Akhand Bharath

  • Home
  • Akhand Bharath

Akhand Bharath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akhand Bharath, News & Media Website, .
(7)

22/01/2024

జైశ్రీరామ్🚩🛕

Jai sree krishna!❤️
23/11/2023

Jai sree krishna!❤️

Fan made edited Ayodhya Railway Station.... Jai Sriram 🚩🙏🏻
04/11/2023

Fan made edited Ayodhya Railway Station.... Jai Sriram 🚩🙏🏻

24/09/2023
07/09/2023

ధన్యవాదాలు ఉదయానిది స్టాలిన్ గారు, మీ యొక్క ప్రకటనతో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశం మొత్తం మీద మళ్ళీ ఒకసారి మా ముందుకు వచ్చి చూపించారు, మా వాళ్ళని ఎప్పటికప్పుడు తన్ని లేపాల్సిన బాధ్యత మీలాంటి వాళ్లదే!

23/08/2023

చరిత్ర సృష్టించిన భారత్. విజయవంతంగా చంద్రుని దక్షిణ ప్రాంతంలో ల్యాండ్ అయిన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్..
ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

జై భారత్ 🇮🇳💐

ఈ కుర్రవాడి పేరు షుభ్ పటేల్ (NRI) ......... వయస్సు 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ పుట్‌బాల్ ప్లేయర్. హిందూ సాంప్రదాయం ప్రకా...
14/07/2023

ఈ కుర్రవాడి పేరు షుభ్ పటేల్ (NRI) ......... వయస్సు 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ పుట్‌బాల్ ప్లేయర్. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బాలుడు రుద్రాక్ష మాల ధరిస్థాడు. అయితే రుద్రాక్ష మాల ధరిస్తే పుట్‌బాల్ మ్యాచ్ లను ఆడనివ్వనని, అంతేకాకుండా తనను డిస్‌క్వాలిఫై చేస్థానని పుట్‌బాల్ రిఫరీ బెదిరించాడు.

కాని షుబ్ పటేల్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆ మాల తీసివేస్తే తన హిందూ ధర్మాన్ని తానే అవమానించినట్లని చెప్పి, న్యాయపోరాటం ప్రారంభించాడు. ఈ విషయం ఆస్ట్రేలియా మీడియా లొ సంచలనం సృష్టించింది. దీనితో ఈ విషయం పై విచారణ జరిపిన ఆస్ట్రేలియన్ పుట్‌బాల్ కమిటి --- షుబ్ పటేల్ తొ పాటు అతని కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పి, ఈ బాలుడిని మరలా టీం లోకి తీసుకోవడం విశేషం. షుభ్ పటేల్ కు 12 సంవత్సరాల వయసు అయినప్పటికీ, తన మాతృ ధర్మమైన హిందూఇజానికి ఇచ్చిన గౌరవానికి హేట్సాఫ్ చెప్పక తప్పదు.

14/06/2023

I gained 409 followers, created 13 posts and received 633 reactions from March to June! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

మనుషులలో మానవత్వం అనేది నశించి పోతుందా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే .......🥺😐నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని సాయిర...
13/06/2023

మనుషులలో మానవత్వం అనేది నశించి పోతుందా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే .......🥺😐

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని సాయిరెడ్డిగూడకు చెందిన ఇతని పేరు వెంకటేశ్‌ గౌడ్‌ (26). డిగ్రీ చదివాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. పోలీస్‌ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కనేవాడు. కానీ...గత సంవత్సరం జులై 21న క్యాబ్‌ మాట్లాడుకున్న వ్యక్తి కిరాయి ఇవ్వకపోగా 20 మంది స్నేహితులతో కలిసి చితకబాదాడు. అంతటితో ఆగక తన గొలుసు చోరీ చేశాడంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు రాత్రంతా ఠాణాలో కూర్చోబెట్టారు. మరుసటి రోజు ఉదయం వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే అతను కోమాలోకి వెళ్లాడు. 11 నెలలుగా ఇలా జీవచ్ఛవంలా ఉన్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించగా ఇప్పటివరకు రూ.70 లక్షల వరకు ఖర్చయిందని తండ్రిఅంజయ్యగౌడ్‌ తెలిపారు.

