MBC VANI

MBC VANI ALL MBC CASTES DEWELPMENTS POGRAMS & MOTIVATIONS

21/11/2023
రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు తెలంగ...
15/08/2022

రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యలయంలో, రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం సభ్యులు సి.హెచ్‌. ఉపేంద్ర, కె.కిషోర్‌గౌడ్‌, కార్యాలయ సిబ్బంది, తదితరులతో కలిసి జెండావందనం చేస్తున్న దృశ్యం.

బిసి ఎంబిసి సంచార కుల సంఘాల నాయకులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, దేశ ప్రజలందరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ...
15/08/2022

బిసి ఎంబిసి సంచార కుల సంఘాల నాయకులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, దేశ ప్రజలందరికీ
75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ...

ఎంబిసి వాణి మాస పత్రిక

బిసి రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ గారి జయంతి శుభాకాంక్షలు
08/08/2022

బిసి రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ గారి జయంతి శుభాకాంక్షలు

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి ని పురస్కరించుకుని జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిల...
07/08/2022

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి ని పురస్కరించుకుని జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన జయంతి వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర అబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గౌడ్ కలిసి ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డా. వట్టికూటి రామారావు గౌడ్, జై గౌడ్ తెలంగాణ అధ్యక్షుడు నరేష్ గౌడ్,AP జై గౌడ్ అధ్యక్షుడు చిల్లిగార కిషోర్ గౌడ్, రవీందర్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, హరిశంకర్ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్ , అంబాల నారాయణ గౌడ్, అనురాధ గౌడ్ పాల్గొన్నారు.

‘‘రాష్ట్ర సాధనే లక్ష్యం’’గా జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌‘‘ధన్యజీవి’’ ఆచార్య జయశంకర్‌అసమాన ప్...
06/08/2022

‘‘రాష్ట్ర సాధనే లక్ష్యం’’గా జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌

‘‘ధన్యజీవి’’ ఆచార్య జయశంకర్‌
అసమాన ప్రతిభతో ‘‘తెలంగాణ’’ అంకురార్పణ ప్రతినిధి జయశంకర్‌ సార్‌

జయంతి సభలో డా॥ వకుళాభరణం,జూలూరు

‘‘జయశంకర్‌ సిద్దాంతం కేసీఆర్‌ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన’’ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అని అన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ది పొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ అధ్యయనం, సాధికారత, అహింస ఉద్యమరీతులతో చేసిన కృషి ఫలితంగానే ‘‘తెలంగాణ’’ సాధ్యమైందన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్‌ రాజనీతిజ్ఞత, జయశంకర్‌సార్‌ సాధికారికతతో అవలంబించిన పద్దతులు తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిందన్నారు.
జయశంకర్‌ సర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. రవీంద్రభారతిలోని మినీ హాల్‌లో ఈకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జూలూరు గౌరీశంకర్‌ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, అత్మీయ అతిథిగా రాష్ట్ర సంగీత నాటక అకాడమి చైర్మన్‌ శ్రీమతి దీపికారెడ్డి, ప్రత్యేక అతిథులుగా సి.హెచ్‌.ఉపేంద్ర, కె.కిషోర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. తొలుత జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో డా॥ వకుళాభరణం ప్రసంగిస్తూ... జయశంకర్‌ సార్‌ సేవలు అనిర్వచనీయమైనవని అన్నారు. ఆయన చూపిన మార్గం, ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాకారానికి బలీయమైన పునాదివేశాయన్నారు. రాద్ధాంతంతో కాకుండా సిద్ధాంతంతో సాధించవచ్చని ఆ మార్గాన్ని ఎంచుకుని ఏళ్ళతరబడిగా కృషిచేశారు, అలా తెలంగాణ సాధించడంలో జయశంకర్‌ సర్‌ పాత్ర చరిత్ర మరవలేనిదన్నారు.
జూలూరు గౌరీశంకర్‌ ప్రసంగిస్తూ... జయశంకర్‌ సార్‌ది చరిత్రలో చరగని స్థానం అని కొనియాడారు. అతివాదం కాకుండా మితవాదంతో జీవితాన్ని జయించినవాడు జయశంకర్‌సార్‌ అని అన్నారు. విమర్శలజోలికి పోకుండా వెనుకబాటుతనానికి గల కారణాలను నిర్థిష్టంగా చెప్పి జాతిని ఒప్పించగల్గడంలో జయశంకర్‌సార్‌ పాత్ర ఉదాత్తమైనదని కొనియాడారు.
శ్రీమతి దీపికారెడ్డి ప్రసంగిస్తూ... జయశంకర్‌సార్‌తో తమ కుటుంబానికున్న అనుభూతులను పంచుకున్నారు. ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అయినప్పుడు ఎంతగానో సంతోషించామన్నారు. జయశంకర్‌సార్‌ ఎప్పటికి ఆదర్శప్రాయుడే అన్నారు.
బీసీ కమిషన్‌ సభ్యులు సి.హెచ్‌. ఉపేంద్ర, కే.కిషోర్‌గౌడ్‌లు ప్రసంగిస్తూ... రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్‌సార్‌తో అనేక ఉద్యమాలలో పాల్గొన్నప్పటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తమ జీవితంలో గొప్ప అనుభూతి అని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, సామాజికవేత్తలు పాల్గొని జయశంకర్‌సార్‌తో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు.

