ' వివిధ కేటగిరీలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్ అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. తాజాగా హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లకు యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాం.' అని తెలిపారు గవర్నర్ శక్తికాంత దాస్.
ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో యూపీఐ యూజర్లు విద్యాసంస్థలు, ఆరోగ్య పరమైన ఖర్చులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు గవర్నర్ శక్తికాంత దాస్. మరోవైపు.. యూపీఐకి సంబంధించి మరో ప్రకటన చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్, క్రెడిట్ కార్డు రీపేమెంట్లకు సంబంధించిన రికరింగ్ పేమెంట్లలో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) అవసరం లేకుండా రూ. 1 లక్ష వరకు ఆటో పేమెంట్స్ చేయవచ్చని వెల్లడించారు. రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అంటే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రూ. 1 లక్ష వరకు ఆటో పేమెంట్ సౌలభ్యాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు రూ.15 వేలు దాటిన రికరింగ్ పేమెంట్లకు అథెంటికేషన్ అవసరం అయ్యేది. కానీ, ఇకపై రూ. 1 లక్ష వరకు ఎలాంటి అథెంటికేషన్ లేకుండానే పేమెంట్స్ చేయవచ్చు.

Ayodhya: శ్రీరామభక్తులకు షాక్.. అయోధ్య ప్రారంభోత్సవం రోజు ఎవరూ రావద్దని ట్రస్ట్ సెక్రటరీ విజ్ఞప్తి.ప్రపంచం మొత్తం ఉన్న క...
19/12/2023

Ayodhya: శ్రీరామభక్తులకు షాక్.. అయోధ్య ప్రారంభోత్సవం రోజు ఎవరూ రావద్దని ట్రస్ట్ సెక్రటరీ విజ్ఞప్తి.
ప్రపంచం మొత్తం ఉన్న కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. అయితే ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 వ తేదీన భక్తులు ఎవరూ రాకూడదని రామ మందిర ట్రస్ట్ స్పష్టం చేసింది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా వేలాదిమంది వీఐపీలు, వీవీఐపీలే కాకుండా కోట్లాది మంది హిందూ భక్తులు అయోధ్యకు వెళ్లి రాముడి దర్శనం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిర ఏర్పాట్లు చూస్తున్న శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీన భక్తులు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
జనవరి 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్టించనున్నారు. ఈ అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అయోధ్య నగరానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన ప్రకటన వారిని అయోమయంలో పడేసింది. లక్షల మందిలో భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ కీలక ప్రకటన చేశారు. అయోధ్య నగరంలో ఉండే రద్దీని నివారించేందుకు జనవరి 22 వ తేదీన జరిగే ప్రతిష్ఠాపన వేడుకల కోసం అయోధ్యకు భక్తులు ఎవరూ రావొద్దని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ ఉన్న వారు అక్కడే సమీపంలో దేవాలయంలో ‘ఆనంద్ మహోత్సవ్’ పేరుతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంపత్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య రాముడి గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరగనుందని పేర్కొన్నారు. దీని కోసం ఇప్పటికే గర్భగుడితో పాటు రామ్‌లల్లా విగ్రహం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అయితే అయోధ్య రామాలయం మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండు ఏళ్ల సమయం పట్టొచ్చని చంపత్ రాయ్ పేర్కొన్నారు. గర్భగుడి, రాముడి విగ్రహం మాత్రం పూర్తయ్యాయయని.. మిగితా పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగానే జనవరి 22 వ తేదీన అయోధ్యకు రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా దగ్గరలో ఉన్న ఆలయాలు వెళ్లి పూజలు చేయాలని సూచించారు.

ఇక జనవరి 22 వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి వారం రోజుల ముందే.. ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి 16 వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ముడుపుల ఉత్సవంలో ప్రధాన క్రతువులను లక్ష్మీకాంత దీక్షిత్ నిర్వహిస్తారు. ఇప్పటికే అయోధ్యలో జరిగే వేడుకల కోసం అక్కడ టెంట్ సిటీల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం మెరుగైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు.

కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్‌లు, 10 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్,ప్రభుత్వం మారితే పాలన మారుతుంది. పద్దతులు మ...
19/12/2023

కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్‌లు, 10 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్,

ప్రభుత్వం మారితే పాలన మారుతుంది. పద్దతులు మారుతాయి. పని చేసే అధికారులు మారుతారు. గత ప్రభుత్వ హయంలో వివిధ పోస్టుల్లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు బదిలీలు కామన్. తాజాగా.. తెలంగాణలో అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేయగా.. ఆదివారం 11 మంది ఐఏఎస్‌లు, 10 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ను ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల జీవో జారీ కాగా.. తాజాగా ఆమె స్థానంలో క్రిస్టినా చొంగ్తూకు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమితులైన రాహుల్‌ బొజ్జాకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయనకే కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయిన వాణీప్రసాద్‌కు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

పురపాలక ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంక కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. నల్గొండ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్‌ శ్రీనివాసరాజును నియమించారు. జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. మహిళ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు.