అయిదు నెలలుగా కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స చేయిస్తున్నామని, నెలకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం గుర్తించలేని దీనస్థితిలో ఉన్నాడన్నారు. తమకు ఇంత అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు కానీ, నేతలు కానీ ఎలాంటి సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాయి డబ్బులు అడిగినందుకు ఇదంతా జరిగిందని.. దాడికి పాల్పడిన ఆకతాయిలు బెయిల్‌ తీసుకొని బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చికిత్స కోసం ఉన్న రెండెకరాల పొలం అమ్మేశాం. ఇంటిని అమ్మకానికి పెట్టాం. అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకు మాకు అండగా ఉంటాడని అనుకున్నాం. ఇప్పుడు మంచానికి పరిమితం అయ్యాడు’ అంటూ అంజయ్యగౌడ్‌ కంటితడి పెట్టుకున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుమారుడి చికిత్సకు దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు.

Cc: Aruna Gogulamanda Garu.

13/05/2023

అంతకుముందు ఈవీఎంల మీద ఆరోపణలు చేసిన వాళ్లు బిజెపి ఓటమితో కాంగ్రెస్ గెలుపుతో ఎట్లా కవర్ చేసుకోవాలో అర్థం కాక చస్తున్నారు

13/05/2023

గుర్తుపెట్టుకోండి బిజెపి అభిమానులారా ఎక్కడైతే బిజెపి గెలిచిందో అక్కడ ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఎక్కడైతే బిజెపి కాకుండా వేరే పార్టీ గెలిస్తే ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టు

13/05/2023

కర్ణాటక ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ఈవీఎం ల మీద నెట్టాలి కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పర్ఫెక్ట్ గా పని చేసినట్టు కొంచెం అన్న సిగ్గుండాలి అయ్యా

03/04/2023

రానున్న రోజుల్లో ఘోరకలి తప్పదా ?

మానవాళి కనీ వినీ ఎరుగని, విపత్తు అంచున ఉందా ?

ఓపిగ్గా చదవండి ..

1 కృత్రిమ మేధ .. అంటే మనిషిలా ఆలోచించే యంత్రాలు . మనిషిలా అనుభవ పూర్వకంగా , నేర్చుకొనే యంత్రాలు . రోబో లేదా మరమనిషి అంటారు . రజనీకాంత్ సినిమా ద్వారా అందరికీ పరిచయమే . ఆ సినిమా తీసేనాటికి అది కాల్పనికత . కేవలం ఊహ.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ...

మరో పదేళ్లలో ..

2 . అచ్చం మనిషిలా ఉండే రోబో లు మార్కెట్ లోకి వచ్చేస్తాయి . డబ్బున్నవారు, తమకు ఎలాంటి రోబో కావాలో ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకోవచ్చు . ఒకాయనకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం . ఆర్డర్ ఇస్తే అచ్చం ఆమెలాంటి ఆడ రోబో రెండు మూడు నెలలో కంపెనీ లు డెలివరీ చేస్తాయి . మరొకామెకు మహేష్ బాబు ను పోలిన మగ రోబో .. .. దీపికా... రష్మిక .. ప్రభాస్... అల్లు అర్జున్ .. ఎవరి అభిమానాలు వారివి . వారు కోరితే అచ్చం అలాగే ఉండే రోబో లు సిద్ధం .

౩. రోబో లను పర్సనల్ అసిస్టెంట్ లు గా నియమించుకొవచ్చు . ఇంట్లో వంట చేస్తాయి . ఇంటి పనులు చేస్తాయి . స్నానం మసాజ్ . అంతకంటే మించి బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్ గా కూడా . ఈ రోబో లు మాట్లాడుతాయి . వాటికి కూడా ఫీలింగ్స్ వస్తాయి . ఇప్పటికే విదేశీ మార్కెట్ ల లో కృత్రిమ సెక్స్ అవయవాలు అందుబాటు లోకి వచ్చాయి . నలబై దాటి నవారికి దీని గురించి తెలియక పోవచ్చు . ఇండియా లో కూడా దీన్ని వందలాది మంది యువతీ యువకులు వినియోగిస్తున్నారు . మనిషి తో సెక్స్ కంటే ఇదే ఎక్కువ తృప్తి నిస్తుంది అని ఫీల్ అయ్యేవారున్నారు . రాబోయే రోజుల్లో రోబో ల కు కూడా కృత్రిమ సెక్స్ అవయవాలు ఫిట్ చేస్తారు . అంటే రోబో ల తో సెక్స్ .

