TS5.News

TS5.News LATEST NEWS UPDATES FROM GLOBAL WIDE

22/01/2024

అయోధ్యలో పూర్తి అయిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట!

12/12/2023

దయచేసి సహకరించండి.. యశోద దవాఖానకు రాకండి - ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ విజ్ఞప్తి

#కెసిఆర్



#తెలంగాణ

07/12/2023

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ సమావేశం

30/11/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శాంతినగర్ లో తన సతీమణి అభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

30/11/2023

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన అసెంబ్లీ 2023 ఎన్నికల పోలింగ్

సిరిసిల్లలో ఓటు హక్కును వినియోగించుకున్న సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, పలువురు బిఆర్ఎస్ నాయకులు

06/11/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో యువ సమ్మేళనం.. హాజరైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

06/11/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో యువ సమ్మేళనంలో నృత్యం చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

27/10/2023

సిరిసిల్లలో బిఆర్ఎస్ "యువ ఆత్మీయ సమ్మేళనం"లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

09/08/2023

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బందు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

https://youtu.be/896yYKhwqFI
23/07/2023

https://youtu.be/896yYKhwqFI

యూట్యూబ్ తన చావుకి కారణం | Rajanna-Sircilla News | Prime9 TelanganaPrime9 Telangan...

14/06/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణానికి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ లతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అతిథులు, ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

14/06/2023

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణానికి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ లతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్, స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అతిథులు, ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

How would you like to automate your business with an IA powered platform? ALL YOU NEED ARE UNDER ONE UMBRELLA Learn more...
02/05/2023

How would you like to automate your business with an IA powered platform?

ALL YOU NEED ARE UNDER ONE UMBRELLA

Learn more: www.iamsoinittowinit.com

NO CREDIT CARD REQUIRED, FREE PRODUCTS WITH INSTANT ACCESS

Register Here for FREE:
https://ecosystem.onpassive.com/auth?oesId=C5RRfNfDm3Or2NGlo6Uv4A==

We use cookies to enable essential functionality on our website, and analyze website traffic. By clicking Accept you consent to our use of cookies. Read about how we use cookies.

24/01/2023

దడ పుట్టిస్తున్న పవన్.. దద్దరిల్లిన కొండగట్టు!

10/12/2021

కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌.. ప‌వ‌ర్ లూం క్ల‌స్ట‌ర్ల ఏర్పాటుకు డిమాండ్

10/12/2021

రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్

జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 201 మంది ఓటర్లు

మొదటి ఓటు హక్కును వినియోగించుకున్న ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు

04/11/2021

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వస్త్ర వ్యాపార సముదాయాల నిర్వాహకులు తమ తమ వ్యాపార సముదాయం కార్యాలయాలలో లక్ష్మి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చెల్లించుకున్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో బాణాసంచా లతోపాటు టపాసులను పేల్చుతు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు

04/11/2021

పాపం.. ఏ తల్లి కన్న బిడ్డో..

దీపావళి రోజున అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలివెళ్లిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అవావాస్య రోజు పుట్టిందనో, లేక మరో కారణమే కానీ పసికందును కసాయివాళ్లు... పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో వదిలివెళ్లారు. పసికందు ఏడుపులు విన్న పోలీసులు అక్కడికి చేరుకుని... ఆరుబయట చలిలో వణుకుతున్న పసికందును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. పసికందును పరీక్షించిన వైద్యులు తగిన వైద్యాన్ని అందిస్తున్నారు. పసికందును ఎవరు వదిలివెళ్లార్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

03/11/2021

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐ మరియు పిఎస్ఐల బదిలీలు.. పోస్టింగ్ వివరాలు
28/10/2021

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐ మరియు పిఎస్ఐల బదిలీలు.. పోస్టింగ్ వివరాలు

26/10/2021

హైదరాబాద్ లో పోచిరెడ్డిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ ఎంపిటిసి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నేవూరి పోచిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పోచిరెడ్డిని మంత్రి కేటీఆర్ ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు.

రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం : సీఎం కేసీఆర్అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధి...
25/10/2021

రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం : సీఎం కేసీఆర్

అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, మ‌న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు మాత్ర‌మే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌ని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు.

కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం..
ప్లీన‌రీ వేదిక‌లో ఆశీనులైన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదుల‌కు ధ‌న్య‌వాదాలు, న‌మ‌స్కారాలు తెలియ‌జేస్తున్నాను. 20 సంవ‌త్స‌రాల ప్ర‌స్థానం త‌ర్వాత మ‌ళ్లీ ఒక‌సారి అద్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టివ‌ల్సిందిగా, ఏగ‌క్రీమ‌వంగా న‌న్ను ఎన్నుకున్నందుకు హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 2001, ఏప్రిల్ 27 స్వ‌ర్గీయ కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌యం జ‌ల‌దృశ్యం ఆవ‌ర‌ణ‌లో ఈ గులాబీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించాము. ఆనాడు విప‌రీత‌మైన అప‌న‌మ్మ‌క స్థితి. గ‌మ్యం మీద స్ప‌ష్ట‌త లేన‌టువంటి అగ‌మ్య గోచ‌ర ప‌రిస్థితి. ఉద్య‌మం మీద అప్ప‌టికే ఆవ‌రించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్ప్ర‌చారాలు.. ర‌క‌ర‌కాల అనుమానాస్ప‌ద‌స్థితుల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరింది.

నాడు తెలంగాణ స‌మాజం విశ్వాసం లేన‌టువంటి స్థితిలో ఉంది. ఈ స‌మాజం ఆ స్థితి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని మాట్లాడుకున్నాం. దేశ స్వాతంత్ర్య పోరాటం మ‌హాత్మ‌గాంధీ ఆధ్వ‌ర్యంలో సాగింది. స్వాతంత్ర్య స‌మ‌ర‌బాట‌లో 287 సార్లు అనేక ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చి, వాటిని వాప‌స్ కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది. జ‌లియ‌న్ వాలాబాగ్ మార‌ణ‌కాండ జ‌రిగింది. అయినా స్వాతంత్ర్య పోరాటం ఆగ‌లేదు. విజ‌యం సాధించింది. ఆ పంథాలోనే తెలంగాణ ఉద్య‌మం సాగింది. స్ప‌ష్ట‌మైన‌టువంటి మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగ‌డం జ‌రిగింది. మీలో చాలా మంది మొద‌టి రోజు నుంచి నేటి వ‌ర‌కు ప‌ని చేస్తూనే ఉన్నారు.

సిపాయిల తిరుగుబాటు విఫ‌ల‌మైంది అని అనుకుంటే దేశానికి వ‌చ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాట‌మే విజ‌యం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వ‌చ్చి తీరుతుందిని అని నిర్ణ‌యించుకున్నాం. అలా అనేక ర‌కాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. స‌మైక్య‌వాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వేయ‌ని నింద‌లు లేవు. పెట్ట‌ని తిప్ప‌లు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు. చివ‌రికి రాజ్య‌స‌భ‌లో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌నం కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వివ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబ‌ట్టి విజ‌య‌తీరాల‌కు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌కు కొత్త బాట‌ను చూపాయి. చ‌రిత్ర‌లో తెలంగాణ ఉద్య‌మానికి, ఉద్య‌మ‌కారుల‌కు శాశ్వ‌తంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి రూ. 240 కోట్ల విరాళాలు : సీఎం కేసీఆర్టీఆర్ఎస్ ఆర్థిక‌ప‌రంగా కూడా శ‌క్తివ‌తంగా త‌యారైంది. టీఆర్ఎస్‌కు క...
25/10/2021

టీఆర్ఎస్ పార్టీకి రూ. 240 కోట్ల విరాళాలు : సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ ఆర్థిక‌ప‌రంగా కూడా శ‌క్తివ‌తంగా త‌యారైంది. టీఆర్ఎస్‌కు కూడా విరాళాలు స‌మ‌కూరాయి. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన విరాళాల ద్వారా పార్టీ కార్య‌కలాపాలు కొన‌సాగుతున్నాయి. 31 జిల్లాల్లో పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేసుకుంటామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటు: సీఎం కేసీఆర్రాబోయే ఏడేండ్ల‌లో బ‌డ్జెట్ల ద్వారా మొత్తం రూ. 23 ల‌క్ష‌ల కోట్...
25/10/2021

ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటు: సీఎం కేసీఆర్

రాబోయే ఏడేండ్ల‌లో బ‌డ్జెట్ల ద్వారా మొత్తం రూ. 23 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతామ‌న్నారు. ద‌ళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు. అట్ట‌డుగున ఉన్నందునే ద‌ళితుల‌కు మొద‌ట కార్య‌క్ర‌మం చేప‌ట్టాం. ద‌ళిత‌బంధుపై పెట్టే పెట్టుబ‌డి వృథా కాదు. ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటునిస్తోందన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సంప‌ద సృష్టి జ‌రుగుతోంది. 75 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచ‌న చేశారా? అని ప్ర‌శ్నించారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హంకేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చే...
25/10/2021

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది అని ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగాభార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాను.

కేసీఆర్ స‌భ పెట్టొద్దు ఇది ఏం క‌థ. ఇది ఒక ప‌ద్ధ‌తా? కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ స‌భ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో స‌భ నిర్వ‌హించొద్దంటూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌న పార్టీ నాయ‌కులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులు. ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతోంది. న‌వంబ‌ర్ 4 వ‌న‌ర‌కు ద‌ళిత బంధు అమ‌లును ఆప‌గ‌ల‌దు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు దీవించి, ఆశీర్వ‌దిస్తారు. రాష్ట్ర‌మంత‌టా ద‌ళిత బంధును అమ‌లు చేస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాల‌ని డిమాండ్ : సీఎం కేసీఆర్తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప...
25/10/2021

ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాల‌ని డిమాండ్ : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. ద‌ళిత బంధు ప్ర‌క‌టించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాప‌న‌లు వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామ‌ని చెబుతున్నారు. తెలంగాణ ప‌థ‌కాలు త‌మ‌కు కావాల‌ని ఆంధ్రా ప్ర‌జ‌లు కోరుతున్నారు. తెలంగాణ‌లో మంచి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయని, ఆ రాష్ట్రంలో మ‌మ్మ‌ల్ని కూడా క‌ల‌పాల‌ని కోరుతూ నాందేడ్, రాయ‌చూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వ‌చ్చాయి. ఉత్త‌రాది నుంచి వేల సంఖ్య‌లో కూలీలు వ‌చ్చి ప‌ని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్ర‌తిష్ఠ ఇనుమ‌డిస్తోంద‌న్నారు.

కేసుల‌తో అభివృద్ధిని అడ్డుకోవాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. పాల‌మూరులో పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేశామ‌న్నారు. సాహ‌సం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. క‌ల‌లు క‌ని.. ఆ క‌ల‌ల‌నే శ్వాసిస్తే సాకార‌మ‌వుతాయి. తెలంగాణ‌లో అద్భుతంగా వ్య‌వ‌సాయ స్థీరీక‌ర‌ణ జ‌రిగింది. మ‌నం విడిపోయిన ఏపీ త‌ల‌సరి ఆదాయం రూ. 1.70 ల‌క్ష‌లే. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం రూ. 2.35 ల‌క్ష‌ల‌కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే క‌రెంట్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కొందరు ఏపీ నేత‌లు అపోహ‌లు సృష్టించారు. కానీ తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మ‌వుతంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

అమరులను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌అమరవీరులను, కాలధర్మం చెందిన వారిని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని హైట...
25/10/2021

అమరులను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

అమరవీరులను, కాలధర్మం చెందిన వారిని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అమరవీరులను స్మరించుకున్నారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేక మంది కలిసి పనిచేశారని అన్నారు. పార్టీకి నిబద్ధులైన నాయకులు కీర్తిశేషులయ్యారని, చరిత్రలో వారిపేర్లు చిరస్థాయిగా నిలవాలని చెప్పారు. కీర్తి శేషులైన పార్టీ నాయకులకు ప్లీనరీ సంతాపం తెలిపింది. అమరులకు ప్రతినిధుల సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

Address


Alerts

Be the first to know and let us send you an email when TS5.News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TS5.News:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share