Navtej Tv Telugu

  • Home
  • Navtej Tv Telugu

Navtej Tv Telugu It is a part of National News Channel Navtej Tv, providing news items from all over the world.

06/07/2024
పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?పార్టీయే నాయకులను తయారు చేస్తది తప...
01/07/2024

పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా?

పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు

నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది

రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం : కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

కాగా.. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై చర్చించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి,. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కె. వాసుదేవ రెడ్డి గురుకులాల ఉద్యోగ నియామకాల్లో ...
01/07/2024

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు కె. వాసుదేవ రెడ్డి

గురుకులాల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి

స్పెషల్ కేటగిరీలో గందరగోళం జరిగింది

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9,210 పోస్టులతో గురుకులాల నోటిఫికేషన్ వచ్చింది

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిజల్ట్స్ ఇచ్చి నియామకాల పేరుతో హడావిడి చేశారు

వికలాంగుల కోటా కింద కొంతమందిని అపాయింట్మెంట్ చేశారు

ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వెళ్తే మిమ్మల్ని రిజెక్ట్ చేశామని అధికారులు చెప్తున్నారు

స్పెషల్ కేటగిరి, డిసేబుల్డ్ కేటగిరి కింద జాబ్ ఇచ్చే వారికి ముందుగానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి.

కానీ రేవంత్ రెడ్డి హడావిడిగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు.

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటే భాద్యులు ఎవరు

గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది

ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వలేదు

వికలాంగుల కోటాలో రిజెక్ట్ చేసిన ఉద్యోగాలను వెంటనే వారికి పోస్టింగ్స్ ఇవ్వాలి

లేకపోతే స్పెషల్ కేటగిరి అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయిస్తారు

మెగా డీఎస్సిలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారు

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది...?

హైదరాబాద్ నుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నారు

వారం రోజుల పాటు సీఎం,ఏడుగురు మంత్రులు ఢిల్లీలో వున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి

గాంధీ హాస్పిటల్ లో నిరుద్యోగులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్🔹రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్...
01/07/2024

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్

🔹రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడానికి కారణం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది

🔹ఫాక్స్‌కాన్ సంస్థను తెలంగాణకు తీసుకువచ్చింది కేటీఆర్.. దీన్ని కాంగ్రెస్ ఘనతగా గొప్పలు చేసుకుంటున్నారు

🔹సీతారామ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం

🔹కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది

🔹దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది

🔹బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు

🔹కంటోన్మెంట్ భూముల విషయంలో స్పెషల్ మీటింగ్‌కు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా హాజరు కాలేదు

🔹రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు

🔹పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్

🔹రాహుల్ గాంధీ అశోక్ నగర్ వద్దకు వచ్చి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు

🔹కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది.. కాంగ్రెస్ మెగా డీఎస్సీ ఏమైంది

🔹మోతీలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

🔹గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది

🔹కాంగ్రెస్ గ్యారెంటీలు వెనక్కి వెళ్లి స్కాంలు ముందుకు వచ్చాయి

🔹రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు.

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ  పెంచొద్దు* ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతికుత్బుల్లాపూర్ నియోజకవర్...
01/07/2024

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు

* ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామల గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ శివారు గ్రామ ప్రజలతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిహెచ్ఎంసి పరిధిలోగల వందలాది గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని, అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామలు కూడా సరియైన అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడ నివసిస్తున్న వారియొక్క మరణించిన తాతలు, తండ్రుల పేరున ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు తమ పేరున రిజిస్ట్రేషన్ కాకపోవడం మూలన ఇప్పటివరకు మరణించినవారిపేరుమీదనే పన్నులు చెల్లిస్తున్నామన్నారు. తాము ఇక్కడి స్థలాలలో నిర్మాణాలు చేపట్టేందుకు జిహెచ్ఎంసి,పురపాలక సంఘాలు మరియు కార్పోరేషన్లు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడి రెవెన్యూ అధికారులు గ్రామ కంఠ ధ్రువీకరణ పత్రాలుగానీ, కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు కానీ ఇవ్వడం లేదని అన్నారు. ఇక్కడి ఇండ్లు ఇండ్ల స్థలాలకు బ్యాంకువారు రుణాలు ఇవ్వడంలేదని,రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తాము ఇండ్లు నిర్మించుకునేందుకు అధిక వడ్డీతో ప్రైవేటు అప్పులు తీసుకొని,లేదా ఉన్న నాలుగైదు గుంటల భూమిని అమ్ముకొని ఇండ్లు నిర్మించుకుంటే జిహెచ్ఎంసి వారు 100% ఇంటి పన్ను అధికంగా వేస్తున్నారని వాపోయ్యారు. కాబట్టి ఇక్కడి ఇండ్లు,ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని కోరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి శివారు గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోల రవీందర్ ముదిరాజ్ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, బుచ్చిరెడ్డి,, సంబంధిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్లు*నిరుపేదలను పీక్కుతింటున్న  రాబందులు*ప్రభుత్వ అనుమతి ఉన్న... వీరి అనుమతి తప్పనిసరి*...
01/07/2024

