08/06/2024
జగన్ ఓటమికి కారణం ఏమిటీ
దేశమే అబ్బుర పడేలా విద్య రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన వాడు నేడు ఏమయ్యాడు...నాణ్యమైన విద్య ఇస్తూ చదువుకునే పిల్లాడికి నగదు ఇచ్చిన విద్య దీవెన ఏమయ్యింది.. నాడు నేడు లో భాగంగా ఆసుపత్రుల మెరుగు పర్చింది నిజం కాదా... సంక్షేమ పథకాలు ఏమయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఏమయ్యాయి.. ఎందుకు ఓడిపొయ్యాడు.. దక్షిణాదిలో వీచిన మోడీ గాలి కారణమా..టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక పోవడమే ఓటమికి కారణమా.. ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందా.. కారణం ఏమిటి
అసలు సమస్య ఇంటి నుండే మొదలు అయ్యింది తన కోసం ఓదార్పు యాత్ర చేసిన చెల్లెను పక్కన పెట్టడం.. అమ్మను దూరం పెట్టడంతోని సగం ఓటమి మొదలు అయ్యింది...తన కష్టంలో భాగం అయిన చెల్లికి ఓ ఎంపీ సిటు కూడా ఇవ్వక పోవడం ఏమిటి అసలు కారణం ఎవ్వరికీ తెలియదు.. కానీ వైఎస్ఆర్ పరువూ రోడ్డున పడింది మాత్రం నిజం..
ఇది కాకుండా వివేక్ హత్య కేసు అవినాష్ రెడ్డి పాత్ర అనుమానాలు వివేకా కూతురి పోరాటం షర్మిల కాంగ్రెస్ లో చేరికతో జగన్ వంటెద్దు పోకడల వల్ల సీమలో కొంత మొత్తం రెడ్డిల ఓట్లు కూడా దూరం అయ్యాయి.. షర్మిల పోటీతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది.. బాబాయికి చెల్లెలుకు న్యాయం చెయ్యని వాడు మీకేం న్యాయం చేస్తాడు అనే ప్రశ్నించే అవకాశం దొరికింది.. సీమలో గోర ఓటమికి ఫ్యామిలీ విబేధాలు కూడా ప్రధాన కారణం.. జగన్ ఎన్డీఏ మోడీకి దగ్గర అని రాజధాని నిర్మించలేదని చదువున్న ముస్లిం లు కూడా దూరం అయ్యారు..రెడ్డి ఏసు బాబు అని హిందు రెడ్డి కాదని గుళ్ళు గోపురాలు నాశనం చేస్తుండు అని ఏపీలో మత మార్పిడులు కావాలని ప్రోత్సహిస్తుండు అని సనాతన హిందు వాదులు దూరం అయ్యారు.. దీన్నే వందలాది సోషల్ మీడియా పేజీలు యూ ట్యూబ్ ఛానెళ్లు వార్త ఛానెళ్లు ప్రచారం చేశాయి.. జగన్ ప్రమేయం లేకుండానే ఒక్క సీటు గెలవని పవన్ కళ్యాణ్ ను విపరీతమైన టార్గెట్ చేసి అవహేళన చులకన చేసి కాపులో లేని వ్యతిరేకత మూట కట్టుకుండు.. చూసి చూడనట్టు వదిలేసే బదులు అతన్ని మూడు పెళ్ళిళ్ళు దత్త పుత్రుడు ప్యాకేజీ స్టార్ అని అవహేళన చేసి అతని హీరో ను చేసిండు .. ఇదే హేళన పవన్ ను బాబు కు దగ్గర చేసింది.. కపు కులంలో హీరోను చేసింది గెలవాలి అనే కసిని పెంచింది.. కమ్మ కులంలో వున్న బాబు ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలను తన మీద వేసుకొని బాబుతో వ్యక్తిగత వైరం వున్న కొడాలిని వల్లభనేని లాంటి నాయకుల ఉచ్చులో పడి 70 ఏళ్ల మహిళను వ్యక్తిత్వ హననం చెయ్యడం ఆ కులంలో బాబు పట్ల సానుభూతి పెంచేలా జగన్ అరాచక వాది అనేలా చేసింది రాష్ట్రంలో మహిళ సానుభూతి పెంచింది.. బాబు ను అరెస్టు చేస్తే రెండు ఏళ్ల ముందే చెయ్యాలి ఎన్నికల ముందు చేసిండు ఇది పెద్ద తప్పు ఇదే అదనుగా కమ్మలు మా సామ్రాజ్యం కూలిపొయ్యి అవమానం పాలు అయ్యము అని ఆ కులంలో స్థితి మంతులు శ్రీమంతులు ఒక్కటి అయ్యి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫండ్ రైజింగ్ కావడానికి కారణం పరోక్షంగా జగన్ అయ్యిండు..
