24/04/2024
పెత్తందారులు అందరూ ఒక్కటవ్వటమే కాదూ.. కోటానుకోట్ల ఉన్న ఐశ్వర్యవంతులు ప్రత్యక్షంగా పరోక్షంగా వాలిపోయారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక్క ఆంధ్రనే కాదు దేశంలో మరే రాష్ట్రంలో కూడా చూడని విధంగా డబ్బుల కట్టల మీద నాలుగు రోజులు ప్రజల్ని నడిపించి... తర్వాత..
ఇంగ్లీష్ చదువుల వ్యాపారం చేసుకోవటానికి...
రోగాలతో ఆరోగ్య వ్యాపారం చేసుకోవటానికి....
24 గంటలు లిక్కర్ వ్యాపారం చేసుకోవటానికి...
హైప్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి....
బ్లాక్ లో సినిమా టిక్కెట్లు అమ్ముకోవడానికి...
ప్రజల్ని అయిదు రూపాయల అన్నం కోసం లైన్లలో నిలబెట్టడానికి.. సంవత్సరానికి ఒకసారి పండక్కి పరమాన్నం వండుకోమని కానుకలు ఇవ్వటానికి..
మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఫ్లోరైడ్ వ్యాధిని పెంచటానికి..
ఇచ్చిన సెంటు భూమి కూడా పేదలకు దూరం చేయటానికి...
ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా, చైతన్య పరులు కాకుండా పేద మధ్య తరగతి ప్రజలను మరో కొన్ని తరాల పాటు బానిసలుగా చేసుకొని తమ ఆధిపత్యం ప్రదర్శించటానికి...
ఇందిరాగాంధీ గరీబీ హటావో అని పేదలకు భూమి, ఇళ్ళు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఆ మాట అని 50 ఏళ్ళు గడిచాయి. పేదరికం తగ్గిందా, ఉన్నవారికి, పేదలకు మధ్య అంతరం పెరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు తగ్గలేదు? ఆవిడకు వ్యతిరేకంగా మరోసారి అవిడ గెలిస్తే మనం అడుక్కు తినాల్సిందే అంటూ అప్పుడు కూడా పెత్తందార్లు ఏకమయ్యారు. అది ఒక కారణం అయితే మరో కారణం అవిడ వారి అవసరాలు తీర్చి "అమ్మ" అయింది కానీ, వారి జీవితాలను శాశ్వతంగా మార్చేది చదువు మాత్రమే, అప్పో సొప్పో చేసి వారిని పెద్దల పిల్లలకు సమానంగా చదివించే "నాన్న" కాలేకపోయింది. ఇన్నేళ్ళ స్వాతంత్రంలో మొదటిసారి మీ పిల్లలను కూడా పెద్ద చదువులు చదివించండి, చదువే అభివృద్ది, నేను ఉన్నాను అంటున్న ప్రభుత్వం వచ్చింది. ఆఖరుకు ప్రపంచంలోనే అత్యున్నత కోర్స్ అయిన IB ను కూడా మన పిల్లలకు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఇవేమీ నచ్చని వర్గాలు ఏకమవుతున్నాయి. చావో రేవో అంటూ ఎక్కడెక్కడో నుంచి డబ్బు తెస్తున్నారు. ఈ ప్రజల్ని కొంటాం అంటున్నారు. కానీ, చావో రేవో వారికి కాదు..పేద మధ్య తరగతి వర్గాలకు... బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు. మన వేలు వేలకు అమ్ముడుబోతుందా లేక మన పిల్లల్ని పట్టుకుని నడిపించి అభ్యున్నతికి దారి చూపిస్తుందా! చైతన్యవంతులు అవ్వండి..మరో నలుగురిలో చైతన్యం తీసుకురండి. ప్రతి పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి...ఈసారి ఓటు మీకోసం కాదు..మీ భవిష్యత్తు తరాల కోసం అని. దేశంలో మిగతా ప్రభుత్వాలు కూడా విద్య వైద్యం అందుబాటులోకి తేవాలని తెలుసుకోవటానికి, ఒక కొత్త ఇండియా ముందుకు రావటానికి మీ వేలును వాడండి. పది మందికీ ఈ మెసేజ్ ను చెరవేయండి.