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్లు

*నిరుపేదలను పీక్కుతింటున్న రాబందులు
*ప్రభుత్వ అనుమతి ఉన్న... వీరి అనుమతి తప్పనిసరి
*నాయకుల ముసుగులో అక్రమ వసూళ్లు
*పూర్తి కేటాయింపులు జరగనే లేదు... గద్దల్లా వాలారు
*మెయింటెనెన్స్ పేరిట ప్రతినెల రూ. 1000 వసూలు
*సభ్యత్వం పేరుతో మరో రూ.1100 డిమాండ్
* ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని మరో రూ.100 బాదుడు.

కుత్బుల్లాపూర్: రేక్కడితే కానీ డొక్కాడని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదల కోసం కేటాయించింది. అధికార పూర్వకంగా ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అందించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగదు. అయితే కొందరు నిరుపేదలు ఇంటి కిరాయి కట్టుకోలేని పరిస్థితులలో ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో ఆ నిరుపేదలను కొందరు రాబందుల్లా పిక్కు తింటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మెయింటెనెన్స్ పేరుతో, సభ్యత్వం పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో గత కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు తమకు తామే నాయకులుగా ప్రకటించుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే కొందరు మెయింటెనెన్స్ పేరుతో ఒక్కో ఇంటికి నుండి ప్రతినెల రూ.1000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సభ్యత్వం పేరుతో మరో రూ 1100. వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి నెల ఆ నాయకులకు సులభంగా ఆదాయం వచ్చే విధంగా పావులు కలుపుతున్నట్లు సమాచారం. 900 ఇండ్ల నుండి ప్రతి ఒక్కరి నుండి రూ.1000 రూపాయలు వసూలు చేస్తే, రూ 9 లక్షల రూపాయలు వసూలు అవుతుంది. ప్రతి నెల 9 లక్షల రూపాయలు ఖర్చు కాదు కదా... అని ప్రశ్నిస్తే, అడిగిన వారిని టార్గెట్ చేసి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. 8 బ్లాక్ లకు గాను 900 ప్లాట్లు నిర్మించారు. వీటిలో 780 ప్లాట్లను మాత్రమే పంపిణీ చేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడ ఇల్లు కేటాయించడంతో ఇక్కడ స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇక్కడ స్థానికులు తామే నాయకులమని ప్రకటించుకుని ప్రతినెల మెయింటినెన్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఎక్కువమంది స్థానికేతరులే కావడంతో ఈ నాయకులు చెప్పిందే వేదం చేసిందే కార్యంగా తయారయింది. ఇప్పటికే ఇక్కడ ఆ వ్యక్తులు నాయకుల ముసుగులో లక్షల్లో వసూళ్లు చేసినట్లు సమాచారం.