ఎలాంటి సర్వేలు చెయ్యకుండా తన కోటరీ మాటలు విని కొందరికి టికెట్ల నిరాకరణ ఎంపీలకు ఎంఎల్ఏ సీట్లు.. ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు ఇచ్చి నెల్లూరు నాయకుడిని పల్నాడుకు పంపడం లాంటి అవివేకమైన చర్యలతో కార్యకర్తలు నాయకులు అయోమయంలో వాపు ను బలుపు అనుకునేలా ప్రచారం చేశారు.. అసలు పాలన వ్యవహారాల్లో జగన్ కంటే ఎక్కువ సజ్జల , జవహర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి పేర్లు వినిపించడం తో బలమైన రెడ్డి ముద్ర రెడ్డి వ్యతిరేకత పార్టీలో ఎంఎల్ఏ ఎంపీ లకు వచ్చింది...
అయినా జగన్ కోటరిలో 50 మంది రెడ్డిలు అవసరమా ..వడ్డించే వాడు మన వాడు ఐనప్పుడు తిండి కోసం ఎందుకు కకూర్తి పాడాలి.ఎం.అన్ని పదవుల్లో తన వారే వుండాలి అనుకోవడం కూడా జగన్ కొంప ముంచింది.. కనీసం టీటీడీ చైర్మన్ ఓ బ్రాహ్మణుడి కో ఓ బలిజ లో ఓ బీసీకో ఓ హిందూ ధార్మిక వ్యక్తికో ఇస్తే ఎం అయ్యేది.. బాబాయికి ఇవ్వడంతో ఆయన హిందూ వే కాదు అని ప్రతిపక్షాలు హిందూ సంస్థలు విపరీతంగా ప్రచారం చేశారు..ఇలాంటి చర్యలతో సహజంగా హిందుత్వ వాదులు జగన్ కు దూరం అయ్యరు.. ఆ నోటి దూల RRR గాలికి వదిలెయ్యకుండా అరెస్టు చేసి కుళ్ళ బోడవడంతో సహజంగానే రాజులు దూరం అయ్యారు.. అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ వారసత్వ వ్యవహారంలో కల్పించుకొని సౌమ్యుడు అయిన ఆయన్ను ఇబ్బంది పెట్టారు దీంతో రాజుల ఓట్లు దూరం అయ్యాయి.. పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ చేసింది చెప్పకుండా అమ్మ నా మొగుడు వాడు వీడు అని జగన్ పరువును వైసిపి పార్టీని పరువూ గంగలో కలిపారు.. పార్టీకి అరాచక పార్టీ అని నాయకులందరూ రౌడీలు అనే ముద్ర వేసుకున్నారు రోజా లాంటి అనవసర టాపిక్స్ మాట్లాడే నాయకురాలు కూడా ఈ ఓటమిలో పెద్ద పాత్ర వుంది.. సర్వం జగన్ అనే విర్రవీగే అనుచరులకు ఇందులో పాత్ర వుంది.. దేశంలో మెరుగైన విద్య వైద్యం అందించి బడికి వస్తే నగదు బదిలీ చేసి 63 లక్షల పెన్షన్లు 54 లక్షల మందికి రైతులకు రైతు భరోసా 53 లక్షల మందికి అమ్మ ఒడి కాపు లకు కాపు భరోసా లాంటి పథకాలతో 2.70 లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చి ఇంత దారుణంగా ఓడిపోవడం విచిత్రం... ఏ రాష్ట్రం చెయ్యనంత సంక్షేమం చేసి మంచి