పలువురు ఐపీఎస్ అధికారులకు కూడా స్థాన చలనం కలిగింది. పీ విశ్వప్రసాద్‌ను అడిషనల్‌ ట్రాఫిక్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్‌ సిట్‌, క్రైమ్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌, వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఎస్‌ఎం విజయ్‌కుమార్, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌, హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా ఎన్‌ శ్వేత, నార్త్‌ జోన్‌ డీసీపీగా రోహిని ప్రియదర్శిని, సిటీ ట్రాఫిక్‌-1 డీసీపీగా ఎల్‌ సుబ్బారాయుడును బదిలీ చేసింది. త్వరలోనే మరికొందరు ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగనున్నట్లు సమాచారం.

సంక్రాంతికి మరో రెండు గ్యారంటీలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!ఆరు గ్యారంటీల అమలుపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొం...
19/12/2023

సంక్రాంతికి మరో రెండు గ్యారంటీలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఆరు గ్యారంటీల అమలుపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా.. సంక్రాంతికి మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఏ రెండు గ్యారంటీలు అనే విషయాన్ని ఆయన చెప్పలేదు.

ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగకు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని.. ప్రజా సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణిలో తప్పులు ప్రక్షాళన చేసి నష్టం లేకుండా చేస్తామన్నారు. వీఆర్ఏల సమస్యలపై యూనియన్లతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. అయితే ఆయన ఏ రెండు గ్యారంటీలు అమలు చేస్తారన్న విషయం మంత్రి స్పష్టంగా చెప్పలేదు.
తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మెుగ్గు చూపగా.. ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. డిసెంబర్ 9న రెండు గ్యారంటీలను అమలు చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. చేయూత పథకం కింద రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సౌకర్యాన్ని కల్పించారు. దీంతో మరికొన్ని గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది

సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలి: పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం.పీఏసీ సమావేశంలో చేసిన 3 తీర్మానాలు:* కాంగ్రెస్ పార్టీకి ఘన ...
19/12/2023

సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలి: పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం.

పీఏసీ సమావేశంలో చేసిన 3 తీర్మానాలు:
* కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
* సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా జాతీయ నేతలకు ధన్యవాదాలు
* సోనియా గాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (2024) తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సోనియా గాంధీ అయితే తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోనియా గాంధీ.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. గతంలో ఇందిరా గాంధీ.. మెదక్ స్థానం నుంచి పోటీ చేశారని ఆయన గుర్తుచేశారు. ‘తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీకు రుణపడి ఉంటాం’ అని సోనియా గాంధీని ఉద్దేశించి ఈ సమావేశంలో నేతలందరూ పేర్కొన్నారు.

అదేవిధంగా 6 గ్యారంటీలపై PAC (పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశంలో చర్చించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. మిగిలిన గ్యారెంటీలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. గాంధీ భవన్‌లో సోమవారం (డిసెంబర్ 18) పీఏసీ సమావేశం అనంతరం మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు.

వీలైనంత త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
నామినేటెడ్ పోస్టుల భర్తీని వీలైనంత త్వరగా భర్తీ చేస్తానని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తద్వారా మరి కొంత మంది సీనియర్ నేతలు, పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 28న నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తరలించాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

పార్లమెంట్ ఎన్నికలపై చర్చ
ఇక పార్లమెంట్ ఎన్నికల పైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. పలు పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేవెళ్ల, మహబూబ్‌నగర్ పార్లమెంట్ బాధ్యతలను చూడనున్నారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క - ఆదిలాబాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి - ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్గొండ, పొన్నం ప్రభాకర్ - కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను పర్యవేక్షించనున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు. విద్యుత్, ఫైనాన్స్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

19/12/2023

శుభవార్త: కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. గ్రామాల్లోనే ఎంపిక

తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అర్హులైన పేద ప్రజలకు రేషన్‌ కార్డులు లేక, ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చిన కోడలి పేరు, పుట్టిన పిల్లల పేర్లను చేర్చుకునేందుకు అవకాశం లేకుండాపోవడంతో వివిధ సేవలకు దూరం అవుతున్నారు.