సభ్యత్వం ముసుగులో అక్రమ వసూలు

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఉన్నవారికి సభ్యత్వం తీసుకోవాలని అందుకు ఒక్కొక్క ఇంటి నుండి రూ. 1100 రూపాయలు చెల్లించాలని ఆ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో 100 రూపాయలు ప్రభుత్వానికి వెళుతుందని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆ ఇళ్లలోకి పూర్తిస్థాయిలో లబ్ధిదారులు రాలేదు, కేటాయింపులు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు. మరి నాయకుల ముసుగులో ఈ అక్రమ వసూళ్లు ఏంటని పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇళ్లకు నీటి సరఫరాను, విద్యుత్ మీటర్లను తీసుకువచ్చామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. 900 గృహాలను నిర్మించిన ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా చేయలేదా...? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులందరూ గృహప్రవేశాలు చేసిన తర్వాత ప్రతి నెల మెయింటెనెన్స్ వసూలు చేసిన, ఇంటికి రూ.1000 రూపాయలు వసూలు చేసిన రూ.9లక్షల రూపాయలు అవుతుందని, ప్రతినెల అంతా ఖర్చు ఎందుకు అవుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అసలు అసోసియేషన్ లేదు..? కమిటీ లేదు..? కొందరు ప్రతి నెల ఈజీ మనీ కోసం చేస్తున్న ప్రయత్నంగా ఉందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

దుకాణాల అద్దె డబ్బులు ఎవరికి...?

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో నిర్మించిన దుకాణాల నుండి వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ చేయాలని గతంలోని గత ప్రభుత్వం ప్రతిపాదించింది ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నప్పటికీ ఈ దొంగ నాయకులు అవి ఏమీ పట్టించుకోకుండా ప్రతి నెల మెయింటెనెన్స్ వసూళ్లకు సిద్ధం కావడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం నిరుపేదల నుండి మెయింటెనెన్స్ వసూలు చేయకుండా ఉండేందుకు అక్కడ వ్యాపార సముదాయాలను నిర్మించి, వాటి నుండి వచ్చే ఆదాయాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల మెయింటనెన్స్ కు ఉపయోగించాలని ప్రతిపాదించింది.

ఇక్కడ ఉండాలంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... వీరి అనుమతి తప్పనిసరి

ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లాలంటే ముందుగా ఈ నాయకులు అనుమతి ఉండాల్సిందే. ఎవరైనా కొత్తగా వచ్చిన ఈ నాయకులను కలిసి వీరికి ఇవ్వాల్సింది ఇచ్చి ఇళ్లలోకి వెళ్తున్నారు. ఒకవేళ లబ్ధిదారులు కొంతమంది ఇటీవల చనిపోగా, వారి పిల్లలు వారికి కేటాయించిన ఇల్లు లోకి ఉండేందుకు వాస్తే, మీరు ఎవరు..? అసలు లబ్ధిదారులు ఎక్కడున్నారు...? అని బెదిరించి తిరిగి పంపివేస్తున్నట్లు సమాచారం. మా అమ్మ ఇటీవల కాలంలో మరణించిందని కాళ్ల వేల్ల పడి పెట్టుకున్న కనికరించడం లేదని తెలుస్తోంది. చాలామందిని వెనక్కి పంపిన సంఘటనలు చాలానే ఉన్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు. లబ్ధిదారులపై వీళ్ల పెత్తనం ఏందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మెయింటెనెన్స్, సభ్యత్వం పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

16/04/2024
09/04/2024

కుత్బుల్లాపూర్ ల్యాండ్ గ్రాబ్బర్ లపై మైనంపల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల తర్వాత రాజకీయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భూకబ్జాదారులపై పంజా విసురుతుంది. ఇదే విషయమై బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన కొందరు భూకబ్జాదారులపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒక రేంజ్ లో మండిపడ్డారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని చిత్తూగా ఓడించిన కొందరు ల్యాండ్ గ్రాబ్బర్ లు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అయిన 85,500 మెజారిటీ ఓట్లతో తమ సత్తా చాటుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలను హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కుత్బుల్లాపూర్ లో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఇంతగా కాంగ్రెస్ పార్టీ ని కుత్బుల్లాపూర్ లో అధపాతాలానికి తొక్కిన భూకబ్జాదారులు కొందరిపై రౌడీ షీట్ లు ఓపెన్ కావటంతో తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికి కొందరు మధ్యవర్థుల సహాయంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న కొందరు భూకబ్జాదారులపై స్థానికులు కొందరు మైనంపల్లి హన్మంత రావుకు ఫిర్యాదు చేయగా ఘాటుగా స్పందించిన మైనంపల్లి హన్మంత్ రావు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలోనే ఓ భూకబ్జాదారుడికి ఫోన్ చేసి ఘాటుగా హెచ్చరించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నువ్వు పార్టీ మారగానే ఏం మారిపోదు.. నీపై వందకు పైగా స్థానికులు ఫిర్యాదులు చేశారు. తమాషాలు చేస్తే... నేనే లోపలేపిస్తా... ఇమ్మిడియేట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫోటోలు డిలీట్ చెయ్ అంటూ ‘గాలిపోచమ్మ బస్తీ ఫౌండర్, గాలిపోచమ్మ ఆలయకమిటీ చైర్మన్’ బానా నర్సింహా అలియాస్ బోదాస్ నర్సింహా... అతని సోదరుడు డాన్ శీను లను హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేచి చూడాలి, భూకబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా దండుకున్న ‘రౌడీ బ్రదర్స్’ పై చర్యలు ఎలా ఉండబోతున్నాయో... అంటూ స్థానిక ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