సిఎం పేరు తెచ్చుకునే బదులు అరచకవాదిగా ముద్ర వేసుకున్నారు...అమెరికా మాజీ ప్రెసిడెంగ్ ఒబామా లాంటి వారు నా జేబులో హనుమాన్ ప్రతిమ వుంటుంది అది చూసినప్పుడు నాకు ఆత్మవిశ్వాసం కల్గుతుంది అని చెప్పినప్పుడు .. ఇండియన్ క్రిస్టియన్ అయిన ఈయన దేవుని ప్రసాదం తిని కొబ్బరి కాయ కొట్టి హిందూ సంప్రదాయాలను గౌరవించడానికి ఎం అడ్డు వస్తుంది.. ఇవ్వే జగన్ కొంప ముంచాయి.. వీటినే ప్రతిపక్షాలు భూతద్దంలో పెట్టి ప్రజల మద్యలో తీసుకెళ్ళి విజయం సాధించాయి..50 పైగా యూ ట్యూబ్ చానెల్లు 10 పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ ప్రతి దానిని భూతద్దంలో చూపి జగన్ ను ఓడించారు.. సినిమా హీరోలు కలవడానికి వస్తే కార్లు అక్కడే ఆపి ఒక్క కిలో మీటర్ దూరం నడిపించడని అందరి హీరోల అభిమానుల పట్ల వ్యతిరేకత మూటగట్టుకున్నారు .. ఆ హీరోల్లో ఎక్కువ కమ్మలు కాపులు రాజులో అనుకోండి..
మద్యం పాలసీ గురించి ఎంత మాట్లాడిన తక్కువే ..ఎవడికి నచ్చిన బ్రాండ్ వాడిని తాగనివ్వకుండా నీకు నచ్చిన బ్రాండ్ నీకు కమిషన్ ఇచ్చిన బ్రాండ్ మాత్రమే తాగాలి అనడం మధ్య నిషేధం ఎట్లా అవుతుంది..ఇది తాగుబోతు ల్లో వ్యతిరేకత ను పెంచింది...
అసలు నా ఊరు అనే సెంటిమెంట్ ఏలాగే నా రాజధాని అనేది కూడా ఆలాంటిదే దీనిని పూర్తిగా విస్మరించారు జగన్..ఈ అంశం కూడా చదువుకున్న యువత లో విపరీతమైన వ్యతిరేకత తెచ్చింది.. చేసిన మంచి గాలిలొ కలిపింది..పవన్ జనగ్ ను కొట్టాలి అనే లక్ష్యంతో బాబును కలిసి బీజేపీని కలిపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలకుండా జాగ్రత్త పడ్డారు... బీజేపీ కలవడం తో దక్షిణాదిలో వున్న మోడీ వేవ్ ఈ కూటమికి బాగా కలిసి వచ్చింది.. కర్ణాటక తెలంగాణలో గెలిచిన ఎంపీ సీట్లు చూస్తే తమిళ నాడులో బీజేపీ సొంతంగా సాధించిన 11% ఓట్లు,కేరళలో సాధించిన 16% ఓట్లు చూస్తే ఇది అర్థం అవుతుంది .. కాపులు కమ్మలు రాజులు హిందూ వాదులు ఓట్లకు పార్టీ వ్యతిరేక ఓటు కూడా కలిసింది.. అందుకే ఈ ఘోరమైన ఓటమి.. ఎక్కడ సమీక్షించుకోలేదు.. సజ్జల మీకు ఆ సమయం ఇవ్వ లేదు.. ఆ ఆలోచన చెయ్య లేదు..తెలుగు దేశం కమ్మలను వెనకేసుకొని కాపులను కలుపుకొని రాజులను అండతో బీజేపీ పొత్తు ద్వారా సనాతన జాతీయ వాదులను మద్దతుతో రాయల సీమ నుండి కోస్తా దాక రెడ్డిల అస్తిత్వం లేకుండా తాము కూడా ఊహించిన విజయం సాధించింది..