4 . ఇప్పటికే డేటింగ్, లివ్- ఇన్ సాధారణం అయిపోయాయి . ముంబై ఢిల్లీ ఐఐటీ ల లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదివే విద్యార్థినీ విద్యార్థుల్లో కనీసం ఇరవై శాతం ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి పెళ్లి చేసుకోకుండానే కలిసి కాపురం ఉంటున్నారు . రెండుళ్లు కాపురం ఉండి , సెక్స్ చేసుకొని ... నచ్చితే పెళ్లి . నచ్చక పొతే విడిపోవడం .

5 . " పెళ్లి చేసుకోవడం, పిల్ల్లల్ని కనడం, మెడకు గుదిబండ .. కెరీర్ కు అడ్డు .. అందం నాశనం" అనుకొనే అంమ్మాయిల సంఖ్య పెరుగుతోంది . ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్నత విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల మధ్య లైంగిక సంబంధాలు .. అంటే ఇద్దరు అబ్బాయిలు .. లేదా ఇద్దరు అమ్మాయిలు .. గే .. లెస్బియన్ సంబంధాలు .

6 రాబోయే రోజుల్లో వివాహం .. కుటుంబం .. ఈ రెండు వ్యవస్థలు ఉంటాయా ? లేదా ఎవరికి వారు రోబో లతో సెక్స్ .. వివాహం తో సంబంధం లేకుండా సెక్స్ చేసుకొనే రోజులు రానున్నాయా ? ... ఆలోచించే వారిని వేధిస్తున్న ప్రశ్నలు .మానవ సమాజం విపత్తు అంచున .

6 . శాస్త్ర రంగం లో అభివృద్ధి ఎలా ఉందంటే .. మరో పదేళ్లలో వృద్దులు, కృత్రిమ అవయవాలను అమర్చుకొని ఇంజక్షన్ లు వేసుకొని యువకులుగా మారి పోవచ్చు . శాశ్వతంగా {అంటే ముందుగా కనీసం వెయ్యేళ్లు} యువకులుగా ఉండిపోవచ్చు . మరణాన్ని జయించడానికి పురాణం కాలంలో సాగర మథనం చేశారట . ముందుగా విషం .. దాన్ని శివుడు తాగి లోకాన్ని రక్షించాడట . అటు పై అమృతం వచ్చింది . దాన్ని తాగి దేవతలు నిత్యయవ్వనులుగా ఉండిపోయారట . ఇది హిందువుల నమ్మకం . విశ్వాసాలు ఎలా వున్నా .. ఇది మరో పదేళ్లలో వాస్తవ రూపం దాల్చబోతోంది .

రాక్షసుల చేతికి చిక్కితే ?

7 . ఏజ్ రిగ్రెషన్ అంటే వయసు తగ్గించుకొనే పద్దతి అవలంబించాలంటే చేతిలో కనీసం వంద కోట్లు ఉండాలి . అంటే ఇది ప్రపంచ కోటీశ్వరులకే సాధ్యం . వారేమో ఈ పద్దతిలో నిత్యా యవ్వనులుగా ఉండిపోతారు . సాధారణం జనం రోగాలతో మరణిస్తారు . బీద - ధనిక ఎడం బాగా ఎక్కువయిపోతుంది .

8 . గత 500 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా మూడు రెట్లు పెరిగింది . పారిశ్రామిక యుగం లో పనులు చేయడానికి అధిక జనాభా అవసరం అయ్యింది . ఇప్పుడు మనిషి చేసే పనులన్నీ రాబోయే రోజుల్లో రోబో లే చేసేస్తాయి . రాబో లను నడిపించడానికి ఇప్పుడున్న జనాభా లో పది శాతం చాలు . అంటే రానున్న రోజుల్లో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోతారు . వీరిని సమాజానికి భారం గా చూడడం జరుగుతుంది . "ఎలాగైనా ప్రపంచ జనాభా తగ్గించాలి .. రోబో యుగానికి ఇంత మానవాళి అవసరం లేదు "అని ఇప్పటికే కొన్ని కంపెనీ ల యజమానులు ఆలోచిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం మనిషి చేతిలో కీలు బొమ్మ కావాలి . కానీ టెక్నాలజీ కి మనిషి బానిస కాకూడదు . మనిషికోసం టెక్నాలజీ అంతే కానీ రోబో ల కోసం మనసులు కాదు .