- బ్యూరో రిపోర్ట్, నవతేజ్ టీవీ, తెలంగాణ స్టేట్.

https://youtu.be/_UKinid-BX0?si=WoDa3jM_kGGhTPTk
16/03/2024

https://youtu.be/_UKinid-BX0?si=WoDa3jM_kGGhTPTk

గిరిజన బిడ్డల గుడ్లు మింగుతున్న అంగన్వాడీ అనకొండలు15 రోజుల స్టాక్ దాచిపెట్టి దోచుకుంటున్న అంగన్వాడీ సిబ్బంది. ...

29/02/2024

గాజులరామారం డివిజన్లోని ప్రభుత్వ భూములు ఆక్రమించి పారాగాన్ చెప్పులు వాడనోడు కూడా కరోడ్ పతి అయ్యిండు... (కొందరు మాత్రమే), మరి ఆ కబ్జా కుక్కల భరతం పట్టేది ఎవరు... కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు స్పందించండి😘😘

29/02/2024

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల పరిస్థితి గత పది సంవత్సరాల్లో చెప్పుకుంటే సిగ్గుపోతాది... చెప్పుకోకపోతే ప్రాణం పోతాది.. అన్నట్టు తయారయ్యింది. ఇప్పడైనా పట్టించుకోండి సారూ... లేకుంటే మరో ఉద్యమం మొదలయ్యేటట్టుంది. For your kind information (Intelligence Report).

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప...
28/02/2024

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవస్తావాలపై రూపొందించిన కరపత్రాన్ని సిరిసిల్లలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మత్తులు చేసి ప్రాజెక్ట్ ను పునరుద్దరణ చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర పన్నుతోందాన్నారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్ గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను మంటగలుపుతోందని విమర్శించారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టిగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన చలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మంథని బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాస్తావస్తావాలను వివరిస్తూ రూపొందించిన ఈ కరపత్రాన్ని చదివితే పూర్తిగా అవగతమవుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పికొట్టాలని కోరారు.

28/02/2024

ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థినిల వీడ్కోలు కార్యక్రమానికి హాజరైన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే

బీఆర్ఎస్ నేతలపై అకారణంగా అక్రమకేసులు, థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఆత్మకూరు ఎస్ఐ దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేసిన వరంగల్ పోలీస...
28/02/2024

బీఆర్ఎస్ నేతలపై అకారణంగా అక్రమకేసులు, థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఆత్మకూరు ఎస్ఐ దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

- ఈ అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ ఉపయోగించిన సంఘటనను మరింత లోతుగా దర్యాప్తు జరిపి మిగతా అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గారికి వినతి
- నేడు చేపట్టే ధర్నా కార్యక్రమం విరమించుకుంటున్నట్లు వెల్లడి
- పోలీస్ కమిషనర్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
- అకారణంగా కేసులు బనాయించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోలీసు అధికారులకు సిపి గారి నిర్ణయం ఒక గుణపాఠం లాంటిది
- బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. వారికి అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

25/02/2024

సమస్యల పరిష్కార వేటలో గళం విప్పిన నవతేజ్ టీవీ బృందం.. బంగారు బాతుగుడ్డు గాజులరామారం డివిజన్ లో డబ్బులకోసమే వస్తారా.. అభివృద్దిని పట్టించుకోరా..?

Address


Alerts

Be the first to know and let us send you an email when Navtej Tv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navtej Tv Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share