వైఎస్ వివేకా ను ఎవరు చంపినారో జైలో వెయ్యకుండా ఆ ఇష్యూలో ను అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో వైఎస్ వివేకా కూతురు ప్రవేశంతో ఇమెకు షర్మిల తోడు కావడంలో రాయల సీమలో రెడ్డి ముస్లిం ఓట్లు చిలాయి నమ్మకం.. మెల్లగా అన్ని వర్గాల్లో వ్యతిరేక సునామీ మొదలు అయ్యింది.. సీమలో వివేకా హత్య వివేకా కూతురు సునీత పోరాటం దీనికి షర్మిల తొడుతో పోటీ కారణంగా 1000 నుండి 10000 మద్యలో రాయల సీమలో 30 సీట్లు వైసిపి కోల్పోవడానికి పరోక్షంగా జగన్ ఫ్యామిలీ రాజకీయమే కారణం..ప్రతిపక్షంలో వున్నప్పుడు పాద యాత్ర సమయంలో అంత బాగా మాట్లాడిన జగన్ అధికారంలోకి రాగానే ఎందుకు మాట్లాడలేక ఎవరో రాసిన స్ర్కిప్ట్ చదువుతూ కనీసం తెలుగు చక్కగా మాట్లాడ లేక పోవడానికి కారణం ఏమిటి...63 లక్షల సంక్షేమ భరోసా ఇచ్చి
54 లక్షల మందికి రైతులకు రైతు భరోసా
53 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చి 2.70 లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చి ఇంత దారుణంగా ఓడిపోవడం దారుణం..
జగన్ కంటే ఎక్కువ సంక్షేమం వాళ్ళు చేస్తాము అంటే జగన్ దానిని తను ఎదుర్కోలేక పోవడం.. 10 రోజుల్లో తెలివిగా తీర పైకి తెచ్చిన భూమి టైటిల్ ఆక్ట్ వ్యతిరేక ప్రచారాన్ని సమర్ధవంతంగా అడ్డు కోకపోవడం.. ఇక్కడ జగన్ ఓటమికి ప్రధాన కారణం 3 పార్టీల కూటమి కారణం ..ప్రభుత్వ వ్యతిరేక ఓటు వన్ సైడ్ అవ్వడం.. ఇక్కడ సానుకూల అంశం ఏమిటి అంటే జగన్ కు ఇప్పటికీ 40% ఓట్ షేర్ రావడం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేక పోవడం వైసిపి మరో సారి పొరడానికి అవకాశం అనుకూలత ఎప్పటికీ వుంటుంది.. జగన్ కాంగ్రెస్ చేసిన పోరాటంతో పోల్చితే ఇప్పుడు చేసే పోరాటం పెద్దది ఎం కాదు... సహజంగానే వర్గ రాజకీయాలు వుండే ఆంధ్రలో ఎప్పుడు ఇంకో ప్రధాన పార్టీకి అభ్యర్థుల కు కొదవ వుండదు.. ప్రత్యామ్నాయ పార్టీ ఆంధ్రలో లేక పోవడం జగన్ కు కలిసి వచ్చే అంశాలు.. తన లోపాలను అనుభంవలోకి తీసుకొని తను మారి పార్టీని మార్చి ప్రజల్లోకి వెళ్తే మరో సారి గెలవడం కష్టం ఎం కాదు.. బీజేపీ జన సేన కూడా తనకు తాను ఎదగాలి అనుకుంటాయి కూటమి ఎప్పటికీ ఇలాగే వుండదు..
51 సం|| ఉన్న జగన్ ,అదే 14 సం||లో ఓ జాతీయ పార్టీని అంతం చేసి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు గా ఒకసారి సిఎం అయ్యాడు.. మరో సారి సిఎం కాలేడా..
జగన్ 150 వచ్చినప్పుడు టీడీపీ 23 వచ్చాయి.. టీడీపీకి 130 వచ్చినప్పుడు జగన్ కు 11 వచ్చాయి.. ఇప్పటికీ 3 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ప్రతి సారి ప్రభుత్వం మారింది మరో సారి మారదు అని ఎందుకు అనుకోకూడదు..