కృత్రిమ మేధ మానవాళి కి ఎంతో ఉపయోగ పడుతుంది . ప్రమాదకరమైన గనుల్లో పర్వతాల్లో పని చేయసానికి బాంబు ను నిర్వీర్యం చేయడం టెర్రరిస్ట్ ల తో పోరాటం లాంటి అనేక రంగాల్లో రోబో లు ఎంతో ఉపయోగ పడుతాయి .

బ్లేడ్ తో గడ్డం గీసుకోవచ్చు . లేదా అవతలి వారి గొంతు కోయవచ్చు .

రోబో లను కృత్రిమ మేధ ను ఎక్కడ ఉపయోగించాలి? ఎక్కడ వాటిని నిషేధించాలి అని విషయం పై ప్రభుత్వాలు నియంత్రణ చేపట్టాలి .

కానీ మిలియన్ డాలర్ ప్రశ్న ఏమిటంటే నేటి ప్రభుత్వాలు ..
[మొత్తం ప్రపంచ వ్యాప్తంగా} ఈ పని చేయగలవా ?

ఇప్పటికే కొన్ని ప్రపంచ స్థాయి కంపెనీ లు దేశాల ప్రబుత్వాలకంటే బలం గా తయారయ్యి తాము చెప్పిన విధంగా ప్రభుత్వాలు నడుచుకునే విధంగా చూసుకొంటున్నాయి .

మీకో చిన్న ఉదాహరణ .

కరోనా వచ్చింది . దాని కోసం వాక్ సీన్ వచ్చింది . ఆ రోజుల్లో అత్యవసరం అనుకొన్నారు . అందరూ వేసుకొన్నారు . వేయించారు .ఆ వాక్ సీన్ ల పై పూర్తి స్థాయి ... ఆంటే మూడో దశ ... అత్యంత కీలక దశ పరిశోధన లేకుండా నే వాటికి అత్యవసర అనుమతులు ఇచ్చారు .సరే.. అప్పట్లో సమయం లేదు .. కానీ ..

దాన్ని వేసుకొన్న అనేక మంది మరణించారు . అంతకు అనేక రెట్లు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తో బాధ పడుతున్నారు . ఎవరైనా ఈ విషయం చెబితే కొంత మంది వారిపై బురద చల్లారు . ఋజువులు లేదన్నారు .

ఇప్పుడు సాక్షాత్తూ ప్రభుత్వమే పార్లమెంట్ కు ఇచ్చిన నివేదిక లో లక్ష మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంది. వాస్తవానికి ప్రభుత్వం వాక్ సీన్ సడీ ఎఫెక్ట్స్ పై నియమించిన కమిటీ AEFI కి వెళ్లాలంటే ముందుగా డాక్టర్స్ సర్టిఫికెట్ ఉండాలి . అలాంటి సర్టిఫికెట్ ఇవ్వడకుండా తమపై రకరకాల ఒత్తిడి వచ్చిందని కొంతమంది డాక్టర్ లు చెబుతున్నారు . ఆంటే ప్రభుత్వం చెప్పిన సంఖ్య కంటే అనేక రెట్లు వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ తో సతమతం అవుతున్నారు అని అర్థమవుతుంది .

లక్షా? ఇంకా ఎక్కువా? అనే చర్చ తరువాత .
పోనీ లక్షే అనుకొందాము .
లక్ష మంది .. ఆంటే లక్ష కుటుంబాలు నాశనం . చాలదా ?? .

ఇప్పుడేమి చెయ్యాలి ..

