పరవళ్లు తొక్కుతున్న కట్లేరు వాగు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీరు. గంపలగూడెం మండలం వినగడప వద్ద వంతెనపై నుంచి మూడు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న కట్లేరు వాగు.
తిరువూరు కోదండ రామ దేవాలయంలో స్వామి వార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. దేవాలయ పునః ప్రతిష్ట అనంతరం ప్రధమ శ్రీ రామనవమి నేపథ్యంలో కళ్యాణానికి పోటెత్తిన భక్తులు.
గంపలగూడెం మండలం లో నెమలి ఆలయం పవిత్రోత్సవాలు ముగింపు చేసిన రుక్మణీ, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులు,నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో నాలుగు రోజులు నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగింపు కార్యక్రమాల్లో భాగంగా నేడు స్వామివారి కాళ్యాణం, శాంతి హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు కావురి శేశిరేఖ,ఆలయ సహాయ కమిషనర్ శాంతి, ప్రధాన అర్చకులు, భక్తులు విరివిగా పాల్గొన్నారు.
Murder mystery solved.
తిరువూరు పట్టణంలో జరిగిన హత్య కేసులో 36 గంటల్లో మిస్టరీ చేధించిన పోలీసులు. ఈ నెల 23న దారుణ హత్యకు గురైన కళ్యాణపు కృష్ణ చైతన్య (26) అనే యువకుడు.హత్యకు పాల్పడిన మునుకుంట్ల శ్రీను (బాబు) మరియు అతని అనుచరులు ఏడుగురిని విజన్ స్కూల్ సమీపంలో పట్టుకున్న పోలీసులు.A-1 నిందితుడైన మునుకుంట్ల శ్రీను మృతుడు కళ్యాణ్ కృష్ణ చైతన్య కి మధ్య డబ్బు విషయంలో వివాదం ఉన్నట్లు మీడియాకు తెలిపిన పోలీసులు.
తిరువూరు శ్రీ వేంకటాచలస్వామి* *ఆలయంలో తిరుకల్యాణ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి* *అద్దాల మండపము నందు స్వామివారి పవళింపు సేవ నిర్వహించిన అర్చకులు, భక్తులు*
విశాఖ నుండి భద్రాచలం ITC Paper Boardకు రవాణా చేస్తున్న భారీ యంత్రం నేడు తిరువూరు చేరుకుంది. నెలల తరబడి సాగే ఈ యాత్రను చూడటానికి పట్టణ ప్రజలు ఆసకతి కనబరిచారు. విద్యుత్, పోలీసు అధికారులు భద్రతాపరమైన చర్యలు చేపట్టారు.
TDP vs YSRCP In AP.
మంగళగిరి టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడిని ఖండిస్తూ తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో టిడిపి ఆధ్వర్యంలో నిరసన.
కాలు జారితే-కట్టలేరులో గల్లంతే..
గంపలగూడెం మండలం తోటమూల- వినగడప వద్ద కట్టలేరు వాగుకు పోటెత్తుతున్న వరదనీరు..
ఎన్ని భారీ వర్షాలు కురిసినా, ఎన్నిసార్లు బస్టాండు మునిగినా,
ఆ అనుభవాల నుండి కొంచెం కూడా ఏమీ నేర్చుకోని అధికార యంత్రాంగ కేవలం తిరువూరుకే సొంతం.
కృష్ణాజిల్లా ఏ.కొండూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులు పురుగు మందులు డబ్బాలతో ఆందోళన.
దాళ్వా వరి డబ్బులు చెల్లించాలని, ట్రక్ చీట్ ఇచ్చిన తరువాత 14-23 కిలోలను ప్రభుత్వం తగ్గించడం ఎలా సమంజసమని వాపోయారు.
23 కిలోలు తగ్గించటం వలన రైతుకు గిట్టుబాటు ధర కలగడం లేదని పురుగుమందు డబ్బాలతో ఆందోళన.
జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ఎన్నో సార్లు సమస్య చెప్పినప్పటికీ పరిష్కారం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరువూరు మధిర రోడ్ మేరిమాత విగ్రహం మలుపు వద్ద బడ్డీ కొట్టులోకి దూసుకువెళ్ళిన బ్రీజా కారు.
66th Film Awards Conferred By Shri.M.Venkaiah Naidu