అగస్టు 7న  డిల్లీలోని తలకటోర్ స్టేడియం లో జరిగే "జాతీయ ఓబిసి మహసభ" వాల్ పోస్టర్ ను తెలంగాణ బిసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యు...
26/07/2022

అగస్టు 7న డిల్లీలోని తలకటోర్ స్టేడియం లో జరిగే "జాతీయ ఓబిసి మహసభ" వాల్ పోస్టర్ ను తెలంగాణ బిసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు వారి నివాసంలో ఆవిష్కరించడం జరిగింది చిత్రంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ ,కనకాల శ్యామ్ కురుమ ,కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తాటికొoడ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

భారతదేశపు తొలి గిరిజన మహిళ,15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికిహార్థిక శుభాకాంక్షలు...
21/07/2022

భారతదేశపు తొలి గిరిజన మహిళ,15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి
హార్థిక శుభాకాంక్షలు...

గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమఃరాష్ట్ర ప్రజలందరికీ.. గురు పూర్ణిమ శుభ...
13/07/2022

గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః

రాష్ట్ర ప్రజలందరికీ..
గురు పూర్ణిమ శుభాకాంక్షలు...

05/07/2022

కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని వెంటనే అరికట్టాలి

విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని బిసి సంఘాల డిమాండ్

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో బీసీల అభివృద్ధి కొరకు ప్రధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య...
02/07/2022

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో బీసీల అభివృద్ధి కొరకు ప్రధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

ఈ సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ యాదవ్ , కోలా జనార్ధన్, లాల్ కృష్ణ , జయంతి గౌడ్ ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు

సత్తా చాటిన సర్కారు కాలేజీలుఇంటర్ ఫలితాలలో సర్కారు కాలేజీలు సత్తా చాటాయి. మొదటి సంవత్సరం ప్రభుత్వ కాలేజీలో 47.70 శాతం, గ...
30/06/2022

సత్తా చాటిన సర్కారు కాలేజీలు

ఇంటర్ ఫలితాలలో సర్కారు కాలేజీలు
సత్తా చాటాయి. మొదటి సంవత్సరం
ప్రభుత్వ కాలేజీలో 47.70 శాతం,
గురుకులాల్లో 73.30 శాతం ఉత్తీర్ణత నమోదు,

ద్వితీయ సంవత్సరంలో
గవర్నమెంట్ కాలేజీల్లో 63.56 శాతం,
గురుకులాల్లో 78.25 శాతం ఉత్తీర్ణత నమోదు

చేనేత పై  జీరో జిఎస్టి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేనేత మహా వస్త్ర లేఖపై  ఎంపీగా సంతకం చేస్తున్న బిసి సంఘం నేత రాజ్యసభ స...
29/06/2022

చేనేత పై జీరో జిఎస్టి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేనేత మహా వస్త్ర లేఖపై ఎంపీగా సంతకం చేస్తున్న బిసి సంఘం నేత రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

జాతీయ విశ్వబ్రాహ్మణ అద్యక్షునిగా గణేష్ చారివిశ్వ బ్రాహ్మణ,విశ్వ కర్మ  జాతీయ అధ్యక్షులుగా కుందారం గణేష్ చారి ఎన్నుకున్నార...
29/06/2022

జాతీయ విశ్వబ్రాహ్మణ అద్యక్షునిగా గణేష్ చారి

విశ్వ బ్రాహ్మణ,విశ్వ కర్మ జాతీయ అధ్యక్షులుగా కుందారం గణేష్ చారి ఎన్నుకున్నారు

నిన్న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కుందారం గణేష్ చారి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి  #విడదల_రజిని గారికి హృదయ పూర్వక  పుట్టిన రోజు శుభాకాంక్షలు ....
25/06/2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి #విడదల_రజిని గారికి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు ...

ఎంబిసి వాణి మాస పత్రిక

24/06/2022

ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు నేడు పార్లమెంటు హౌస్ లో ప్రమాణస్వీకారం చేయడం జరిగింది

Address

Dilsukhnagar

HYDERABAD,500079

Opening Hours

Monday 10:00 - 18:00
Tuesday 10:00 - 18:00
Wednesday 10:00 - 18:00
Thursday 10:00 - 18:00
Friday 10:00 - 18:00
Saturday 10:00 - 22:00

Website

Alerts

Be the first to know and let us send you an email when MBC VANI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MBC VANI:

Videos

Shortcuts

  • Address
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share