"వాక్ సీన్ కంపెనీ లు! .. అప్పుడేదో అత్యవసర అనుమతి ఇచ్చాము . ఇప్పుడు మూడేళ్లయ్యింది . మీరు ఎప్పుడో తొలి నాటి కరోనా కోసం తయారయిన వాక్ సీన్ ను ఇంకా వెయ్యడం ఏంటి ?. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్స్ కోసం తయారు చేయండి . అలాగే మీరు మూడో దశ టెస్ట్ ల కోసం సిద్ధం కండి.. పూర్తి స్థాయిలో పరిశీలించి అనుమతులు ఇస్తాము. అలాగే వాక్ సీన్ వేసుకొని ఏదైనా నష్టం జరిగితే మీ కంపెనీ భాద్యత వహించాలి . వాక్ సీన్ వేసుకొన్న ఆరు నెలలు కనీసం రక్షణ ఇవ్వాలి . లేకుండా ఆరు నెలలో లోపే ఇంకో సారి కరోనా సోకితే ఆ వ్యక్తి చికిత్స ఖర్చు మీరే భరించాలి" అని చెప్పాలి . కదా ?
న్యాయంగా ఉందా లేదా ? ఆలోచించండి .

ఏదైనా ప్రభుత్వం .. పార్టీ .. నాయకుడు ఇలాంటి డిమాండ్ చేశాడా ? ఇండియా లో .. లేదా ఇంకేదైనా దేశం లో?
.. లేదే! .
ఎందుకు? .
ఆలోచించండి .

ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాల సార్వభౌమాధికారం కొన్ని బడా కంపెనీ ల చేతుల్లోకి వెళ్ళిపోయింది . ఆఫ్రికా అయినా ఆసియా అయినా... ఏ ప్రభుత్వం అయినా ... వారు గీసిన గీత దాట కూడదు .

ఇలా చెప్పడంఅంటే ఇక్కడి ప్రభుత్వాల పై విమర్శ కాదు . నిజానికి ప్రజల్లో చైతన్యం పెరిగితే ప్రభుత్వాలకు కొండంత అండ . ప్రపంచ కంపెనీ ల ఆటలకు ఎంతో కొంత అడ్డుకట్ట .

ఇవన్నీ ట్రాష్ .. ఒట్టి ఊహాగానాలు అనుకొనే వారు ఇంకా కోట్ల లో ఉన్నారు. ఇంతముప్పు ఉంటే పత్రికల్లో టీవీ ల లో ఎందుకు రాదు? అని వీరి ప్రశ్న . అదే నా ప్రశ్న కూడా . నేను పైన చెప్పిన వాక్ సీన్ విషయమే ఆలోచించండి . సాక్షాతూ ప్రభుత్వమే చెప్పిన లెక్కలు . ఎందుకు మీడియా లో పెద్దగా రాలేదు . నేటి మీడియా ను, ప్రభుత్వాలను నడుపుతున్నది ఎవరు ?
రిమోట్ ఎవరి చేతిలో ఉంది.
ఆలోచించండి .

సోదండీ బాబోయ్ ..
కంపెనీ లేంటి ?
ప్రపంచ ప్రభుత్వాలను నడపడం ఏంటి అనుకొంటున్నారా ?
మీకు తెలుసా?
ఈస్ట్ ఇండియా కంపెనీ ..
400 సంవత్సరాల క్రితం కేవలం ఒక ట్రేడింగ్ కంపెనీ .
స్థాపించిన నూట యాభై ఏళ్ళల్లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించింది . కొన్ని వందల ప్రభుత్వాలను మట్టి కరిపించింది.

నేటి కంపెనీ లు ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ .

మీరేమి చేయగలరు ?

రాక్షసుల చేతికి అమృతం అందకుండా చూసేందుకు మహా విష్ణవు, మోహిని రూపం ఎత్తాడట .

నేడు డిజిటల్ ప్రపంచం లో పబ్లిక్ ఒపీనియన్ పవర్ఫుల్ .
కంపెనీ ల అటకట్టి మన ప్రభుత్వాల, నాయకుల, మొత్తంగా చెప్పలంటే మన వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటే ఈ మెసేజ్ ని అందరితో షేర్ చేసుకోండి . ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం లో భాగస్వామ్యులు కండి .

మానవాళిని రక్షించండి .

సర్వే జనా సుఖినోభవంతు !

చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మిస్తున్న 125 అడుగుల డా. BR అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి కావొస...
30/03/2023

చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మిస్తున్న 125 అడుగుల డా. BR అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి కావొస్తున్నాయి

అంబేడ్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

26/03/2023

మంత్రోచ్ఛరణకు ఆ శక్తి కలదో లేదో అనే సందేహము ఉన్న వారికి ఆ మూగజీవి స్పందన సృష్టంగా గమనించవచ్చు
చివరిలో ఆ ఏనుగు ఆశీర్వాదం చూసి కామెంట్ చేయండి

22/03/2023

అర్ధరాత్రి వేడుకలు లేవు..
మద్యం, మాంసం వాసనలు లేవు.. నడివీధులలో హారన్ హోరులు లేవు.. చెవులు హోరెత్తించే సంగీతపు డి.జె లు లేవు..
మందు గ్లాసుల గలగల లేదు..
కృత్రిమ దీపాల కళకళ లేదు..
బార్ ల ముందు బారులు లేవు..
HAPPY NEW YEAR హగ్గులు లేవు.. పెగ్గులు లేవు.. కెమికల్ రంగుల ముగ్గులు లేవు..
నిన్న అర్ధరాత్రి అస్తమిస్తున్న అమావాస్య చీకట్లు..వేపపువ్వూ వాసనలు ఉన్నాయి..మామిడికాయ పుల్లదనం, ఆరోగ్యాన్నిచ్చే పచ్చడి ఉంది‌..
వీధుల్లో నూతన వస్త్రాల తళతళలు.. దివ్యాశిస్సుల కోసం దేవాలయ దర్శనాలు..
గడపగడపనా టి.వి.లో పంచాంగ శ్రవణాలు..
ఇంటింట షడ్రుచుల పచ్చడి..

ఇదీ తెలుగుదనం అంటే..! ఇదే హిందూ సంస్కృతి సాంప్రదాయం.

ఇదీ మన కొత్త సంవత్సరం *ఉగాది*..!!. ⛳⛳⛳⛳⛳⛳⛳🚩🚩🚩🙏🏻

*హైదరాబాద్‌ లోని ప్రాంతాలు-* *వాటికి  ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి.*A1.* ♨️ బేగం పేట.6వ నిజాం  మహబూబ్  అలీ ...
19/03/2023

*హైదరాబాద్‌ లోని ప్రాంతాలు-* *వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి.*

A1.* ♨️ బేగం పేట.
6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బ‌షీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..
కూతురికి క‌ట్నం కింద‌ ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదగా బేగంపేట అని పేరు వచ్చింది.

B2. *♨️చార్మినార్*
కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు….
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వ‌చ్చింది!

H3. *♨️సికింద్రాబాద్*
మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది . అంతకుముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచే వారు.

I4.*♨️ఖైరతాబాద్*
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది

N5. *♨️శంషాబాద్*
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వ‌చ్చింది. ష‌మ్స్ అంటే సూర్యుడు.
దీని అర్థం ప్ర‌భువుల యందు సూర్యుడిలాంటి వాడని….
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు క‌ల‌దు.!

A6. *♨️నాంపల్లి*
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.

V7. *♨️హిమయత్ నగర్*
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆస‌ఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.

A8. *♨️అబిడ్స్*
ఆరో నిజాం కాలంలో అల్‌బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదువ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిర‌ప‌డిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.

S9. *♨️సోమాజిగూడ*
నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి .
సోనాజీ కాస్త సోమాజి అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు క‌లిపి సోమాజిగూడ అయ్యింది!

A10 . *♨️మాసబ్ ట్యాంక్*
6వ కుతుబ్ షాహ్ భార్య హ‌యత్ భ‌క్షిభేగంను మాసాహెబా అని పిలిచేవారు. మాసాహెబా పల్లె భూములకు సాగునీరు ఇవ్వడానికి ఒక ట్యాంక్ నిర్మించింది .
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు . చివరకు ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది .

N11. *♨️హైదరాబాద్*
కులీకుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైద్రా నగరం అని అర్ధం తర్వాత ఆ పేరు మీద హైదరాబాద్ గా మారింది .

T12 .*♨️మలక్ పేట్*
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

H13 . *♨️బషీర్ బాగ్*
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది .
ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది . బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్ధం .

O14. *♨️ఫలక్ నుమా:*
ఫలక్ అంటే ఆకాశం , నామ అంటే అద్దం . ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది . కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!

S15 . *♨️సరూర్ నగర్*
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.

H16.*♨️లంగర్ హౌజ్:*
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది.
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.

K17.*♨️చెంచల్‌ గూడ:*
చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.