ఇంతకుముందు రూపాయికి కిలో బియ్యం ఇవ్వగా.. కొవిడ్‌ ప్రభావంతో మూడేళ్లుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డులో పేరున్న సభ్యుడికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయక, పిల్లల పేర్లు చేర్చుకునేందుకు అవకాశం లేక వేలాది కుటుంబాలు ఈ ఉచిత బియ్యానికి కూడా దూరం అవుతున్నారు.

ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు ఆహారభద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60 వేల నుంచి 90 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక గ్రామాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తే.. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

26/10/2022

Kodali Nani Sensational Comments On Amaravathi | Press Meet | Spot News Channel


nani

kodali nani mla KODALI NANI Kodali Nani LOCAL kodali nani mla kodali nani gudivada Kodali Nani Kodali Nani LOCAL Kodali Nani Fans
🇸🇱 గడపగడపకూ మన ప్రభుత్వం 🇸🇱

25/10/2022

Srisailam Temple Closed Due to Solar Eclipse శ్రీశైల ఆలయం మూసివేత | Srisailam Temple | Spot news channel
🙏 ❤️ 🙏🏻 😎😎😎 🕉️☘️🌷 💟 🌓

srisailam_temple

25/10/2022

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఆదిపురుష్ మళ్ళి వాయిదా | Andhra TV

😍

Prabhas rebel star Prabhas fans Prabhas fans Prabhas FC Prabhas fans
Actress Kriti Sanon Kriti Sanon Fans Club Kriti Sanon KRITI SANON FANS
Om Raut Saif Ali Khan FC Sunny Singh Adipurush Adipurush Spot News Channel

16/10/2022

Tik Tok Star Shalini About Indians Problems In Qatar | Qatar Papa Latest Interview | Spot news channel



Qatar papa Qatar papa Qatar Papa Videos Qatar Papa Fans Qatar Papa videos It's Gone Viral Qatar Papa Videos Spot News Channel

15/10/2022

Actor Naresh Big Shock To Pavitra Lokesh | Naresh Pavitra Lokesh Love Story End | Spot News Channel

❤ ☝️

PAVITHRA LOKESH Pavithra Lokesh Pavithra Lokesh Pavithra Lokesh Naresh Spot News Channel Tollywood

15/10/2022

Atal Bihari Vajpayee Is My Favorite Politician | Megastar Chiranjeevi | Puri Jaganath | Spot News channel

❤️ #ᴘᴜʀɪᴊᴀɢᴀɴɴᴀᴅʜ ❤️

Konidela Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjeevi
Puri Jagannadh Puri jagannath PuRi jAgaNnAdH&kRiShNa Puri jagannath
atal bihari vajpayee Atal Bihari Vajpayee ATAL Bihari Vajpaee Atal Bihari Bajpeyi Salman Khan Salmaan Khan Sallu bhai Salmaan khan Salmaan khan Spot News Channel

14/10/2022

PV Sindhu Teenmaar Dance in Saree | Jigili Jigili song instagram Reel | Spot News Channel

🇮🇳 🇮🇳👏👏👏👏👍 ❤❤

pv sindhu(golden girl) PV Sindhu Pv sindhu PV SINDHU Pv sindhu PV Sindhu PV Sindhu P.V. Sindhu Fans Club PV Sindhu Fans PV Sindhu fanclub PV Sindhu Fans P V Sindhu FC Sindhu Army P.v sindhu fans AP Sindhu Indian Lioness PV Sindhu - India's badminton heroine * PV Sindhu Fans Club* PV Sindhu PV Sindhu P V Sindhu Best Player In India PV Sindhu The Golden Girl PV Sindhu( Daughter of india) PV Sindhu The Golden Girl P.V. Sindhu - India Wants Gold News Channel

14/10/2022

Qatar Papa Seansational Comments On Anchor In Interview | Qatar Papa Shalini Latest Interview | Spot News Channel



Qatar papa Qatar papa Qatar papa Qatar Papa Videos Qatar Papa videos Qatar Papa Spot News Channel Exclusive Interviews Enjoy Comedy Comedy Interview Qatar Papa Fans

13/10/2022

Home Minister Thaneti Vanitha Gadapa Gadapaku Programme | CM Jagan | YSRCP |Spot News Channel



Taneti Vanitha Followers (వనితమ్మ అభిమానులు) Taneti Vanitha Followers (వనితమ్మ అభిమానులు) YSRCP YOUTH Wing JMR ADoni Party Office Ysrcp YSRCP V.Kota YSRCP SOCIAL MEDIA KURNOOL CM JAGAN-THE VISIONARY CM Jaganism AP With YSJagan Jagan Again 2.0 Jaganism Jagan Followers Im Jagan Fan Spot News Channel