U18.*♨️కార్వాన్:*
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.

M19.*♨️కవాడిగూడ:*
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.

A20.*♨️దోమలగూడ:*
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.

R21. *♨️బేగం బజారు:*
హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.

K22. *♨️అఫ్జల్ గంజ్:*
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది

S23.*♨️హైదర్ గూడ:*
మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

K24.*♨️తార్నాక:*
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె..
నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
25.*♨️శాలిబండ:*
శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు.
ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది

26.*♨️హబ్సిగూడ:*
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.

27.*♨️మదీనా:*
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.

28.*♨️చిక్కడపల్లి:*
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.

29.*♨️నౌబత్ పహాడ్:*
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.

30.*♨️బాగ్‌లింగంపల్లి:*
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.
31.*♨️అడిక్‌మెట్:*
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.

32.*♨️మీరాలంమండి:*
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!

౩౩.*♨️బార్కాస్:*
నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.

34.*♨️తాడబండ్:*
తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.

35.*♨️ఎర్రమంజిల్‌:*
ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.

36.*♨️కాచిగూడ:*
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.

37.*♨️లాడ్‌ బజార్:*
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.

38.*♨️ముషీరాబాద్:*
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.

39.*♨️ఫతే మైదాన్:*
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు.
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.

40.*♨️పబ్లిక్ గార్డెన్స్:*
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్

41.*♨️చాదర్ ఘాట్:*
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.

42.*♨️ఆస్మాన్ గఢ్:*
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.

43.*♨️ఉమ్దా బజార్:*
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.

44.*♨️గౌలిగూడ:*
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.

45,*♨️లల్లాగూడ:*
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది.

46.*♨️సుల్తాన్ బజార్:* 1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక,
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.

47.*♨️రికాబ్ గంజ్:*
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.

48.*♨️డబిర్ పురా:*
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.

49.*♨️అంబర్‌ పేట:*
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.

50.*♨️చాంద్రాయణగుట్ట:*
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
🄺🄷🄰🄳🄸🅁
51.*♨️చిలకలగూడ:*
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!

52.*♨️మంగళ్ హాట్:*
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.

53. *♨️సైదాబాద్:*
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.

54.*♨️టప్పాచబుత్ర:*
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.

55.*♨️తుకారాం గేట్:*
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.
ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.

56,*♨️యాఖుత్ పురా:*
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు...

మీరు చదివాక మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు

❤️
04/03/2023

❤️

12/02/2023

😍😍😍😍😍

మహామ్మద్ ఘోరీని వణికించిన వీరనారి నాయకీ దేవి...చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !ఒక స్త్రీ ,ఆమెతోపాటు ఒక‌సైనిక పటాలం ...
10/02/2023

మహామ్మద్ ఘోరీని వణికించిన వీరనారి నాయకీ దేవి...
చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !
ఒక స్త్రీ ,ఆమెతోపాటు ఒక‌సైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయ్యటం కనిపించింది ! ఎటుచూసినా ఆ వీరవనితచేతిలోని కత్తి తళత్తళలే కనిపించాయి !
మహమ్మద్ ఘోరీ తేరుకుని తన సైనికులను సన్నద్ధం చేసేలోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము లేదు అంతా ఆరావళి కొండలలో మటుమాయమయ్యారు ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు వారికి ! సైనికుల ప్రాణనష్టం భారీగా జరిగింది ఘోరీ వైపు !
ఆవిడ !! ఆ ధీరమూర్తి!!
పేరు నాయికిదేవి ! చాళుక్యరాజవంశాన్ని మెట్టిన వనిత ! గోవాకు చెందిన ఒకమహామండలేశ్వరుడైన పరమార్ది కూతురు
నాయికిదేవి సోలంకివశస్తుడైన అజయపాలడి సతీమణి ! అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్ లోని కొన్నిప్రాంతాలకు అజయపాలుడు రాజు !
అజయపాలుడి హఠాన్మరణం తో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయికిదేవి !
నాయికిదేవి చిన్నతనంలోనే గుర్రపుస్వారీ ,ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధవిద్యలలో శిక్షణ పొందింది ! రాజనీతి చతరురాలు యుద్ధవ్యూహాలలో మేటి !
ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని గురించివిన్నాడు మహమ్మద్ ఘోరి !
ఒక ఆడుది, ఒక పసివాడు పరిపాలించే రాజ్యాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు అనుకున్నాడు !
అనుకున్నదే తడవుగా
ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్ష సైన్యంతో బయలు దేరాడు !
వేగులద్వారా మహమ్మద్ ఘోరీ కదలికలు వాడి ఆలోచనలు పసిగట్టింది నాయికిదేవి !
కానీ వాడి సైన్యం చాలా పెద్దది తన వద్ద అంత సైనిక సంపత్తి లేదు ఎలా ?
తలవంచటంకంటే ఎదిరించి నిలబడటంలోని ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని అర్ధించింది !
రాజులైన.....
కీర్తిపాలుడు సరేనన్నాడు
ధరావర్షుడు నేను సిద్ధం అన్నాడు
కల్హణదేవుడు ఘోరీతో కలహానికి నాదే ముందడుగు అని కబురంపాడు !
అనుకున్నట్లుగా సైన్యం సమకూరింది ! అయినా వాడి సైన్యం ముందు చాలా చాలా తక్కువ !
ఆలోచించింది రాణి ఏమి చేయాలా అని !
ఒకరోజు ఒకరాయబారి ఘోరీవద్దనుండి కబురు తెచ్చాడు !
దాని సారాంశమిది " నీవు నీకొడుకుతోసహా నావద్దకు వచ్చి నీ రాజ్యంలోని స్త్రీలను ,సంపదను నాకు సమర్పించి లొంగిపోతే ఏ విధమైన ప్రాణనష్టముండదు """ అని ...
కాస్త ఆలోచించింది రాణి ! సరే ! నీవు చెప్పినట్లే చేస్తాను ! నీవు ఆరావళి పర్వత శ్రేణి వద్దగల ప్రాంతానికి వచ్చినవెంటనే నా అంతట నేనే వచ్చి లొంగిపోతాను ...అని కబురుపెట్టింది !
ఆరావళి పర్వతశ్రేణులలో ప్రతి కొండ ,కోన ,లోయ మలుపులు గుహలు చాటుమాటుప్రదేశాలు తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల సైనికులకు తెలుసు ! నిజానికి ఆ దారులు కొట్టిన పిండి వారికి !
అప్పటికప్పుడు ఆమె యుద్ధవ్యూహం నిర్ణయించుకున్నది ! అది గెరిల్లా వ్యూహం !
అక్కడ !! విడిదిలో రాణి వచ్చి లొంగిపోతుంది అన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానాబజానాలో మునిగిపోయారు ఘోరిసైనికులు !
ఎక్కడనుండి ఏ కొండ ఈనిందో తెలియదు వచ్చారు మిడతలదండులాగ మీదపడ్డారు
అదనుచూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలలోకి‌ పారిపోయారు ! వారి వెంటపడ్డారు కొందరు ఘోరీ సైనికులు ! ...సైన్యం అలా చీలి పోగానే గుట్టలలో ఇంకొక వైపునుండి మరొక‌బృందం మిగిలిన సైన్యాన్ని ఇదే తరహాలో చావుదెబ్బకొట్టింది ! ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు !
ఈ విధమైన యుద్ధంలో గుట్టలలో కెళ్ళిన ఘోరీసైనికులు గుట్టలలోనే మట్టువెట్టబడ్డారు !
లక్ష ఉన్న సైన్యం కాస్త ఘోరి,అతని అంగరక్షకదళం మాత్రమే మిగిలారు ! ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది వాడికి !

బ్రతుకు జీవుడా అంటూ మృత్యుభయంతో ప్రాణాలరచేతబట్టుకొని గాంధారం వైపు పరుగులుతీసి ఇల్లు చేరుకున్నాడు !!
మరి జీవితంలో బ్రతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు !
ఇదీ వీరనారి నాయికిదేవి సాహసోపేతమైన వీరగాధ !..

Courtesy Vutukuru Janakiramarao

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Akhand Bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Akhand Bharath:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share

rajaneethi

what will you get in mind when you heard that word, “RAJANEETHI”, exactly this page shows everything what going on around the world,with out any favour of political party . and moreover will cinema updates, keep in touch get updates every mintute, here is our website https://www.therajaneethi.com/ you want more updates keep in touch