13/10/2022

Nandamuri BalaKrishna Comments on Nara Lokesh about his Photo | Unstoppable 2 Prom | Spot News Channel

✌️ ❤️

Unstoppable2 Only for Nandamuri Balakrishna Fans Nandamuri Balakrishna NANDAMURI BALAKRISHNA Nandamuri Balayya Balakrishna Nandamuri Balayya Balayya-Ramayya Jai Balayya jai balayya jai balayya జై టిడిపి జై బాలయ్య జై చంద్రబాబు నాయుడు గారు Balayya Babu thopu Nandamuri Balayya Nara Lokesh Nara Lokesh Follower NARA LOKESH YUVASENA AP. Nara Lokesh Nara Lokesh Followers Forever Spot News Channel

11/10/2022

Funny Interview with Qatar Papa | | | Spot News Channel

😂😂

papa Qatar Papa videos Qatar papa Qatar Papa Videos Qatar papa Qatar Papa videos News Channel Comedy Interview Comedy entertainment Enjoy Comedy Comedy Entertainment entertainment comedy Pandagoo

11/10/2022

Gold Man Chinna Pailwan Sensational Comments on Youtuber Harsha Sai | | Spot News Channel

❤️🔥

Darga Chinna bhai pailwan Harsha Sai - Telugu Harsha Sai video Harsha Sai Harsha Sai fans group Harsha Sai fc Harsha Sai Big fans Harsha Sai For You_ Telugu Harsha Sai fans group Harsha Sai - For You Hindi Harsha Sai fc

10/10/2022

ECIL Beggar Gold Medalist Raju Heart Touching Story | BeggarRaju Exclusive Emotional Interview | The Spot News Channel


😘

Beggar Raja Beggar
Spot News Channel

07/10/2022

Junior dhanush Reaveled his life story | | Spot News Channel

😍 🔥💙🖤😊

Dhanush Aishwaryaa.R.Dhanush Dhanush Wholesale Dhanush

07/10/2022

Nagababu Sensational Tweet About Garikapati Narsimharao | | Spot News Channel

😍 💯💯 💯💯 .

Naga Babu actor_nagababu Naga babu Nagababu Spot News Channel

07/10/2022

రాముడిలా బాణం వేసిన ప్రభాస్ || Prabhas Ravan Dahan at Ramlila || Adipurush | Spot News Channell

❤️😎🔥 💪🏻😍

Prabhas Army Warangal PRABHAS Fans Club Prabhas fans Pan Indian Super Star Prabhas Prabhas FC Prabhas_FC Prabhas_FC Prabhas FC Prabhas FC Prabhas FC Rebellism Rebelism Rebelism Diehardfansofprabhas Rebelism Rebelism Rebelism Bahubali (film) REBEL STAR FC Rebel Star Rebel stars Rebel star fanc's Rebel Star Adipurush Adipurush Adipurush

07/10/2022

Bollywood hero Salmaan khan beautiful comments on Megastar chiranjeevi God Father | | | | Top Telugu TV Videos

❤️ ❤️ 😍

Salmaan khan Salman Khan Salmaan Khan Salmaan khan Salmaan khan Fan Club Sallu bhai Sallu bhai SALLU BHAI Sallu BHAI Sallu Bhai Sallu Bhai Salmaan Khan FC Salmaan khan fc club � SALMAN KHAN FC � Salman Khan Sir Sri Lanka FC🇱🇰- සල්මාන් ඛාන් ශ්‍රී ලංකා රසික සමූහය.
Konidela Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjeevi Konidela Chiranjeevi Megastar Chiranjeevi Fans Megastar Chiranjeevi Chiranjeevi Fans Club Megastar Chiranjeevi Fans Megastar chiranjeevi fan's groups Megastar Chiranjeevi Spot News Channel

30/09/2022

VJ Mahalakshmi and Producer Ravindhar Couple entry in Bigg Boss 6 tamil | | | Spot News Channel



Mahalakshmi VJ Ravindhar Mahalakshmi VJ Boss Tamil

30/09/2022

Vishnu Manchu Strong Warning Trollers | | | Spot News Channel

🙂

Vishnumanchu Manchu Vishnu Manchu Vishnu Manchu vishnuism Manchu Vishnu Fan's VishnuManchu Fan's Manchu Vishnu Fans Page Vishnu Manchu Fans Club - VMFC Manchu manoj & vishnu fans Manchu Family Fans Manchu manoj & vishnu fans Manchu fans club Manchu Vishnu Fans News Channel

Address


Alerts

Be the first to know and let us send you an email when Spot News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

Spot News Channel reaches audience with interesting Political, Movie, Sports, Business and Featured News along with Entertaining

watch spot news channel